Thursday, April 2, 2026

_పారాక్వాట్ నిషేధంపై రైతు కమిషన్ హర్షం_


*థాంక్స్ టు సీఎం రేవంత్ రెడ్డి : రైతు కమిషన్ బృందం.*

-పారాక్వాట్ నిషేధంపై రైతు కమిషన్ హర్షం.
-అత్యంత విషపూరితమైన పారాక్వాట్ ద్వారా వందలాది రైతుల ప్రాణాలు పోయాయి. 
- రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా నిషేధం విధించాలి.
-సీఎం రేవంత్ రెడ్డి, అగ్రికల్చర్ మినిస్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కమిషన్ చైర్మన్, సభ్యులు.
-కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ని శాలువాతో సన్మానించిన సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, భూమి సునీల్.

రాష్ట్ర ప్రభుత్వం పారాక్వాట్ గడ్డి మందు నిషేదించడం హర్షించదగ్గ విషయమని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ఇవాళ రైతు కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్, సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత విషపూరితమైన పారాక్వాట్ నిషేదించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవో విడుదల చేయడం సంతోషకరమన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు లకు రైతు కమిషన్ బృందం స్పెషల్ థాంక్స్ చెప్పింది. అత్యంత విషపూరితమైన పారాక్వాట్ వల్ల వందలాది మంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయారని ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రంలో గడ్ది, కలుపు మందులను నిషేదించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రైతు సంఘాల నేతలు రైతు కమిషన్ దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.  దీనితో రంగంలోకి దిగిన రైతు కమిషన్ క్షేత్ర స్థాయిలో పర్యటించి, నిపుణులతో రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసి.. విషపూరితమైన పారాక్వాట్ ను నిషేదించాలని  కమిషన్ ప్రభుత్వాన్ని కోరిందన్నారు. రైతు కమిషన్ సూచన మేరకు అసెంబ్లీ లో తీర్మానం పెట్టడం, నిన్న జీవో విడుదల చేయడం సంతోషమన్నారు. రాష్ట్రంలో గడ్డి మందు నిషేదించడంతో పాటు దేశంలో కూడా నిషేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి లేఖ రాయడం కూడా శుభపరిణామం అని తెలిపారు. ఇక రైతులు కూడా విషపూరితమైన గడ్డి కలుపు మందుల వైపు వెళ్లొద్దని కమిషన్ చైర్మన్, సభ్యులు కోరారు. ప్రాణాలకు హాని చేయని, నేల పాడుచేయని కలుపు మందులను వాడాలని సూచించారు. వీలయితే కలుపు తీసే యంత్ర పరికరాలు వినియోగిస్తే మంచిదన్నారు. ఈ సమావేశంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తోపాటు సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, భూమి సునీల్ వున్నారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి కమిషన్ సభ్యులు శాలువాతో సత్కరించారు.

Wednesday, April 1, 2026

CYBER FRAUD BUSTED – FAKE TRADING CALL CENTER EXPOSED!

🚨 CYBER FRAUD BUSTED – FAKE TRADING CALL CENTER EXPOSED!

Malkajgiri Cyber Crime Police have busted a cyber fraud call center involved in an #InvestmentFraud case.

👤 A 35-year-old faculty from Nagole was cheated through a fake WhatsApp group “Barclays” with fake profits up to ₹7 Crores shown to trap him.

💸 Total Loss: ₹36,30,010/-

👮‍♂️ 8 Accused Arrested 
📱 Seized Items:
45 Mobile Phones | 1 Laptop | 3 Routers | 2 Tabs
40 ATM Cards | 20 SIM Cards | 22 Cheque Books & more
🔍 Fraudsters posed as traders and lured victims into investing on fake platforms.
⚠️ Stay Alert:
✔️ Don’t trust online investment groups blindly
✔️ Verify before investing
✔️ If it sounds too good to be true, it’s a scam
📢 Report Cyber Frauds immediately at 1930 or cybercrime.gov.in
#CyberCrime #StayAlert #OnlineFraud #TradingScam #PublicSafety #HyderabadPolice

https://x.com/MalkajgiriCop/status/2039365063098941823?t=fSmWE1RpqdVPxxDpYkkW6Q&s=19