Wednesday, July 15, 2026

గ్రామీణ ప్రాంతాల్లో మొదలైన ఇందిరమ్మ ఇళ్ల విప్లవం... ఇప్పుడు పట్టణ పేదల జీవితాల్లోకి_

*ఈ నెల 20న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్లకు శ్రీకారం - మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి*

*దశలవారీగా లక్ష ఇండ్ల నిర్మాణం*

*పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి వెయ్యి ఇండ్ల  వరకు నిర్మాణం*

*గ్రామీణ ప్రాంతాల్లో మొదలైన ఇందిరమ్మ ఇళ్ల విప్లవం... ఇప్పుడు పట్టణ పేదల జీవితాల్లోకి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 14:

గ్రామీణ ప్రాంతాలల్లో ఇందిరమ్మ ఇండ్లతో పెద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం ఇప్పుడు అదే సంకల్పంతో క్యూర్ ప్రాధిలోని పేదల సొంతింటి స్వప్నాన్ని నిజం చేసేందుకు మరో చారిత్రాత్మక అడుగు వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో దశల వారీగా లక్ష ఎల్.ఐ.జి. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నామని, ఇందుకు సంబంధించి ఇప్పటికే పరిపాలన అనుమతులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు.మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయం క్యూర్ పరిధిలో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇండ్ల పై హౌసింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్ల పథకానికి శ్రీకారం చూడుతున్నామని  ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి పథకానికి సంబంధించిన విదివిధానాలను, దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు, టెండర్ల ప్రక్రియ, అమలు విధానం తదితర పూర్తి మార్గదర్శకాలను ప్రకటిస్తామని వివరించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గానికి కనీసం 500 చొప్పున ఆయా స్థానిక పరిస్థితులనుబట్టి అవసరమైన చోట వెయ్యి వరకు నిర్మిస్తామని తెలిపారు.గత ప్రభుత్వం ఎలాంటి ముందుచూపు లేకుండా, హైదరాబాద్ నగరానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అరకొరగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించడంవల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతామనే ఆందోళనతో చాలామంది అక్కడ నివసించలేకపోయారని అన్నారు.తమ ప్రభుత్వం మాత్రం పేదల జీవన వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే, వారి ఉపాధి, పిల్లల విద్య, వైద్య సౌకర్యాలు, రవాణా వంటి అంశాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలల్లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లను నిర్మిస్తున్నామని, ఆ స్థలములో వారికి వాటా ఇస్తూ యాజమాన్య హక్కు కల్పిస్తూ వారి కుటుంబాలకు శాశ్వత ఆర్థిక భద్రతను కల్పిస్తున్నామన్నారు.క్యూర్ పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గాలల్లో స్థలాలను గుర్తించడం జరిగిందని, ఈ స్థలాలను ఇప్పటికే హౌసింగ్ విభాగం పొజిషన్ లోకి తీసుకుందని, ఎక్కడ ఎన్ని ఇండ్లు, ఎన్ని అంతస్తులు నిర్మించాలి, ఒక్కో ప్లాట్ విస్తీర్ణం, బిల్డింగ్ డిజైన్ లను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి  రెండు, మూడు రోజులల్లో తుది రూపును ఇస్తామని వెల్లడించారు.

హైదరాబాద్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది_

*హైదరాబాద్ లో "బ్రిక్స్" ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ కార్యక్రమం*

*తెలంగాణ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు, 2026 ఆగస్టు 4-5 తేదీలలో హైదరాబాద్‌లో జరగనున్న 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షచేశారు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 14:

హైదరాబాద్‌లో ఆగస్టు 4 మరియు 5 తేదీల్లో జరగనున్న రెండవ బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గ సమావేశం (BRICS Anti-Corruption Working Group Meeting) ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ రోజు సమీక్షచేశారు.సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశం, ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంపై దృష్టి సారించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు భారత ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ రెండవ బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గ సమావేశంలో 11 బ్రిక్స్ సభ్య దేశాల నుండి సుమారు 40 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. వీటితో పాటు, భారత ప్రభుత్వానికి చెందిన దాదాపు 40 మంది ఉన్నతాధికారులు కూడా చర్చల్లో పాల్గొంటారు.సమావేశం సందర్భంగా, భారత ప్రభుత్వంలోని సిబ్బంది మరియు శిక్షణ శాఖ (DoPT) జాయింట్ సెక్రటరీ శ్రీ సుశీల్ కుమార్ పటేల్ ఈ కార్యక్రమంపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి అవసరమైన సహకారం గురించి వివరించారు. సమావేశం సజావుగా సాగేందుకు భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్యం, ఆరోగ్యం మరియు అత్యవసర వైద్య సేవలు, రవాణా, ప్రోటోకాల్, వసతి, వేదిక నిర్వహణ మరియు ఇతర నిర్వహణపరమైన అవసరాల విషయంలో ఆయన సహకారాన్ని కోరారు.ఏర్పాట్లను సమీక్షిస్తూ, ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత శాఖలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేసి, ముందుగానే సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పటిష్టమైన భద్రత, సమర్థవంతమైన రవాణా మరియు ట్రాఫిక్ నిర్వహణ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన పారిశుధ్యం మరియు పరిశుభ్రత, తగిన వైద్య సదుపాయాలు, అంతరాయం లేని పౌర సేవలు మరియు సంబంధిత ఏజెన్సీల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.ప్రధాన అంతర్జాతీయ సమావేశాలు మరియు సదస్సులను విజయవంతంగా నిర్వహించడంలో హైదరాబాద్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని, బ్రిక్స్ సమావేశం సమయంలో ఆ ప్రతిష్టను నిలబెట్టేలా కృషి చేయాలని ప్రధాన కార్యదర్శి నొక్కి చెప్పారు. భారత ప్రభుత్వంతో సన్నిహిత సమన్వయం పాటిస్తూ, నిర్ణీత గడువులోగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చిన సంజయ్ జాజు, ఈ కార్యక్రమ నిర్వహణలో భారత ప్రభుత్వానికి తెలంగాణ పూర్తి సహకారం అందిస్తుందని, ప్రతినిధుల సౌకర్యం, భద్రత మరియు అనుకూలత కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ సమావేశానికి వైఏటీ&సీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, జీఏడీ (పోల్) ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, ప్రణాళికా కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఏడీజీపీ (లా&ఓ) మహేష్ భగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, డైరెక్టర్ ప్రోటోకాల్ శివ లింగయ్య, ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి మరియు ఇతర అధికారులు హాజరయ్యారు.

జర్నలిస్టు గుండెల్లో జ్యోతి వెలిగించిన నాయకుడు...ఒక పేరు... ఒక నినాదం...డాక్టర్ కేకేయార్... డాక్టర్ కేకేయార్...!

*ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ కేకేఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై ప్రజామిత్ర ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ విశ్వశ్వర్ రావు రాసిన పాట డివిడి ఆవిష్కరిస్తున్న డాక్టర్ కేకేఆర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 13:

మీడియా టుడే తెలుగు జాతీయ దినపత్రిక మరియు ఇంగ్లీష్ డైలీ న్యూస్ పత్రిక,మీడియా టుడే టీవీ, N24 న్యూస్ సంస్థల చైర్మన్ మరియు మేనజింగ్ డైరెక్టర్, AWJA అల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే. కోటేశ్వరరావు (kkr)గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసి తాను స్వయంగా రాసిన పాట ను డీవిడీ లో అనువదించి kkr గారి చేతుల మీదుగా ఆవిషరించడం జరిగింది.ఈ సందర్బంగా విశ్వశ్వర్ రావు తాను రాసిన పాట గురించి అక్షర రూపంలో తెలియచేశారు.
*(పల్లవి:)*
ఎవరు ఆ యోధుడు... ఎవరు ఆ వీరుడు...
చీకటి జీవోలపై యుద్ధం చేసిన ధీరుడు...
జర్నలిస్టు గుండెల్లో జ్యోతి వెలిగించిన నాయకుడు...
ఒక పేరు... ఒక నినాదం...
డాక్టర్ కేకేయార్... డాక్టర్ కేకేయార్...!
*(చరణం – 1)*
ఏపీలో చీకటి జీవో రద్దు కోసం పోరాడిన సింహమే...
తెలంగాణ గర్జనగా నిలిచి ధ్వజమెత్తిన వీరుడే...
జంతర్ మంతర్ వీధుల్లో సమరభేరి మోగించినా...
పత్రికా స్వేచ్ఛ కోసం ఢిల్లీని కదిలించినా...
న్యాయం కోసం అడుగేస్తే వెనుకడుగు తెలియదయ్యా...
అన్యాయం కనిపిస్తే నిప్పులై రగిలేదయ్యా...
జర్నలిస్టు హక్కుల కోసం జాతీయ గళమయ్యా...
డాక్టర్ కేకేయార్... మా ఉద్యమ... పతాకమయ్యా...
*(పల్లవి)*
ఎవరు ఆ యోధుడు... ఎవరు ఆ వీరుడు...
చీకటి జీవోలపై యుద్ధం చేసిన ధీరుడు...
జర్నలిస్టు గుండెల్లో జ్యోతి వెలిగించిన నాయకుడు...
డాక్టర్ కేకేయార్... డాక్టర్ కేకేయార్...!
*(చరణం – 2)*
కరోనా కాలమొచ్చినప్పుడు కన్నీళ్లు తుడిచినవాడు...
నిర్లక్ష్య ప్రభుత్వాలను ప్రజాక్షేత్రంలో నిలిపినవాడు...
మనోజ్ మరణం వెనుక నిజం ప్రపంచానికి చెప్పినవాడు...
జర్నలిస్టు బాధలన్నీ దేశానికి వినిపించినవాడు...
పీటీఐ కార్మికులకు న్యాయం సాధించిన పోరాటం...
వందల కుటుంబాలకు మళ్లీ వెలిగించిన దీపం...
అలుపెరుగని పట్టుదలతో విజయగాథ రాసినవాడు...
కేకేయార్ అంటే ఉద్యమమే అని చాటినవాడు...

*(చరణం – 3)*
పేద విద్యార్థుల కలలకు విద్యాదీపం వెలిగించి...
హరితహారం స్వచ్ఛభారత్ సేవా మార్గం చూపించి...
స్త్రీజ్యోతి ఫౌండేషన్‌తో సమాజానికి తోడై...
సేవలోనే సంతోషమని జీవితాన్ని అంకితమై...
అవినీతి గుట్టురట్టు చేస్తూ కలాన్ని ఖడ్గం చేశాడు...
ప్రజల పక్షాన నిలబడి నిజం జెండా ఎగరేశాడు...
*(బ్రిడ్జ్)*
వృత్తులు ఎన్నో ఉండొచ్చు...
అందరూ జర్నలిస్టులు కాలేరు...
జర్నలిస్టులు ఎందరో ఉండొచ్చు...
అందరూ ఉద్యమనేతలు కాలేరు...
ఉద్యమనేతలు ఎందరో ఉండొచ్చు...
అందరూ కేకేయార్ కాలేరు...
అందరూ కేకేయార్ కాలేరు...
*(ఫైనల్ పల్లవి)*
జర్నలిస్టుల గుండె చప్పుడు...
ప్రజల హక్కుల యుద్ధనాదం...
నిజం కోసం నిరంతర పోరాటం...
అదే మా కేకేయార్ మార్గం...
జై జై కేకేయార్...
జర్నలిస్టుల సింహగర్జన...
జై జై కేకేయార్...
ప్రజాహితం కోసం ఉద్యమ జ్యోతి...
జై జై కేకేయార్...
జై జై కేకేయార్...!

SIR ఓటర్ ఎన్యూమరేషన్ ఫారం ప్రక్రియ పూర్తి చేసి BLO కు అందచేసిన మీడియా టుడే జర్నలిస్ట్ బాపట్ల కృష్ణమోహన్_

*SIR ఓటర్ ఎన్యూమరేషన్ ఫారం ప్రక్రియ పూర్తి చేసి BLO కు అందచేసిన మీడియా టుడే జర్నలిస్ట్ బాపట్ల కృష్ణమోహన్*

*అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడడమే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR–2026) కార్యక్రమం ప్రధాన ఉద్దేశం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 13:

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ గాంధీ నగర్ కమ్యూనిటీ హలో లో తన ఓటర్ SIR ఎన్యూమరేషన్ ఫారం ప్రక్రియ పూర్తి చేసి BLO బందెల ప్రేమలత కు అందచేసిన సామజిక కార్యకర్త, ప్రజాసంకల్పం ఫౌండర్, మానవహక్కుల బాద్యులు, అల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సోషల్ మీడియా కన్వినర్ (ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ), మీడియా టుడే జర్నలిస్ట్ బాపట్ల కృష్ణమోహన్. ఈ సందర్బంగా  కృష్ణమోహన్ మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు (BLOలు)M. శ్రీనివాస్ రెడ్డి, BLO సూపర్‌వైజర్ రవికుమార్ తో మాట్లాడి కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, ఆన్‌లైన్ డిజిటైజేషన్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తి పారదర్శకతతో, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు.ప్రతి అర్హ ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఫారాలను పూర్తిగా నింపించి నిర్దేశిత గడువులోగా తిరిగి స్వీకరించేలా విస్తృత ప్రజా అవగాహన కల్పించాలని సూచించారు.బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, అందిన ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులో డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR–2026) కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి వివరాలతో నింపి నిర్దేశిత గడువులోగా సంబంధిత బూత్ స్థాయి అధికారులకు (BLOలు) తప్పనిసరిగా సమర్పించాలని తెలిపారు.అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడడమే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR–2026) కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి వివరాలతో సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.

అమ్మాయి వాంగ్మూలం వింటుంటే వళ్ళు జలదరించింది_

*30-32 మంది మానవ మృగాలు 13సంవత్సరాల అమ్మాయిపై అత్యాచారం.*

*అమ్మాయి వాంగ్మూలం వింటుంటే వళ్ళు జలదరించింది*

*2012 లో జరిగిన నిర్భయ ఘటన ఇంకా కళ్ళ ముందే ఉంది, ఇది మరో నిర్భయ కేసు*

*అనూరాధ రావు అధ్యక్షురాలు - బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 13:

రాజస్థాన్లోని శ్రీనగర్ జిల్లాలో 
జూన్ 18, 2026 న ఇంటికి వెళ్లాలని ఆటో ఎక్కిన 13 సంవత్సరాల బాలిక, , హోటల్ జాయ్ ఇన్ ఈ బాలికను డ్రైవర్ నేను తీసుకెళ్లి, హోటల్ యజమాని మయాంక్ సైన్కు 50 వేలకు అమ్మేశాడు.అక్కడ నుంచి వివిధ హోటళ్లలో 30-32 మంది మానవ మృగాలు ఆ అమ్మాయిపై అత్యాచారం. చేశారు ఐదు రోజులు. ఆ పాపను చేతులు కట్టి, మద్యం తాగించి నరకం చూపించారు. బాలిక అరుపులు,బాధ, దుఃఖం ఎవరికి వినపడలేదు, కరగలేదు. పైశాచికత్వం ప్రదర్శించారు.జూన్ 22న పోలిసులు హోటల్ రైడ్ చేసినపుడు ఈ పాపను అపస్మారక స్థితిలో రక్షించి, హాస్పిటల్లో జాయిన్ చేసి వైద్యం, కొన్సిలింగ్ చేస్తున్నారు.ఆ పాపకు జరిగిన గాయం మాయని గాయం. 2012 లో జరిగిన నిర్భయ ఘటన ఇంకా కళ్ళ ముందే ఉంది, ఇది మరో నిర్భయ కేసు.  P0CSO కేసు నమోక్ష అయ్యింది, కొంతమంది మృగాలను పట్టుకున్నారు,ఆ అమ్మాయి వాంగ్మూలం వింటుంటే వళ్ళు జలదరించింది.
అయితే ఇది ఒక్క కేసు కాదు ఆ లేక్కలు చూసే భయం వేస్తుంది.NCRB నివేదిక ప్రకారం భారత దేశంలో ప్రతి సం|| 1లక్ష పైగా P0CSO కేసులు నమోదు అవుతున్నాయి. రోజుకు సగటున 100 - - 120 మంది బాలికలపై లైంగిక దాడులు ఆవుతున్నాయి.రాజస్థాన్ పిల్లల పై జరిగే లైఃగిక దాడుల్లో మొదటి  రాష్ట్రాల్లో ఉంది.
రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర,  మధ్యప్రదేశ్, ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో ఎక్కువ సంఘటనలు జరుగుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సామూహిక అత్యాచారాలు మరియ ట్రాఫికింగ్ క్రైం గురించి నివేదికల ప్రకారం, ఎక్కువగా ఈ సమస్య ఉన్న దేశాలు - భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికా, బ్రెసిల్, మెక్సికో, యూరప్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉంది.  కొన్ని దేశాల్లో ఈ క్రైం రేట్ అతి తక్కువగా ఉంది కారణం ఆ దేశాలు పిల్లల రక్షణ కోసం తీసుకునే జాగ్రత్తలు -కఠిన నిబంధనల,బలమైన చట్టలు, కఠిన శిక్షలు, నిరంతరం పోలీసింగ్, త్వరితగతిన న్యాయం దొరకడం, నిరంతరం సి సి టివీల పర్యవేక్షణ, చిన్న తరగతుల్లో సెక్సు ఎడ్యుకేషన్ ఇవ్వడం, సమాజం మంచి అవగాహనతో ఉండడం.ఆ దేశాలు- ఐస్లాండ్, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, జపాన్, సింగపూర్, స్విట్జర్లాడ్జ్,ఉత్తర యూరప్ దేశాలు.ఈ దేశాల్లో జీరో క్రైం అని చెప్పుకోవచ్చు.సమస్యలు పునరావృతం కాకుండా,ఈ క్రైమ్స్ అధికం కావడానికి కారణాలు ఆలోచిద్దాం,ఇంత కౄరంగా ఎందుకు ప్రవర్తిస్తారు అని చూస్తే ,కారణం - *1.మానసిక రుగ్మతలు*. దాంట్లో రకరకాలు ఉన్నాయి. 
*పెడోఫిలియా*-అంటే చిన్నపిల్లలతో లైంగిక సంపర్కం చేయాలి అని ఆలోచిస్తారు, ఇది ఒక మానసిక వ్యాధి.
ఎంపతీలోపం - అంటే ఎదుటి వ్యక్తి లేదా ఇతరులు బాధలో ఉన్నప్పుడు లేదా సమస్యలను చెప్పుకుంటున్నప్పుడు ఎలాంటి భావోద్వేగ స్పందన చూపకపోవడం,నాకేం సంబంధం అనే భావన ఉన్న వ్యక్తులు.
*పవర్ ఫిలింగ్*  - ఇది ఒక మానసిక వ్యాధి. బలహీనులైన బాలికలపై, మహిళల పై హింస చేసి తాను బలవంతుడి అని అనుకోవడ.
*2.సామాజిక  కారణాలు* - బాలికలను / మహిళలను వస్తువులుగా చూడడం, కేవలం వారు శారీరక సుఖాన్ని ఇచ్చే వస్తువులుగా చూడడం.పోర్నోగ్రఫీ, హార్డ్ కోర్ కంటేంట్ ఎక్కువగా చూస్తారు, ఆ విధంగా నిజ జీవితంలో ప్రవర్తించాలి అని దాడులకు పాల్పడ్డారు.
*3. అసాంఘిక కార్యకలాపాలకు బానిసలు* - డ్రగ్స్కు  బానిసలు, మద్యానికి బానిసలు,మత్తు పదార్థాలకు బానిసలుగా మారి, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారు.
*4.సిస్టం ఫెయిల్యూర్* -  శిక్షల గురించి భయం లేక పోవడం, న్యాయం ఆలస్యం, చాలా లొసుగులు ఉండడం,పోలిసింగ్ బలహీనత, హోటల్స్ పై ట్రాన్స్ పోర్ట్ పై నియంత్రణ, నిఘా లేకపోవడం.
*5.నా కెందుకు అని మౌనం వహించే సమాజం*.
*6.రక్షణ వ్యవస్థ బలహీనం, బాలల రక్షణ వ్యవస్థ పూర్తిగా బలహీనం.*

ప్రస్తుతం మనం పరిష్కార మార్గాలు చూడాల్సిన సమయం: ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, కఠిన శిక్షలు / మరణశిక్ష /జీవిత ఖైదు లాంటివి త్వరగా అమలు చేయాలి దానికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎక్కువగా ఏర్పాటు చేయాలి.సమాజం మౌనం వీడాలి,గానం విప్పాలి, బాధితులకు అండగా ఉండాలి.  చిన్న తరగతుల్లోనే / పాఠశాల స్థాయి నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పిల్లల్లో కాన్సిడెన్స్ పెంపొందించాలి. పాఠశాలల్లో ఆత్మరక్షణ కోసం కొన్ని మెళకువలు నెర్పించాలి కరాటే లాంటివి.
రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. నిరంతరం CCTV పర్యవేక్షణ ఉండాలి, ట్రాన్స్ పోర్టు కోసం ఉపయోగించే ఆటోలు, బస్సులు, కార్ల పై నిరంతరం నిఘా ఉండాలి.చిన్నారుల కోసం మన గళం విప్పాలి.ఈ పాపకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేయాలి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ ఆలోచనలు చెప్పండి ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల కంట్రోల్ చేయవచ్చు.

నల్లగొండ జిల్లాలో రెచ్చిపోతున్న భూ మాఫియా_

*నల్లగొండ జిల్లాలో రెచ్చిపోతున్న భూ మాఫియా*

*శాలిగౌరారం మండలం ఊటుకూరు గ్రామంలో పడగ విప్పిన భూ మాఫియా*

*ప్రభుత్వ భూములు,చెరువు శిఖం భూములపై అక్రమాల ఆరోపణలు... ప్రశ్నించిన సామాజిక ఉద్యమకారుడిపై దాడి!*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 13:

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊటుకూరు గ్రామంలోని ఎల్మరాజు కుంట అలుగుల ప్రాంతంలో ప్రభుత్వ భూమి, చెరువు శిఖం భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించి, అనంతరం అక్రమ పట్టాలు పొందినట్లు గ్రామస్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇట్టి విషయంపై గతంలో ఇప్పుడు దాడికి పాల్పడిన వ్యక్తులపై కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.మరియు కలెక్టర్ గారు ఇట్టి విషయం పై విచారణకు ఆదేశించడం కూడా జరిగింది.
*ఎల్ ఆర్ నెంబర్ (Lr.no.F1/3431/2025.తేది:-17/07/2025)*. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా రెచ్చిపోయి న భూ ఆక్రమణదారులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయి రెవెన్యూ విచారణ నిర్వహించి, నిజానిజాలు వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదే ప్రాంతంలో ఊటుకూరు నుండి కొండారం వైపు వెళ్లే ప్రజా బాటతో పాటు రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిని కూడా అడ్డుకుంటూ, ప్రభుత్వ భూమిలోని మట్టిని రైతులు తీసుకెళ్తున్న సమయంలో పనులను నిలిపివేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని వ్యక్తిగత ఆస్తిగా చూపించి ప్రజల రాకపోకలను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.ఈ సందర్భంగా రైతులందరికీ ఉపయోగపడే ప్రజా బాటను మూసివేయడం సరికాదని, సమస్యను చట్టబద్ధంగా పరిష్కరించాలని *సామాజిక ఉద్యమకారుడు వేముల శ్రీను సూచించగా, ఆయనపై దాడి జరిగి తీవ్రంగా గాయపడ్డారని ఆరోపణలు* ఉన్నాయి.ప్రభుత్వ భూములను కాపాడాలని అడిగితే దాడులా? ప్రజల హక్కుల కోసం మాట్లాడితే హత్యాయత్నమా? ఇదేనా ప్రజాస్వామ్యం?.ఈ ఘటనపై గ్రామ ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే పేరును వాడుకుంటూ ప్రజల్లో ఎమ్మెల్యేను బధనాం చేస్తూ... అతని ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతున్న, చెప్పబడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్  మరియు ఆయన సోదరుల పాత్రపై వస్తున్న ఆరోపణలను కూడా సమగ్రంగా విచారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ, ఆర్థిక లేదా ఇతర ప్రభావాలకు అతీతంగా నిజానిజాలను వెలికితీసి, ఎవరి ప్రమేయం ఉన్నా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గ్రామాలలో ఇలాంటి భౌతిక దాడులను ప్రోత్సహిస్తున్న  భూ కబ్జాకోరులు, మాఫియా అక్రమ దారుల ను ఉపేక్షించవద్దు. ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు ప్రజల ఆస్తి. వాటిని ఆక్రమించే హక్కు ఎవరికీ లేదు. ప్రజా బాటలను మూసివేసే హక్కు ఎవరికీ లేదు. ప్రశ్నించే గొంతులను అణచివేసే హక్కు ఎవరికీ లేదు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా విచారణ జరిపి, ప్రభుత్వ భూముల రికార్డులను బహిర్గతం చేయాలి. అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వేముల శ్రీనుపై జరిగిన దాడి ఆరోపణలపై కూడా సమగ్ర విచారణ నిర్వహించి, దోషులను చట్టం ముందు నిలబెట్టాలి.భూ మాఫియా ఎంతటి ప్రభావశీలులైనా చట్టం కంటే గొప్పవారు కాదు. ప్రభుత్వ భూములను కాపాడటం, ప్రజల హక్కులను రక్షించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత. న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్యవాదులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తాయి.

తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి తో Bplkm✍️

తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి ని & హైకోర్ట్ సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి బాలకిష్టి ని మర్యాదపూర్వకంగా కలిసిన మీడియా టుడే జాతీయ తెలుగు దినపత్రిక & అల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సోషల్ మీడియా (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ) కన్వినర్ బాపట్ల కృష్ణమోహన్.

https://x.com/Praja_Snklpm/status/2076537960850211150?t=8n5K00aaFqwFCJ8aPxeG8w&s=08

*_మీడియా టుడే :జాతీయ తెలుగు దినపత్రిక_*
media today pages 13-7-2026 epaper.mediatodaydaily.in/index.php?date…

*_తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి ని & హైకోర్ట్ సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి బాలకిష్టి ని మర్యాదపూర్వకంగా కలిసిన మీడియా టుడే జాతీయ తెలుగు దినపత్రిక జర్నలిస్ట్ & అల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సోషల్ మీడియా (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ) కన్వినర్ బాపట్ల కృష్ణమోహన్._*
*@high_assn93719 @IPRTelangana*