Thursday, March 6, 2025

చెరువుల అభివృద్ధిలో ఎక్క‌డా ఆటంకాలు లేకుండా చూస్తాము.. హైడ్రా

చెరువుల అభివృద్ధికి ఆటంకాలు తొల‌గిస్తాం
ప‌రిస‌రాల‌ను ఆహ్లాదంగా మార్చుతామ‌న్న‌ హైడ్రా క‌మిష‌న‌ర్‌
---------------
హైద‌రాబాద్‌, మార్చి 06:

* చెరువుల అభివృద్ధిలో ఎక్క‌డా ఆటంకాలు లేకుండా చూస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు చెప్పారు. 

* న‌గ‌రంలో చెరువుల అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌కు ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ద‌ని అన్నారు.

* కార్పొరేట్ సంస్థ‌లు సీఎస్ ఆర్ నిధుల‌ను అందించి చెరువుల అభివృద్ధికి తోడ్ప‌డాల‌న్నారు. అలాగే ప‌రిస‌ర ప్రాంతాల నివాసితుల్లో ఉన్న‌త వ‌ర్గాల వారు కూడా చేయూత‌నందించాల‌న్నారు. 

*  నాన‌క్‌రామ్ గూడ‌లోని ఖాజాగూడ పెద్ద చెరువుతో పాటు.. నెక్నాంపూర్‌లోని  ఇబ్రహీంబాగ్ చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు గురువారం క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. 

* ఖాజాగూడ చెరువు అభివృద్ధిలో త‌లెత్తిన  ఇబ్బందుల‌ను ఈ సంద‌ర్భంగా అక్క‌డ ప‌నులు చేప‌ట్టిన  ఎన్ ఎస్ ఎల్ ఇన్‌ఫ్రా, దివ్య‌శ్రీ ఇన్‌ఫ్రా ప్ర‌తినిధులు క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. 

* అక్క‌డిక‌క్క‌డే ఇరిగేష‌న్ అధికారుల‌తో మాట్లాడి.. చెరువులోకి మురుగు నీరు చేర‌కుండా కాలువ డైవ‌ర్ష‌న్ ప‌నులు చేప‌ట్టాల‌ని సూచించారు.

Courtesy / Source by :
#HYDRAA 

*_ప్రతిమ ఫౌండేషన్ లో శిక్షణ పొంది పల్లెటూరు నుంచి విదేశాలకు #తెలంగాణ బిడ్డ... ఆర్యన్ పొన్నం _*

దుబాయ్: 06/03/2025

*_ప్రతిమ ఫౌండేషన్ లో శిక్షణ పొంది పల్లెటూరు నుంచి విదేశాలకు #తెలంగాణ బిడ్డ._*

*_యువత నిరుద్యోగం ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఒక ముఖ్యమైన ఆందోళన,ఎందుకంటే బాల్య నిరుద్యోగం సామాజిక సంఘర్షణ, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రభావాలు …. వీటిని  ఎలా ఆదిగమించాలో చూపి అందరికి ఆదర్శంగా నిలిచిన యువకెరటం ఆర్యన్ పొన్నం._*

*_నేటి కాలం లో  నిరుద్యోగ యువతకు నెపుణ్య శిక్షణలు అవసరమే ..._*

*_"ప్రజాసంకల్పం మీడియాతో  యువకెరటం ఆర్యన్ పొన్నం  S/O సత్యం పొన్నం_*

*_జగిత్యాల: మెట్ పల్లి ప్రాంతము అమ్మక్కపేట్ గ్రామ శివారు లో చెన్ననేని విద్యాసాగర్ రావు (మహారాష్ట్ర మాజీ రాష్ర్టగవర్నర్) నిరుద్యోగ యువతకు వృత్తి, నైపుణ్యాలపై శిక్షణ అందించి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రతిమ ఫౌండేషన్,2019 ఆగస్టు లో ఏర్పాటు చేశారు._*

*_చెన్ననేని విద్యాసాగర్ రావు జీ ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందిన ఎందరో యువకులు ఈరోజు వివిధ కంపెనీ (దేశ & విదేశాలలో )మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు. అందులో ఒకరు ఆర్యన్ పొన్నం.రావు జీ చేసిన మేలు మరువలేనిది.మంచి ఆలోచనల తో ఏర్పడిన ఈ శిక్షణ కేంద్రం యువకులకు పూల బాటనిచ్చింది.భవిష్యత్ లో మెట్పల్లి ప్రాంత యువకులకు పునాది ఈ ఫౌండేషన్._*

*_ఈ సందర్బంగా విద్యాసాగర్ రావు జి కి ధన్యవాదాలు తెలిపారు ఆర్యన్ పొన్నం S/O సత్యనారాయణ పొన్నం._*

*_ఆర్యన్ పొన్నం సక్సెస్ కు కారణాలు👇_*

*_ప్రతిమ ఫౌండేషన్ లో సోలార్ టెక్నీషియన్ గా శిక్షణ తీసుకొని టాటా స్ట్రైవ్ సర్టిఫికెట్ అందుకొని ,జగిత్యాల జిల్లా డిస్ట్రిబ్యూటర్  సోలార్ ఇన్స్టాలేషన్ (మెట్ పల్లి) లో సంవత్సరమున్నర కాలం పాటు సోలార్ ఇన్స్టలేషన్ లో పని ఫీల్డ్ వర్క్ వివిధ గ్రామాల్లో చేసి,ఒక్క సంవత్సరము హైదరాబాదు లో  పనిచేసిన అనుభవం తో యూఏఈ లో సందర్శక వీసా మీద వచ్చి దుబాయిలో పని కోసం వెతికితే  మూడు రోజులు ట్రయల్ కూడా తీసుకున్నారు. Hansa  enargy ఎనర్జీ సొల్యూషన్ లో,  (Tata strive  certificate) )ఉపయోగపడింది.   గత సంవత్సరన్నర కాలముగా సోలార్ ఇన్స్టాలేషన్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నారు.రానున్న రోజుల్లో దేశ విదేశాల్లో సోలర్ వినియోగం అత్యంత వాడకంలోకి రానున్నది. యువకులు తప్పకుండా నైపుణ్యం కలిగిన టెక్నికల్ పనులు నేర్చుకుంటే దేశ విదేశాల్లో మంచి ఉపాధి అవకాశం  అని తన అనుభవాన్ని "ప్రజా సంకల్పం" న్యూస్ తో పంచుకున్నారు ఆర్యన్ పొన్నం._*

*_ఆర్యన్ తండ్రి సత్యం పొన్నం దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నారు. తను Dubai (WTC)(UAE Telugu Helping Hands organisation) లో సభ్యులు._*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Rupavath Shankar, SI of Police of Korutla Police Station, Jagtial District was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.5,000/- from the complainant for showing an official favour "to issue notice under section 35 BNSS in a Case was registered against the complainant in the Police Station, Korutla."

“Dial 1064 for Reporting Corruption”

"ఫిర్యాదుదారుడిపైన కోరుట్ల రక్షక భట నిలయంలో నమోదైన ఒక కేసులో సెక్షన్ 35 భా.న్యా. సు.సం. క్రింద నోటీసు జారీ చేయడానికి" అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.5,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన జగిత్యాల జిల్లా కోరుట్ల రక్షక భట నిలయంలో పనిచేస్తున్న ఎస్.ఐ. రూపావత్ శంకర్.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1897336343686250932?t=mNR6QlhhMLzsroPawIdW8Q&s=19

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Gajula Shyam Prasad, ADE, Operations, TGSPDCL, Choutuppal, Yadadri Bhuvanagiri District was caught by Telangana #ACB,Officials for demanding and accepting the #bribe amount of Rs.70,000/- from the complainant for showing official favour "to get the inspection for Synchronization of NET Meter installed at a Pharmaceutical Company in TGSPDCL Portal through DE (Ops), Choutuppal in order to get Complainant's pending bills from another private company".

“Dial 1064 for Reporting Corruption”

"ఒక ఫార్మా కంపెనీ లో నెట్ మీటర్ ను ఏర్పాటు చేసినందుకు, డి.ఇ.ఆపరేషన్స్ చౌటుప్పల్ చేత అట్టి మీటర్ ను అనుసంధానం చేయడానికి మరియు ఇంకొక ఫార్మా కంపెనీకి సంబంధించి  పెండింగులో గల ఫిర్యాదుధారునికి సంబంధించిన బిల్లులను స్వీకరించేందుకు" అధికారికంగా అనుకూలతను చూపించేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ. 70,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్. లో పనిచేస్తున్న ఎ.డి.ఇ. (ఆపరేషన్స్) గాజుల శ్యామ్ ప్రసాద్.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1897622559656702098?t=7r7qAdx47Qz1fDctyuUg-w&s=19

Wednesday, March 5, 2025

తాగునీటిని వృధా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం... hmwssb-MD

తాగునీటితో బైక్ క్లీనింగ్... వ్యక్తికి జరిమానా
====================
# ఎవరైనా ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని ఎండీ హెచ్చరిక

జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ లో జరిగింది. 

జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై వెళుతుండగా... రోడ్ నం. 78 లో నీరు లీకేజి అయినట్టు ఎండీ గమనించి..  స్థానిక జీఎంను లీకేజికి కారణాలు అరా తియ్యమని ఆదేశించారు.. దీంతో ఓ అండ్ డివిజన్ జీఎం హరిశంకర్ స్థానిక మేనేజర్ తో వెళ్లి పరిశీలించారు. అయితే దగ్గరికి వెళ్లి చూస్తే ఒక వ్యక్తి జలమండలి సరఫరా చేసే నీటితో బైక్ కడుగుతున్నాడు. ఇదే విషయం ఎండీకి విన్నవించారు.. దీంతో ఎండీ ఆగ్రహం వ్యక్తం చేసి.. తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని చెప్పారు. అంతే కాకుండా అతనికి నోటీసు అందించి, జరిమానా వెయ్యాలని సంబంధిత జనరల్ మేనేజర్ ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి రూ.1000 జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించద్ధని ఎండీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే..  తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జలమండలి సుదూరు ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తుంది. కాబట్టి.. నీటిని వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరుతోంది. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోగా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. రానున్న రెండు నెలలు నీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తాగునీటికై సరఫరా చేసే శుద్ధమైన నీటిని వృధా చేయకూడని విజ్ఞప్తి చేస్తోంది.  

జలమండలి జిహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో 13.7 లక్షల నీటి కనెక్షన్లు ఉండగా ప్రతి రోజూ 550 ఎంజీడీల నీటిని ప్రజలకు సరఫరా చేస్తోంది. వెయ్యి లీటర్ల (ఒక కిలోలీటరు) నీటి సరఫరాకు రూ.48 వ్యయం చేస్తోంది. కేవలం తాగునీటి కోసం ఉద్దేశించిన రక్షిత నీటిని  వాహనాలను శుభ్రం చేయడానికి, గార్డెనింగ్, ఇళ్ల పరిసరాలను కడగడానికి వృధా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారు.

Courtesy / Source by : 
https://x.com/HMWSSBOnline/status/1897307892329365864?t=_dE65w2cRXcxK0-mehF8Dg&s=19

మాయమైపోతున్నడమ్మా.. మనిషి అన్నవాడు..

మాయమైపోతున్నడమ్మా.. మనిషి అన్నవాడు.. ఎంతలా అంటే వ్యక్తిగత స్వార్థం ఎక్కువై.. ఆస్తులు, డబ్బే ముఖ్యమై.. ఇలా కన్న వాళ్లను, కట్టుకున్న వాళ్ళను కడతేర్చే అంత. 

కొందరికి అయినవారి కన్నా ఆస్తిపాస్తులే ముఖ్యం అవుతుండటం బాధాకరం.

Courtesy / Source by :
https://x.com/SajjanarVC/status/1896870575890645278?t=5gB4F2L6wwVa5V7Df1WGmA&s=19

Monday, March 3, 2025

_న్యాయం కోసం 12 ఏండ్లుగా అలుపెరుగనిపోరాటం చేస్తున్న ప్రముఖ పరిశోధన పాత్రికేయులు_

*_న్యాయం కోసం 12 ఏండ్లుగా అలుపెరుగనిపోరాటం చేస్తున్న సీనియర్ పాత్రికేయులు / ప్రముఖ పరిశోధన పాత్రికేయులు ఆనం చిన్ని వెంకటేశ్వరరావు గారికి అండగా 'ప్రజాస్వామ్యం' ను పరిరక్షించే శ్రేయోభిలాషులందరం ✊... Bplkm✍️_*