Wednesday, December 11, 2024

*_శ్రీహరికోట ఎంత భద్రం.?_*

_అభద్రతలో అంతరిక్ష పరిశోధన కేంద్రం_
*_శ్రీహరికోట ఎంత భద్రం.?_*
_# కానరాని సమన్వయ కమిటీ సూచనలు_
_# పోలీసుల తనిఖీలు అంతంతే_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_'తెలంగాణ వాచ్' సంచలన పరిశోధన కథనం_*

*_దేశ భద్రత దృష్ట్యా కొన్ని చేదు వాస్తవాలను బహిరంగ పర్చాల్సి ఉంటుంది. అలాంటి అరుదైన, అవాంఛనీయ కథనం ఇది. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం భద్రత పరంగా అత్యంత సున్నితమైంది. అయితే ఈ విషయంలో నీలినీడలు అలుముకుంటున్నాయి. నిఘావర్గాలు హెచ్చరించినా లోపాలు కనిపిస్తున్నాయి. కేంద్ర పారిశ్రామిక భద్రత దళాలు, పోలీసుల మధ్య సమన్వయం సైతం లోపించింది. ఏడాది కిందట భద్రతపై సమన్వయ కమిటీ చేసిన సూచనలు అమలు కావడం లేదు._*

*_సమన్వయ కమిటీ సమావేశం_*
శ్రీహరికోట భద్రతకు సంబంధించి గతేడాది నవంబరు 8న సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. షార్‌ నియంత్రణ, విజిలెన్సు అధికారి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తమిళనాడు, ఆంధ్ర పోలీసు అధికారులు, కోస్ట్‌గార్డు, కేంద్ర, రాష్ట్ర నిఘా అధికారులు, సీఐఎస్‌ఎఫ్‌ దళాల అధిపతులు పాల్గొన్నారు. ఎవరు వస్తున్నారో..? వెళ్తున్నారో..? అర్థం కావడం లేదని, పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, నిరంతరం తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

*_చక్కర్లు కొట్టని బోటు_*
తీరంలో నిరంతరం బోటు ద్వారా పెట్రోలింగ్‌ చేయాలని కోస్ట్‌గార్డు అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్రాలకు సరఫరా చేసిన బోట్లు చక్కగా వినియోగంలో ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉపయోగించడం లేదని ఆ విభాగం అధికారులు చెబుతున్నారు. 

*_అరకొరగానే.._*
కంచెతోపాటు సీసీ కెమెరాలు అరకొరగానే ఏర్పాటు చేశారు. దీవుల్లో తనిఖీలు మరిచారు. సీఐఎస్‌ఎఫ్, పోలీసుల మధ్య సమన్వయం లేదు. ఉద్యోగుల కాలనీలు, పులికాట్‌ నగర్‌లో చోరీలు జరుగుతున్నాయి. ఇటీవల బెల్జియంకు చెందిన ఉపగ్రహం రాగా పోలీసులు బందోబస్తు విస్మరించారు. 

*_దృష్టిసారిస్తాం.._* _-శ్రీనివాసులురెడ్డి, నియంత్రణ, విజిలిన్స్‌ అధికారి_
షార్‌ శ్రీహరికోట భద్రతపై దృష్టి పెడతాం. దీవుల్లో తనిఖీలు ఉండేలా సంబంధిత అధికారులతో మాట్లాడతాం. అన్ని విషయాలపై మరోసారి అధికారులతో చర్చిస్తాం.

*_చివరిగా.._*
భారత దేశ భద్రత దృష్ట్యా భారతీయ పౌరుడిగా ఎంతో సమాచారం ఉన్నప్పటికీ.. కొంత మేరకే సమాచారం బయటకు విడుదల చేస్తున్నాం. 'షార్' అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి వెంటనే కేంద్ర, రాష్ట్ర బలగాలతో రక్షణ కల్పించాల్సిన తక్షణ బాధ్యత ప్రభుత్వాలది. 

*_అంకితం_*
ఈ కథనం భారతరత్న అబ్దుల్ కలాంకు అంకితం

బాక్స్:

1970 వరకూ అంతరిక్ష పరిశోధనలకు కేరళ లోని తిరువనంతపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న తుంబా అంతరిక్ష కేంద్రాన్ని ఉపయోగించేవారు. కానీ దీని చుట్టూ జనసంచారం ఎక్కువగా ఉండేది. పైగా ఆ కేంద్రం మినీ రాకెట్ ప్రయోగాలకే పరిమితం. భవిష్యత్తులో చేయబోయే భారీ రాకెట్ ప్రయోగాల దృష్ట్యా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరోచోట రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో అనువైన రాకెట్ ప్రయోగ కేంద్ర స్థలం కోసం అన్వేషణలో భాగంగా దేశంలో అన్ని ప్రాంతాలనూ పరిశీలిస్తూ రాగా ఈ దీవి కంటపడింది. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఈ దీవి రాకెట్ ప్రయోగాలకు అత్యంత అనువైనదిగా భావించిన సారాభాయ్ బృందం ఆ విషయాన్ని ఇస్రోకు తెలిపింది. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేల ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చింది.

Tuesday, December 10, 2024

*_కొందరి అత్యుత్సాహం వల్ల మొత్తం #జర్నలిజం కే చెడ్డపేరు వచ్చింది._*

https://x.com/Praja_Snklpm/status/1866728792334512379?t=Sc5zDsa8w745RtrRSSF-rw&s=08  

*_#MohanBabu గారు ఆడియో ద్వారా ₹జర్నలిస్ట్ #జర్నలిజం గురించి వాస్తవాలు చెప్పారు ✊_*

*_నిన్న మోహన్ బాబు గారి ఆడియో విన్న తరువాత అయినా #జర్నలిస్ట్ #జర్నలిజం లో మార్పు వస్తుంది అనుకుంటున్నాను._*

*_కొందరి అత్యుత్సాహం వల్ల మొత్తం #జర్నలిజం కే చెడ్డపేరు వచ్చింది._*

*#SaveJournalism*

*@IPRTelangana*
 
*#pashamyadagiri* 
*#anamchinnivenkateshwararao*  *#kkrAWJA* *#TJSS*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

Monday, December 9, 2024

జీడిమెట్ల ఆరోరా ఫార్మాసూటికల్ చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం?

https://x.com/Praja_Snklpm/status/1866371180157977015?t=cl3s0cCfOnKJrXzqzMI9eg&s=08 

 *#AroraPharma #jeedimetla*
*#LaboursDead* *#Telangana*

*_@psjdm_cyb ఆరోరా ఫార్మాసూటికల్ యాజమాన్యం చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం ఎంత ఇచ్చారు తెలుపగలరు._*

*@TelanganaCMO @TelanganaCS @IPRTelangana @OffDSB @mpponguleti @DamodarCilarapu @HRF_Humanrights @BplplH @brkalapala*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

*#HumanRightsViolations*

https://x.com/Praja_Snklpm/status/1866341732889321908?t=kw0lPPUU6cQCvgSkEkuCmA&s=08  

*#HumanRights #HumanRightsDay #HumanRightsViolations*

*_మానవహక్కులకు కాలరాసిన #కెసిఆర్ ప్రభుత్వం... కాలరాస్తున్న #RevanthreddyCM ప్రభుత్వం._*

*#IndianConstitution #SupremeCourtIND* 
*#TelanganaHighCourt*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #balalahakkulasangham* 

*కలం యోధులు*
*Blkm✍️*

*_మజీద్ పేరుతో వేలకోట్ల ప్రభుత్వభూమి కబ్జా_*

https://www.youtube.com/live/z6QVgfUK1Lg?si=89P_p-nS6g3JMMnl 

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_మజీద్ పేరుతో వేలకోట్ల ప్రభుత్వభూమి కబ్జా_*

*_#సంగారెడ్డి జిల్లా #అమీన్పూర్ మండలం, #సుల్తాన్పూర్ గ్రామం లో వేలకోట్ల ప్రభుత్వభూమిని కబ్జా చేస్తుంటే జిల్లా అధికారులు నిద్దురపోతుండ్రా ?_*

*_Rtv మీడియా గ్రౌండ్ రిపోర్ట్ విశ్లేషణ ప్రకారం ప్రభుత్వభూములు కబ్జాలు చేస్తున్న రాజకీయ నాయకులు / ప్రజాప్రతినిధులు వీరికి సహకరించిన సహకరిస్తున్నా సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఎందుకంటే  ఇతర రాష్ట్రాల నుంచి మనుషులను తీసుకొచ్చి వారికి ఇక్కడ మకాం ఏర్పాటు చేసి ఈ తతంగం చేయడం ఏమిటి ? అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్లలో ఎవరైనా సంఘ విద్రోహక శక్తులు ఉంటే ?జిల్లా పోలీస్ యంత్రాంగం ఏమి చేస్తుంది? ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత శాఖల ప్రభుత్వఅధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వారిని విధుల నుంచి తొలగించాలి._*

*@RTVnewsnetwork ✊*

*Cc:@TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @IPRTelangana @Collector_SRD @TelanganaDGP @DamodarCilarapu @mpponguleti @RaviVattem*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1866127023930015869?t=arti3nK0XUwWkvp5LwdtcQ&s=19

“Dial 1064 for Reporting Corruption”

#ACBOfficials registered a case of Criminal Misconduct against Katta Nagesh, Senior Accountant, District Treasury Office, Khammam for demanding #bribe of Rs.40,000/- from the complainant to process the Revised Pay Scale - Pay Fixation, Service pension, Gratuity, Enhanced family Pension, Normal family pension bills and Commutation amounting to about Rs. 3,92,960/- pertaining to an Expired Person (Employee), who was a relative of the complainant.

“Dial 1064 for Reporting Corruption”

చనిపోయిన ఉద్యోగి (ఫిర్యాదుధారుని బంధువు) కి సంబంధించిన చెల్లింపు స్థిరీకరణ , సేవా ఫించను, గ్రాట్యుటీ, మెరుగైన కుటుంబ పింఛను, సాధారణ కుటుంబ ఫించను బిల్లులు  మరియు కమ్యుటేషన్ man (మొత్తం విలువ రూ. 3,92,960/-) లను సవరించబడిన చెల్లింపు స్థాయి (ఆర్ పి ఎస్) ప్రకారం మంజూరు చేయడానికి ఫిర్యాదుదారుని నుండి రూ. 40,000/- #లంచం డిమాండ్ చేసినందుకు గాను ఖమ్మం జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న కట్టా నగేష్‌ పైన "క్రిమినల్ మిస్కాండక్ట్ కేసు" నమోదు చేసిన #అనిశా అధికారులు.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1866074048511582306?t=UaOXp7vgsrV2ItYuLC_Nig&s=19

Sunday, December 8, 2024

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తా..

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని ముఖ్యమంత్రి @revanth_anumula గారు చెప్పారు. “ఎంత ఖర్చయినా కానివ్వండి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది” అని అన్నారు.

✅ ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా నల్గొండలో నిర్వహించిన సభలో ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు, ఇతర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

✅ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుల సంక్షేమం, మూసీ పునరుజ్జీవం, నల్గొండ జిల్లా సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామన్న విషయాన్ని పునరుద్ఘాటించారు. ఇంకా ఏమన్నారంటే...

✅ మూసీ ప్రక్షాళన చేయకపోతే నల్గొండ ప్రజలు జీవించలేని పరిస్థితులు తలెత్తబోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఫ్లోరైడ్ బారిన పడి నల్గొండ ప్రజలు అనేక విధాలుగా నష్టపోయారు.

✅ మూసీలో కొట్టుకొచ్చే శవాలు, కళేబరాల నుంచి విముక్తి కలిగించి ఈ జిల్లాలో వ్యవసాయానికి, తాగునీటికి ఉపయోగపడే విధంగా గోదావరి నుంచి నీటిని తరలించి కృష్ణా నదిలో కలిసే వరకు ప్రాజెక్టును పూర్తి చేస్తాం.

✅ నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎన్ని నిధులైనా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది.

✅ ఈ ప్రాంతానికి కృష్ణా నదీ జలాలను ప్రవహింపజేసి దేశానికే తలమానికంలా నిలబెట్టాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోంది.

✅ ప్రపంచంలోనే పొడవైన 44 కిలోమీటర్ల ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను పూర్తి చేసి 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు తాగునీటిని ఇవ్వాలని ఆనాడు ప్రణాళికలు సిద్దం చేశాం.

✅ బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీరివ్వాలని సంకల్పించాం. కానీ గడిచిన పదేళ్ల ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.

✅ ప్రజా ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా పోరాటాల గడ్డ నల్గొండ జిల్లాలో ఉత్సవాలు చేసుకోవడం సంతోషకరం.

✅ 21 వేల కోట్ల రూపాయలతో 25 లక్షల మంది రైతులకు 2 లక్షల మేరకు రుణమాఫీ చేశాం. ఒక్క నల్గొండ జిల్లాలోనే 2400 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగింది.

✅ 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇచ్చిన మాట ప్రకారం సన్నాలకు రూ. 500 బోనస్ ఇచ్చాం.

✅ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ప్రభుత్వ పరంగా 55,143 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర దేశంలోనే ఏ రాష్ట్రానికి లేదు.

✅ నల్గొండ రింగ్ రోడ్డును పూర్తి చేస్తాం. రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని కట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.

✅ ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ @Gutha_Sukender గారు, మంత్రులు @UttamINC గారు,  @DamodarCilarapu గారు, @Tummala_INC గారు, @KomatireddyKVR గారు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. #TelanganaRising #PrajaPalana #Nalgonda #MusiRejuvenation 

Courtesy / source : https://x.com/TelanganaCMO/status/1865419465472758240?t=_cPLxgIFBHqqdcIINro2AA&s=19