Saturday, September 30, 2023

👉తస్మాత్ జాగ్రత్త...దంపతులకు కాని ఒంటరి మహిళలు కానీ

👉తస్మాత్ జాగ్రత్త

దంపతులు కాని ఒంటరి మహిళలు కానీ వృత్తి పరంగా లేదా విహార యాత్రకో దూర ప్రాంతాలకు వెళ్లి హోటల్ గదుల్లో బసచేయాల్సి రావటం తప్పనిసరవుతుంది......

ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెందడం వల్ల సౌకర్యాలతో పాటు ఇబ్బందులు కూడా పెరుగు తున్నాయని గుర్తించాలి.......

బసచేసే గదుల్లో, చీకటిలో సైతం చిత్రీకరించగల అత్యాధునిక రహస్య కెమేరాలు బిగించి, అభ్యంతర సన్నివేశాలను నేరస్తులు చిత్రీకరించి అంతర్జాలంలో సొమ్ము చేసుకుంటున్నారు. గుర్తు పట్టలేనంత సూక్ష్మ కెమేరాలు మార్కెట్లో లభిస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నేరస్తుల వల్ల ఇబ్బంది పడకుండా ఉండవచ్చు........

మీరు బసచేసే ప్రాంతం గురించి, హోటల్ గురించి ముందుగానే సమాచారం సేకరించి నమ్మకం కుదిరాకే హోటల్ గది బుక్ చేసుకోవాలి.........

ఎంత మంచి పేరున్న హోటలయినా గుడ్డిగా నమ్మి అజాగ్రత్తగా ఉండకండి. హోటల్ యాజమాన్యం మంచిదయినా, పనిచేసే సిబ్బంది నేరపూరిత మనస్తత్వం ఉన్న వాళ్ళు కావచ్చు. ఇంతకు ముందు బసచేసిన కస్టమర్లు కూడా, హోటల్ సిబ్బందికి తెలియకుండా రహస్యంగా కేమేరాలు ఏర్పాటు చేసుకుని, రిమోట్ లొకేషన్ నుంచి చిత్రాలను రికార్డు చేసుకొనేందుకు అవకాశం ఉంది.........

హోటల్ గదుల్లోనే కాకుండా, ట్రయల్ రూమ్స్, మహిళా షేరింగ్ గదుల్లో, రాబందుల వంటి బందువుల ఇళ్ళల్లో కూడా రహస్య కెమేరాలు అమర్చి అభ్యంతర సన్నివేశాలు చిత్రీకరించే అవకాశం లేకపోలేదు.........

ఇటు వంటి నేరాలకు పురుషులే కాకుండా, సాటి స్త్రీలు కూడ పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. దగ్గరి బంధువులు, స్నేహితులు కూడా అభ్యంతర సన్నివేశాలను రహస్యంగా చిత్రీకరించి, బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది.........

గదిలో ప్రవేశించిన వెంటనే, గదిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఫ్లవర్ వాజులను, అలంకారం కోసం ఉంచిన బొమ్మలను, లైట్లను, గోడ గడియారాలను, అవకాశం ఉన్న ఇతర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయ మేమంటే, రహస్య కెమేరాలు అతి సూక్ష్మంగా ఉండి, అలంకారం కోసం ఉంచిన వస్తువుల రంగులతో కలిసిపోయి, గుర్తించలేనంతగా అమరుతాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప కనిపించవు.........

గదిని పూర్తిగా చీకటి చేసి, అంటే లైట్లు, టి.వి లు, ఇతర వెలుగునిచ్చే డివైజులన్నింటిని ఆపి, మీ మొబైల్ ఫోన్ కేమరాతో గది మొత్తం క్షుణ్ణంగా పరిశీలించండి. రహస్య కెమరాల నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ కిరణాలు మిణుకు మిణుకు మంటూ కనిపిస్తాయి...........

మీ పరిశీలనలో ఏమైనా రహస్య కెమేరాలు దొరికి నట్లయితే, ముందుగా మీ మొబైల్ కెమెరాతో ఫొటోలు తీయండి. సాక్ష్యం కోసం పనికి వస్తాయి. హోటల్ యాజమాన్యంకి కాకుండా, డైరెక్టుగా లోకల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి మరో హోటలుకి మారండి. వీలైతే స్థానిక మీడియా దృష్టికి తీసుకు రండి................
Courtesy / Source by : శ్రీమతి రాధిక గారు IPS, SP - శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ 

Friday, September 29, 2023

తెలంగాణ శ్రీ శ్రీ,అభ్యుదయ కవి, దివంగత శ్రీ అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.

తన కవిత్వాన్ని నిర్భాగ్యుల గొంతుకగా మలచిన ప్రజా కవి, తెలంగాణ శ్రీ శ్రీ గా అభిమానులు పిలుచుకునే తెలంగాణ అభ్యుదయ కవి, దివంగత శ్రీ అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇల్లును కేటాయించి అలిశెట్టి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.

నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీ అలిశెట్టి ప్రభాకర్ చిత్రకారుడుగా, ఫోటోగ్రాఫర్ గా అభ్యుదయ కవిగా సమాజం కోసం నిరంతరం శ్రమించి తన జీవితాన్ని త్యాగం చేసాడు. మనసున్న ప్రతి మనిషిని తన కవిత్వంతో కదిలించినవాడు అలిశెట్టి. 

నాటి ఉమ్మడి పాలనలో సామాన్యులకు జరిగే అన్యాయాలపై కలం పోరాటం చేసిన సృజనాత్మక కవి అలిశెట్టి. దారితప్పిన సామాజిక పోకడలను పదునైన పదాలతో కూడిన సునిశిత వ్యంగ్యంతో సరిదిద్దే ప్రయత్నం చేసినాడు. పేదరికం మీద, మహిళా సమస్యలమీద, పల్లె పట్నం బాధల మీద సమస్త సామాజిక రంగాలలో అసమానతలు, అన్యాయాల మీద తన కవితల బాణాలను గురిపెట్టి కొడుతూ సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాల తరఫున బాధ్యత కలిగిన సైనికుడుగా అక్షర పోరాటం చేసినవాడు అలిశెట్టి. సామాజిక బాధ్యతలే తప్ప తన ఇంటి బాధ్యత, తన వంటి బాధ్యత కూడా పట్టకుండా తన జీవితాన్ని కళకే అంకితం చేసిన త్యాగశీలి అలిశెట్టి.

సమాజం కోసం తన జీవితాన్నే త్యాగం చేసి తనువు చాలించిన కవి అలిశెట్టి కుటుంబం నేడు పేదరికంలో మగ్గుతుండడం, భార్య భాగ్యమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నదని తెలుసుకున్న ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అలిశెట్టి కుటుంబానికి సరియైన విధంగా సహాయం అందించే చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీ @KTRBRS కు ఆదేశించారు.

సీఎం ఆదేశాల మేరకు మంత్రి కేటిఆర్ వెంటనే స్పందించి శ్రీ అలిశెట్టి ప్రభాకర్ కు డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ను ఇప్పించేందుకు తన కార్యాలయాన్ని ఆదేశించారు.

మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు దివంగత అలిశెట్టి ప్రభాకర్ భార్య శ్రీమతి భాగ్యమ్మ పేరుతో అసీఫ్ నగర్ లోని జియాగూడలో నిర్మించిన డబుల్ బెడ్రూంల సముదాయంలో వొకదానిని కేటాయిస్తూ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

తమకు డబుల్ బెడ్ రూం కేటాయించినందుకు అలిశెట్టి ప్రభాకర్  భార్య భాగ్యమ్మ, కుమారులు సంగ్రామ్, సంకేత్ సహా ఇతర కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కు, మంత్రి శ్రీ కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కవిగా తమ తండ్రి త్యాగాలను గుర్తించి తమను కష్టకాలంలో ఆదుకుని తమకో గూడు నిలిపినందుకు సీఎంకు రుణపడి వుంటామని అలిశెట్టి కుమారులు అన్నారు.

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1707779720501449052?t=9WWWa71Red_b87RoqouZCg&s=19

Thursday, September 28, 2023

45ఏళ్లుగా గ్రామం మొత్తంలో ఓకే వినాయకుడిని ప్రతిష్టిస్తారు.

*ఒకే వినాయకుడు ముద్దు...*

*ఐక్యమత్యనికి ప్రతిరూపం లింగారెడ్డి గూడ...*

*కుల మతాలకు అతీతంగా వేడుకలు..*

*వేలంపాటలో లడ్డు దక్కించుకున్న మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర్ రెడ్డి..*

*అంబరాన్ని అంటిన సంబరాలు..*

ఒకే గణపతి ముద్దు అంటూ ఆ గ్రామం తీర్మాణం చేసుకుంది.వినాయక చవితి వచ్చిదంటే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా ఉత్సవాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తారు. నవరాత్రులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పల్లె నుంచి పట్నం వరకు వాడవాడలా సందడి ఉంటుంది. కానీ షాద్ నగర్ నియోజక వర్గం ఫరూఖ్ నగర్ మండలం లింగారెడ్డి గూడ గ్రామం దానికి బిన్నం.బిన్నత్వంలో ఏకత్వానికి నిర్వచనం లింగారెడ్డి గూడ గ్రామ ప్రజల ఐక్యమత్యం. దాదాపు 45ఏళ్లుగా గ్రామం మొత్తంలో ఓకే వినాయకుడిని ప్రతిష్టిస్తారు. ఓకే వినాయకుడిని ప్రతిష్టించి  గణేష్ వేడుకల్లోను తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఊరికి ఒకే విగ్రహం పెట్టాలని మొదలైన తీర్మాణాలు పలు పల్లెలను కదిలిస్తు్న్నాయి. ఒకే విగ్రహం నెలకొల్పేలా స్పూర్తిని నింపుతున్నాయి. లడ్డు వేలంపాటలో మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర రెడ్డి 2,25,000 వేలకు వేలం పాటలో లడ్డును కైవసం చేసుకున్నాడు. వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.కులాల మతాలకు అతీతంగా వేడుకలు నిర్వహణ అని ఏక దంతునితో స్పష్టంగా కనిపిస్తుంది..

*CRM...!* (ప్రజల పక్షం)

వినాయకుని విగ్రహాలు ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా....?

*వినాయకుని విగ్రహాలు ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా....?*

*భక్తి...*
హిందువులు జరుపుకునే పండగల్లో వినాయకచవితి ఒకటి. భాద్రపదమాసం శుక్ల పక్షంలో వచ్చే చవితి తిధి, హస్త నక్షత్రం రోజున మధ్యాహ్న శుభ సమయంలో చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.అయితే ఎవరి శక్తి తగట్టు వాళ్ళు ఒకరోజు, 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటారు. మొదటి రోజు వినాయక ప్రతిమని మండపంలో ప్రతిష్టించడంతో ప్రారంభమైన పండుగ వినాయకుని ప్రతిమని నిమజ్జనం చేయడంతో ముగుస్తుంది. అయితే వినాయకుని ప్రతిమలని ఎందుకు నిమజ్జనం చేస్తారు అనే సందేహం ఎప్పుడైనా కలిగిందా..? అయితే ఎందుకు నిమజ్జనం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా వినాయకచవితి భాద్రపదమాసంలో అంటే వర్షాకాలంలో వస్తుంది. ఇలా వర్షాకాలంలో జరుపుకోవడం వెనుక చాల కారణాలు ఉన్నాయి. వర్షాకాలంలో వానలు ఎక్కువగా కురవడం వల్ల నదులు, కాలువలు, పొంగి పొరలుతుంటాయి. ఇలా నీరు ఉద్రికతతో ప్రవహించడం వల్ల భూక్షయం ఏర్పడుతుంది. అంటే సారవంతమైన మట్టి కొట్టుకు పోతుంది. వినాయకుని ప్రతిమలని నిమజ్జనం చేయడం వల్ల సారవంతమైన మట్టి తిరిగి నదుల్లో కాలువల్లో చేరుతుంది. అలానే వినాయకుని ప్రతిమని ఆకులతో మరియు పువ్వులతో పసుపు కుంకాలతో పూజించి వినాయకునితో పాటు నీటిలో కలుపుతారు.
అలా వినాయకుణ్ణి పూజచే ఆకులు ఆయుర్వేద గుణాలను ఆకలిగి ఉంటాయి. ఇవి నీటిలో కలపడం వల్ల నీటిలోని సూక్ష్మ క్రిములు నశించి నీరు స్వచంగా మారుతుంది. ఈ నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండావుంటాయి. అలానే వర్షాకాలంలో మనుషుల్లో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. దీనితో జలుబు, దగ్గు, జ్వరం వంటి అనేక వ్యాధులు వచే అవకాశం ఉంది. అలానే జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది. అందుకే ఈ పండుగ రోజుల్లో ఎక్కువగ ఆవిరిపైన ఉడికించిన పౌష్ఠిక విలువులున్న ఆహార పదార్ధాలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటాము. దీనివల్ల మనలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలానే ఆవిరిపైన ఉడికిన పదార్ధాలు త్వరగా జీర్ణం అవుతాయి. ఇలా జీర్వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

*సుజీవన్ వావిలాల🖋️*

హరిత విప్లవ పితామహుడు... MS స్వామినాథన్ కన్నుమూత..!

*హరిత విప్లవ పితామహుడు... MS స్వామినాథన్ కన్నుమూత..!*

భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్(98) గురువారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు
ఇది భారతదేశంలోని తక్కువ-ఆదాయ రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి ఎంతో సహాయపడింది. స్వామినాథన్ చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించిన తర్వాత 1987లో మొదటి ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారు. అనేక అవార్డులతో పాటు, స్వామినాథన్ రామన్ మెగసెసే అవార్డు (1971) మరియు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు (1986) గ్రహీత. ఆయనకు భార్య మినా మరియు ముగ్గురు కుమార్తెలు సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్ మరియు నిత్యా స్వామినాథన్ ఉన్నారు

*సుజీవన్ వావిలాల*🖋️

Wednesday, September 27, 2023

స్టెప్పులేసిన...వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాధ్

*వినాయక నిమజ్జన వేళ.... స్టెప్పులేసిన.... సీపీ రంగనాధ్*

వరంగల్‌  : సిటీ పరిధిలో వినాయక నిమజ్జనానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ.రంగనాథ్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పరిధి కాలనీల్లో నిమజ్జన ప్రాంతాలను ముందస్తుగా గుర్తించడంతో పాటు ఆయా వినాయక మండపాల నిర్వాహకులకు సూచనలు చేశారు.కమిషనరేట్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జనం సందర్భంగా పోలీస్‌ అధికారులు, సిబ్బందితో కలిసి సీపీ రంగనాథ్‌ స్టెప్పులేశారు. సిబ్బందితో ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

వైకల్య ధ్రువీకరణ పత్రం జారీలో అవకతవకలు.. NPRD

పత్రిక ప్రకటన   27.09.2023

*కరీంనగర్ జిల్లాలో సదరం క్యాంపులో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి*

*బోగస్ సర్టిఫికెట్స్ జారీ చేస్తున్న డాక్టర్లపై కేసు నమోదు చేయాలి*

            *NPRD డిమాండ్* 

 కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాపితంగా సదరం 
క్యాంపులో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, స్లాట్ బుక్ చేయడం కోసం డబ్బులు వసూలు చేస్తున్న మీసేవ కేంద్రాలను సీజ్ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది 
       
వైకల్య ధ్రువీకరణ పత్రం పొందాలంటే మీసేవ కేంద్రాలలో స్లాట్ బుక్ చేసిన తర్వాతనే సదరన్ క్యాంపుకు హాజరు కావాల్సి ఉంటుంది దీన్ని ఆసరా చేసుకొని మీసేవ సెంటర్స్ 500 నుండి 5000 రూపాయల వరకు వసూలు చేస్తూ వికలాంగులను మోసం చేస్తున్నారు. మీసేవ సెంటర్ల ద్వారా స్లాట్ బుక్ చేయాలంటే కనీస చార్జ్ మాత్రమే వసూలు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా మీసేవ సెంటర్స్ వ్యవహరిస్తున్న అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు. వైకల్య ధృవీకరణ పత్రాలు ఇప్పిస్తామని కొంతమంది బ్రోకర్లు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి డాక్టర్లతో కుమ్మక్కై అనరులకు సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నారు సదరం క్యాంప్ నిర్వహణ దగ్గర దళారుల పెత్తనం చేస్తున్న క్యాంపు పర్యవేక్షించవలసిన డిఎంహెచ్ఓ ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఒక్కొక్క సర్టిఫికెట్ ఇప్పించేందుకు ఐదువేల నుండి 20వేల వరకు డబ్బులు వసూలు చేస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు సర్టిఫికెట్ కాలపరిమితిని  బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నరు ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, మహబూబ్నగర్తో పాటు సిద్దిపేట నిజామా బాద్, వికారాబాద్, అదిలాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో వికలాంగుల శ్వయంగా సదరo క్యాంపుకు హాజరు అయితే అర్హత ఉన్నప్పటికీ పర్సంటేజ్ తక్కువ వైకల్య శాతం వేసి తిరస్కరిస్తున్నారు. బ్రోకర్ల ద్వారా వెళ్లిన వారికి మాత్రమే వైకల్యం లేకున్నా డబ్బులు తీసుకొని ఎక్కువ వైకల్యం 
శాతం వేసి సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నప్పటికీ నకిలీ వైకాల్య ధ్రువీకరణ పత్రాలతో ప్రమోషన్స్ పొందుతున్నారు. మూగ చెవిటి, మానసిక వికలాంగులకు జిల్లాల్లో సర్టిఫికెట్ జారీ చేయాలంటే కోటి ENT హాస్పిటల్, బోయిన్పల్లి లోని ఎన్ఐఎంహెచ్ కేంద్రాల్లో సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది.దీనికోసం జిల్లాల నుండి వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది తక్షణమే SERP సీఈవో, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రవ్యాప్తంగా సదరం క్యాంపులలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలనీ , నకిలీ వైకల్య
ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపై కేసులు నమోదు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.

కె వెంకట్
 రాష్ట్ర అధ్యక్షులు

యం అడివయ్య
 రాష్ట్ర కార్యదర్శి

అర్ వెంకటేష్
 రాష్ట్ర కోశాధికారి

Courtesy / Source by : NPRD