Thursday, April 6, 2023
భాజపాలోకీ మాజీ సీఎం నల్లారి....!
బీజేపీ లో చేరనున్నమాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ. సుభాషిన్ రెడ్డి కొడుకు ఇంద్రసేనారెడ్డి
బీజేపీ లో చేరనున్న
మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ. సుభాషిన్ రెడ్డి కొడుకు ఇంద్రసేనారెడ్డి ..
ఖైరతాబాద్ నియోజకవర్గం బీజేపీ టికెట్ మీద ఆశలు..
బండి సంజయ్ చేసిన తప్పేంటి?
*బండి సంజయ్ చేసిన తప్పేంటి?*
*అది లీకేజీ ఎలా అవుతుంది:హైకోర్టు సూటి ప్రశ్న.*
హైదరాబాద్: పదో తరగతి పశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 41ఏ నోటీసు ఇవ్వకుండా సంజయ్‌ను అరెస్ట్ చేశారంటూ.. హనుమకొండ కోర్టు విధించిన రిమాండ్ రద్దుపై అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరారు...న్యాయవాదుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. గురువారం మధ్యాహ్నం విచారణ జరిపారు.
కరీంనగర్ నుంచి వరంగల్‌కు బండి సంజయ్‌ను తీసుకెళ్లేందుకు 300 కిలోమీటర్లు తిప్పారని ఆయన తరపు న్యాయవాది రామ్‌చంద్రరావు కోర్టుకు తెలిపారు.బండి సంజయ్‌పై ఉన్న ఆరోపణలు ఏంటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.పేపర్ బయటకు వచ్చాక వాట్సాప్‌లో సర్క్యూలేట్ చేశాడే తప్ప.. పేపర్ లీకేజీలో అతని ప్రమేయం ఎక్కడుందని ప్రశ్నించింది.క్వశ్చన్ పేపర్ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చిన తర్వాత అది లీకేజ్ ఎలా అవుతుందని ప్రశ్నించింది. పేపర్ బయటకు వచ్చాక ప్రతిపక్ష నేతగా ఈ అంశాన్ని ఎలా అయినా వాడుకోవచ్చని తెలిపింది
*సుజీవన్ వావిలాల*🖋️
Wednesday, April 5, 2023
పద్మ అవార్డు అందుకున్న..... చినజీయర్, కీరవాణి
పద్మ అవార్డు అందుకున్న..... చినజీయర్, కీరవాణి!
దిల్లీ: గణతంత్ర దినోత్సవం వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్రం ప్రకటించిన 'పద్మ' అవార్డుల ప్రదానోత్సవం (రెండో సెషన్) సందడిగా జరిగింది.దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ ఏడాది మొత్తం 106 పద్మ పురస్కారాలను ప్రకటించగా.. మార్చి 22న తొలి విడతలో 50మందికి పైగా 'పద్మ' అవార్డులు ప్రదానం చేసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం సాయంత్రం మిగిలిన వారందరికీ పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను అందజేసి గౌరవించారు.తెలుగు రాష్ట్రాలనుంచి త్రిదండి చినజీయర్ స్వామి పద్మభూషణ్ అందుకోగా.. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు. అలాగే, దివంగత నేత ములాయం సింగ్ యాదవ్‌కు కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్‌ను ఆయన తనయుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అందుకున్నారు. అలాగే, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. వీరితో పాటు మిగతా ప్రముఖులు 'పద్మ' పురస్కారాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం 106 పద్మ పురస్కారాలు ప్రకటించగా.. అందులో ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీలు దక్కాయి. ఈసారి తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కింది. రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తంగా 12 పద్మ అవార్డులు వరించాయి. ఆధ్యాత్మిక రంగం నుంచి చినజీయర్ స్వామి, కమలేష్ డి.పటేల్‌లను పద్మభూషణ్ పురస్కారాలు వరించగా.. ఎం.ఎం.కీరవాణి సహా ఏపీలో ఏడుగురికి, తెలంగాణలో ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. మార్చి 22న కొందరు రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకోగా.. మిగతా ప్రముఖులంతా ఈరోజు అవార్డులు స్వీకరించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి కీరవాణి-రాజమౌళి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.
*సుజీవన్ వావిలాల*🖋️
A1 గా బండి సంజయ్!
*A1 గా బండి సంజయ్!*
వరంగల్: టెన్త్ పేపర్ లీక్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ1గా బండి సంజయ్ పేరును చేర్చారు.ఏ2 ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా శివగణేష్, ఏ6గా పోగు సుభాష్, ఏ7గా పొగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్‌ను పోలీసులు పేర్కొన్నారు
120(బి) సెక్షన్ కింద సంజయ్‌పై కేసు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్ట్‌లో మొత్తం 10 మంది నిందితుల పేర్లు చేర్చారు. బండి సంజయ్ సహా ప్రశాంత్, మహేష్, శివగణేష్‌లను అరెస్ట్ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. టెన్త్ విద్యార్థికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరికొంతమంది కీలక సాక్షులను విచారించాల్సి ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
''ఏ2 ప్రశాంత్ ఎమ్మెల్యే ఈటలకు 10:41కి పేపర్‌ను పంపించారు. బండి సంజయ్‌కు 11:24కి ప్రశ్నపత్రం చేరింది. 9:30కే ప్రశ్నాపత్రం లీకైందంటూ ప్రశాంత్ తప్పుడు వార్తలు ప్రచారం చేశాడు. ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. ఏ4గా మైనర్ ఉండటంతో వివరాలు వెల్లడించడం లేదు. టెన్త్ హిందీ పేపర్‌ను ప్రశాంత్ వైరల్ చేశాడు. ఈటల సహా చాలా మంది నేతలకు టెన్త్ పేపర్ వెళ్లింది. పరీక్షకు ముందు రోజు ప్రశాంత్, బండి సంజయ్ చాటింగ్ జరిగింది'' అని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.
*సుజీవన్ వావిలాల*🖋️
కేసీయార్ ఎప్పుడో చెప్పిండు... గోకుతనే ఉంటనని... బీజేపీకే సమజ్ కాలేదు.
*_కేసీయార్ ఎప్పుడో చెప్పిండు... గోకుతనే ఉంటనని... బీజేపీకే సమజ్ కాలేదు..._*
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*_'నువ్వు గోకూ గోకకపో, నే గోకుతనే ఉంటా…!' అని కేసీయారే స్వయంగా చెప్పిండు కదా…! ఊకుంటడా…! కాబోయే ప్రధాని మాటతప్పితే ఏం మర్యాద ఉంటది…? ఎంత నామర్థ.! పైగా తన బిడ్డ మీదనే కేసు పెట్టి, ఊకూకే ఢిల్లీకి పిలిపిస్తుంటే, అసలే గోకుడు సరదా ఉన్న కేసీయార్‌కు మండదా..? ఏం మోడీకి సీబీఐ, ఈడీ, ఐటీ ఉంటే కేసీయార్‌కు పోలీసుల్లేరా..? సిట్లు లేవా..? సీఐడీ లేదా..?_*
*_ఆ ఇద్దరే టార్గట్.._*
అసలు బీజేపీ పెద్దలనే బజారుకు లాగాలని ఉబలాటపడ్డోడు, 'ఎమ్మెల్యేల కొనుగోళ్లు' అంటూ గాయిగత్తర చేసి, బీజేపీ ప్రధాన కార్యదర్శి సంతోష్ పేరు కేసులో రాసేసిన కేసీయార్‌కు గీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్‌ను లోపలేసుడు పెద్ద లెక్కనా ఏంది..? బాగా ఎగుర్తుంటడు కదా, అందుకనే బీజేపీలో ఎవరి జోలికీ పోడు కేసీయార్… అటు రాజాసింగ్, ఇటు బండి సంజయ్… మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే లోపలకు నెట్టిన, నేనిట్లాగే గోకుతా, మీకు చేతనైంది చేసుకొండి ఫొండి అంటున్నాడు కేసీయార్…!
*_మా సార్ గోకుడు ఇంతే..!_*
అబ్బే, ఈ కేసులో పెద్ద పంచ్ లేదు సార్, ఎవరో బండి సంజయ్‌కు ప్రశ్నపత్రం వాట్సపులో షేర్ చేస్తే ఇక 'బండికి లింకున్నట్టేనా..?'👌 అని అంటారా..? అదంతా కోర్టులో చెప్పుకొండి, మేం ఊర్లన్నీ తెగ తిప్పి, లాయర్లకూ జవాబులు చెప్పకుండా, హన్మకొండలో కోర్టులో ప్రవేశపెట్టామా లేదా..? బెయిల్ తెచ్చుకో, కావాలంటే కోర్టులో చెప్పుకో… మా సారు గోకుతా అన్నాడంటే ఇలాగే ఉంటది మల్ల…!
*_కమలం.. తెల్లమొహం_*
మోడీకి, అమిత్ షాకు ఏమీ చేతనైత లేదు, చాలాసార్లు కేసీయార్ విసిరే అస్త్రాలకు తెల్లమొహాలు వేస్తున్నరు అంటారా..? వాళ్లంతే… ఎవరెంత గోకినా ఏమీ చేతకాదు… అసలు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు పెట్టినా కవితను అరెస్టు చేసేందుకు ఈరోజుకూ దడ, వణుకు… అసలు మమతనేం చేయగలిగారు..? రాబర్ట్ వాద్రాను ఏం చేయగలిగారు..? అఖిలేష్‌ను ఏం చేయగలిగారు..? ఇక ఒకటికి నాలుగు ఉల్టా అంటించే కేసీయార్‌ను ఏం చేయగలరు..?
*_బీజేపీ మెడలోనే...😊:*
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసును కూడా బీజేపీ మెడలో వేసిన్రు, కేటీయార్ స్టార్ట్ చేయంగనే ఇక మంత్రులందరూ అదే చెప్పడం మొదలు పెట్టిన్రు… ఇప్పుడు టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీని కూడా సంజయ్ మెడలో వేసేశారు… బీజేపీ వాళ్లు డిఫెన్సులో పడిపోతే, బీఆర్ఎస్ వాళ్లంతా 'బండి దొంగ, బండి దొంగ' అని హైపిచ్ పాటలు మొదలుపెట్టిన్రు… రేప్పొద్దున తెలంగాణలో ఏం జరిగినా సరే, బండి సంజయ్ మాత్రమే ప్రథమ నిందితుడు అవుతాడు… అది పక్కా… కేసీయార్ గోకుడు తీవ్రత ఏంటో బీజేపీ హైకమాండ్‌కు తెలిసిరావాలి మల్ల…!!
*_చివరిగా..._*
*_రెండుసార్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేసినా... తొమ్మిది ఏళ్ళుగా ఎనో అక్రమాలు జరిగినై.. అని అరచి గీ పెట్టినా.. కేంద్రం ఎందుకు మౌనవ్రతం పాటిస్తుంది.. ఏదైనా లోపాయకారి ఒప్పందం ఉందా..? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కాపాడుకోలేని కేంద్రం.. తెలంగాణలో ఓ పేదోడికి భరోసా ఏం ఇస్తుంది..?_*
*_ఓట్లు.. సీట్లు మటాష్.._*
బండి సంజయ్ భార్య ఆవేదన....!
*చెప్తున్నా వినకుండా కాలర్ పట్టుకొని లాక్కెళ్లారు.... బండి సంజయ్ భార్య ఆవేదన....!*
కరీంనగర్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మంగళవారం అర్థరాత్రి కరీంనగర్‌లోపోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం బలవంతంగా పోలీస్ వాహనంలో యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీసుస్టేషన్‌కు తరలించారు. సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎందుకు అరెస్టు చేశారు, ఏ విషయంలో కేసు నమోదు చేశారనే దానిపై పోలీసుల నుంచి స్పష్టత లేదు.
తాజాగా సంజయ్‌ను అదుపులోకి తీసుకోవడంపై ఆయన భార్య అపర్ణ స్పందించారు. అసలు కరీంనగర్‌లోని ఇంట్లో మంగళవారం రాత్రి ఏం జరిగిందో ఆమె వివరణ ఇచ్చారు పోలీసులు అకస్మాత్తుగా ఇంటిపై దాడి చేసి తన భర్తను అరెస్ట్ చేయడంతో తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలిపారు. సంజయ్ హైదరాబాద్ నుంచి ఇంటికి చేరుకున్న కొద్దిసేపట్లోనే పోలీసులు దాడి చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి(అపర్ణ తల్లి) చనిపోయిన బాధలో ఉన్నామని.. చిన్న కర్మకు హాజరయ్యేందుకు వచ్చిన సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని వాపోయారు.
ఆమె మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి డిన్నర్ చేస్తున్న సమయంలో ఏసీపీ వచ్చారు. కూర్చొమని చెప్పి.. వెంటనే తిని ఆయన బయటకు వెళ్లారు. చెప్పండి సర్ ఇలా వచ్చారు అని అడిగితే.. అరెస్ట చేయాలి సర్ మిమ్మల్ని.. మాకు ఆర్డర్స్ వచ్చాయని తెలిపారు. ఏ విషయంలో అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ వారెంట్ ఉందా అని సంజయ్ అడిగితే లేదని చెప్పారు. కమిషనర్ సర్ నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పడంతో కమిషనర్‌కు ఫోన్ చేశారు. ఏ కారణంతోనే నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు..
ఆయన మాట్లాడుతుండగానే 40 మంది పోలీసులు వచ్చి సంజయ్‌ను చుట్టుముట్టారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున్న అడ్డుకునేందుకు యత్నించినా.. వినకుండా కాలర్ ప్టటుకుని బయటకు లాక్కెళ్లారు. ఇంట్లో ఉన్న సామన్లు, ఫర్నీచర్ బయటపడేశారు. ఇంటి దగ్గర దాదాపు గంట సేపు వాగ్వాదం జరిగింది. ఇప్పుడే తిన్నారు. హార్ట్ పేషెంట్.. మందులు వేసుకోలేదని నేను చెప్తూనే ఉన్నాను. అయినా మాట వినిపించుకోకుండా తీసుకెళ్లారు. ఒక ఎంపీని, ప్రజాప్రతినిధిని ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తారని అనుకోలేదు. కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదు. మమ్మల్ని బయటకు కూడా రానివ్వకుండా డోర్ లాక్ చేశారు' అని అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
*సుజీవన్ వావిలాల*🖋️