Sunday, July 10, 2022

ఓపెన్ ఛాలెంజ్.... ముందస్తు ఎన్నికల దిశగా..... కెసిఆర్ అడుగులు...?

*ఓపెన్ ఛాలెంజ్.... ముందస్తు ఎన్నికల దిశగా..... కెసిఆర్ అడుగులు...?*

హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ కామెంట్స్‌.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్‌, బీజేపీలు డేట్‌ చెప్తే అసెంబ్లీని రద్దు చేస్తానని..
ముందస్తు ఎన్నికలకు వెళదామంటూ సీఎం కేసీఆర్‌ ఛాలెంజ్‌ చేశారు. మొదటి సారిగా ముందస్తు ఎన్నికలపై కేసీఆర్‌ వ్యాఖ్యలపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ ఆచితూచి స్పందిస్తున్నాయి.దేశంలో అన్ని రకాలుగా అథోగతి పాలవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసమర్థ పాలన, బీజేపీ విధానాలే కారణమంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం తీవ్రస్థాయిలో విమర్శించారు. దేశం ఇంత అసమర్థ ప్రధానిని ఇంతకుముందెన్నడూ చూడలేదని ధ్వజమెత్తారు. నిష్క్రియ, అవివేక, అసమర్థ పాలనను మోదీ సాగిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని జలగలా పీడిస్తోందని, ఇందిరాగాంధీ గతంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తే.. ఇప్పుడు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాకు లేదని.. అనడం అహంకారం.. వివేకానికి నిదర్శనం. వాళ్లకు దమ్ముంటే డేట్‌ డిక్లేర్‌ చేస్తే నేను అసెంబ్లీ రద్దుకు సిద్ధమంటూ కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా? మేం స్కాంస్టర్లము కాదు. కుంభకోణాలు చేయలేదు. అపకీర్తి మూట కట్టుకోలేదు. ప్రజల కోసం మంచి పనులు చేశాం. వాళ్లే గెలిపిస్తారు. దేశ వ్యాప్తంగా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని బీజేపీ భయపడుతోందని కేసీఆర్‌ అన్నారు.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం 

కన్నీటికే కన్నీరు!రెండేళ్ల తమ్ముడు మృతి....రెండు గంటలు జాడ లేనీ తండ్రి.....!

*కన్నీటికే కన్నీరు!రెండేళ్ల తమ్ముడు మృతి....రెండు గంటలు జాడ లేనీ తండ్రి.....!*

*ఒడిలో తమ్ముడి శవంతో సాయం కోసం బాలుడి ఎదురు చూపులు*

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మోరేనా పట్టణంపై హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది.అంబా జిల్లాలోని బాద్‌ఫ్రా గ్రామానికి చెందిన పూజారామ్‌ జాతవ్‌ అనారోగ్యంతో బాధపడుతున్న తన రెండేళ్ల చిన్న కుమారుడు రాజాను మోరేనా జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తీసుకొచ్చాడు. ఎనిమిదేళ్ల పెద్ద కుమారుడు గుల్షన్‌ తండ్రి వెంట ఆస్పత్రికి వచ్చాడు.

రక్తహీనత, కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాబు శనివారం ప్రాణాలు కోల్పోయాడు. పూజారామ్‌ చేతిలో చిల్లిగవ్వ లేదు. పసిబిడ్డ మృతదేహాన్ని తిరిగి ఇంటికి ఎలా తీసుకెళ్లాలో తెలియక తల్లడిల్లాడు. ఆస్పత్రి వారు ఎలాంటి వాహనం ఏర్పాటుచేయలేమన్నారు. కనిపించిన వారినల్లా సాయం కోసం అర్థించాడు. ఇక చేసేది లేక తన బిడ్డ మృతదేహాన్ని భుజానికెత్తుకొని ఆసుపత్రి బయటకు నడిచాడు.

రోడ్డు పక్కన గుల్షన్‌ను కూర్చోబెట్టి ఒడిలో రాజా మృతదేహాన్ని ఉంచి, సాయం కోసం వెళ్లాడు. దాదాపు రెండు గంటల పాటు తమ్ముడి శవంతో గుల్షన్‌ అక్కడే తండ్రి రాకకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తమ్ముడి మృతదేహంపై వాలే ఈగలను తోలుతున్న గుల్షన్‌ను చూసి అటుగా వెళ్లేవాళ్ల హృదయం ద్రవించింది. నాన్న ఎప్పుడు వస్తాడో తెలియక భయంతో కన్నీరు పెట్టాడు.

తనతో కలిసి ఆడుకున్న తమ్ముడి ఇక లేడని ఏడుస్తున్న గుల్షన్‌ను చూసి స్థానిక జర్నలిస్టు ఒకరు ఆ ఫొటోలు తీశారు. ఇంతలో పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమికూడారు. బాలుడి పరిస్థితిని చూసి చలించిపోయారు. పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసు అధికారి యోగేంద్ర సింగ్‌ రంగంలోకి దిగారు. రాజా చికిత్స పొందిన ఆసుపత్రి అధికారులతో మాట్లాడి, వాహనం ఏర్పాటు చేశారు. రాజా శవాన్ని, అతడి తండ్రిని, సోదరుడిని వారి స్వగ్రామానికి పంపించారు.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం 

ONE more cop, ONE more RAPE case!


ONE more cop, ONE more RAPE case! Maredpally CI Nageshwara Rao who allegedly raped a woman by putting a gun to her husband, surrendered a while ago 2days after FIR. With all CCTV cameras police couldn’t catch him. Meanwhile,a rape case was lodged on Malkajagiri SI Vijay Kumar 🧵 https://t.co/abkpsx3DOW

Vijay Kumar was in love with a woman for a while. But he married another woman in 2014! Since then he has been harassing the victim. The SI want the victim to be with him. He isn’t allowing her marry &get on with her life. He recently raped her. SI has been suspended #Hyderabad🧵

Surprising how police couldn’t catch the culprit in first case. He had to surrender! How much of the investigation will be fair? Considering how they showed no interest to catch him. I am already seeing victim shaming in both cases. Victims may be threatened to withdraw కేసెస్

Courtesy by : @revarhitweets 

వర్షం ఎఫెక్ట్....తెలంగాణలో మూడు రోజులు బడులు బంద్

*బ్రేకింగ్ న్యూస్....!*
*వర్షం ఎఫెక్ట్....తెలంగాణలో మూడు రోజులు బడులు బంద్....*

హైదరాబాద్‌: గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగిందిఇందులో భాగంగా వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో మూడు రోజుల(సోమ, మంగళ, బుధవారాలు) పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.

సుజీవన్ వావిలాల(ప్రజల పక్షం)🖋️ 

Saturday, July 9, 2022

అత్యాచార ఆరోపణలు.... మారేడుపల్లి సీఐ నాగేశ్వరావు సస్పెండ్

*అత్యాచార ఆరోపణలు.... మారేడుపల్లి సీఐ నాగేశ్వరావు సస్పెండ్*

హైదరాబాద్: మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో నాగేశ్వరరావుపై అత్యాచారం, హత్యాయత్నం, ఆర్మ్స్‌ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో నాగేశ్వర్ రావును విధుల నుంచి తప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీదు, బోనాల పండుగ బందోబస్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుపల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ నియమించారు. కాగా జూలై 7న అర్థరాత్రి ఇన్‌స్పెక్టర్‌ తనపై అత్యాచారం జరిపినట్లు ఆరోపిస్తూ ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

హస్తినాపురంలో నివసిస్తున్న మహిళ ఇంటికి సీఐ నాగేశ్వరరావు వెళ్లాడు. అర్థరాత్రి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బయటకు వెళ్లిన భర్త ఇంటికి తిరిగి రావడంతో అతన్ని సీఐ రివాల్వర్‌తో బెదిరించాడు. అర్ధరాత్రి సమయంలో ఆ దంపతులిద్దరిని కారులో ఎక్కించుకుని ఇబ్రహీంపట్నం వైపు వెళ్లాడు. అయితే కారు రోడ్డు ప్రమాదానికి గురవడంతో.. సీఐ నుంచి దంపతులిద్దరూ తప్పించుకుని, వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Courtesy by : సుజీవన్ వావిలాల 🖋️ 

అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా ఇప్పుడు కొత్త పథకం తేవడం వెనుక వున్న కుట్ర

https://twitter.com/arvindkumar_ias/status/1545617720607027202?t=5s4jax7Kjl6w68oHu-uXfg&s=08
  *TS-bPASS సులభంగా, తక్షణమే,అవాంతరాలు లేకుండా మరియు ఎవరినీ కలవకుండా నిర్మాణ అనుమతులు*

*భవన నిర్మాణ అనుమతి ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మరియు కాలపరిమితితో చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం*

YouTube - https://t.co/PYYEa5eI3a

https://t.co/h8gk9i2wKm

https://t.co/jI6i3GShTq

@KTRTRS https://t.co/VgSXvphbTQ                              ------------------------------------                          *ప్రజాసంకల్పం ప్రశ్నస్తుంది*
 *@అరవింద్ కుమార్ సర్  గారు @TS_bPASS / మున్సిపల్ చట్టాలను ఉల్లంగిస్తూ @GHMCOnline & చుట్టూ వున్న మున్సిపాలిటీ / corporation లలో జోరుగా అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు అని వార్త కథనాలు వేల ల్లో వస్తున్నా అధికారులు మౌనంగా వున్నారు ఎందుకు??*                                                       .........                                        *అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా ఇప్పుడు కొత్త పథకం తేవడం వెనుక వున్న కుట్రను ప్రజాసంకల్పం & link Media బట్టబయలు చేయడం ఖాయం ..... Bplkm🪶* 
#askktr @SrinivasRTIA 

NOTE : *Copy to Group link Media*  09/07/2022
*Bplkm🪶
* https://t.co/mwgeuzBAJk

Friday, July 8, 2022

NHRC Slaps CS With Notices Regarding The Land Encroachment Activities