Friday, September 11, 2020

ప్రజా సంకల్పం

అందరికి నమస్కారం 🙏
*వాస్తవాలు వాస్తవంగా నిష్పక్షపాతంగా చెప్పే ప్రజా సంకల్పం లో మీరు భాగస్వామ్యులు కావాలి భవిష్యత్ తరాలకు మార్గనిర్దేషులు కావాలి..మానవత్వం, విలువలు,  సంస్కారం కన్నా ఏది గొప్ప కాదు **
బాపట్ల కృష్ణమోహన్ 🙏
https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ కొత్త రెవిన్యూ బిల్లు ఆమోదం

హైదరాబాద్ : 11/09/2020

*నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఆమోదం.....*

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లు శాసనసభలో ఆమోదం పొందింది. బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం జరిగిన చర్చలో కాంగ్రెస్‌, ఎంఐఎం,భాజపా సభ్యులు తమ సలహాలు, సూచనలు చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ దానిపై సమాధానమిచ్చారు. బిల్లులో పొందుపర్చిన అంశాలపై సీఎం సుదీర్ఘంగా వివరించారు. అనంతరం నూతన రెవెన్యూ బిల్లుకు సంబంధించి తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసుబుక్‌ల బిల్లు-2020ను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అనంతరం శాసనసభను స్పీకర్‌ సోమవారానికి వాయిదా వేశారు.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

Thursday, September 10, 2020

తెలంగాణ కోవిద్ -19 పరీక్షలు

హైదరాబాద్ : 11/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2426 కరోనా కేసులు*
రాష్ట్రంలో కొత్తగా 2426 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,52,602కు చేరాయి. అదేవిధంగా కరోనా నుంచి నిన్న మరో 2324 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,19,467 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. మరో 32,195 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 25,240 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, నిన్న మరో 13 మంది కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతులు 940కి పెరిగారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 78.2 శాతంగా ఉండగా, కరోనా మరణాల రేటు 0.61 శాతంగా ఉన్నదని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్న ఒకేరోజే 62,890 మంది కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.
నిన్న రాత్రి 8 గంటల వరకు నమోదైనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 338 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 216, మేడ్చల్ మల్కాజిగిరిలో 172, నల్లగొండలో 164, కరీంనగర్‌లో 129, వరంగల్ అర్బన్‌లో 108, ఖమ్మం 98, సంగారెడ్డి 97, నిజామాబాద్ 89, సిద్దిపేట 87, సూర్యాపేట 78, మహబూబాబాద్ 76, భద్రాద్రికొత్తగూడెం 67, జగిత్యాల 62, మంచిర్యాల 57, పెద్దపల్లి 56, కామారెడ్డి 54, నాగర్‌కర్నూల్ 50, మహబూబ్‌నగర్ 46, యాదాద్రిభువనగిరి 43, మెదక్ 42, రాజన్నసిరిసిల్ల 41, వనపర్తి 38, జనగాం 33, జోగులాంబ గద్వాల 32, నిర్మల్ 32, ఆదిలాబాద్‌లో 25, జయశంకర్ భూపాలపల్లి 22, వరంగల్ రూరల్ 18, ములుగు 16, కొమురం భీమ్ ఆసిఫాబాద్ 15, నారాయణపేట 14, వికారాబాద్ 11 చొప్పున ఉన్నాయి.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

తెలంగాణ పాలీసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ : 11/09/2020

*పాలిసెట్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి*
  
*ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌లో ఆధిపత్యం*
రేపటి నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ షురూ
తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ పాలిసెట్‌) ఫలితాల్లో *బాలికలు సత్తా చాటారు*. ఈ నెల రెండున నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను సెట్‌ కన్వీనర్‌, సాంకేతిక విద్యాకమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ గురువారం విడుదలచేశారు. పాలిటెక్నిక్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 81.14% ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో *బాలికల శాతం 84.93 ఉండగా.. బాలురు 78.72 శాతం ఉన్నారు*. మొత్తం 73,920 మంది దరఖాస్తుచేసుకోగా.. 56,945 మంది పరీక్షలకు హాజరయ్యారు. 46,207 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్‌ విభాగంలో 46,318 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇక్కడ కూడా బాలికలే సత్తా చాటారు. బాలురు 78.40 శాతం, బాలికలు 85.93 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 120 మార్కుల్లో జనరల్‌ విద్యార్థులకు (క్వాలిఫైయింగ్‌) 30% మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు ఒకశాతం మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. 30% మార్కులు సాధించిన జనరల్‌ అభ్యర్థులకు, ఒక్కశాతం మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ర్యాంకులు కేటాయించారు. ఇందులో ఎస్సీ విద్యార్థులు 9,510 మంది పరీక్షలకు హాజరుకాగా.. 9,508 మంది ర్యాంకులు సాధించారు. పరీక్షకు హాజరైన 4,715 మంది ఎస్టీ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ విభాగాల్లో వేర్వేరుగా ర్యాంకులు ప్రకటించారు. ఫలితాలను https:// polycetts.nic.in,  www.sbtet .telangana.gov.in, www.dtets.cgg. gov.in వెబ్‌సైట్లలో పొందుపరిచారు. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్‌ జారీచేశారు.

@నమస్తే తెలంగాణ మీడియా

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

చంద్రబాబు నాయుడు సర్ దంపతులకు శుభాకాంక్షలు

హైదరాబాద్ : 10/09/2020

*ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సర్ గారికి, భువనేశ్వరి మేడం గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది *ప్రజా సంకల్పం & link Media*

*Happy wedding anniversary*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

Ghmc ఉప్పల్ సర్కిల్ Engg- Sec

హైదరాబాద్ : 10/09/2020

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ భరత్ నగర్ *X* వద్ద గత కొద్ది రోజుల క్రితం CC రోడ్డు మంచినీటి మెయిన్ వాల్వ్ వద్ద భూమిలోకి కృంగిపోయి వాహనదారులకు ఇబ్బందిగా మారడంతో *ప్రజా సంకల్పం & link Media* ద్వారా ఉప్పల్ సర్కిల్ అధికారులకు తెలుపగా ఈరోజు సమస్య పరిష్కారం చేయడం జరిగింది.
*ధన్యవాదములు ఉప్పల్ సర్కిల్ Engg-Sec అధికారులకు*

Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/ 

online పరీక్షలు

హైదరాబాద్ : 10/09/2020

*ఆన్ లైన్ పరీక్షలపై హైకోర్టులో విచారణ*

తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. కరోనా వైరస్‌ కారణంగా హాస్టల్స్‌ మూసి ఉన్నందున పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడతారని, చివరి సెమిస్టర్ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరారు. పిటిషనర్‌ వాదనపై స్పందించిన న్యాయస్థానం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సాంకేతికతను ఉపయోగించుకుని ఇంజనీరింగ్ కోర్సులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది.
అలాగే సప్లమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని కూడా రెగ్యులర్‌గా పరిగణిస్తారా అని హైకోర్టు అడిగింది. న్యాయస్థానం ప్రశ్నలకు స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌.. ప్రభుత్వాన్ని అడిగి చెప్తానని అన్నారు. దీంతో విచారణ ఈనెల 15కు వాయిదా వేసింది
మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన వివిధ డిగ్రీ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమైంది. ఈనెల 22 నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు మొదలవుతాయి. అదేవిధంగా ఈనెల 15 నుంచి ఇంజనీరింగ్‌, బీసీఏ, బీఈడీ, బీఫార్మసీ, డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు నిర్వహించేందుకు స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/