*ప్రెస్ నోట్*
*ప్రభుత్వ అసైన్డ్ భూములు ప్రైవేటు పట్టా భూములుగా ఎలా మారాయి?*
*మెదక్ ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సభ్యుల పేర్లపై నమోదైన భూముల పూర్తి రికార్డులు బయటపెట్టాలి - అడ్వకేట్ వి. రవికృష్ణ డిమాండ్*
*చౌదరపల్లి సర్వే నెం.294 భూముల వ్యవహారంపై విజిలెన్స్, ఏసీబీ దర్యాప్తు జరగాలి*
*1954–55 సేత్వార్‌లో సర్కారీ భూమి - 1958 విధానం ప్రకారం భూమిలేని పేదలకు అసైన్‌మెంట్ - ఆ తరువాత 84 ఎకరాలకు ఎన్ఓసీ NOCలు, రిజిస్ట్రేషన్లు ఎలా సాధ్యమయ్యాయి?*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 27:
సిద్దిపేట జిల్లా, అక్బర్‌పేట్–భూంపల్లి మండలం, చౌదరపల్లి గ్రామంలోని సర్వే నెం.294కు సంబంధించిన ప్రభుత్వ భూములు, పేద రైతులకు జరిగిన అసైన్‌మెంట్లు, తదనంతరం జారీ అయినట్లు పేర్కొంటున్న ఎన్ఓసీ NOCలు, మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో తీవ్రమైన చట్టపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని అడ్వకేట్ వి. రవికృష్ణ పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై ఇప్పటికే పలు మార్లు జిల్లా కలెక్టర్, రాష్ట్ర రెవెన్యూ శాఖ, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తదితర అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, అసలు భూముల చట్టపరమైన స్థితిని స్పష్టంగా నిర్ధారించే సమగ్ర నివేదికను ఇప్పటివరకు అందించలేదని తెలిపారు.
**2026 అక్టోబర్ 25న తెలంగాణ విజిలెన్స్ అధికారులకు, అవినీతి నిరోధక శాఖ ACBకు సమగ్ర ఫిర్యాదు పంపినట్లు వెల్లడించారు.**
*(1)*: 1954–55 సేత్వార్‌లో భూమి స్వరూపం ఏమిటి?
అందుబాటులో ఉన్న 1954–55 సేత్వార్ రికార్డుల ప్రకారం సర్వే నెం.294లో సుమారు 172 ఎకరాల 12 గుంటల భూమి పొరంబోకు/సర్కారీ భూమిగా నమోదై ఉన్నట్లు రవికృష్ణ తెలిపారు.అయితే తదుపరి రెవెన్యూ రికార్డులు, ఫిర్యాదుల్లో సర్వే నెం.294 మొత్తం విస్తీర్ణం 175 ఎకరాల 12 గుంటలుగా పేర్కొనబడిందని, ఈ రెండు విస్తీర్ణాల మధ్య తేడాను కూడా అసలు సేత్వార్, సప్లిమెంటరీ సేత్వార్, సర్వే రికార్డుల ఆధారంగా ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.
ఒక భూమి ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నప్పుడు, అది ఏ తేదీన, ఏ ఉత్తర్వుల ప్రకారం, ఏ అధికార పరిధిలో ప్రైవేటు పట్టా భూమిగా మారిందనే విషయానికి స్పష్టమైన ప్రభుత్వ రికార్డులు ఉండాలని అన్నారు.
*(2)*: జి.ఓ.ఎమ్ఎస్.నెంబర్
G.O.Ms.No.1406/1958 ప్రకారం పేద రైతులకు భూముల అసైన్‌మెంట్.
జి.ఓ.ఎమ్ఎస్.నెంబర్ G.O.Ms.No.1406, తేదీ 25.07.1958 ద్వారా అమలులోకి వచ్చిన అసైన్‌మెంట్ విధానం ప్రకారం, భూమిలేని పేదలకు ప్రభుత్వ భూములను అసైన్ చేసినట్లు సంబంధిత పత్రాలు సూచిస్తున్నాయని తెలిపారు.ఈ సర్వే నంబర్‌కు సంబంధించిన పలువురు రైతుల అసైన్‌మెంట్ పట్టాలు, ఫైనల్ పట్టా సర్టిఫికెట్లు, పాస్‌బుక్కులు, రెవెన్యూ రికార్డుల్లో 1980–90 దశకాలకు చెందిన వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు.అయితే పట్టా సర్టిఫికెట్ జారీ చేసిన తేదీనే అసలు అసైన్‌మెంట్ తేదీగా భావించరాదని, ప్రభుత్వం ఒరిజినల్ అసైన్‌మెంట్ ప్రొసీడింగ్స్, అసైన్‌మెంట్ రిజిస్టర్లు, లావోని రికార్డులను బయటపెట్టి అసలు తేదీలను నిర్ధారించాలని డిమాండ్ చేశారు.
*(3)*: హైకోర్టులో తహసీల్దార్ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌కు విరుద్ధంగా ఎన్ఓసీ NOCలు ఎలా?
రిట్ పిటిషన్ నెంబర్
W.P.No.16161 of 2025లో అక్బర్‌పేట్–భూంపల్లి తహసీల్దార్ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో సర్వే నెం.294లోని భూముల అసైన్‌మెంట్చరిత్ర,
జి.ఓ.ఎమ్ఎస్.నెంబర్ G.O.Ms.No.1406/1958 ప్రస్తావన ఉన్నట్లు ఫిర్యాదులో వివరించామని రవికృష్ణ తెలిపారు.ప్రభుత్వం తరఫున హైకోర్టులో సమర్పించిన ప్రమాణపూర్వక ప్రకటన ఒకవైపు, అదే భూముల్లోని కొన్ని భాగాలను బదిలీ చేయదగిన ప్రైవేటు పట్టా భూములుగా పరిగణించడం మరోవైపు కనిపిస్తే, ఆ వైరుధ్యాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా వివరించాలని అన్నారు.
హైకోర్టులో ప్రభుత్వమే అసైన్‌మెంట్ చరిత్రను ప్రస్తావించినప్పుడు, ఆ భూములపై ఉన్న చట్టపరమైన బదిలీ నిషేధం ఏ ఉత్తర్వుతో తొలగిపోయిందో ప్రభుత్వం వెల్లడించాలి.
*(4)*: సర్వే నెం.294/1 నుంచి 294/10 వరకు బై నంబర్లు ఎలా ఏర్పడ్డాయి?
ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం సర్వే నంబర్ల విభజన అని రవికృష్ణ పేర్కొన్నారు.ప్రభుత్వం వద్ద ఉన్న కొన్ని రికార్డుల్లో 294/1 నుంచి 294/4 వరకు మాత్రమే ఉన్నట్లు చెబుతున్న నేపథ్యంలో, తదనంతరం 294/5, 294/6, 294/7, 294/8, 294/9, 294/10 తదితర సబ్‌డివిజన్లు ఏ విధంగా ఏర్పడ్డాయనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ముఖ్యంగా 294/7, 294/8, 294/9, 294/10 సబ్‌డివిజన్లలోని భూములపై నమోదైన లావాదేవీల విషయంలో అసలు సర్వే మ్యాపులు, సబ్‌డివిజన్ ప్రొసీడింగ్స్, ఫైసల్ పట్టీలు, అసైన్‌మెంట్ రిజిస్టర్లు, మ్యూటేషన్ ఫైళ్లు పరిశీలించాలని కోరారు.ఈ భూములు 1958కు ముందే ఎటువంటి బదిలీ నిషేధం లేని పట్టా భూములుగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తే, అందుకు సంబంధించిన 1958కు పూర్వపు అసలు పట్టాలు, అసైన్‌మెంట్ ఉత్తర్వులు, రికార్డు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
*(5)*: ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సభ్యుల పేర్లపై నమోదైన భూములు. అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులు, ఖాతా వివరాలు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు పరిశీలించినప్పుడు మెదక్ ఎంపీ శ్రీ మాధవనేని రఘునందన్ రావు కుటుంబ సభ్యుల పేర్లతో సంబంధం ఉన్న భూ లావాదేవీలు కనిపిస్తున్నాయని తెలిపారు.
**మాధవనేని సింధు - ఖాతా నెం.60433**
**మంజుల మాధవనేని - ఖాతా నెం.60418**
ఈ రెండు ఖాతాలకు సంబంధించిన సర్వే నెం.294లోని వివిధ సబ్‌డివిజన్లలో నమోదైన భూములు, వాటి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, యాజమాన్య మార్పులపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
సుమారు 84 ఎకరాల భూములకు సంబంధించిన ఎన్ఓసి NOCలు, లావాదేవీలపై ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో, అసలు ఎంత విస్తీర్ణానికి ఎన్ఓసీ NOCలు జారీ అయ్యాయి, ఎంత భూమి రిజిస్టర్ అయింది, ఎంత విస్తీర్ణం ప్రస్తుతం ఆయా ఖాతాల్లో ఉంది అనే అంశాలను వేర్వేరుగా నిర్ధారించాలని కోరారు.
*(6)* అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టాన్ని ఎన్ఓసీ NOCతో అధిగమించగలరా?
తెలంగాణ అసైన్డ్ భూముల (బదిలీల నిషేధ) చట్టం, 1977లోని సెక్షన్ 3 ప్రకారం, చట్ట పరిధిలోకి వచ్చే అసైన్డ్ భూముల బదిలీలు నిషేధించబడి, నిషేధానికి విరుద్ధమైన బదిలీలు చెల్లవు.
సెక్షన్ 4 ప్రకారం చట్టబద్ధమైన స్వాధీన పునరుద్ధరణ చర్యలకు అవకాశం ఉంది. సెక్షన్ 5 ప్రకారం అసైన్డ్ భూములకు సంబంధించిన కొన్ని రిజిస్ట్రేషన్లపై నిషేధం వర్తిస్తుంది.
అదేవిధంగా రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22ఏ ప్రకారం చట్టపరంగా నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రత్యేక నియంత్రణలు అమలులో ఉన్నాయి.ఒక భూమి 1977 చట్టం ప్రకారం బదిలీ నిషేధానికి లోబడి ఉన్నప్పుడు, కేవలం ఎన్ఓసీ NOC లేదా మ్యూటేషన్ ద్వారా ఆ నిషేధాన్ని తొలగించలేరు.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఏ చట్టం ప్రకారం, ఏ ఆధారాలతో ఎన్ఓసీ NOCలు జారీ చేశారో వెల్లడించాలని రవికృష్ణ డిమాండ్ చేశారు.
*(7)*: రెవెన్యూ అధికారులకు నేరుగా ప్రశ్నలు
•చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, సిద్దిపేట జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు రవికృష్ణ పలు ప్రశ్నలు సంధించారు.
•ప్రభుత్వ అసైన్డ్ భూములకు ఎన్ఓసీ NOCలు జారీ చేసే ముందు అసలు అసైన్‌మెంట్ రికార్డులను పరిశీలించారా?
•భూములు అసైన్డ్ కాదని నిర్ణయించిన అధికారి ఎవరు? ఆ నిర్ణయానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఎక్కడ ఉన్నాయి?
•294/7, 294/8, 294/9, 294/10 సబ్‌డివిజన్లలోని భూములు ఎప్పుడు, ఏ చట్టం ప్రకారం బదిలీ చేయదగిన పట్టా భూములుగా మారాయి?
•ఈ భూములపై 1977 చట్టం వర్తించదని నిర్ధారించిన చట్టపరమైన ఉత్తర్వు ఏది?
•ఎన్ఓసీ NOCలు జారీ చేయడానికి ముందు సెక్షన్ 22-A నిషేధిత ఆస్తుల రికార్డులను పరిశీలించారా?
•ఒకవేళ అసలు రికార్డులకు విరుద్ధంగా ఎన్ఓసీ NOCలు జారీ చేసి ఉంటే, సంబంధిత అధికారులపై ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు?
*(8)*: అధికారులకు లంచాలు అందాయా? రాజకీయ ఒత్తిడి పనిచేసిందా? లేక చట్టబద్ధమైన నిర్ణయాలేనా?
ఇంత పెద్ద విస్తీర్ణంలో ప్రభుత్వ అసైన్‌మెంట్ చరిత్ర ఉన్న భూములకు సంబంధించిన ఎన్ఓసీ NOCలు, మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లు జరిగిన పరిస్థితుల్లో, వాటి వెనుక అధికార దుర్వినియోగం లేదా అవినీతి ఉందా అనే ప్రశ్నను విస్మరించలేమని రవికృష్ణ పేర్కొన్నారు.ఎన్ఓసీ NOCలు జారీ చేసిన అధికారులకు ఏవైనా అక్రమ ఆర్థిక ప్రయోజనాలు అందాయా? ప్రజాప్రతినిధుల రాజకీయ ప్రభావం లేదా ఒత్తిడి పనిచేసిందా? లేక ప్రతి నిర్ణయానికీ చట్టబద్ధమైన ఆధారాలు ఉన్నాయా?
ఈ ప్రశ్నలకు సమాధానం ఊహాగానాల ద్వారా కాకుండా, అసలు ఫైళ్లు, అధికారుల నోట్‌షీట్లు, ఆమోద ఉత్తర్వులు, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్y రికార్డుల ఆధారంగా స్వతంత్ర దర్యాప్తు ద్వారా తేలాలని అన్నారు.ఎవరి మీదైనా నేరం రుజువైందని ముందుగానే ప్రకటించడం తమ ఉద్దేశం కాదని, అధికారుల నిర్ణయాలు చట్టబద్ధమైనవా కాదా, అవినీతి లేదా అక్రమ ప్రభావం ఏమైనా ఉందా అన్నది నిష్పక్షపాతంగా విచారించడమే ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు.
*(9)*: ఎంపీ రఘునందన్ రావు కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలి
ప్రజా సమస్యలను ప్రశ్నించే ఒక పార్లమెంట్ సభ్యుని కుటుంబ సభ్యుల పేర్లపై ఇంత పెద్ద విస్తీర్ణానికి సంబంధించిన భూ లావాదేవీలపై సందేహాలు తలెత్తినప్పుడు, వాటిని నివృత్తి చేయడానికి సంబంధించిన అసలు పత్రాలను ప్రజల ముందుంచడం పారదర్శకతకు దోహదపడుతుందని రవికృష్ణ అన్నారు.రఘునందన్ రావు గారూ, మీ కుటుంబ సభ్యుల పేర్లపై నమోదైన భూములు ప్రభుత్వ అసైన్డ్ భూములు కావని చెప్పడానికి ఆధారమైన అసలు పట్టాలు, టైటిల్ చైన్,ఎన్ఓసీ NOCలు, సబ్‌డివిజన్ ఉత్తర్వులు, మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ ప్రజల ముందుంచడానికి సిద్ధంగా ఉన్నారా?
ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర విజిలెన్స్, ఏసీబీ దర్యాప్తుకు మీరు బహిరంగంగా మద్దతు ఇస్తారా?ఈ ప్రశ్నలు ప్రజాప్రతినిధిగా పారదర్శకత, జవాబుదారీతనానికి సంబంధించినవేనని పేర్కొన్నారు.
*(10)*: అక్టోబర్ 25న విజిలెన్స్, ఏసీబీకి ఫిర్యాదు
ఈ అంశంపై 25.10.2026న తెలంగాణ విజిలెన్స్ అధికారులకు, ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు వివరణాత్మక ఫిర్యాదు పంపినట్లు రవికృష్ణ తెలిపారు.ఆ ఫిర్యాదును చీఫ్ సెక్రటరీ,సీసీఎల్ఏ CCLA, సిద్దిపేట జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు మరియు సంబంధిత అధికారులకు కూడా పంపినట్లు వెల్లడించారు.
ఫిర్యాదులో ప్రభుత్వ అసైన్‌మెంట్ రికార్డులు, సేత్వార్, సప్లిమెంటరీ సేత్వార్, నిషేధిత ఆస్తుల రికార్డులు, పాస్‌బుక్కులు,ఈసీ ECలు, మ్యూటేషన్ వివరాలు, హైకోర్టు కౌంటర్ అఫిడవిట్ తదితర పత్రాలను పరిశీలించాలని కోరినట్లు తెలిపారు.
*(11)*: ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు
*(1)* సర్వే నెం.294 మొత్తం భూమి యొక్క అసలు చట్టపరమైన స్థితిని నిర్ధారించాలి. 172 ఎకరాల 12 గుంటలు, 175 ఎకరాల 12 గుంటల మధ్య ఉన్న రికార్డు వ్యత్యాసాన్ని వివరించాలి.
*(2)* 294/1 నుంచి 294/10 వరకు అన్ని సబ్‌డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన అసలు సర్వే, రెవెన్యూ ప్రొసీడింగ్స్ బయటపెట్టాలి.
*(3)* సుమారు 84 ఎకరాలకు సంబంధించినట్లు ఆరోపిస్తున్న ఎన్ఓసీ NOCల అసలు విస్తీర్ణం, ప్రొసీడింగ్స్ నంబర్లు, ఆమోదించిన అధికారుల వివరాలు వెల్లడించాలి.
*(4)* ఖాతా నెం.60433, 60418లకు సంబంధించిన పూర్తి భూ లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, టైటిల్ చైన్‌ను స్వతంత్రంగా పరిశీలించాలి.
*(5)* W.P.No.16161/2025లో ప్రభుత్వ అధికారులు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌ను అసలు అసైన్‌మెంట్ రికార్డులతో సరిపోల్చాలి.
*(6)* ఎన్ఓసీ NOCల జారీ, మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లలో అవినీతి, అధికార దుర్వినియోగం, రాజకీయ ఒత్తిడి లేదా రికార్డుల తారుమారు జరిగిందా అనే అంశాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ జరపాలి.
*(7)* అసలు భౌతిక రికార్డులతో పాటు Dharani/Bhu Bharati డిజిటల్ ఆడిట్ ట్రయల్స్, ఫైల్ నోటింగ్స్, ఆమోద వివరాలను భద్రపరచాలి.
*(8)* చట్టవిరుద్ధ బదిలీలు నిర్ధారణ అయితే సంబంధిత చట్టాల ప్రకారం భూముల స్వాధీన పునరుద్ధరణ, అర్హులైన వారికి చట్టబద్ధమైన పునరుద్ధరణ, బాధ్యులపై శాఖాపరమైన మరియు క్రిమినల్ చర్యలు చేపట్టాలి.
*(9)* విచారణను సంబంధిత నిర్ణయాల్లో గతంలో పాల్గొనని స్వతంత్ర అధికారులతో నిర్వహించాలి.
*(10)* పూర్తి విచారణ నివేదిక, కారణాలతో కూడిన ఉత్తర్వులు, Action Taken Report ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
*(11)* పేద రైతుకు ఒక చట్టం — పలుకుబడి ఉన్నవారికి మరో చట్టమా?
భూమిలేని పేద రైతుల కోసం రూపొందించిన అసైన్‌మెంట్ విధానం ఉద్దేశం వారి జీవనోపాధికి భరోసా కల్పించడమేనని రవికృష్ణ అన్నారు.అటువంటి భూములపై చట్టపరమైన నిషేధాలు ఉన్నప్పటికీ, అధికారుల నిర్ణయాల ద్వారా అవి ప్రైవేటు వ్యక్తుల పేర్లకు బదిలీ అయ్యాయని తేలితే అది సాధారణ రెవెన్యూ పొరపాటు మాత్రమే కాదని, ప్రజా పరిపాలనలో తీవ్రమైన జవాబుదారీతన సమస్యగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
“పేద రైతు అసైన్డ్ భూమిని బదిలీ చేస్తే చట్టం అమలవుతుంది. అదే భూమి పలుకుబడి ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యుల పేర్లకు వెళితే చట్టం ఎందుకు వర్తించకూడదు? చట్టం అందరికీ సమానంగా అమలు కావాలి.”
“ప్రభుత్వం మాటలతో కాదు - అసలు రికార్డులతో సమాధానం చెప్పాలి. NOC ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఏ చట్టం ప్రకారం ఇచ్చారు? అసైన్డ్ భూమి ప్రైవేటు పట్టా భూమిగా ఎలా మారింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.”
ఈ వ్యవహారం రాజకీయ పార్టీలు లేదా వ్యక్తుల మధ్య వివాదం కాదని, ప్రభుత్వ భూముల పరిరక్షణ, పేద రైతుల హక్కులు, రెవెన్యూ అధికారుల బాధ్యత, చట్టపాలనకు సంబంధించిన ప్రజా ప్రయోజన అంశమని స్పష్టం చేశారు.
స్వతంత్ర విచారణ జరిపి, నిజానిజాలను ప్రజల ముందుంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వి. రవికృష్ణ
అడ్వకేట్
No comments:
Post a Comment