Wednesday, November 30, 2022
దేవాలయ భూముల ఆక్రమణలపై ఉక్కు పాదం
Tuesday, November 29, 2022
లక్ష మెదళ్ళను కదిలించిన లేఖ!!
కామ్రేడ్ అమ్మ వస్తోంది..!*
*_కన్నీళ్లు తుడవరా.!_*
_◆ ఎదురుచూపులే జీవితం_
◆_ కాళ్ళు మొక్కిన కలెక్టరమ్మ_
_◆ పోరుబాటలో కొడుకులు_
_◆ పూరి గుడెసెలో జీవనం_
_◆ అన్నీ 'చావు' దెబ్బలే.!_
_◆ లక్ష మెదళ్ళను కదిలించిన లేఖ_
Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*
*_తెలంగాణలో తల్లుల దర్పణ ముఖచిత్రం అదృశ్యమైయింది. ఓ తెలంగాణ తల్లి కానరాని లోకాలకు తరలిపోయింది. భర్త పోరాటానికి సన్మానం. కొడుకుల పోరాటానికి 'ఎన్ కౌంటర్స్' బహుమానం. ఎవరీ పెద్దపల్లి పెద్దవ్వ.. మల్లోజుల మధురవ్వ.. వాళ్లింటి పేరు పోరాటం..!_*
*_ఎవరీమె.._*
మధురమ్మ చనిపోయిందట.. ఎవరామె..? ఎందుకింతగా చెప్పుకుంటున్నారు..? పెద్దపల్లి పెద్దవ్వగా ఆ ప్రాంతం వాళ్లందరికీ పరిచయమే.! అసలు ఆమె కథే ఓ సంక్లిష్ట ముఖచిత్రం. నక్సలైట్ల ఉద్యమంలో 'తెగిన పేగులు బోలెడు.. పుస్తె పోగులు బోలెడు..' కన్నీళ్లు, అడవుల బాట పట్టిన కొడుకో, పెనిమిటో ఒక్కసారి 'వచ్చిపోతే' బాగుండననే ఎదురుచూపులు..! ఇవన్నీ ఎంత చెప్పుకున్నా ఒడవవు, తెగవు.! ఎందుకంటే తెలంగాణలో ప్రతి అమ్మది కనిపించని పోరాటమే.! కానీ మధురమ్మది కాస్త భిన్నమైన విచిత్ర అనుభవం.!
*_ఎదురుచూపులే జీవితం_*
నూరేళ్ల జీవితమంతా ఆమెకు కూడా ఎదురుచూపులే..! ఎప్పుడో పేగు కదిలినట్టు అనిపిస్తే 'ఏడుపులు..' ఇక 'ఎవరూ రారు' అని మళ్లీ మనసు నిమ్మలం చేసుకుని ముసుగు తన్ని పడుకోవడం.! ఈమె ఎవరంటే మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలైన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతిల తల్లి. ఆమె మంగళవారం కన్నుమూసింది. ఇదీ వార్త. ఆమె గురించి తెలిసినవాళ్లకు ఓ విషాదం.!
*_భర్త వెంకటయ్య పోరాటం_*
అప్పట్లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం. భర్త వెంకటయ్య రజాకార్లతో పోరాడుతున్న సందర్భంలో భర్త కోసం రజాకార్లు వచ్చి వేధించేవాళ్లు. ఓరకమైన నిర్బంధం, ఆమె మీద నిఘా.! రాజ్యానికి వ్యతిరేకంగా సాగిన రెండురకాల పోరాటాల్లో ఆమె వేదన ఉంది. ఆవేదన ఉంది. భిన్నమైన అనుభవముంది. ఆమె పడిన కష్టముంది… అవమానాలున్నయ్.!
*_కాళ్ళు మొక్కిన కలెక్టరమ్మ_*
ఆనాడు అవస్థలపాలైనా స్వాతంత్య్ర సమరయోధుడి భార్యగా ప్రభుత్వం నుంచి సన్మానం అందుకుంది.! ప్రతి గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాన గౌరవాన్ని పొందుతూనే ఉంది. ఆమధ్య నాలుగేళ్ల క్రితం కావచ్చు పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన మధురమ్మకు 'పాదాభివందనం' కూడా చేసింది. ఇంతా చేస్తే ఆమె భర్త రాజ్యానికి, అనగా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినవాడే.
*_పోరుబాటలో కొడుకులు_*
కట్ చేస్తే... తొలి ముగ్గురు తనకు దక్కకుండా కన్నుమూశారు. ఆ తరువాత పుట్టిన కొడుకులు అడవి బాట పట్టారు. నక్సలైట్లయ్యారు.! ఉద్యమానికి నేతలయ్యారు.! కేంద్ర కమిటీ సభ్యులుగా ఎదిగారు. వాళ్లు కూడా రాజ్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవాళ్లే.! తండ్రి నెత్తురే.! వాళ్ల ఆచూకీ కోసం మధురమ్మను పోలీసులు అనేకసార్లు వేధించారు.! సేమ్, అప్పట్లో రజాకార్లు వేధించినట్టుగానే.! ఆమె జీవితంలో వ్యక్తులు మారారు..కాని సమస్యలు మాత్రం మారలేదనేది నడుస్తున్న చరిత్రకు నిదర్శనం.
*_పూరి గుడిసెలో.._*
ఆ ఇద్దరి ఆచూకీ కోసం తల్లి, తండ్రి, సోదరుడైనా ఆంజనేయ శర్మకు వేధింపులు తప్పలేదు. వాళ్ల సోదరుడు అక్కడే పౌరోహిత్యం చేసుకుంటాడు. 1987లో డీఎస్పీ బుచ్చిరెడ్డి హత్య జరిగింది. ప్రతీకారంగా పోలీసులు వందల ఇళ్లను కూల్చేశారు. అందులో మధురమ్మ ఇల్లు కూడా కూలిపోయింది. దాంతో నాలుగైదేళ్లు ఓ పూరి గుడిసే దిక్కయింది ఆమెకు.!
*_అన్నీ 'చావు' దెబ్బలే.!_*
అగ్రస్థానాల్లో ఉన్న నక్సలైట్లు ఎవరినైనా చూడటానికి రావాలంటే ఎంత కష్టమో ఆమెకు తెలుసు. ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటే చాలు అనుకుంది. కానీ పెద్ద కొడుకు కోటేశ్వరరావు 2011లో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆమె కుంగిపోయింది. చిన్న కొడుకైనా బాగుంటే చాలు అనుకుంది. సహజం కదా..! అదే తెలంగాణ తల్లుల అనుభవం కదా.!
*_లక్ష మెదళ్ళను కదిలించిన లేఖ_*
ఆ సోదరులు ఓసారి అమ్మకు బహిరంగ లేఖ రాశారు. *_''అమ్మా, మమ్ముల కన్నందుకు నీకు విప్లవ వందనాలు.. కోట్లాది మంది తల్లుల కన్నీళ్లు తుడవడానికి మేం ఈ విప్లవబాట ఎంచుకున్నాం, తిరుగుబాటు నాన్న రక్తం నుంచే వచ్చింది..''_ ఇలా సాగిపోయింది ఆ లేఖ..! అప్పట్లో ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆ లేఖ లక్షలమందిని చదివించింది.! కదిలించింది. దాదాపు నూరేళ్లు బతికిన ఆమె ఇక జీవనాన్ని చాలించింది. మంగళవారం కన్నుమూసింది.
*_చివరిగా..._*
కిషన్‌జీ, స్వర్గానికి అమ్మ వస్తోంది, ఇప్పుడైనా కళ్లారా చూసి, ఆమె కన్నీటిని తుడువు కామ్రేడ్..!
Monday, November 28, 2022
తెలుగు రాష్ట్రాల్లో రూ.1100 కోట్లు
ఎమ్మెల్యేలకు ఎర కేసు..... బండి సంజయ్ పేరు చెప్పాలని వేదిస్తున్నారు....!
Sunday, November 27, 2022
తెలంగాణలో తొమ్మిది మంది అధికారులు విలవిల.!
Saturday, November 26, 2022
ఇదిగో ఆధారాలు.. కళ్ళప్శగించి చూడండి సార్..!
నియంతలకు పట్టినగతే కేసీఆర్ కు పడుతుంది..... గద్దర్
*నియంతలకు పట్టినగతే కేసీఆర్ కు పడుతుంది..... గద్దర్*
హైదరాబాద్: నియంతలకు ఏ గతి పట్టిందో కేసీఆర్ (KCR)కు అదే గతి పడుతుందని ప్రజాగాయకుడు గద్దర్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మాట్లాడుతూ...
రాజకీయ నాయకులు ఏకనామికల్ ప్రామిస్ చేస్తారని... కేసీఆర్ మాత్రం పొలిటికల్ ప్రామిస్ చేశారని అన్నారు. ప్రజల ఆలోచనలు కేసీఆర్ అర్థం చేసుకోవాలని హితవుపలికారు. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలో కేసీఆర్ చెప్పాలని అన్నారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ దళితులకు అనేక పొలిటికల్ ప్రామిసెస్ చేశారని గుర్తుచేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ఎందుకు ఆ మాటపై నిలబడలేదని ప్రశ్నించారు. మూడు ఎకరాల భూమి పక్కన పెట్టి దళితబందు ఎందుకు తెచ్చాడో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్‌ను కేసీఆర్ తన జాతీయ ఎజెండాలో చేర్చాలని గద్దర్ పేర్కొన్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
Friday, November 25, 2022
భారత రాజ్యాంగ పీఠక
సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని;
ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ;
అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి;, వారందరిలో
వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి;
మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము.
రూ.3వేల కోట్ల లావాదేవీలపై అనుమానం.!
Wednesday, November 23, 2022
ఇప్పుడు మీకు తెలుస్తుందా..?
The collector who is captive in the hands of the leaders..?
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో భారీగా పట్టు బడ్డ గంజాయి
*షాద్ నగర్ పట్టణంలో భారీగా పట్టు బడ్డ గంజాయి*
*రాయికల్ టోల్ ప్లాజా వద్ద శంషాబాద్ ఎస్. ఓ. టి. పోలీసులు మరియు షాద్ నగర్ పోలీసులు కలిసి పట్టు కున్న గంజాయి*
*దాదాపుగా ఏడూ లక్షల విలువ చేసే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఎల్లంపల్లి కుర్వ రమేష్ ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించిన పోలీసులు*
*గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను వలపన్ని పట్టు కున్న పోలీసు సిబ్బందిని అభినందించిన షాద్ నగర్ ఏసిపి*
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు మరియు షాద్ నగర్ పోలీసులు కలిసికట్టుగా గంజాయ్ స్మగ్లింగ్ చేస్తున్న ఎల్లంపల్లి కి చెందిన కుర్వ రమేష్ తన కారులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు వచ్చిన సమాచారం తో అతని పై కొన్ని రోజుల నుండి నిగా పెట్టి నిన్న రాయికల్ టోల్ ప్లాజా భద్రాచలం అటవీ ప్రాంతం నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న గంజాయి నీ సీజ్ చేశారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు, విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ sot పోలీసులతో పాటు షాద్ నగర్ పోలీసులు రాయికల్ టోల్ ప్లాజా దగ్గర వాహనాన్ని అపి తనిఖీ చెయ్యగా 110 కిలోల గంజాయి పట్టుబడింది షాద్ నగర్ ప్రాంతానికి చెందిన రమేష్ అని వ్యక్తి ఈ గంజాయి నీ భద్రాచలం నుండి టోల్ ప్లాజా లు లేని రహదారుల ద్వారా హైదరాబాద్ కు ఈ గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు, గంజాయి తరలించే క్రమంలో పట్టుబడకుండా ఉండడానికి నిందితుడు వాహనం లో ప్రతేక ఏర్పాట్లు చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు, పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్ లో 7 లక్షల వరకు ఉంటుందని తెలిపారు షాద్ నగర్ ఎసిపి కుషాల్కార్ తెలిపారు.
--------------------------------------------------------------
ఇక వివరాల్లోకి వెళ్తే షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ పరిధిలో రంగ సముద్రానికి చెందిన కురువ రమేష్ వయసు 30 సంవత్సరాలు మరియు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గూడూరు గ్రామానికి చెందిన వీరన్న మరియు భద్రాచలం జిల్లాకు చెందిన సోము రాజు ముగ్గురు కలిసి గంజాయిని భద్రాచలం నుండి హైదరాబాద్ కి రవాణా చేస్తూ పట్టుబడ్డారు
నిందితుడు కురవ రమేష్ వరంగల్ కు చెందిన వీరన్న భద్రాచలం వెళ్లి అక్కడ సోమరాజు అనే వ్యక్తిని కలిసి అతని ద్వారా 110 కిలోల గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసుకొని కురువ రమేష్ కు చెందిన TATA TS10 EM10 7999 గల వాహనం వెనుక భాగంలో ఒకదాని మీద ఒకటి పేర్చుకొని ఎవరికి అనుమానం రాకుండా భద్రాచలం నుండి హైదరాబాద్ కు వెళ్తూ ఎక్కడైనా పోలీసు లు పట్టుకుంటారేమోనని తెలివిగా గుంటూరు- కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్లే క్రమంలో షాద్ నగర్ టోల్ గేట్ దగ్గర నిన్న రాత్రి 7 గంటల సమయంలో పక్క సమాచారంతో శంషాబాద్ డిసిపి మరియు షాద్‌నగర్ ఏసిపి గారి పర్యవేక్షణలో రాజేశ్వర్ రెడ్డి STO శంషాబాద్,మరియు షాద్‌నగర్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్,ఎస్సై విజయ్ మరియు కానిస్టేబుల్. షాద్‌నగర్ టోల్ గేట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తూ నిందితుడిని పట్టుకోవడం జరిగిందని ఏ సి పి కుశాల్కర్ మీడియాకు తెలపడం జరిగింది.ఇట్టి చేదనలో చాకచక్యంగా వ్యవహరించిన షాద్‌నగర్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్,ఎస్సై విజయ్ కుమార్ మరియు ఎస్ ఓ టి రాజేశ్వర్ రెడ్డిని అభినందించి వీరికి తగిన రివార్డులను పై అధికారుల ద్వారా ఇప్పించడం జరుగుతుందని అన్నారు
*మహేష్ బైరమోని*
Tuesday, November 22, 2022
మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్.....!
సాయంత్రం ప్రగతిభవన్ లో సీయం కేసీఆర్....అత్యవసర సమావేశం....!
అయ్యప్ప భక్తులకు.... శుభవార్త.....!
*అయ్యప్ప భక్తులకు.... శుభవార్త.....!*
ఢిల్లీ : అయ్యప్ప స్వామి భక్తులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్-బీసీఏఎస్ శుభవార్త చెప్పింది. విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు వెసులుబాటు కల్పించింది.విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులు ఇకపై ఇరుముడిని క్యాబిన్ లగేజీలో తీసుకువెళ్లేందుకు అనుమతించింది. అన్ని తనిఖీల తర్వాత... అయ్యప్ప భక్తులు తీసుకెళ్లే ఇరుముడిని క్యాబిన్లోకి అనుమతించాలని అన్ని విమానాశ్రయాల సెక్యురిటీ సిబ్బందికి బీసీఏఎస్ మార్గదర్శకాలు ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 20 వరకూ విమానాల్లో శబరిమల వెళ్లే భక్తులకు వెసులుబాటు కల్పిస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. మండలం, మకరజ్యోతి దీక్షలు పూర్తయ్యే వరకూ అవకాశం కల్పిస్తూ... బీసీఏఎస్ డైరక్టర్ జనరల్ ఉత్తర్వులు ఇచ్చారు
*సుజీవన్ వావిలాల*🖋️
శ్రీ శ్రీ శ్రీ కట్టమైసమ్మ దేవాలయం
*అందరికి 🙏*
*#GHMC ఉప్పల్ సర్కిల్ #రామంతాపూర్ డివిజన్ చిన్న చెరువు కట్ట క్రింద వున్న శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం కబ్జా & అభివృద్ధి గురించి కొందరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఆటివారికి హెచ్చరిక ఈ అంశం న్యాయ పరిధిలో వుంది కావున ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే #చట్టపరమైన చర్యలు తీసుకోబడును.... Bplkm🪶*
Monday, November 21, 2022
ఆదాయానికి మించి ఆస్తుల బాగోతంపైనే దృష్టంతా
Sunday, November 20, 2022
పవన్ రాజకీయ జీవితంపై....చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
*పవన్ రాజకీయ జీవితంపై....చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు*
హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''నా మనస్సు నుంచి రాకపోతే దేనిఅంతూ నేను చూడలేను.నేను చూడని ఆ అంతు ఏమిటో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని వెనక్కి వచ్చేశాను. రాజకీయాల్లో రాణించాలంటే సెన్సిటివ్ గా ఉండకూడదు. రాజకీయాల్లో మొరుటుతేలాలి.. బాగా రాటుతేలాలి. ఇతరులను మాటలు అనాలి.. అనిపించుకోవాలి.. ఇది నాకు అవసరమా?.. దానికి పవన్‌కల్యాణ్ తగినవాడు.. తాను అంటాడు.. అనిపించుకుంటాడు. పవన్‌కు మీరంతా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులతో పవన్ ఏదో ఒకరోజు అత్యున్నత స్థానంలో ఉంటాడు'' అని చిరంజీవి జోస్యం చెప్పారు.మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు సినిమాల్లో సంచలనం. ఆయనకు విజయవంతమైన నటుడిగా గుర్తింపు ఉంది. సినిమాల్లో సక్సెస్ సాధించిన చిరంజీవి.. రాజకీయాల్లో మాత్రం మూణాళ్ల ముచ్చటగానే ప్రయాణం సాగింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా సినిమాల్లో బిజీ అయిపోయారు. రాజకీయ వివాదాలకు చిరంజీవి దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో '' నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు" అని చిరంజీవి వ్యాఖ్యానించారు. తాజాగా రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమనే భావనకు ఆయన వచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.
*సుజీవన్ వావిలాల*🖋️
నకిలీ జీఎస్టీ అధికారులు.... అరెస్ట్
*నకిలీ జీఎస్టీ అధికారులు.... అరెస్ట్*
రూ. 28 కోట్ల మోసం
నిందితులపై పీడీ యాక్ట్
హైదరాబాద్/జీడిమెట్ల: జీఎస్టీ, కస్టమ్స్ అధికారులమంటూ నకిలీ ఐడీ కార్డులు సృష్టించి పలువురు వ్యాపారులను మోసం చేసి రూ.28 కోట్ల వసూళ్లకు పాల్పడిన ముఠాను బాలానగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.20 వేల నగదు, మూడు సెల్ ఫోన్లు, కారు, బంగారం కొనుగోలు చేసిన రసీదులు, ఏటీఎం కార్డులు, నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ డీసీపీ గోనే సందీప్ శనివారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బురుజుకింది నారాయణగౌడ్(57) నగరంలోని బోడుప్పల్లో ఉంటున్నాడు. ఇతడు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుడు. నాంపల్లిలోని జీఎస్టీ కార్యాలయంలో కార్లను అద్దెకు నడుపుతోన్నాడు. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న అధికారుల ఐడీ కార్డులు దొంగిలించి, నకిలీ ఐడీ కార్డులు తయారు చేయించాడు.
వరంగల్ జిల్లాకు చెందిన మేరుగు శైలజ (37) ప్రైవేట్ ఉద్యోగి. కాప్రాలో నివాసముంటోంది. ఆమె పేరు మీద కూడా జీఎస్టీ కమిషనర్‌గా ఐడీ కార్డు సృష్టించాడు. ఇద్దరూ బంగారం, స్టీలు, సిమెంట్ దుకాణ యజమానులు, బిల్డర్లతో మాట్లాడి జీఎస్టీ లేకుండా చూస్తామని నమ్మించి మోసం చేశారు. అనంతరం మొఖం చాటేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టారు. నకిలీ అధికారులుగా గుర్తించి నారాయణగౌడ్, శైలజను అరెస్ట్ చేశారు. వీరిపై పేట్‌బషీరాబాద్, దుండిగల్, పహాడీషరీఫ్, ఎల్బీనగర్, నర్సాపూర్, మీర్పేట్, మేడిపల్లి, ఉప్పల్, కరీంనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 13 కేసులు ఉన్నాయి. వీరు దాదాపు 50మంది నుంచి రూ.28 కోట్ల మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. నిందితులపై పీడీయాక్ట్ పెట్టనున్నట్టు డీసీపీ సందీప్ వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్వోటీ సైబారాబాద్ ఏడీసీపీ పి.నారాయణ, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ జేమ్స్‌బాబు, సిబ్బందిని అభినందించారు.
*సుజీవన్ వావిలాల*🖋️
తొలివెలుగు'పై 10 కోట్ల పరువు నష్టం దావా
Friday, November 18, 2022
బీజేపీ టీఆర్ఎస్ పై విమర్శలు....!
*బీజేపీ టీఆర్ఎస్ పై విమర్శలు....!*
హైదరాబాద్: బీజేపీ (BJP), టీఆర్ఎస్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ-టీఆర్ఎస్ కలిసి తెలంగాణను కలుషితం చేస్తున్నాయని దుయ్యబట్టారు.అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను నమ్ముకుని సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌వి దిగజారుడు రాజకీయాలని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు తనకు ఆఫర్ చేశారని ఎమ్మెల్సీ కవిత ఒప్పుకున్నారని, దీనిపై కూడా హైదరాబాద్ సీపీ ఆనంద్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కవిత స్టేట్మెంట్ను సీపీ ఆనంద్ రికార్డ్ చేయాలని, ఆమెకు ఎవరు ఆఫర్ ఇచ్చారో వారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
*సుజీవన్ వావిలాల*🖋️
ఈడీ విచారణకు ఎమ్మెల్సీ రమణ..... అస్వస్థతతో ఆస్పత్రికి తరలింపు....!
*ఈడీ విచారణకు ఎమ్మెల్సీ రమణ..... అస్వస్థతతో ఆస్పత్రికి తరలింపు....!*
హైదరాబాద్: క్యాసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. క్యాసినో విషయంలో ఇప్పటికే ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలని తెరాస ఎమ్మెల్సీ ఎల్ రమణకు గతంలోనే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. క్యాసినో ఆడేందుకు ఎల్ రమణ విదేశాలకు వెళ్లినట్లు అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఇవాళ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం రమణ హాజరయ్యారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే అనంతపురానికి చెందిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోదరులు మహేష్‌యాదవ్, ధర్మేందర్ యాదవ్‌లను హైదరాబాద్ ఈడీ అధికారులు తమ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించారు.
*కళ్లు తిరిగి నీరసంగా*
ఈడీ కార్యాలయానికి వచ్చిన ఎల్ రమణ.. ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల రమణ గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకున్నారు. విచారణ నిమిత్తం వచ్చిన ఆయన.. అక్కడి భవనంలో మూడో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ వినియోగించకుండా మెట్లు ఎక్కి వెళ్లారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన వెంటనే అధికారులను రమణ మంచినీరు అడిగినట్లు సమాచారం. కళ్లు తిరిగి నీరసంగా అనిపించడంతో విషయాన్ని ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చాలా సేపటివరకు రమణ పరిస్థితి అలాగే ఉండడంతో అధికారులు స్పందించి హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల పాటు ఈడీ కార్యాలయంలోనే ఉన్నప్పటికీ నీరసంగా కనిపించడంతో క్యాసినోపై రమణను అధికారులు పెద్దగా ప్రశ్నించలేకపోయారని సమాచారం.
క్యాసినోల ముసుగులో విదేశాలకు నిధుల మళ్లిస్తున్నారన్న ఆరోపణలపై నాలుగు నెలల క్రితం ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి జూద ప్రియులను ప్రత్యేక ప్యాకేజీల ద్వారా విదేశాలకు తీసుకెళుతూ పెద్దమొత్తంలో నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పలువురు టూర్ ఆపరేటర్లపై గత జులైలో ఈడీ కేసు నమోదు చేసి పలువురిని విచారించింది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి తదితరుల ఇళ్లు, కార్యాలయాల్లో అప్పట్లో సోదాలు నిర్వహించి వారిని విచారించారు.
*సుజీవన్ వావిలాల*🖋️
ఈటలతో పాటు ప్రభుత్వ పెద్దలకూ నిర్మాణాలు.....!
*ఈటలతో పాటు ప్రభుత్వ పెద్దలకూ నిర్మాణాలు.....!*
*పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులకు కూడా..*
*దేవరయాంజాల్'లో* *1350 ఎకరాలు దేవాదాయ శాఖవే!*
*ఆ భూముల్లో గోదాములు, పరిశ్రమలు*
*సర్కారుకు నివేదిక అందించిన త్రిసభ్య కమిటీ*
మేడ్చల్, : దేవరయాంజాల్‌లోని 1350 ఎకరాలు దేవాదాయ శాఖకు చెందినవేనని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మునిసిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్ సీతారామచంద్రస్వామి ఆలయ భూములు 1350 ఎకరాలు దేవాదాయ శాఖవేనని సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావు నేృత్వంలోని కమిటీ స్పష్టం చేసింది. అయితే ఈ భూముల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామిక వేత్తలు, ప్రజాప్రతినిధులు గోదాములు, పరిశ్రమలు తదితర నిర్మాణాలను చేపట్టినట్లు కమిటీ పేర్కొంది. ఈటల రాజేందర్ టీఆర్‌ఎ్‌సలో ఉన్నంత వరకూ ఈ భూముల వైపు కన్నెత్తి చూడని అధికారులు.. ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపించిన తర్వాత ఆలయ భూములను గుర్తించే పని చేపట్టడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో పలుమార్లు క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిటీ.. ఆలయ భూములతో పాటు అందులో చేపట్టిన నిర్మాణాలను పరిశీలించింది. ఎట్టకేలకు 1350 ఎకరాలు దేవాదాయ శాఖవేనని తే ల్చింది. ఈ భూముల్లో ఈటలతో పాటు అధికార పార్టీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధుల నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఈటలకు చెందిన గోదాముల్లో ఉన్న ప్రభుత్వ మద్యం డిపోలను కూడా అప్పట్లో సర్కారు ఖాళీ చేయించింది. ప్రస్తుతం ఈ గోదాములు ఖాళీగానే ఉన్నాయి. దేవరయాంజాల్‌లో సర్వే నంబర్లు 55 నుంచి 63 వరకు, 639, 641, 656, 657, 660, 682, 686, 718లో ఆలయ భూములున్నాయి. ప్రస్తుతం త్రిసభ్య కమిటీ ఈ భూములు దేవాదాయ శాఖకు చెందినవేనని నివేదిక అందించడంతో అక్క డ నిర్మాణాలు చేపట్టిన వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందోనని ఆందోళనలో ఉన్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
Thursday, November 17, 2022
2023 సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం
లిక్కర్ స్కామ్‌లో ‘కనిక’ట్టు
Wednesday, November 16, 2022
*పత్రికా ప్రకటన*
Tuesday, November 15, 2022
#కేసిఆర్ సారు నిఘా ప్రజలు పెట్టారు ఎప్పుడో
*#కేసీఆర్ సారు #ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం MLA మీద నిఘా పెట్టండి.... అతని పనితీరు గురించి #ప్రజాసంకల్పం ను సంప్రదించండి మీ #ఇంటెలిజెన్స్ ఇచ్చే రిపోర్ట్ కన్నా అసలైన రిపోర్ట్ మేమే మీకు వాస్తవాలతో తెలియచేస్తాము.... Bplkm🪶* *Copy to Group link Media* prajasankalpam1.blogspot.com
నాలుగో స్తంబమూ.... కూలిపోయింది.....!
*నాలుగో స్తంబమూ.... కూలిపోయింది.....!*
*తొలి తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్.. మలి దశలో కృష్ణ, శోభన్‌బాబు*
*ఎన్టీఆర్ తరహాలో అన్ని పాత్రలూ పోషించిన సూపర్ స్టార్ కృష్ణ*
తెలుగు చిత్ర పరిశ్రమ తొలి తరం హీరోలెవరంటే ఎన్టీఆర్, ఏఎన్నార్..! వీరిలో ఎన్టీఆర్ పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక పాత్రలతో అలరించగా.. ఏఎన్నార్ రొమాంటిక్, కుటుంబ ప్రాఽధాన్య చిత్రాలతో ఆకట్టుకున్నారు. వీరి స్థానాలను మలి తరంలో కృష్ణ, శోభన్‌బాబు భర్తీ చేశారు.
కృష్ణ.. ఎన్టీఆర్‌లా అన్ని తరహా పాత్రలతో రంజింపజేశారు. దీనికితోడుగా సాహసోపేత ప్రయోగాలతో దూసుకెళ్లారు. శోభన్‌బాబు కుటుంబ కథానాయకుడిగా, మహిళల అభిమాన హీరోగా మన్ననలు పొందారు.
అలా ఈ నలుగురూ తెలుగు సినీ సౌధానికి నాలుగు స్తంభాలుగా నిలిచారు. సినిమా కథాంశాల్లోనే కాక సంఖ్యలోనూ వీరి మధ్య పోలికలున్నాయి. నలుగురిలోనూ కష్ణనే ఎక్కువ సినిమాలు చేశారు. ఎన్టీఆర్, కృష్ణ ఇద్దరూ 300 పైగా చిత్రాల్లో నటించారు. కృష్ణ స్కోరు 350పైనే. ఏఎన్నార్ 255, శోభన్‌బాబు 230 సినిమాలు చేశారు. కృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్తంభాలుగా నిలిచిన నలుగురూ వెళ్లిపోయినట్లుయింది.
*సుజీవన్ వావిలాల*🖋️
షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి
*టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించారు. ప్రజల మధ్యలోనే ఎమ్మెల్యేలు, నేతలు ఉండాలని సీఎం సూచించారు. మళ్లీ పాత వాళ్లకే టికెట్లు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికలకు పది నెలల సమయమే ఉంది. బీజేపీతో పోరాడాల్సిందే అని చెప్పారు. ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు*.