Wednesday, July 31, 2024

𝗝𝗼𝘂𝗿𝗻𝗮𝗹𝗶𝘀𝘁𝘀 𝘀𝗵𝗼𝘂𝗹𝗱 𝗰𝗼𝗺𝗲 𝗶𝗻𝘁𝗼 𝗽𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀..! (Unanimous Resolution in Hyderabad Round Table Meeting)

𝗝𝗼𝘂𝗿𝗻𝗮𝗹𝗶𝘀𝘁𝘀 𝘀𝗵𝗼𝘂𝗹𝗱 𝗰𝗼𝗺𝗲 𝗶𝗻𝘁𝗼 𝗽𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀..!
 (Unanimous Resolution in Hyderabad Round Table Meeting)

 Many speakers opined that there is a need for journalists to come directly into politics, who are constantly striving for a corruption-free, crime-free and selfless society.  A Political Party of Journalists was formed under the joint auspices of All India Working Journalists Association, Telugu State Welfare Association and Telangana State Journalists Welfare Association in Hyderabad Somajiguda Press Club.  On this occasion, in the round table meeting held on Wednesday, celebrities and intellectuals expressed their views on zero based budget politics, establishment of new society, social justice, women empowerment, future of unemployed youth, corruption-free and selfless society.  In this round table meeting, retired IG Narsimhulu, former BC Commission Chairman BS.Ramulu, AWJA National President K. Koteswar Rao, Telangana State Journalists Welfare Association Founder President Anamchinni Venkateswara Rao, AWJA National Coordinator Giriraj Belide Harinadh, AWJA Andhra Pradesh President Namala Visveswara Rao.  , AWJA Advisor Giri Raju, Social Telangana Print Women Leader, Activist Aruna, 'Zero' Budget Politics Madhava Reddy, AWJA Telangana General Secretary Bln Prasad, TJSS General Secretary Gauti Ramakrishna, AWJA State President Rajireddy, TJSS Telangana Social Media Incharge Bapatla Krishnamohan,Chintakayala Venkateshwarlu, Purushottam, Rajanarsimha, Venkataramana,  Ravi, Ravikumar, Srinivas, Brahm and many other senior journalists participated in large scale. Later, the guests unveiled a free online platform for common people to send their opinions.

పాత్రికేయులు రాజకీయల్లోకి రావలసిందే..!

.
పాత్రికేయులు రాజకీయల్లోకి రావలసిందే..!
( హైదరాబాద్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏకాగ్రీవ తీర్మానం)


అవినీతి, నేర రహిత నిస్వార్థ సమాజం కోసం నిరంతరం కష్టపడే పాత్రికేయులు నేరుగా రాజకీయల్లోకి రావలసిన ఆవశ్యకత ఏర్పండిందని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్, తెలుగు రాష్ట్ర సంక్షేమ సంఘం, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పాత్రికేయుల రాజకీయ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈ సందర్బంగా బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జీరో బేస్ డ్ బడ్జెట్ పాలిటిక్స్, నవ సమాజ స్థాపన, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, నిరుద్యోగ యువత భవిష్యత్, అవినీతి - నేర రహిత, నిస్వార్థ సమాజ నిర్మాణం వంటి అంశాలపై ప్రముఖులు, మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జైళ్ల శాఖ రిటైర్డ్ ఐజి నర్సింహులు, బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ బిఎస్‌.రాములు, ఏడబ్ల్యూజేఏ జాతీయ అధ్యక్షుడు కె.కోటేశ్వర్‌రావు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరావు, ఏడబ్ల్యూజెఎ జాతీయ కో-ఆర్డినేటర్ గిరిరాజ్ బెలిదే హరినాధ్, ఏడబ్ల్యూజెఎ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు నామాల విశ్వేశ్వర రావు, ఏడబ్ల్యూజెఎ సలహాదారు గిరి రాజు, సామాజిక తెలంగాణ ప్రంట్ మహిళా నాయకురాలు, ఉద్యమకారిణి అరుణ, 'జీరో' బడ్జెట్ పాలిటిక్స్ మాధవ రెడ్డి, ఏడబ్ల్యూజెఎ తెలంగాణ ప్రధాన కార్యదర్శి బిఎల్ఎన్ ప్రసాద్, టిజేఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ, ఏడబ్ల్యూజెఎ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి,TJSS తెలంగాణ సోషల్ మీడియా ఇంచార్జి బాపట్ల కృష్ణమోహన్, చింతకాయల వెంకటేశ్వర్లు, పురుషోత్తం, రాజనర్సింహ, వెంకటరమణ, రవి, రవికుమార్, శ్రీనివాస్, బ్రహ్మం పలువురు సీనియర్ పాత్రికేయులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సామాన్య ప్రజలు తమ అభిప్రాయాలను పంపటానికి ఉచిత అంతర్జాలాన్ని అతిథులు ఆవిష్కరించారు

హైదరాబాద్ చేరుకున్న నూతన గవర్నర్.... స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

*హైదరాబాద్ చేరుకున్న నూతన గవర్నర్.... స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి*

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. బుధవారం త్రిపుర నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న నూతన గవర్నర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాలల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు, గవర్నర్ కార్యదర్శి బి.వెంకటే,శం ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.అనంతరం శంషాబాద్ విమానాశ్రయంలో నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ నూతన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే జిష్ణు దేవ్ వర్మ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్, ప్రతిపక్ష నేత కేసీఆర్, విపక్ష పార్టీల నేతలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.

Courtesy / Source :
*V.S.జీవన్*

Tuesday, July 30, 2024

*_పాత్రికేయుల రాజకీయ పార్టీ ఆవిర్భావం_*

_AWJA, తెలంగాణ & తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘాల (TJSS) సంయుక్త ఆధ్వర్యంలో.._
*_పాత్రికేయుల రాజకీయ పార్టీ ఆవిర్భావం_*
_(రౌండ్ టేబుల్ సమావేశం)_

_# జీరో బడ్జెట్ పాలిటిక్స్_
_# నవ సమాజ స్థాపన_
_# సామాజిక న్యాయం_
_# మహిళా సాధికారత_
_# నిరుద్యోగ యువత భవిష్యత్_
_# అవినీతి - నేర రహిత, నిస్వార్థ సమాజ నిర్మాణం_ 

*_తేది: 31/07/2024,    సమయం: ఉదయం 11.00 గంటల నుంచి 1.00 గంట వరకు.._*
*_(నోట్: 11.00 గంటల వరకు కచ్చితంగా కార్యక్రమం ప్రారంభం అవుతుంది. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానం)_*

_స్థలం: సోమాజీగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాద్_


Sunday, July 28, 2024

Telangana Father Mourns Daughter Who Died in Delhi IAS Coaching Centre Flood

Telangana Father Mourns Daughter Who Died in Delhi IAS Coaching Centre Flood

Vijay Kumar, a resident of Secunderabad, Telangana, is grappling with the devastating loss of his eldest daughter, Tanya Soni, a highly motivated UPSC aspirant. Tanya was one of three students who tragically died on Saturday after being trapped in the flooded basement of Rau’s IAS Study Circle in Old Rajinder Nagar, Central Delhi, when a drain burst during heavy rain.

Tanya, along with Shreya Yadav from Uttar Pradesh and Nivin Dalwin from Kerala, had been attending coaching classes in Delhi, chasing their dreams of becoming IAS officers. The news of the incident sent shockwaves through the families of the victims.

Vijay Kumar, who works with the Singareni Collieries Company Limited (SCCL) and resides in Mancherial, was on a train to Lucknow with his wife and another daughter when they received the heartbreaking news of Tanya’s death. They immediately deboarded the train at Nagpur and flew to New Delhi.

“I have no words to express how I feel. She was my eldest, she had big dreams and was highly motivated. We are troubled thinking about the way she died. We are devastated… Don’t know what to do,” Vijay Kumar said.

Vijay umar is a deputy general manager in the Srirampur area. He described Tanya as diligent and focused, noting that she graduated from Delhi University and had been dedicated to her UPSC preparations, calling home daily to discuss her progress.

#Telangana #RajendarNagar #రాసిస్

Courtesy / Source by :  https://x.com/sudhakarudumula/status/1817586038988296452?t=QMGd5X-PPvcKJz1s9VsqFg&s=19

*కల్వకుర్తి TO హైదరాబాద్ నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తాం.... సీఎం రేవంత్ రెడ్డి*

*కల్వకుర్తి TO హైదరాబాద్ నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తాం.... సీఎం రేవంత్ రెడ్డి*

కల్వకుర్తి: కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డికి పదవులతో గౌరవం రాలేదు.. ఆయన వల్లే పదవులకు గౌరవం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కొట్ర చౌరస్తాలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ప్రత్యేక తెలంగాణ ప్రాధాన్యతను జైపాల్‌రెడ్డి వివరించి ఒప్పించారని గుర్తు చేశారు. 2014లో ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. జులై 31 లోపే రెండో విడత రుణమాఫీ పూర్తి చేస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మరో మూడు రోజుల్లో ముచ్చెర్లలో స్కిల్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తామని సీఎం వివరించారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ భారాసకు గుండుసున్నానే వస్తుందని సీఎం జోస్యం చెప్పారు.
కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌, రహదారుల కోసం రూ.180కోట్లు మంజూరు చేస్తాం. ఆమన్‌గల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేస్తాం. కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు నాలుగు లేన్ల రహదారి తెస్తాం. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కూడా మాట్లాడాం. నేను చదువుకున్న తాండ్ర హైస్కూల్‌ అభివృద్ధికి రూ.5కోట్లు మంజూరు చేస్తున్నా. కల్వకుర్తిలో నిరుద్యోగం పారదోలడానికి స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం. మాడగుల మండల కేంద్రంలో అండర్‌ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం'' అని సీఎం ప్రకటించారు.

Courtesy / Source by : 
*V.S. జీవన్* 

Saturday, July 27, 2024

బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సమావేశాలకు ఆoక్షలు ఎందుకు?

మానవహక్కులవేదిక :
*సుందరయ్య విజ్ఞానకేంద్రం లో సమావేశాలు నిర్వహణపై ఆoక్షలు రద్ద చేయాలి*   
బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశాలు నిర్వహించాలంటే ముందుగా చిక్కడపల్లి పోలీసుల నుండి అనుమతి తీసుకోవాలని, లేనిపక్షంలో సుందరయ్య  భవన్ లో ఉన్న ట్రస్ట్ యాజమాన్యం, హాలు కోసం బుకింగ్స్ తీసుకోవడం లేదని, ఈ విషయంలో మానవహక్కుల వేదిక సంస్థ, తెలంగాణ డి.జి.పి. కి ఒక లేక రాసింది.

తెలంగాణ  రాష్ట్రంలో  అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర భాద్యత చేపట్టిన ముఖ్యమంత్రి తెలంగాణ లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు కృషి చేస్తామని పౌర స్వేచ్ఛను, పౌర హక్కులను కాపాడుతామని బహిరంగంగా ప్రకటిం చారు, అసెంబ్లీ లో కూడా ప్రకటన చేసారు. చిక్కడపల్లి  పోలీసులు సుందరయ్య భవన్ యాజమాన్యం కు పంపిన ఆదేశాలు ముఖ్యమంత్రి బహిరంగంగా అసెంబ్లీ లో ప్రకటించిన  ప్రజలకు  ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ఉన్నాయని, ఈ విషయంలో DGP గారిని జోక్యం చేసుకొని చిక్కడపల్లి పోలీసులు ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీ .శేషాద్రి గారికి, హాంశాఖ కార్యదర్శికి కూడా లేఖలు రాసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చి  జోక్యం  చేసుకోవాలని కొరినట్టు సంస్థ ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు యస్.జీవన్ కుమార్, వేమన వసంత లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి డా. ఎస్.తిరుపరుపత య్య గార్లు పత్రికలకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు,

Friday, July 26, 2024

పేదింటి పిల్లల చదువులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత

సిద్దిపేట బిడ్డ ఆర్యన్ రోషన్ ఐఐటీలో చేరుతాడిక..
🟩 సెమిస్టర్ ఫీజుతోపాటు ల్యాప్ టాప్ అందించిన కలెక్టర్
🟩 పేదింటి పిల్లల చదువులకు ప్రజాప్రభుత్వం చేయూత

చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా, కూలీ పనులు చేసే తల్లి అండతో, సోషల్ వేల్ఫేర్ విద్యా సంస్థల్లో చేరి, చదువుల్లో రాణించి దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించిన సిద్దిపేట జిల్లా బిడ్డ ఆర్యన్ రోషన్ కు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది.

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన బి.ఆర్యన్ రోషన్ కోహెడలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదివాడు. పదవ తరగతిలో 10/10 జీపీ, ఇంటర్ లో 93.69 మార్కులు తెచ్చుకొని, జేఈఈ ర్యాంకు ద్వారా తిరుపతి ఐఐటీలో సీటు సాధించాడు. పేదరికం కారణంగా ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆర్యన్ రోషన్ గురించి వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రి @revanth_anumula గారి ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా యంత్రాంగం స్పందించింది. 

@Collector_SDPT మను చౌదరి గారు విద్యార్థి ఆర్యన్ రోషన్ ను శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయానికి పిలిపించారు. ఐఐటీ తిరుపతిలో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్  లో సీటు పొందిన ఆర్యన్ రోషన్ కు సెమిస్టర్ ఫీజు నిమిత్తం రూ.36,750 చెక్కును అందజేశారు. అలాగే చదవు అవసరాల నిమిత్తం రూ. 40,500 విలువైన ల్యాప్ టాప్ ను కూడా కొనిచ్చారు.

భవిష్యత్తులోనూ ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని, ఐఐటీలోనూ రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థి ఆర్యన్ రోషన్ కు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ @Garimakagrawal గారు, ఇతర అధికారులు కూడా ఉన్నారు.
#Siddipet #Telangana 

Courtesy / Source by :  https://x.com/CPRO_TGCM/status/1816850369999438214?t=2sDcDV6bS2BMWxfAU0mGiw&s=19

​*ఉత్తమ తెలుగు జర్నలిస్టు లు -2024 జాబితా విడుదల*

*​ఉత్తమ తెలుగు జర్నలిస్టు లు -2024 జాబితా విడుదల*

*40 విభాగాలలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి 41 మంది ఎంపిక*

*అవార్డుతో పాటు రూ.5వేల నగదు పురస్కారం కూడా..*

*సంయుక్తంగా ప్రకటించిన  తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం*

*త్వరలోనే హైదరాబాద్ లో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం*

*హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్* :
 
ప్రజాగళాన్ని తన కలంగా మార్చుకుని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన జర్నలిస్టులకు 'తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం', 'తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం'  సంయుక్త ఆధ్వర్యంలో 'ఉత్తమ తెలుగు జర్నలిస్టు పురస్కారాలు' అందజేస్తుంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉత్తమ జర్నలిస్టు -2024 పురస్కార గ్రహీతల వివరాలను తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మిద్దెల జితేందర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి ఎంతగానో సేవ చేస్తున్న జర్నలిస్టులకు  ప్రభుత్వాలు అండగా ఉంటే మరింత మేలు జరుగుతుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచారం శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టులకు ఇటువంటి పురస్కారాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయని, బాధ్యతను పెంచుతాయన్నారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అనం చిన్ని వెంకటేశ్వరరావు లు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది ప్రతిభ కలిగిన జర్నలిస్టులు ఉన్నారన్నారు. సామాజిక స్పృహ, బాధ్యత కలిగిన జర్నలిస్టులకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజా గొంతుక ప్రజాప్రతినిధుల గొంతుకగా మారితే సమాజం నష్టపోతుంది. అందుకే సామాజిక దృక్పథం కలిగిన నిఖార్సయిన జర్నలిస్టులను ఎంపిక చేసి సమాజానికి ఆదర్శవంతమైన జర్నలిజాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు కార్యక్రమంలో భాగంగా వచ్చిన ధరఖాస్తులలో నుండి 40 విభాగాలలో 41 మంది జర్నలిస్టులను ఎంపిక చేసి ప్రకటించడం జరిగింది. త్వరలోనే ప్రముఖుల చేత ఈ పురస్కారంతో పాటు రూ.5వేల నగదు పురస్కారం కూడా అందజేయబోతున్నాం అని వివరించారు. రెండు రాష్ట్రాలలో ఎన్నికల కారణంగా కొంత ఆలస్యం జరిగిందన్నారు.  తెలుగు జర్నలిస్టుల కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఉగాది పురస్కారాల  ప్రదానోత్సవాలను కూడా ప్రతీ ఏటా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ర్ట అధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గిలకత్తుల శ్రీనివాస్, బోడపాటి సుబ్బారావు, *తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం సోషల్ మీడియా ఇన్చార్జి బాపట్ల కృష్ణ మోహన్*, సుపర్ టీవీ న్యూస్ ఎండీ చుండూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Thursday, July 25, 2024

తెలంగాణ బడ్జెట్ లో విద్య వైద్య రంగానికి తీవ్ర అన్యాయం

ప్రెస్ నోట్ 
_________

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లొ గతంలో లాగానే విద్య వైద్య రంగానికి తీవ్ర అన్యాయం
విద్య వైద్య రంగంపై చిన్న చూపు
  నిధుల కేటాయింపులో మొండి చేయి
విద్యకు రూపాయలు 21, 292 కోట్లు
వైద్యానికి రుపాయలు 11,468 కోట్లు చాలా తక్కువ

కార్పొరేట్ స్థాయిలో విద్య వైద్యాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవు

కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య, వైద్యం లేకపోవడం వలన ప్రజలు ప్రవేట్ విద్య వైద్యాన్ని ఆశ్రయించి లక్షల రూపాయల దోపిడికి గురి అవుతున్నారు తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం.

నారగొని ప్రవీణ్ కుమార్ 
ప్రెసిడెంట్
ఉచిత విద్య వైద్య సాధన సమితి 
98490 40195

*****---*****---*****---*****
*విద్య, వైద్యానికి బడ్జెట్ లో లక్ష కోట్లు కేటాయించాలి* 

*లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ పాలన కనిపించదు నలుగురిలో నారాయణ గుంపులో గోవింద లాగ మిగిలి పోతారు*

BRS ప్రభుత్వం చేయని మంచి పని ఇది రేవంత్ రెడ్డి చేస్తే చరిత్ర పుటల్లలో నిలిచిపోయే అవకాశం

నారగోనీ ప్రవీణ్ కుమార్ 
అద్యక్షులు
ఉచిత విద్య వైద్య సాధన సమితి 

     ప్రభుత్వాల నిర్లక్ష్యం  కారణంగా ప్రభుత్వ విద్య వైద్యం కొన ఊపిరితో ఉన్నది స్కాలర్ షిప్, టిఫిన్స్,మధ్యానం భోజనం కాదు కావాల్సింది అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన ప్రభుత్వ విద్య కావాలి, ఆరోగ్యశ్రీ,ఆహిష్మాన్ భారత లాంటి స్కీమ్ లు కాదు కావాల్సింది కార్పొరేట్ స్థాయిలో మెరుగైన ప్రభుత్వ వైద్యం కావాలి, విద్యా వైద్యాన్ని జాతీయం చేసి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించాలి, విద్య, వైద్యం వ్యాపారస్తుల చేతిలో ఉండటం వలన ప్రజలు దోపిడీకి గురి అవుతున్నారు కనీసం ఒక కుటుంబం సంవత్సరానికి 2 లక్షల నుండి 3 లక్షల వరకు ఖర్చు చేస్తుంది  విద్యా వైద్యాన్ని ప్రభుత్వాలు తప్ప ప్రవేట్ వ్యక్తులు నడపకూడదు

ప్రవేట్ వ్యక్తల చేతిలో విద్య వైద్యం ఉన్నంత కాలం పేదరిక నిర్మూలన జరగదు

      *ప్రభుత్వ వైద్యం*

   "డబ్బు లేని ఇల్లు ఉంటుంది కానీ జబ్బు లేని ఇల్లు ఉండదు"

         పేదలకు తప్ప సంపన్నులకు పాలకులకు పనికి రాని ప్రభుత్వ వైద్యం నిర్లక్ష్యానికి గురైంది, ప్రతి వెయ్యి మందికి ఒక ప్రభుత్వ డాక్టర్ ఉండాలి కాని తెలంగాణలో 8 వేల మందికి ఒక ప్రభుత్వ డాక్టర్ ఉన్నారు
 కనీసం 37 వేల మంది డాక్టర్స్ ఉండాలి కాని నాలుగు వేల ఏడు వందల మంది మాత్రమే ఉన్నారు
పెరుగుతున్న ప్రజల అవసరాలకు తగ్గట్టుగా దవాఖానాలను పెంచాలి పెంచక పోగా ఉన్న దవాఖానలలో అరకొర వసతులు మాత్రమే ఉన్నాయి రాష్ట్రం లో ఉన్న అన్ని దవాఖానలో 20 వేల మంది నర్సులు ఉండాల్సిన చోట 5 వేలమంది నర్సులు మాత్రమే ఉన్నారు మొత్తం  దవాఖానలలో 30 వేల బెడ్లు ఉంటాయి, గాంధీ హాస్పిటల్ లొ 2000 వేల బెడ్లు ఉన్నాయి కనీసం 1000 మంది నర్సులు ఉండాలి కాని 350 మంది నర్సులు మాత్రమే ఉన్నారు
ఒక డాక్టర్ రోజు కు ఓపి లొ సుమారు 100 నుండి 200 మంది పేసెంట్లను చూస్తున్నారు, ఉన్న ప్రభుత్వ దవాఖాన లలో ప్యాకల్టీని పెంచడం లో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నవి,పారామెడికల్, స్టాప్ నర్స్,ల్యాబ్ టెక్నీషియన్, పార్మసిస్ట్, పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి,ల్యాబ్ టెక్నీషియన్ లు లేకపోవడం తో పెద్ద యంత్రాలు పడాబడి ఉన్నాయి వైద్యుల ఇతర ఉద్యోగుల నిర్లక్ష్యం అన్ని రకాల మందుల కొరత  శుభ్రత పాటించక పోవడం సర్వ సాధారనమై పోయింది, బడ్జెట్ 2022-23 కు గాను బడ్జెట్ లో కేవలం 5 శాతం మాత్రమే కేటాయించడం జరిగింది కనీసం దీన్ని 20శాతానికి పెంచాలి,ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం లేకనే ప్రజలు ఉన్నది అమ్ముకోనైన ప్రవేట్ దవాఖానలకు పోయి నిలువు దోపిడీకి గురి అవుతున్నారు 
పాలకులు మాత్రం ప్రభుత్వ సొమ్ముతో వారికి అనారోగ్యం కలిగినప్పుడు ప్రవేట్ దవాఖాన లలో వైద్యం పొందుతున్నారు, 2 ప్రభుత్వ కంటి దవాఖానలు 4 ప్రసూతి ఆస్పత్రులు 1 పిల్లల ఆస్పత్రి 2 ఛాతీ ఆస్పత్రులు, 4 ఆయుర్వేద ఆస్పత్రులు, 3 యూనాని ఆస్పత్రులు 3 హోమియోపతి ఆస్పత్రులు 1 నేచురో పతి ఆస్పత్రి (యోగ )మాత్రమే ఉన్నాయి వీటి సంఖ్య పెంచాలి, అట్లాగే ప్రభుత్వ ఫార్మాసిలు 1 ఆయుర్వేద 1 యునాని 1 హోమియోపతి మాత్రమే ఉన్నాయి,అల్లోపతి పార్మ్ సి లేదు 
     *మాఫియా చేతిలో వైద్యం*
        ప్రవేట్ దవాఖానలో లక్షలు ఖర్చు పెట్టందే వైద్యం దొరకడం లేదు,కన్సల్టింగ్ ఫీజు నుండి మొదలవుతుంది దోపిడీ వెంటనే టెస్టులు రాస్తారు, ఉదా:- సిటీ స్క్యాన్ రాస్తే 
డయాగ్నటిక్ సెంటర్ వారు పది వేలు అయితే నాలుగు వేలు నేరుగా డాక్టర్ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు ఏ రక్త పరీక్ష రాసినా 40% డాక్టర్స్ కు మామూలు ఉంటుంది, ఇక మందుల కంపెనీలు డాక్టర్స్ కు వారి కంపెనీ ల మందులు రాస్తే 40% నుండి 50% ఇస్తారు కొన్నిటిలో 200%మార్జిన్ కూడా ఉంటది విదేశీ టూర్లు ఉంటాయి, ఐ,డీ,పీ,యల్ కంపెనీ మూత పడేలా చేసి పార్మూలాలు తస్కరించి ప్రవేట్ ఫార్మా కంపెనీలు పెట్టు కున్న వారు ఉన్నారు, ఐ,డీ,పీ,యల్ లాంటి కంపెనీలను పునః ప్రారంభించి పటిష్ట పర్చి జనరిక్ మెడిసిన్ అభివృద్ధి పర్చాలి,  ప్రస్తుతానికి బ్రాండెడ్ జనరిక్ మెడిసిన్ MRP రేట్లను తగ్గిస్తే పేసెంట్స్ కు లాభం జరుగుతుంది ప్రవేట్ పార్మా సెటికల్ కంపెనీలు   పేర్కొన్నట్లు  టాబ్లెట్ లలో ఇంజక్షన్ లలో మెడిసిన్ ఉండదు, అన్ లిమిటెడ్ MRP కూడా ఉంటుంది, ప్రవేట్ దవాఖాన ల, ప్రవేట్ పార్మసి కంపెనీల యజమానులు వేల కోట్లకు పడగెత్తారు, మాఫియా చెర నుండి వైద్యాన్ని విముక్తి చేయాలంటే ప్రభుత్వ ఆస్పత్రులను పెంచి తగిన ప్యాకాల్టి యేర్పాటు చేయాలి, ఐ,డీ,పీ,యల్ లాంటి ప్రభుత్వ పార్మా కంపెనీలను స్థాపించాలి ముక్కు మూసుకుంటే తప్ప ప్రభుత్వ ఆస్పత్రులలో అడుగు పెట్టే పరిస్థితి మారాలి శుభ్రత పాటించాలి 
        *ప్రభుత్వ విద్య*
ప్రాథమిక హక్కు లలో విద్య కూడా ఒకటి మతాలకు కులాలకు అతీతంగా ప్రభుత్వమే అందరికీ సమానంగా విద్య అందించాలి
  "విద్య అనగా మానవునిలో దాగివున్న అంతర - జ్ఞానాన్ని వెలికి తీయడం"
        తెలంగాణలో ఇప్పటికీ అక్షరాస్యత 74 శాతం దాట లేదు దీనికి అనేక కారణాలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ప్యాకల్టి లేకపోవడం, విద్యార్థుల సంఖ్య కు సరిపోను ప్రభుత్వ పాఠశాలలు,జూనియర్ కాలేజీలు,డిగ్రీ కళాశాలలు,ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలను స్థాపించడం లో ప్రభుత్వాలు విఫలం కావడంతో ప్రవేట్ వ్యక్తులు పాఠశాలలను జూనియర్ కాలేజీలను, ఇంజనీరింగ్,మెడికల్ కాలేజీలను యేర్పాటు చేసి విద్యను వ్యాపారం చేశారు ఒక తెలంగాణ రాష్ట్రం లోనే వేల కోట్ల విద్యా వ్యాపారం జరుగుతుంది ఇది ఒక మాఫియాగా మారి ప్రభుత్వ అధికారులను, రాజకీయ పార్టీలను ముఖ్యంగా అధికార పార్టీనీ శాసిస్తుంది విద్యా శాఖ అధికారులకు రాజకీయ నాయకులకు కలిపి వందల కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో ముట్టుతాయి అందుకే ప్రవేట్ స్కూల్స్ ను కాలేజీలను విద్యాశాఖ అధికారులు తనిఖీ చేయరు చాలా విద్యా సంస్థలకు పర్మిషన్ లు వుండవు ఉన్న వాటిలో పర్మిషన్ ఇవ్వడానికి కావాల్సిన సదుపాయాలు వుండవు 
        తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో  ప్రభుత్వ పాఠశాలలు 5,115 విద్యార్థుల సంఖ్య 9,89,316
     స్థానిక సంస్థల కింద అంటే జిల్లాపరిషత్ మరియు మండల పరిషత్ పాఠశాలలు 24,323 విద్యార్థుల సంఖ్య 20,62,406
    ఏయిడెడ్ పాఠశాలలు 670 విద్యార్థుల సంఖ్య 81,171
      ప్రవేట్ పాఠశాలలు 10,967  
విద్యార్థుల సంఖ్య 30,47,361
     ఇవికాక మదరసాలు ఇతర గుర్తింపు లేని పాఠశాలలు 243 విద్యార్థుల సంఖ్య 8,222
      కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు 51 విద్యార్థుల సంఖ్య 40,189
      మొత్తం పాఠశాలలు 41,369 మొత్తం విద్యార్థుల సంఖ్య 62,28,665
       ప్రైమరీ స్కూల్స్ 25,331
అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 6,883
    రాష్ట్రంలో పాఠశాలలు
2015- 2016.   2021-2022
------------------    ------------------
40,821.            41,369

రెసిడెన్షియల్ పాఠశాలలు 

2014-2015.     2016-2023
-----------------      -----------------
   293.                  1002

  అన్నిరకాల విద్యా సంస్థలు& విద్యార్థుల సంఖ్య 

అంగన్ వాడి కేంద్రాలు 35700
విద్యార్థులు 6,09,922
ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలలు 41,369 విద్యార్థులు 62,28,665

ప్రభుత్వ ప్రవేట్ జూనియర్ కాలేజీలు 2,963
విద్యార్థులు 9,48,321
డిగ్రీ కాలేజీలు 1073 విద్యార్థులు 3,84,021
ప్రోపేసనల్  కాలేజీలు 1327
విద్యార్థులు 2,23,427
    2014 తరువాత ప్రభుత్వ స్కూల్స్ తగ్గి ప్రవేట్ స్కూల్స్ పెరగటం జరిగింది, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 420 మాత్రమే మిగితావి ప్రవేట్ జూనియర్ కాలేజీలు,
  విద్య పైన రాష్ట్ర ప్రభుత్వం 2022-2023 కు గాను 7.6 శాతం కేటాయించడం జరిగింది దీనిని కూడా 20 శాతానికి పెంచితే తప్ప కొంత మేరకు ప్రభుత్వ విద్య బాగుపడదు
ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల ఉపాధ్యాయ పోస్టు లు కాలీగా ఉన్నాయి, నాన్ టీచింగ్ స్టాప్ పోస్టులు 24,000 కాలీలు ఉంటాయి బాతు రూంలు సరిపడ వుండవు, ల్యాబ్ లు,లైబ్రరీలు లేవు, MEO లు 20 శాతం కూడా లేరు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు చాలా తక్కువగా ఉన్నాయి వీటి సంఖ్య గణనీయంగా పెంచాలి, బడ్జెట్ లో విద్య వైద్యానికి 40 శాతం నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తూ క్రమేనా విద్యా వైద్యాన్ని జాతీయం చేసి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రతి ఒక్కరికి అందించాలి అప్పుడు మాత్రమే రాష్ట్రాలు, దేశం అభివృద్ధి చెందుతుంది
     ...నారగోని,ప్రవీణ్ కుమార్ ప్రెసిడెంట్, ఉచిత విద్య వైద్య సాధన సమితి
  సెల్ నెంబర్: 98490 40195

*_అసెంబ్లీ పాస్ లు అడుక్కోవాలా..?_*

https://x.com/Praja_Snklpm/status/1816466567464681875?t=AaWcLHhSz26EmgL_PqORCA&s=08    

*_అసెంబ్లీ పాస్ లు అడుక్కోవాలా..?_*

*_# నిబంధనలు బేఖాతర్_*

Courtesy / Source by :
*_(అనంచిన్ని వెంకటేశ్వరావు, ఈ దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, 9440000009)_*

*_ఎవడ్రా ప్రభుత్వం మారగానే అధికారులు మారుతారని చెప్పేది. అదే దౌర్భాగ్య ప్రహసనం. అవగాహన లేని అసమర్థ అధికారులు. సిఎం రేవంత్ రెడ్డి గారూ... మీ పతనానికి విత్తనాలు పడుతున్నాయ్.! జర జాగ్రత్త..._*

*_ఈ వర్షాకాలం అసెంబ్లీ సమావేశాల్లో పాత్రికేయులకు జారీ చేసిన పాసుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అప్రదిష్ఠ మూటగట్టుకొంది. (కావాలంటే సంబంధిత అధికారులు నాపై కేసు పెట్టుకోవచ్చు. గులాబీ కోతుల కేసులో మరో కేసు. ఇకనైనా మారండ్రా.... లేకుంటే సహజంగా మరో 4 ఏళ్ళ 5 నెలలకు మార్పు అనివార్యం. దరిద్రులారా ధన్మోసి)_*    
*#IndianConstitution* 
*#TelanganaAssembly2024*
*@PrasadKumarG999*
*@TelanganaCMO @Bhatti_Mallu* *@TelanganaCS @CPRO_TGCM*
*@jupallyk_rao  @Vemnarenderredy*
*@KSriniReddy @IPRTelangana*

*Bplkm✍️*

https://www.facebook.com/share/p/hQPNpe13zPBcncsW/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C92QQadv_8V/?igsh=MXFrbm50dXN3YWM0Nw==
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_indianconstitution-telanganaassembly2024-activity-7222234838320173056-er5g?utm_source=share&utm_medium=member_android

అవినీతి చేప (SHO) సబ్ ఇన్‌స్పెక్టర్ - బాణాల రాము.

#ACB Officials caught Banala Ramu, S.I. of Police, Palvoncha Town Police Station of Bhadradri Kothagudem district for he demanded and accepted the #bribe amount of Rs.20,000/- from an Advocate to do official favour to the accused in a Case.
#AntiCorruptionBureau #Justice #Telangana @CVAnandIPS

ఒక నేరములో నిందితుడయిన వ్యక్తికి సాయం చేయడం కోసం అడ్వకేట్ నుండి ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటూ అనిశా అధికారుల చేతికి చిక్కిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ (SHO) సబ్ ఇన్‌స్పెక్టర్ -  బాణాల రాము.
#అవినీతినిరోధకశాఖ #న్యాయం #తెలంగాణ

Courtesy / Source by :  https://x.com/TelanganaACB/status/1816442989490659786?t=wHfo-pqTyLFhujIuoLyibA&s=19

Wednesday, July 24, 2024

_*పాలమూరు కు పండుగ సాయన్న నామకరణం*_

https://x.com/Praja_Snklpm/status/1816128177040941447?s=08                                  

_*పాలమూరు కు సాయన్న నామకరణం*_

_*#తెలంగాణ లో రాజకీయ పార్టీలకు #ముదిరాజుల ఓటు బ్యాంకు అవసరం.... మెజారిటీ బడుగుల్లో పేదల రాబిన్ హుడ్ పండుగ సాయన్న...@ప్రభ న్యూస్ మీడియా ప్రతినిధి,పాలమూరు*_

_*పండుగ సాయన్న నామకరణం గురించి అందరికి తెలిసేలా కథనాన్ని అందించిన @ప్రభ న్యూస్ మీడియా ప్రతినిధికి అభినందనలు ✊... ప్రజాసంకల్పం గ్రూప్ Link Media*_

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది #తెలంగాణ ముదిరాజులను*_

_*పెత్తందారీ వ్యవస్థను రూపు మార్చిన ధైర్య సాహసీ #పాలమూరు  ముద్దుబిడ్డ పండుగ సాయన్న అలియాస్ రాబిన్ హుడ్.పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన గొప్ప చరిత్రకారుడు.అలాంటి సాయన్న చరిత్ర చదివి మహబూబ్ నగర్ జిల్లాకు పండుగ సాయన్న పేరు పెట్టాలి అని రాజకీయాలకు అతీతంగా ముదిరాజులు ఏకం అయ్యి  ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఇది మంచి అవకాశం... ఈ అసెంబ్లీ సమావేశాలలో పండుగ సాయన్న పేరు వినపడాలి...Bplkm✍️*_

*@TelanganaCMO @Bhatti_Mallu @CPRO_TGCM @Eatala_Rajender  @coll_deo_mbnr @ACLB_MBNR* 

*@mudirajsena* 
*@prabha_andhra*

*NOTE : అందరికి అన్ని గ్రూప్ లలో షేర్ చేయండి*

*Bplkm✍️*

https://www.facebook.com/share/p/bWTr4h1znSosFQqg/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C9z4-tlvu75/?igsh=NnhxMTczNTh2dW1w 
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_bhobiwbicbhgbhbbiobhn-bhybirbhqbipbiabiobhgbirbic-activity-7221902217849524224-Gcw6?utm_source=share&utm_medium=member_android

Haffizpet Land Scam 1000Cr

Haffizpet Land Scam 1000Cr

బీఆర్ఎస్ భూ మాఫియాను అధికారులు కంటిన్యూ చేస్తున్నారా..?

హాఫిజ్ పేట్ పాయిగా ల్యాండ్ రికార్డులో మార్పులు.

జూన్ 14 వరకు ప్రభుత్వ భూమిగా ఉన్న 1000 కోట్ల ఆస్తి.

జూన్ 17 నాటికి పట్టా ల్యాండ్ గా మార్చిన రంగారెడ్డి కలెక్టర్.

దశల వారిగా హైకోర్టుకు తప్పుడు సమాచారం.

అనుకూలమైన వారిపై అప్పిల్ కి వెళ్లని వైనం.

వివవాదస్పదమైన టైటిల్ పై మ్యూటేషన్.

జస్టిస్ నవీన్ రావు, ఎంఎస్ ఆర్ తీర్పుల్లో ఎంతో తేడా..?

అప్పటి కలెక్టర్ శ్రీధర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏమైంది. ?

విచారణ పూర్తి ముగియకుండానే 10 ఏండ్ల క్రితం ఫైల్ మ్యూటేషన్ చేసేశారు.

మూడు రోజుల్లో 24 ఎకరాలు పట్టాగా మార్చేశారు.

800 మంది ప్లాట్ ఓనర్స్ కి లోయర్ కోర్టు ఆర్డర్స్ మర్చిపోయారా..?

చర్చి జాగాలో లార్డ్ ఇక్బాల్ అలీఖాన్ ఫోర్జరీ సంతకాలేంటీ?

పీఎస్ రెడ్డి భార్య విజయరెడ్డికి చేసిన అసైన్మెంట్ డీడ్ లో జరిగిందేంటి.?

హాస్తం పార్టీ అధికారంలోను ఆ ఆఫీసర్స్ అదే దందాలు కొనసాగిస్తున్నారు..?

ఎవ్వరి ఒత్తిళ్లు పనిచేశాయి.?

లక్షల కోట్ల వివాదస్పద భూముల పై రియల్ మాఫియా పట్టుసాధిస్తుందా..?

హాఫీజ్ పేట్ ల్యాండ్స్  లాస్ట్ అప్డెట్స్ పై ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ప్రత్యేక కథనం.

Courtesy / Source by :

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల (9848070809), Lands & Records.

హైదరాబాద్ భూములంటే బంగారు బాతులాంటివి. నాయకులు ఒక్క సెటిల్మంట్ తో వందల కోట్లు పోగేసుకుంటారు. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ని కోర్టుకు తప్పుడు నివేదికలు ఇస్తూ భూ దందాలు చేస్తుంటారు. నేతలు చెప్పినట్లు అధికారలు వినడంతో తలకొంత పంచుకుంటూ విలువైన భూములపై వేల కోట్ల వ్యాపారం చేస్తుంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో 3 లక్షల కోట్ల వివాదస్పద భూములను క్లియర్ చేసుకున్నారు. రెవెన్యూ, పోలీస్, న్యాయశాఖ సహాకారాలతో వారి చేసిందే చట్టంలా వ్యవహారించారు. వేల కోట్ల భూముల సమస్యలకు పరిష్కారం చెప్పుతూ ఫర్సెంటెజీలు పంచుకున్నారు. అద్దాల భవంతులు నిర్మించి అమ్మేసుకున్నారు.  వారు చేసిన భూ అక్రమణల పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఇప్పుడు అదే దందాలు అధికారుల సహాకారంతో కొంత మంది చేస్తున్నట్లు కనిపిస్తుంది. హాఫీజ్ పేట్ లోని వెయ్యి కోట్ల విలువచేసే 24 ఎకరాల 35 గుంటల పై రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చూస్తే ఇట్లే తెలిసి పోతుంది.

హిస్టరీ ఇదే.

హిఫీస్ పేజ్ సర్వే నెంబర్ 77 లోని 64 ఎకరాలు 1981లో హిందుస్తాన్ ఏరో నాటికల్ లిమిటెడ్ సోసైటీ కొనుగోలు చేసింది.  ఇందులో కల్వరి టెంపుల్ లార్డ్ అలీఖాన్ ఫోర్జరీ సంతకాలతో  20 ఎకరాల వరకు అక్రమించుకుంది. మరో 25 ఎకరాల్లో వెదిరి ఎస్టేట్ వాళ్లు చుట్టు రేకులు పెట్టేశారు. ఈ భూ వివాదం సీఎస్ 14/1958కి చెందింది. 813 మంది ఉద్యోగులు కలిసి సోసైటి పెట్టుకుని భూమి తీసుకున్నారు. ప్రభుత్వం- పాయిగా ల మధ్య కోర్టు కేసుల్లో నలుగుతుంది. పాయిగా ఫ్యామిలీలో నుంచి కొంత మంది డిఫెండెండ్స్ వద్ద నుంచి కొనుగోలు పూర్తి అయింది.  అయినా చాలా మందికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వెదిరి ఎస్టేట్ అక్రమించుకున్న 25 ఎకరాల్లో టైటిల్ లేకుండానే ఇప్పుడు మ్యూటేషన్ పూర్తి అయింది. అగష్టు 16, 2004లో పుత్తి సదాశివ రెడ్డి (పీఎస్ రెడ్డి) చనిపోయారు.. జూన్ 10, 2005లో ఆయన భార్య విజయారెడ్డి కు టైటిల్ లేకుండానే అసైన్మెంట్ డీడ్ ప్రకారం వెదిరి ఎస్టేట్ కి సెల్ డీడ్ చేశారు. జూలై 6, 2002న చేసిన అసైన్మెంట్ డీడ్ కి ఇండియాన్ రిజిస్ట్రేషణ్ యాక్ట్ 1908. సెక్షన్ 23 ప్రకారం 4 నెలలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. కాని ఎప్రిల్ 4, 2005లో అమె పేరు మీదికి వ్యాలుడేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత జూన్ 10,2005న వెదిరికి అమ్మేయడం చట్టవిరుద్దమని అసలు పీఎస్ రెడ్డికి అసైన్మెంట్ డీడీ చేయాడంలో అమ్మినవారికి టైటిల్ లేదని అప్పటి కలెక్టర్ శ్రీధర్ హైకోర్టుకు దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక అధారంగానే జస్టిస్ నవీన్ రావు రిట్ పిటిషన్ 27045 ఆఫ్ 2013 ఆర్డర్ లో ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 81,82,83 ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ ని క్యాన్సల్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. దీని పైనే మళ్లీ మ్యూటేషన్ చేయాల్సిందిగా రిట్ నెంబర్ 15056/2014 లో వెదిరి ఎస్టేట్ వాళ్లు పిటిషన్ దాఖలు చేశారు. అన్ రిజిస్ట్రర్డ్ అసైన్మెంట్ డీడ్ లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ప్రకారం చేయాలని గతంలో కలెక్టర్ ఇచ్చిన నివేదికను, ఫ్లాటింగ్ జరిగిన వ్యవహారాన్ని దాచిపెట్టి సైరస్ ఇన్వెస్టిమెంట్, ఎంతో మంది ఉన్న ఢిపెండెట్స్ వద్ద నుంచి అగ్రిమెంట్లు చేgసుకున్నామని కోర్టుకు తెలిపి 2015లో మ్యూటేషన్ చేసేలా కలెక్టర్స్ కి అదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మరో సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే అప్పటి నుంచి 2023 వరకు ఆ భూమిని మ్యూటేషన్ కాలేదు. ఆనాటి రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు పై కంటెప్ట్ ఆఫ్ కోర్టు పై కేసులు వేశారు. కలెక్టర్ కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ ఆయన పై ఉన్న కోర్టు దిక్కరణ కేసుల పై తీర్పు ఇచ్చింది.

జస్టిస్ ఎమ్మెస్సార్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఈ ఏడాది జనవరి 23న సీసీ నెంబర్ 131 ఆఫ్ 2024ని దాఖలు చేశారు. వేదుల వెంకట్ రమణ పిటిషనర్ తరుపున వాదనలు వినిపిస్తారు. ప్రభుత్వం తరుపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ మహ్మాద్ ఇమ్రాన్ ఖాన్ కంప్టెట్ తీర్పును అమలు చేస్తామని ఒప్పేసుకోవడంతో.. మూడు రోజుల్లోనే అంటే 17-06-2024న వెదిరి ఎస్టేట్ పై మ్యూటేషన్ చేస్తూ పాస్ బుక్స్ ఇష్యూ చేస్తున్నారు. దీంతో వెయ్యి కోట్ల భూమి ఇట్లే క్లియర్ అయిపోయింది. ఇదే పాయిగా భూముల్లో ఇప్పటికి సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుంది. HAL ఎంప్లాయిస్ ఓ.ఎస్ నెంబర్. 359/2001 లో 2008లో టైటిల్ పై ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది రంగారెడ్డి కోర్టు.  నాలుగు వాయిదాల్లోనే అడిషనల్ అడ్వకేట్ కంటెప్ట్ పై ఉన్న తీర్పును అమలు చేస్తామని కోర్టుకు తెలియచేస్తాను. సుప్రీం కోర్టులో ఇదే భూముల పై ఎస్ ఎల్ పీ 2844/2021 సుఖేష్ గుప్తా భూమి పై ఇప్పటికి విచారణ కొనసాగుతుంది. ఇలా అనేక కేసులను మేర్జ్ చేసి టైటిల్ తో పాటు భాగస్వామ్యం చేసిన ప్రాపర్టీస్ పై అడ్వకేట్ కమిషన్ నివేదికలు పటాపంచల్ అవుతున్నాయి. నవీన్ మిట్టల్ కి హైదరాబాద్ ల్యాండ్స్ ని తెలివిగా చేతికి మట్టి అంటకుండా ఎలా చేయాలో వెన్నతో పెట్టిన విద్య. అందుకే అయన డైరెక్షన్ లోనే ఓ మంత్రి, మరో కీలక నేత ఈ తతంగం ముందు ఉండి నడిపించినట్లు తెలుస్తుంది. మరిన్ని భూములను క్లియర్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాడి ఏడాది పూర్తి కాకుండానే అన్ని వ్యవస్థలను బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకున్నట్లు ఈ ప్రభుత్వం వాడేసుకునేందుకు సిద్దమయినట్లు తెలుస్తుంది.  


*@TelanganaCMO @TelanganaCS*
*@PrlsecyMAUD*
*@CPRO_TGCM @IPRTelangana @CollectorRRD @ACLB_Rangareddy @GHMCOnline @HMDA_Gov @CommissionrGHMC*

https://x.com/Praja_Snklpm/status/1816077013876392117?t=lX_JQToWx2Azy-Tri-_lfQ&s=19


Tuesday, July 23, 2024

ఫోన్ ట్యాపింగ్ శ్రవణ్ రావు ఎక్కడ?

*#phonetapping*

*@swetchadaily వార్త కథనం  A6 శ్రవణ్ రావు ఎక్కడా ! వెలుగులోకి వస్తున్న మోసాలు!* 

*👆ఈ వాస్తవ కథనానికి సమాధానం ఎవరు చెపుతారు?*

*@TelanganaCMO*
*@TelanganaCS*
*@CPRO_TGCM*
*@TelanganaDGP*
*@TelanganaCOPs*

*@SrinivasRTIA @marksDudam @PrajaPrashna @BplplH @RVKRao2*

*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1815693706755711231?t=i3BBUfPXd-TuSKXrBEEJTA&s=08   
*****---*****---*****---*****
https://www.facebook.com/share/p/fP5dfz6xB88hiDdw/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C9xLAFNvM_E/?igsh=MTFsejZndWNpam43eQ==
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_phonetapping-activity-7221519729897717760-QOyj?utm_source=share&utm_medium=member_android

Monday, July 22, 2024

మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula కేంద్ర జల శక్తి మంత్రి @CRPaatil ను కోరారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu, మంత్రి శ్రీ @UttamINC లతో పాటు పలువురు  ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు.

* కాలుష్య బారిన పడి మురికి కూపంగా మారిన మూసీని శుద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిన బృహత్తర ప్రణాళిక గురించి ఈ సందర్భంగా వివరించారు.

* రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆవశ్యతను వివరిస్తూ మూసీ మురికి నీటి శుద్ధి పనులకు రూ. 4 వేల కోట్లు, గోదావరి నదీ జలాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను నింపే పనుల కోసం రూ. 6 వేల కోట్లు కేటాయించాలని కోరారు.

* జంట నగరాలకు సంబంధించి ఈ రెండు జలాశయాలను గోదావరి జలాలతో నింపితే హైదరాబాద్ నీటి కొరత తీరుతుందని వివరించారు.

* జాతీయ స్థాయిలో జల్ జీవన్ మిషన్ 2019 లో ప్రారంభమైనప్పటికీ ఈ పథకం కింద తెలంగాణకు ఇంతవరకు నిధులు ఇవ్వలేదని గుర్తుచేస్తూ ఈ ఏడాది నుంచి నిధులు కేటాయించాలని కోరారు.

* తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని ఇందుకోసం పీఎంఏవై (అర్బన్ మరియు రూరల్) కింద చేపట్టే నల్లా కనెక్షన్ల కోసం రూ. 16.100 కోట్ల వ్యయం అవుతుందని వివరించారు. @DoWRRDGR_MoJS
#Telangana #MusiRiverFrontDevelopment 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1815352859975917781?t=R6ek7Gg_dtoUqAMM38lyMg&s=19

“Smitha apologise publicly in 24 hours” Bala Latha gives ultimatum

Bala Latha Mallavarapu Challenges Smita Sabharwal Over Disability Remarks

“Smitha apologise publicly in 24 hours” Bala Latha gives ultimatum 

In a heated response to recent made by IAS officer Smita Sabharwal regarding the disability quota in IAS selection, Bala Latha Mallavarapu of CSB IAS Academy has publicly challenged Sabharwal to sit for the UPSC exam again and beat her score. Mallavarapu made these statements at a press conference held at the Somajiguda Press Club, expressing strong disapproval of Sabharwal's remarks.

Mallavarapu questioned Sabharwal's qualifications to comment on issues related to disabled individuals, arguing that such remarks undermine the judiciary and parliamentary decisions. She emphasized that Sabharwal's words have further marginalized the disabled community, which already faces significant discrimination.

Mallavarapu called for Chief Minister Revanth Reddy to take action against Sabharwal under the Code of Conduct for civil services indiscipline. Highlighting the achievements of disabled individuals like S Jaipal Reddy, who excelled in parliamentary roles, and others who have received prestigious awards like the Padma Shri and Padma Bhushan, Mallavarapu stressed that disabilities should not be a basis for discrimination.
She questioned the duration and impact of Sabharwal's fieldwork, particularly during her tenure as CMO under KCR's regime, suggesting that Sabharwal's statements reflect a lack of understanding of administration and the challenges faced by the disabled.

In a bold move, Mallavarapu challenged Sabharwal to take the civil services exam again, asserting that she could score higher. She demanded that Sabharwal retract her comments within 24 hours and warned of a protest at Tank Bund if the government does not respond to the issue by tomorrow.

"The disabled have made remarkable achievements, overcoming significant obstacles. It is painful to hear such uninformed statements from someone in a position of authority," Mallavarapu stated.

#SmithaSabharwal #BalaLatha #disabilitiycertificate 

Courtesy / Source by :  https://x.com/sudhakarudumula/status/1815306072384790884?t=RTS_B-90OmVPY9wRGhtfXg&s=19

Sunday, July 21, 2024

మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు

మురికికూపంగా మారిన మూసీని సుందరీకరణ చేయడంతో పాటు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం  తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula చెప్పారు. హైదరాబాద్ నగర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు విపత్తుల నిర్వహణకు #HYDRAA అనే సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

* గోపన్‌పల్లిలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఉమెన్ బైకర్స్‌ను అనుమతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ ఫ్లైఓవర్ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు.

* #Hyderabad అభివృద్ధిలో భాగంగా మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందుకోసం త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 5౦ వేల కోట్లతో పనులకు శ్రీకారం చుడతామని వివరించారు. రానున్న ఐదేళ్లలో ప్రపంచ నలుమూలలు పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూసీని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.
#MusiRiverFrontDevelopment 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1814610096267382881?t=I-_swUvAxvM3SkJtmvFF_g&s=19


Saturday, July 20, 2024

*హైదరాబాదులో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత నలుగురి అరెస్ట్*

*హైదరాబాదులో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత నలుగురి అరెస్ట్* 

హైదరాబాద్: రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని రాజస్థాన్ కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ శంషాబాద్, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి.. వారి నుంచి 1,250 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితులు నలుగురూ రాజస్థాన్ కు చెందిన వారేనని సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి మీడియాకు వెల్లడించారు. హెరాయిన్ను చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి.. బస్సుల్లో తీసుకొస్తున్నట్లు చెప్పారు.

Courtesy / Source by :
*V.S. జీవన్*

Friday, July 19, 2024

విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం

విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం
🔹3వ తరగతి వరకు అంగన్ వాడీల్లోనే ప్లేస్కూల్ తరహా బోధన
🔹4 నుంచి సెమీ రెసిడెన్షియల్స్.. విద్యార్థులకు రవాణా సదుపాయం
🔹విద్యావేత్తలతో చర్చించి ప్రణాళికలు రూపొందిచాలని విద్యాశాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు

హైదరాబాద్ :
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను, విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని విద్యా శాఖ అధికారులను ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం గారికి సీఎం సూచించారు.

ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కు సమాంతరంగా అన్ని చోట్లా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారితో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ పై విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ మేరకు సూచనలు చేశారు.

అంగన్ వాడీలకు సింగిల్ టీచర్
చిన్న పిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన  చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంగన్ వాడీలలో ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా విద్యా బోధన కోసం ప్రత్యేకంగా ఒక టీచర్  నియమించేలా ప్రణాళిక  రూపొందించాలని సీఎం సూచించారు.

రెసిడెన్షియల్స్ కు రవాణా సదుపాయం
3వ తరగతి వరకు అంగన్ వాడీ ప్లే స్కూల్ లో బోధన తర్వాత విద్యార్థులు 4వతరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకునేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లివచ్చేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలని సీఎం సూచించారు.

విద్యావేత్తలతో చర్చించాక పైలట్ ప్రాజెక్టు
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్లే స్కూల్, సెమీ రెసిడెన్షియల్ విధానాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయడానికంటే ముందే విద్యా వేత్తల అభిప్రాయాలు తీసుకోవాలని విద్యా శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యావేత్తల సూచనలను బట్టి ముందుగా  ఒకట్రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రణాళికలు ఉండాలని సీఎం చెప్పారు.

సీఎస్ఆర్ ఫండ్స్ తోనూ..
పాఠశాల్లో వసతులు, సౌకర్యాల పెంపు కోసం ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ( సీఎస్ఆర్) ఫండ్స్ పైనా దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచించారు. వీటితోపాటు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
#IntegratedResidentialSchools #Telangana 

Courtesy / Source by : https://x.com/CPRO_TGCM/status/1814252415975383142?t=fVy-8qbmfz0J4RNAlSiFNQ&s=19

#ACB officials#caught Thakoor Roopender Singh, District Fisheries Officer, Suryapet

#ACB officials# caught  Thakoor Roopender Singh, District Fisheries Officer, Suryapet while accepting the #bribe amount of  ₹25,000 for issuing the Fishing Rights Document for a Fisherman Co-Op. Society.
#AntiCorruptionBureau #Justice #Telanagna  @CVAnandIPS

మత్స్యకారుల కో-ఆపరేటివ్ సొసైటీకి చేపలు పట్టుకోవడానికి సంబంధించిన హక్కుల పత్రం జారీ చేసేందుకు "ఇరవై ఐదు వేల రూపాయల" #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు చిక్కిన సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి - "ఠాకూర్ రూపేందర్ సింగ్‌"
#అవినీతినిరోధకశాఖ #న్యాయం #తెలంగాణ

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1814248896073515487?t=6tTPx_whccwjRTjSLSEUuw&s=19

*****---*****---*****---*****---*****

2014 జూన్ నుంచి 2024 డిసెంబర్ వరకు #తెలంగాణ లో #అవినీతి ప్రభుత్వ అధికారుల హవా నడిచింది.

ప్రస్తుతం తెలంగాణ లో #అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న @CVAnandIPS సారు & @TelanganaACB అధికారులు.

@TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM

#FishermenSociety

Bplkm✍️

https://x.com/Praja_Snklpm/status/1814250784835723716?t=2ndn7aAn3IzhS5q7bNc7Vw&s=19

Thursday, July 18, 2024

దేశభక్తుడైన ప్రతి ఒక్కడూ ఇప్పుడు రవిప్రకాశ్ వెన్నంటి ఉండాలి

*_ఆర్థిక బందీగా భారతమాత.!_*
_# రవిప్రకాశ్ జీ...గో హెడ్_*
_# నీ వెంటే భారతదేశం_
_# రూ.100 కోట్ల పరువునష్టం దావా అట.!_
_# దొంగ బాగోతం దోబూచులాట_
_# నిజాలు చెపితే 'నోటీసులు' ఏంట్రా వెధవల్లారా.!_
_# మూర్ఖుల్లారా మారండ్రా..!_
_# రూ.100 కోట్ల చేరిన గా రవిప్రకాశ్ బ్రాండ్.!_
_# 'బట్టే బాజ్'లూ ఇవి చూసుకోండ్రా...!_
_# అండగా ఉంటామన్న జర్నలిస్ట్ సంఘాలు_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_రవిప్రకాష్‌లోని ఆనాటి పాత జర్నలిస్టు మళ్లీ బయటికొచ్చాడు. ఎస్.. రావాలి కూడా. ఆ 'కసి'.. అంతకు మించిన 'పగ'... దానికి మించిన 'ప్రతీకారం'... ఓ 'దొంగ'ను 'దొంగ' అని చెప్పటానికి నోరు లేని పాత్రికేయ సమాజానికి ఇది ఒక సవాల్. దమ్మున్న జర్నలిజానికి ప్రతీక. మన భారతదేశంలోని మన రిజర్వు బ్యాంక్ అనుమతి లేకుండా జరుగుతున్న 'గలీజ్ దందా' ప్రశ్నిస్తే వంద కోట్లకు నోటీసులా..? గతంలో బ్రిటీషోడు 'మన దేశంలోకి చొరబడటానికి చేసిన దందా' లాగానే.. మరో రూపంలో యూరో ఎగ్జిమ్ బ్యాంకు చేస్తున్న దందాను రవిప్రకాశ్ ప్రశ్నించాడు. నిలదీశాడు. దేశభక్తుడైన ప్రతి ఒక్కడూ ఇప్పుడు రవిప్రకాశ్ వెన్నంటి ఉండాలి. లేదంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మరోసారి పక్కోడి చేతుల్లోకి వెళ్ళబోతోంది. పరాయి వాడి చేతుల్లో మన భవిష్యత్ తరాల తలరాతలు. ఆ తర్వాత బానిస బతుకులు_*

*_ముందుగా ఓ వార్త_*
యూరో ఎగ్జిమ్ బ్యాంకు ఆర్టీవీ వ్యవస్థాపకుడు రవిప్రకాష్ మీద 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని లీగల్ నోటీసు పంపించింది. ఇదే ఆ 'బోడి వార్త' స్థూల సారాంశం.

*_పరిచయం అవసరమా..?_*
రవిప్రకాష్ గురించి ఎవరికీ తెలుగు రాష్ట్రాల్లో కొత్త పరిచయం అక్కర్లేదు కదా.! ఈమధ్య తను స్వయంగా ఓ స్టోరీ ప్రజెంట్ చేశాడు. అందులో మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి సదరు బ్యాంకు ఎడాపెడా ఫేక్ గ్యారంటీలను ఇస్తోందనేది పాయింట్.! కొన్ని వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ అనేది తన కథనంలోని ఆరోపణ.! ధైర్యంగా బయటకు చెప్పాడు. అందులో తప్పేం ఉంది.

*₹అసలు పాయింట్ ఇదే కదా.?_*
వార్షిక టర్నోవర్ 8 కోట్లు కూడా లేని ఓ బ్యాంకు ఇన్ని వేల కోట్ల రూపాయలకు గ్యారంటీలు ఎలా ఇస్తోందని రవిప్రకాశ్ ప్రశ్నించాడు. అబ్బే, మా నెట్‌వర్త్ '1900 కోట్ల వరకూ ఉంటుంది' అని ఆ లీగల్ నోటీసులో సదరు బ్యాంకు పేర్కొంది. అందుకే బ్యాంకు ఇచ్చే గ్యారంటీలు 'ఎంత జెన్యూన్' అనేదే రవిప్రకాష్ స్టోరీలో ప్రధానమైన ప్రశ్న, సందేహం, విమర్శ, ఆరోపణ. ఆక్షేపణ.

*_మంగళవారం మీడియా_*
'పని చేయటం చేతగాని వాడు ఈరోజు మంగళవారం ' అన్నట్లు... _(గౌరవంగా చెప్పా...)_ సాధారణంగా ఇలాంటి స్టోరీల జోలికి మీడియా చానెళ్లు వెళ్లవు. లీగల్ కాంప్లికేషన్స్ పట్ల 'భయసందేహాలు' ప్లస్ ఆధారాలు కష్టం కాబట్టి..! (అవి  సేకరించే పరిశోధన చేయలేని చేతగాని దద్దమ్మలు) రవిప్రకాష్ స్వతహాగా సాహసి.! ఇలాంటి స్టోరీలు గతంలో చాలా చేశాడు, లీగల్ చిక్కుల్ని కూడా 'ఫేస్' చేశాడు. చేస్తాడు. పైగా టీవీ9 చానెల్ విషయంలో 'మేఘా' వాళ్లతో రవిప్రకాష్‌కు పాత పంచాయితీలు చాలానే ఉన్నాయి కదా.! అందులోనూ రవిప్రకాశ్ దే పైచేయి. 

ఇప్పుడు ఈ కేసుతో ‘అసలు రవిప్రకాష్ స్టోరీ ఏమిటి’ అనే కుతూహలంతో మరింత మంది చూడటానికి ఆ లింక్ ఇదే https://www.youtube.com/live/yCskUPnxPHk?si=YemjQba1B_0NKdXi సరదాగా చూసేయండి. వెధవలకు కూడా 'దూల' తీరుతుంది. కేసుతో సాధించేది ఏముంటుందో చెప్పలేం గానీ ఆ స్టోరీని మరింత పాపులర్ చేయడమన్నమాట.! కంగ్రాట్స్ టు రవిప్రకాశ్.

*_'ఫేక్ గ్యారంటీ'లే ఇస్తారేమో..?:_*
రేప్పొద్దున నిజంగానే కేసు వేసే పక్షంలో క్లెయిమ్ చేస్తున్న పరిహారంలో కొంత శాతాన్ని డిపాజిట్ చేయాలి కదా.! దానికీ ఫేక్ గ్యారంటీలే ఇస్తారేమో అనే జోకులు కూడా వెలువడ్డాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే నిజంగానే ఫేక్ గ్యారంటీలు అయితే ప్రభుత్వం సీరియస్‌గానే లుక్కేయాల్సి ఉంటుంది. తొక్కి 'నార' తీయాల్సిందే.!

*_అబ్బో..:_*
తక్షణం రవిప్రకాష్ ఆ స్టోరీ పట్ల బేషరతు బహిరంగ క్షమాపణ చెప్పి, సదరు వీడియోలను, పోస్టులను సోషల్ మీడియా వేదికల నుంచి తీసేయాలనీ లేకపోతే సివిల్, క్రిమినల్ కేసులు వేస్తామని ఆ లీగల్ నోటీస్ హెచ్చరించింది, చెన్నై లాయర్ ఎవరో ఆ నోటీస్ పంపించారు. మెగా స్పందిస్తుందని చాలామంది అనుకున్నారు కానీ బ్యాంక్ రంగంలోకి దిగింది.

*_ఇంత డబ్బు ఎట్లా వచ్చిందబ్బా.!_*
అవునూ... మేఘా ఓనర్ల సంపద అపారంగా పెరిగిపోయి, కొన్ని వేల కోట్లకు చేరుకుంది కదా.! చిన్నాచితకా సివిల్ సబ్ కంట్రాక్టుల నుంచి మొదలై ఇప్పుడు డిఫెన్స్, ఆటమిక్ ఎనర్జీ దాకా వెళ్లిపోయారు కదా.! మరి ఆ యూరో ఎగ్జిమ్ బ్యాంకు నుంచి ఫేక్ గ్యారంటీలు ఎందుకబ్బా..? అసలు ఇంత తక్కువ సమయంలో 'నిజాయితీ'గా ఎలా సంపాదించారబ్బా.!

*_అదసలు బ్యాంకే కాదనీ..:_*
జస్ట్, ఓ చిన్న ఆర్థిక సంస్థ అనీ కొందరు ఎక్స్ వేదికగా చెబుతున్నారు. మరి ఆ గ్యారంటీలకు ప్రభుత్వ సంస్థలు ఎందుకు వాల్యూ ఇస్తున్నాయి. అయినా ప్రస్తుతం ఇండియా టాప్ రిచ్చెస్టుల జాబితాలో చేరిన మేఘా వాళ్లు అడిగితే మన బ్యాంకులే పోటీలుపడి గ్యారంటీలు ఇస్తాయి కదా.! ఇదీ 'డౌటనుమానం'..! ఇందులో ఇంకేదైనా తిరకాసు ఉందా..? మళ్లీ రవిప్రకాషే మరో స్టోరీలో చెప్పాల్సి ఉంటుందేమో..!! అసలు 'ఆ మనీ లాండరింగ్' బయటపెట్టు బాసూ..!

*_బలంగా తెరపైకి..:_*
ఏపీ, తెలంగాణ ఎన్నికల ఫలితాలకు సంబంధించి... మిగతా సర్వేలకన్నా భిన్నమైన తన సర్వే ఫలితాన్ని ప్రసారం చేసిన రవిప్రకాష్ మళ్లీ బలంగా తెరపైకి వచ్చాడు. ఆ సర్వే ఫలితాలు నిజమయ్యేసరికి తనకు కొంత పాపులారిటీ ఫాయిదా సమకూరింది. ఇప్పుడు ఎగ్జిమ్ బ్యాంకు స్టోరీ.! ఇలాంటివి మరో నాలుగు స్టోరీలు పడితే మళ్లీ పాత రవిప్రకాష్ కనిపిస్తాడు..!! నువ్వు మగాడివిరా బుజ్జీ...

బాక్స్:
*_తీవ్రంగా ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు_*
ఆర్ టివి రవిప్రకాశ్ కు రూ.100 కోట్లకు బ్యాంక్ నోటీసులు ఇవ్వటం పట్ల జర్నలిస్ట్ సంఘాలు మండిపడ్డాయి. రవిప్రకాశ్ ప్రస్తావించిన విషయాలను ప్రస్తావించకుండా.. వాటికి సమాధానాలు చెప్పకుండా డబ్బు మదంతో నోటీసులు ఇవ్వటం పట్ల తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, అఖిల భారత జర్నలిస్టుల యూనియన్ లు తీవ్రంగా తప్పుపట్టాయి. తాము ఆర్టీవీ కి అండగా ఉంటామన్నారు.

బాక్స్ 2:

*_రవిప్రకాశ్ బ్రాండ్ వంద కోట్లు.!_*
రవిప్రకాశ్ తన కథనాలతో... రూ. 100 కోట్లు ఎప్పటికి సంపాదించే వాడో కానీ.., గతంలో ఆర్టీవీ లోగో విషయంలోనూ ఇలాగే 100 కోట్లు, ఆ మధ్యన టివి9 సామ్రాజ్యంలో ఓ నాలుగు సార్లు, ఇప్పుడు తాజాగా మరోసారి 100 కోట్లకు నోటీసులు అందటం... ఆయన బ్రాండ్ ఇమేజిని పరోక్షంగా శత్రువులు పెంచటం గమనార్హం.

బాక్స్ 3:
*_అరె బట్టే బాజులూ... ఇది మా దేశం_*

# ఇది మా భారత దేశం. మా దేశంలోని మా రిజర్వు బ్యాంక్ అనుమతి లేకుండా మా భారతదేశంలో బ్యాంక్ వ్యాపారం చేయడం ఏంట్రా.!

# మా భారతదేశంలో ఒక కార్యాలయం లేకుండా, ఒక బోర్డు లేకుండా వేల కోట్ల గ్యారంటీలు ఇవ్వడం ఏంట్రా..? ఇది మా భారతదేశానికి జరుగుతున్న ఆర్థిక అవమానం కాదా.?

# మా స్వతంత్ర భారతంలో
కాంట్రాక్టర్లతో కలిసి వేలకోట్ల
ఇల్లీగల్ దందా.. ఏంది రా.! 

# మునగబోతున్న కాంట్రాక్టర్లు, ఐఏఎస్, ఎస్.బిఐ, యుబిఐ అధికారులు

*_జర్నలిస్టుల భద్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి: అనంచిన్ని వెంకటేశ్వరరావు_*

*_జర్నలిస్టుల భద్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి: అనంచిన్ని వెంకటేశ్వరరావు_*



తెలంగాణ జర్నలిస్ట్స్ సంక్షేమ సంఘం సోషల్ మీడియా కన్వీనర్ బాపట్ల కృష్ణమోహన్ ఆధ్వర్యంలో రామంతపూర్ డివిజన్ ఆర్టీసీ కాలనీలో ఏర్పాటుచేసిన టీజేఎస్ఎస్  కార్యాలయాన్ని ముఖ్య అతిథులు విచ్చేసిన తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా అనంచిన్ని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ప్రజాసమస్యలపై, అవినీతి , అక్రమాలు వెలికితీసి వార్తలు రాసే జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారని, జర్నలిస్టులు ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటే ప్రజా సమస్యలను ఎవరు తీరుస్తారని, ప్రశ్నించే గొంతుకలు రాజకీయ పార్టీ నాయకులకు తొత్తులుగా ఉంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ఈ సందర్బంగా ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. జర్నలిస్టుల భద్రతకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని జర్నలిస్టులపై ఎవరైనా దాడులు చేసినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా చట్టపరంగా తీవ్రంగా శిక్షించాలని, ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ ని ప్రవేశపెట్టాలని, జర్నలిస్టులు ఐక్యంగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్.జీవన్ కుమార్  ప్రజాకవి కాళోజీ రాసిన 'నా గొడవ' కవితలు పుస్తకాన్ని  బాపట్ల కృష్ణమోహన్ కు బాపట్ల పుష్పలత (శ్రీనిధి మహిళా ఫౌండేషన్ ఫౌండర్) కు బహుకరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి కీర్తి రాజ్, తెలంగాణ హైకోర్ట్ సీనియర్ న్యాయవాదులు బి. శ్రీనివాస్ రెడ్డి, పులి దేవేందర్, ఆనంద్ కుమార్, మానవ హక్కుల వేదిక సభ్యులు బాలయ్య, 'ప్రజాసంకల్పం సభ్యులు పూండ్రు దామోదర్ రెడ్డి, మండల బిక్షపతి, బలగ జనార్దన్, సురేష్ , మురళి స్థానికులు పాల్గొన్నారు.

కీర్తిరాజ్ 

Wednesday, July 17, 2024

కలం యోధుల మీడియా కార్యాలయం

*'TJSS (తెలంగాణ జర్నలిస్ట్స్ సంక్షేమ సంఘం) సోషల్ మీడియా కన్వినర్ బాపట్ల కృష్ణమోహన్ కలం యోధుల మీడియా కార్యాలయం' 17జులై 2024 న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పరిశోదన పాత్రికేయులు ఆనంచిన్ని వెంకటేశ్వరావు గారు #రామంతాపూర్ లో ప్రారంభోత్సవం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్.జీవన్ కుమార్ గారు 'ప్రజాకవి కాళోజీ' గారు రాసిన 'నా గొడవ' కవితలు పుస్తకాన్ని  బాపట్ల కృష్ణమోహన్ కు & బాపట్ల పుష్పలత(శ్రీనిధి మహిళా ఫౌండేషన్ ఫౌండర్) కు బహుకరించారు.
ఈ కార్యక్రమం లో తెలంగాణ హై కోర్ట్ సీనియర్ న్యాయవాదులు బి. శ్రీనివాస్ రెడ్డి, పులి దేవేందర్, ఆనంద్ కుమార్ మరియు మానవ హక్కుల వేదిక సభ్యులు బాలయ్య,....,'ప్రజాసంకల్పం సభ్యులు పూండ్రు దామోదర్ రెడ్డి,మండల బిక్షపతి,బలగ జనార్దన్,సురేష్ పాల్గొన్నారు.

భూస్వాములను కొట్టి పేదలకు అన్నం పెట్టిన దేవుడు

*తెలంగాణ రాబిన్ హుడ్ పండుగల సాయన్న ఎవరు అయన చరిత్ర ఏంటి*

 *భూస్వాములను కొట్టి పేదలకు అన్నం పెట్టిన దేవుడు* 

 *పేదల కోసం పోరాడిన గొప్ప యోధుడు పండుగల సాయన్న* 

 *బహుజన బంధుక్ పోరాట యోధుడు పండగ సాయన్న జయంతి నేడు*

షాద్ నగర్:జులై 17(ఆదాబ్ హైదరాబాద్) తెలుగు సినిమాల్లో ఈ మధ్య చారిత్రాత్మక కథాంశాల ఆధారంగా కథలను అల్లడం ఎక్కువయింది. మరుగున పడిపోతున్న చరిత్రను భావితరాలకు అందించడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలను చూస్తే సైరా నరసింహారెడ్డి  అయినా సరే... రాజమౌళి నిర్మించిన ఆర్ ఆర్ ఆర్ అయినా సరే ఇవన్నీ కూడా మన గత చరిత్ర వైభవాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూసే అవకాశాన్ని వచ్చింది తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ఒక చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమాలో నటించేందుకు సిద్ధపడ్డట్టు తెలుస్తుంది. తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరున్న పండుగల సాయన్న పాత్రను పవన్ చేయబోతున్నాడట. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ నిండా అసలు. ఈ సినిమా వార్త బయటకొచ్చిన నేపథ్యంలో అసలు ఈ పండుగల సాయన్న ఎవరు ఆయన నేపథ్యం  ఏమిటి? ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడో ఆయన చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. పండుగల సాయన్న లేదా  తెలంగాణ రాబిన్ హుడ్ గా పేర్కొంటారు. ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాడు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన సాయన్న పేదవాళ్ల కష్టాలను చూసి తట్టుకోలేకపోయేవాడు. వారికోసం ఏదో ఒకటి చేయాలనీ నిత్యం పరితపిస్తూ ఉండేవాడు.అతనిపేరు చెబితేనే నిజాం ప్రభుత్వానికి వణుకు పుట్టేదని చరిత్ర పేర్కొంది 

*సాయన్న జననం.... జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన*

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక నిరుపేద ముదిరాజ్ కుటుంబంలో జన్మించాడు సాయన్న. అప్పటి నిజాం ప్రభుత్వం మొహర్రం రాష్ట్రపండగా జరపమని ఆదేశాలు జారీ చేసిన సంవత్సరంలో మొహర్రం పండగనాడు ఆయన జన్మించారు. 
అలా మొహర్రం పండగ నాడు జన్మించడంతో... ప్రతి సంవత్సరం కూడా కందూరు చేయాలనీ అతడి తల్లి మొక్కింది. ఆ కందూరు కార్యక్రమాన్ని తాను మరణించే వరకు కొనసాగించాడు సాయన్న. 

 *ఉన్నోళ్లని కొట్టిండు.. లేనోళ్లకి పెట్టిండు!*

ఇలా ఒకసంవత్సరం కందూరు కోసమని తాండూరు వెళ్లే దారిలో దారి కాచి గొల్ల చెన్నయ్య దగ్గరి నుండి 6 గొర్రెలను, ఒక పుట్టెడు ధాన్యాన్ని దొంగిలించాడు. తాను పేదవాడినంటూ, ఇంటి దగ్గర తాను చూసుకోవలసిన ఒక కుటుంబముందని చెన్నయ్య సాయన్నను బ్రతిమిలాడాడు. సాయన్న కాళ్ళు పట్టుకొని చెన్నయ్య బ్రతిమిలాడడంతో అతడి దగ్గరి నుండి లూటీ చేసిన సామాన్లు అతనికి ఇచ్చేసి, జమీందారు వెంకట్ రెడ్డి దగ్గరి నుండి తనకు కావలిసినవి దొంగిలించి పేదలకు పెద్ద ఎత్హున దావత్ ఇచ్చాడు. ఈ తరుణంలోనే  అలాంటి
భూస్వాములు అంత ఆస్తి ఎలా కూడబెడుతున్నారో అతడికి ఆశ్చర్యాన్ని కలుగజేస్తే...సమాజంలో పెద్ద ధనిక అసమానతలు అతడిలో ఆందోళనను కలిగించాయి. సమాజంలో పెద్ద ధనిక తేడాను చెరిపేయాలంటే... ఉన్నోడిని కొట్టి లేనోడికి పెట్టాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. అలా అతడు పేదలకోసం దొంగతనాలను చేస్తూ దొంగలించిన సొమ్మును పేదలకు పంచుతూ... తెలంగాణ రాబిన్ హుడ్ గా ఎదిగాడు. ఇతడి పనుల వల్ల భూస్వాములు భయభ్రాంతులకు  గురవడమే కాకుండా సాయన్నపై పగా సాధించాలని నిశ్చయించుకున్నారు. అలా నిజాం పోలీసులతో కలిసి అతడి భార్యను భయపెట్టి అతడిని పట్టుకున్నారు. 
6 అడుగుల రూపం, చెవుల వరకు పెంచిన మీసం, కండలు తిరిగిన దేహం మొత్తంగా ఒక పెద్దపులి వలే ఉన్న సాయన్న దగ్గరకు రావడానికి అందరూ జంకారు. అతడిని ఒక ఇనుప బోనులో బంధించారు. అతడి తలను నరికితే తప్ప తమ ఆస్తులకు రక్షణ లేదని భావించిన జమీందారులు అందుకు సిద్ధపడ్డారు. అప్పటి వనపర్తి సంస్థానం రాణి, శంకరమ్మ సాయన్న లూటీ చేసినంత డబ్బు దాదాపుగా 10 వేల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు చెల్లించడానికి సిద్ధపడ్డప్పటికీ కూడా పోలీసులు ఆయన్ను విడిచిపెట్టలేదు. చివరకు తానే తన తలను నరకడానికి నియమించిన వెంకన్నను పిలిచి నరకమని చెప్పాడు. అలా ఒక గొప్ప యోధుడు అస్తమించాడు. ఇప్పటికి కిన్నెర వాయిద్యాలతో ఆయన కథను గానం చేస్తూనే ఉంటారు. అలంటి యోధుడిపైన సినిమా తీస్తుండడం నిజంగా మన అదృష్టం.

Courtesy / Source by : 
*జర్నలిస్ట్ మహేష్ భైరమోని*
*ప్రజల పక్షం-

Tuesday, July 16, 2024

ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది బాధితులతోనే కానీ నేరస్తులతో కాదు.. రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీపడొద్దని ముఖ్యమంత్రి శ్రీ  @revanth_anumula పోలీసు అధికారులను ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది బాధితులతోనే కానీ నేరస్తులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో @TelanganaDGP , #Exise, @TG_ANB అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు.

* కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సచివాలయంలో రోజంతా జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల కాపాడటంలో తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రిగారు దిశానిర్ధేశం చేశారు.

* పోలీసులు రహదారులపై కనిపించాలని, పీరియాడికల్ క్రైమ్ రివ్యూలు చేయాలని, కమిషనర్లు, ఎస్పీలు మొదలు ఎస్ హెచ్ వోల వరకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. గతేడాది కన్నా నేరాలు తగ్గాయని పోలీసు అధికారులు వివరించగా, వాటిని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

* కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. కొన్నిసార్లు కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తారని, అటువంటివి జరగకుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని హెచ్చ‌రించారు.

* అట‌వీ భూముల్లో పండ్ల మొక్క‌లు నాట‌డాన్ని ప్రోత్సహించి తద్వారా గిరిజ‌నుల‌కు ఆదాయం పెంచాలి.

* ప్రాజెక్టు కట్టలు, కాలువ గట్టులు, రహదారుల వెంట తాటి, ఈత చెట్లు నాటాలి.

* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాలు ఒకేచోట ఉండేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటునకు స్థలాలు ఎంపిక చేయాలి.

* కలెక్టర్లు విధిగా పాఠశాలలను తనిఖీ చేయాలి. డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు తరచూ పాఠశాలలను తనిఖీ చేయాలి. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం శ్రీ @Bhatti_Mallu తో పాటు మంత్రివర్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#TelanganaProgress #GovernanceReview
#TelanganaPrajaPrabhutwam 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1813235497935806804?t=SfOc66bQxvd6_DZStCNoyg&s=19

కలెక్టర్ అంటే కుటుంబసభ్యుడిగా ప్రజలు భావించాలి

పారదర్శకంగా ప్రజాహిత పాలన అందించండి
🔷కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గనిర్దేశనం
🔷అర్హులైన అందరికీ ఆరు గ్యారంటీలు చేరవేయాలి
🔷ఆగస్టు 15లోగా ధరణి సమస్యలు పరిష్కరించాలి
🔷ఆర్టీసీలో అద్దె బస్సులు నిర్వహించుకునేలా మహిళా సంఘాలకు అవకాశం
🔷రేషన్ కార్డు లేకున్నా పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు అందించాలి
🔷పటిష్టమైన నిఘాతో ప్రభుత్వ భూములు, ఆస్తులను పరిరక్షించండి
🔷జిల్లాల కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీచేసిన సీఎం

హైదరాబాద్ :

పారదర్శకంగా ప్రజాహిత పాలనను అందించటమే తమ ప్రభుత్వం ఎంచుకున్న మొదటి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి @revanth_anumula  స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ప్రజల ప్రయోజనాలను అర్థం చేసుకొని పని చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు.

సచివాలయంలో మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఉపముఖ్యమంత్రి @Bhatti_Mallu , మంత్రివర్యులు @OffDSB , @Ponnam_INC , @IKondaSurekha , @seethakkaMLA , @KomatireddyKVR , @mpponguleti , @Tummala_INC , @DamodarCilarapu , @UttamINC , @jupallyk_rao , ముఖ్యమంత్రి సలహాదారు @Vemnarenderredy  , @TelanganaCS శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాజకీయ ఒత్తిళ్లు లేవు.. నిబద్ధతతో పనిచేయండి..
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జిల్లా కలెక్టర్లతో ఇది రెండో సమావేశమని,  ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరేనని సీఎం గుర్తు చేశారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి వారధులు.. సారధులు మీరేనని అన్నారు.  ఇటీవలే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమర్థులైన యువ కలెక్టర్లను నియమించామని, రాజకీయ ఒత్తిళ్లు, ఎలాంటి రాగద్వేషాలు లేకుండా కలెక్టర్ల బదిలీలు  చేపట్టామన్నారు. ఐఏఎస్ అధికారుల కెరీర్లో జిల్లా కలెక్టర్లుగా పని చేయటమే  అత్యంత కీలకమైన అవకాశమని సీఎం అన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే బాధ్యతలతో పాటు క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలపై అవగాహన వస్తుందని, జిల్లాల్లో పని చేసిన అనుభవమే భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అన్నారు.

కలెక్టర్ అంటే కుటుంబసభ్యుడిగా ప్రజలు భావించేలా..
ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను చివరి లబ్ధిదారుల వరకు చేరవేసే కీలక బాధ్యత కలెక్టర్లదేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కలెక్టర్లు ఏ జిల్లాలో పని చేసినా.. అక్కడి జిల్లా ప్రజల మదిలో చెరగని ముద్ర వేయాలని, తాము పని చేసే ప్రాంత ప్రజలందరి అభిమానాన్ని అందుకునేలా పని చేయాలని సీఎం అన్నారు. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వం టీచర్లకు ప్రమోషన్లతో పాటు బదిలీలు చేసిందని, కొన్నిచోట్ల టీచర్లు బదిలీపై వెళుతుంటే విద్యార్థులు సొంత కుటుంబసభ్యుడిలా స్పందించారు. వాళ్లకు అడ్డుపడి కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనలు మీడియాలో చూసినట్లు సీఎం చెప్పారు. జిల్లాల్లో కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనితీరు ఉండాలని  అభిప్రాయపడ్డారు. అక్కడి ప్రజలు కలెక్టర్ ను బదిలీ చేయకుండా అడ్డుకునేంత అనుబంధాన్నిసంపాదించుకోవాలని ఉదాహరణగా చెప్పారు.

ప్రజాప్రభుత్వం మార్కు కనబడాలి..
వివిధ రాష్ట్రాల నుంచి వివిధ సంస్కృతుల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులు తెలంగాణలో పని చేస్తున్నారని, విధి నిర్వహణలో భాగంగా ఇక్కడి భాష నేర్చుకుంటే సరిపోదని, భాషతో పాటు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం కావాలని  సీఎం కలెక్టర్లకు సూచించారు. తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావించి పని చేయాలని,  ఇక్కడి ప్రజలతో మమేకం కావాలని, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా ఐఏఎస్లు పని చేయాలన్నారు.  క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని..  కేవలం ఏసీ గదులకే పరిమితమైతే ఎలాంటి సంతృప్తి ఉండదని అన్నారు.  తాము చేపట్టే  ప్రతి పని.. ఇది ప్రజా ప్రభుత్వమని  ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు.

సమస్యలను సత్వరమే పరిష్కరించాలి..
జిల్లా కలెక్టర్లు అందరూ క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాఠశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రుల ద్వారా ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి పేద విద్యార్థిపై ప్రభుత్వం ప్రతి నెలా రూ.85వేలు ఖర్చు పెడుతుందని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు పిల్లల భవిష్యత్తును నిర్దేశించే విద్యా వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. అందుకే ప్రభుత్వ స్కూళ్లు,  ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీలకు వెళ్లినప్పుడు ప్రజలతో మాట్లాడాలని, అక్కడికక్కడ పరిష్కారమయ్యే చిన్న చిన్న పనులను వెంటనే పరిష్కరించాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.

"గతంలో పది పెద్ద జిల్లాలుండేవి.  అప్పడు పది మంది కలెక్టర్లే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా నడిపించారు. అప్పటితే పోలిస్తే ఇప్పుడు జిల్లాల పరిధి, జనాభా తగ్గిపోయింది. అప్పటితో పోలిస్తే కలెక్టర్ల అధికారాలు, బాధ్యతల్లో తేడా ఏమీ లేదు.  అప్పుడు పది మంది చేసిన పనిని ఇప్పుడు 33 మంది కలెక్టర్లు కలిసికట్టుగా ఎందుకు చేయలేరు..? ఎవరికివారుగా మీ ఆలోచనలు, మీ పనితీరును సమర్థతను చాటుకోవాలి. ఇది ప్రజా ప్రభుత్వం. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలతో ప్రజలకు విశ్వాసం కల్పించే బాధ్యత మీదే..." అని సీఎం కలెక్టర్లకు మార్గదర్శనం చేశారు. కలెక్టరేట్లలో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా స్థాయిలో సమస్యలు పరిష్కారమైతే, హైదరాబాద్లో ప్రజాభవన్ కు వచ్చే అర్జీల సంఖ్య తగ్గిపోతుందని, అదే మీ పనితీరుకు అద్దం పడుతుందని సీఎం అన్నారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు.

అర్హులైన అందరికీ ఆరు గ్యారంటీలు
ఇప్పటికే  ప్రకటించిన ఆరు గ్యారంటీలను రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని సీఎం పునరుద్ఘాటించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని గృహ జ్యోతి, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకాలకు అర్హులెవరికైనా ఈ పథకం వర్తించకపోతే.. తమ ఆధార్, రేషన్ కార్డు, లేదా గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్తు సర్వీసు నెంబర్లు సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలు పని చేసేలా చూడాలని, అవసరమైతే ప్రజావాణి జరిగే రోజున కలెక్టరేట్లలోనూ సేవాకేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటివరకు గృహజ్యోతికి 5.89 లక్షల మంది, అయిదు వందలకు గ్యాస్ సిలిండర్ పథకానికి 3.32 లక్షల మంది సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వివరించారు.

ఆగస్టు 15లోపు ధరణి సమస్యల పరిష్కారం
పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ‘ధరణి సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి మార్చి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇప్పటికే ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1,61,760 దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించిందని, కొత్తగా 1,15,308 దరఖాస్తు చేసుకున్నారని  అధికారులు వివరించారు. ధరణిలో దరఖాస్తులను తిరస్కరిస్తే అధికారులు తిరస్కరణకు కారణాన్నికూడా తప్పకుండా నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 15లోగా పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని గడువు నిర్ణయించారు.

మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు
మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది సభ్యులున్నారని, కోటి మందిని సభ్యులుగా చేరేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీరిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం ప్రకటించారు. అయిదేండ్లలో రూ. లక్ష కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పని చేయాలన్నారు.  మహిళా సంఘాల కార్యకలాపాలకు, చేపట్టే వ్యాపారాలకు తమ వినూత్న ఆలోచనలు కూడా జోడించాలని కలెక్టర్లకు సూచించారు. ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని చెప్పారు.

ప్రభుత్వ భూములు, ఆస్తులపై పటిష్ట నిఘా
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ భూములు, చెర్వులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని సీఎం కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అవసరమైతే జియో ట్యాగింగ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసి.. ప్రభుత్వ భూములపై నిఘా ఉంచాలని సీఎం సూచించారు.

రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ సేవలు..
అందరికీ హెల్త్ ప్రొఫైల్ కార్డులు..
రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ముఖ్యమంత్రి  నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని ఆదేశించారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వైద్య సేవలందించే ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందని, అధ్యయనం చేసి అందుకు సంబందించిన ఉత్తర్వులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. రూరల్ ఏరియాలో పనిచేసే డాక్టర్లకు పారితోషికం  అందించి ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్ కు ఒక సీరియల్ నెంబర్ ఉండాలని, గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రుల నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చెప్పారు. స్థానికంగా స్వచ్ఛంద సంస్థల సహకారం,  పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధులు తీసుకోవాలని, వ్యాపార వాణిజ్యవేత్తల భాగస్వామ్యం తీసుకొని వాటి నిర్వహణ మెరుగుపరిచే విధానాన్ని అవలంబించాలని సూచించారు. అనుభవజ్ఞులైన స్పెషాలిటీ డాక్టర్లను ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి వైద్య సేవలకు వినియోగించుకోవాలని, మిగతా డాక్టర్లకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు.

Courtesy,/ Source by : https://x.com/CPRO_TGCM/status/1813199830258491439?t=TEHLWYjR5phT-EvevLIpHA&s=19