Friday, June 30, 2023
అందరి చూపు మెఘా వైపే...ఆడిట్ లో ఎన్నో అభ్యంతరాలు
విద్యాహక్కు చట్టం విశిష్ఠత
రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శ్యాముల్ ఇంట్లో చోరీ కేసులో కొత్తకోణం....!
*రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శ్యాముల్ ఇంట్లో చోరీ కేసులో కొత్తకోణం....!*
హైదరాబాద్ : రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఎస్సై కృష్ణను అదపులోకి తీసుకోనిలో పోలీసులు విచారిస్తున్నారు.ఈ చోరీ కేసులో ఎస్సై కృష్ణ సూత్రదారిగా అధికారులు గుర్తించారు. సురేందర్ ను విచారించడంతో వెలుగులోకి ఎస్సై కృష్ణ వ్యవహారం వచ్చింది. సురేందర్ అనే వ్యక్తితో కలిసి 100 కోట్ల ఆస్థి కొట్టేసేందుకు ఎస్సై కృష్ణ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది.ఎస్సై కృష్ణను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశాడు. మే 30న శామ్యూల్ కు సురేందర్ మత్తు మందు ఇచ్చాడు.. శామ్యూల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లను సురేందర్ చోరీ చేశాడు. 40 ల్యాండ్ డాక్యుమెంట్లు, 5 లక్షల నగదుతో పాటు 30 తులాలు బంగారాన్ని సురేందర్ దోపిడీ చేశాడు. డాక్యుమెంట్లు దుండిగల్ ఎస్సై కృష్ణకు ఇచ్చిన సురేందర్ విచారణలో ఒప్పుకున్నాడు. సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ను పోలీసులు సేకరించారు. చోరీ చేసిన డబ్బులతో సురేందర్ గోవా వెళ్లి క్యాసినో ఆడినట్లు అంగీకరించాడు. గతంలో సైతం క్యాసినోకు బానిసై సురేందర్ అప్పుల పాలైనట్లు తెలిపాడు. ఎస్సై కృష్ణా, సురేందర్ ల అక్రమ దందాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఓ భూమి విషయంలో రిటైర్ శామ్యూల్ ఎస్సై కృష్ణకు మధ్య వివాదం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో శామ్యూల్ ఆస్తిని మొత్తం కొట్టేసేందుకు ఎస్సై ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
*సుజీవన్ వావిలాల*🖋️
Thursday, June 29, 2023
_ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ ఆత్మహత్యా ప్రయత్నం
Press Note
Wednesday, June 28, 2023
కాళేశ్వరం'పై ఆడిట్ రిప్లై
తెలంగాణ ఠీవి మన.... పీవీ... సీయం కేసీఆర్!
*తెలంగాణ ఠీవి మన.... పీవీ... సీయం కేసీఆర్!*
హైదరాబాద్: నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి. ఇక, పీవీ జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో దేశానికి పీవీ అందించిన సేవలను కేసీఆర్ సర్మించుకున్నారు.ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని పీవీ కాపాడారు. పీవీ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు. తెలంగాణ ఠీవీ.. మన పీవీ అని చెప్పారు. పీవీ స్ఫూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని వెల్లడించారు.
మరోవైపు.. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవి కూడా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వాణిదేవి మాట్లాడుతూ.. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల అభివృద్ధి ఫలాలు మనం అనుభవిస్తున్నాం. పీవీ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది అని తెలిపారు.
*సుజీవన్ వావిలాల*🖋️
కమ్మ,వెలమ సంఘాలకు... భూ కేటాయింపుపై.... తెలంగాణ హైకోర్టు స్టే!
*కమ్మ , వెలమ సంఘాలకు... భూ కేటాయింపుపై.... తెలంగాణ హైకోర్టు స్టే!*
హైదరాబాద్ :
కమ్మ, వెలమ సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం భూములు కేటాయించడంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. కులాల వారీగా భూముల కేటాయింపును ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది.ఇలా కేటాయించడం కూడా ఓ విధమైన కబ్జానే అని వ్యాఖ్యానించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది.
*బలమైన కుల సంఘాలకు భూములు ఇవ్వడం ఎందుకు?*
కమ్మ, వెలమ సంఘాలకు 5 ఎకరాల చొప్పున భూములు కేటాయిస్తూ 2021లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిల్‌పై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. భూముల కేటాయింపుపై ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో.. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని చెప్పింది.
అణగారిన వర్గాలకు భూములు ఇస్తే అర్థం చేసుకోవచ్చని.. బలమైన కులసంఘాలకు భూములు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించింది. సాయిసింధు ఫౌండేషన్‌కు భూకేటాయింపు రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తుచేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు కమ్మ సంఘానికి ఉన్నత న్యాయస్థానం అనుమతించింది.
*సుజీవన్ వావిలాల*🖋️
Tuesday, June 27, 2023
తెలంగాణ ముఖ్యమంత్రి (CM) బాధ్యతలు మరియు అధికారిక వ్యవహారాలు RTIA
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి (CM) బాధ్యతలు మరియు అధికారిక వ్యవహారాలకు సంబంధించి సమాచార హక్కు చట్టం, 2005 కింద కొంత సమాచారాన్ని కోరాను. నా ప్రశ్నల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
1. తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత జీతం తీసుకుంటున్నారు మరియు నెలలో ఏ రోజు జీతం పొందుతున్నారు?
2. దయచేసి CM జీతం స్లిప్ కాపీని షేర్ చేయండి.
3. ప్రగతి భవన్ నిర్వహణకు ప్రతినెలా ఎంత డబ్బు ఖర్చు చేస్తారు?
4. సీఎం భద్రతకు, ఎర్రవల్లిలో ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌కు వెళ్లేందుకు ఎంత డబ్బు ఖర్చు చేస్తారు?
5. సీఎం ప్రతిరోజూ ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు?
6. చీఫ్ సెక్రటరీ కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎన్ని ఫైళ్లను పంపింది మరియు జూలై 2014 నుండి మార్చి 2023 వరకు ఏయే విషయాలపై పంపబడింది?
7. 2014 నుండి మార్చి 2023 వరకు ఆమోదించబడిన/తిరస్కరించబడిన/వాయిదా వేయబడిన ఎన్ని ఫైళ్లను CMO నుండి చీఫ్ సెక్రటరీ స్వీకరించారు?
8. 2014 నుండి మార్చి 2023 వరకు సీఎం ఎన్ని శాఖలను సమీక్షించారు, అవును అయితే అటువంటి సమీక్షల్లో తీసుకున్న సమీక్షలు మరియు విధానపరమైన నిర్ణయాల తేదీలు ఏమిటి?
9. గత 9 ఏళ్లలో విద్య, ఆరోగ్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం ఎన్నిసార్లు సమీక్ష నిర్వహించారు? అవును అయితే, దయచేసి సమావేశం తేదీలు మరియు దానిలో తీసుకున్న నిర్ణయాలను అందించండి.
10. దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి పాత్రలు మరియు బాధ్యతలు మరియు అధికారిక వ్యవహారాలపై సమాచారాన్ని అందించండి.
నాకు ప్రభుత్వం నుండి వచ్చిన డొంకతిరుగుడు సమాధానం చూస్తే విస్తుపోతారు. 😊 నిజం చెప్పడానికి ఎందుకు జంకుతున్నారు, సారూ..
Courtesy by : @RSPraveenSwaero (Twitter)
https://twitter.com/RSPraveenSwaero/status/1673577343544332288?t=5PQzdQnMUiYQhho4YTMoTQ&s=19
(RS ప్రవీణ్ కుమార్ IAS rtd)
Monday, June 26, 2023
తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా ప్రొ. ఆర్. లింబాద్రి
*తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా నియమింపబడ్డ ప్రొ. ఆర్. లింబాద్రి సర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తుంది "ప్రజాసంకల్పం"... Bplkm🪶*
*Hearty congratulations to Prof. R. Limbadri Sir on his appointment as Chairman of Telangana State Council of Higher Education (TSCHE). Right person for Right Job. All the best, SIR.... Bplkm🪶*
తెలంగాణ మలిదశ ఉద్యమకారులు తమ ఆవేదన
కేంద్రం నిధులు.... తెలంగాణకు 2102 కోట్లు....!
*16 రాష్ట్రాలకు కేంద్రం నిధులు.... తెలంగాణకు 2102 కోట్లు....!*
దిల్లి....దేశంలోని 16 రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద రూ.56,415 కోట్లు కేంద్రం విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రత్యేక సాయం పథకం కింద ఈ నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా తెలంగాణకు రూ.2,102 కోట్లు కేటాయించింది. ఏపీకి మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ 'స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్' పేరిట ప్రత్యేక పథకాన్ని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.3 లక్షల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 50 ఏళ్లకు గానూ వడ్డీలేని రుణంగా ఈ మొత్తం రాష్ట్రాలకు అందుతుంది. ఈ నేపథ్యంలో రూ.56,415 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో విద్య, వైద్యం, నీటి పారుదుల, మంచినీటి సరఫరా, విద్యుత్, రహదారులు వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు.ఈ పథకం కింద నిధులు అందుకోనున్న రాష్ట్రాల్లో దక్షిణాది నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉండగా.. కేరళ, ఏపీ మాత్రం ఈ జాబితాలో లేవు. అత్యధికంగా బిహార్‌కు రూ.9640 కోట్లు కేంద్రం రుణం మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇదే తరహా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద రూ.95,147.19 కోట్లకు ఆమోదం తెలపగా.. రూ.81,915.35 కోట్లు కేంద్రం విడుదల చేసింది. కొవిడ్ అనంతరం రాష్ట్రాలు తమ మూలధన వ్యయాలను పెంచాలన్న ఉద్దేశంతో 2020-21 సంవత్సరంలో ఈ పథకాన్ని తొలుత ప్రవేశపెట్టారు.
*సుజీవన్ వావిలాల*🖋️
Sunday, June 25, 2023
MLA రోహిత్ రెడ్డి క్షేమంగా రావడంతో అభిమానుల సందడి!
*MLA రోహిత్ రెడ్డి క్షేమంగా రావడంతో అభిమానుల సందడి!*
*దేవాలయాల్లో పూజలు, ఇంటి వద్ద అభిమానుల కోలాహలం...!*
తాండూరు: తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో అభిమానులు సందడి చేశారు.తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల మండలాలతోపాటు తాండూరు పట్టణానికి చెందిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఎమ్మె ల్యే నివాసానికి పెద్దఎత్తున తరలివచ్చారు.
తాండూరు ప్రజలు ప్రేమానురాగాలు, దేవుని కృపతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రమాదం నుంచి బయట పడటం తో అభిమానులు, నాయకులు దేవాలయాల్లో, చర్చిలలో, మసీదుల్లో, దర్గాలలో ప్రత్యేక పూజలు చేయించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు కొందరు నాయకులు 1101 కొబ్బరికాయలు పగులకొట్టారు. మిఠాయిలు పంచుకున్నారు. టపాకాయలు కాల్చారు. తమ నాయకుడు రోహిత్‌రెడ్డి ప్రమాదం నుంచి తప్పించుకుని క్షేమంగా తిరిగి రావడంతో అభిమానులు కోలాహానికి అవదులు లేకుండా పో యాయి. ఎమ్మెల్యేను కలిసి క్షేమంగా ఉండాలని నాయకులు, అభిమానులు కోరారు.
*సుజీవన్ వావిలాల*🖋️
Saturday, June 24, 2023
*పాత్రికేయులకు... త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ.... మంత్రి KTR.....!
*పాత్రికేయులకు... త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ.... మంత్రి KTR.....!*
*న్యూదిల్లి....!*
పాత్రికేయులందరికీ వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు అప్పగించామని తెలిపారు.ఢిల్లీ టీయూడబ్ల్యూజే-143 అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేష్ అధ్యక్షతన శనివారం పాత్రికేయుల బృందం మంత్రి కేటీఆర్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. హైదరాబాదు లోని పాత్రికేయులందరికీ స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఇందులోనే ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ పాత్రికేయుల్ని సైతం చేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు జీవోలో ఆ అంశాలను పొందుపరుస్తామన్నారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు సొసైటీకి, హైదరాబాద్ పాత్రికేయులకు ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. భేటీలో బీఆర్ఎస్ ఎంపీలు గడ్డం రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఉన్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
షాద్ నగర్లో ధరణి దొంగలు
షాద్ నగర్లో ధరణి దొంగలు
at
– రికార్డుల్లో పేరొచ్చిందని దోపిడీ
– అధికారుల సహకారంతో రూ.వందల కోట్ల భూస్కాములు
– 90 మంది వృద్ధుల ప్లాట్స్ కు టోకరా?
– చక్రం తిప్పిన రెవెన్యూ అధికారులు!
– తక్కువలో కొని.. ఎక్కువ లాభాలకు అమ్మకం
– తన్నుకు చావండి.. మేము సేఫ్ అంటున్న రియల్టర్స్
– డీటీసీపీ వర్సెస్ హెచ్ఎండీఏ లే అవుట్స్ రగడ
క్రైంబ్యూరో, తొలివెలుగు:హైదరాబాద్ శివార్లలో ఎకరం భూమి ఎక్కడ చూసినా రూ.10 కోట్లకు తక్కువ లేదు. అలాంటప్పుడు హైదరాబాద్-బెంగళూరు హైవేకి ఆనుకుని వున్న భూమిలో యజమానిగా తాతల పేరు ధరణిలో కనిపిస్తే ఈ తరం వాళ్లు ఊరుకుంటారా? ఎలాంటి పొజిషన్ లేకున్నా.. తాతలు చనిపోయి పదేళ్లు దాటినా.. ఆ భూమిని కొట్టేసేందుకు చట్టాల్లోని లొసుగులను వాడేస్తున్నారు. హెచ్ఎండీఏ అనుమతులు అంటూ ఎల్పీ నెంబర్ తో అమ్మేసుకుని కోట్లు గడిస్తూ పరార్ అవుతున్నారు. ఇలా గ్రామ పంచాయతీ, డీటీసీపీ లే అవుట్స్ చేసి అమ్మిన ప్లాట్స్ కు ఇంకా రైతుబంధు తింటూ లిటిగేషన్ సృష్టిస్తున్నారు. దీనికి చక్కటి ఉదాహరణే షాద్ నగర్ ఫారుఖ్ నగర్ లోని 8 ఎకరాల లే అవుట్.
జరిగింది ఇదే..!
హైదరాబాద్-బెంగుళూరు హైవేకి ఆనుకుని ఉన్న కొత్తూరు శివారులోని తిమ్మాపూర్ సర్వే నెంబర్ 97, 98లోని 10 ఎకరాల భూమి. దాన్ని అన్నీ లీగల్ గా చూసుకుని 6 ఎకరాలు డీటీసీపీ లే అవుట్ తో ప్లాట్స్ అమ్మకాలను జరిపాయి జన సాయి హౌసింగ్, సుప్రజ హౌసింగ్. ఇందులోని రోడ్లు, పార్క్ ప్లేస్ అంతా తిమ్మాపూర్ గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, 2019 తర్వాత అసలు కథ మొదలైంది. తహసీల్దార్ ఆఫీస్ లో పనిచేసే భాను, రిటైర్డ్ ఎమ్మార్వో వెంకట్ రెడ్డి కలిసి ఆ భూమికి పట్టా పాసు బుక్ ఇచ్చి వివాదం సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఐపీఎస్ లు, ఓ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, పలువురు ప్రముఖులు ప్లాట్స్ తీసుకున్నారంటే ఆ భూమి విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి లే అవుట్ లోని భూమిలో ధరణి వచ్చాక మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయని అంటున్నారు ప్లాట్స్ కొన్నవారు. 2009లో మరణించిన కొండ అంజయ్య(గతంలో భూ యజమాని) పేరు ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చింది. 2018 ఫిబ్రవరి 15న కొండయ్య వారసులు డెత్ సర్టిఫికేట్ సమర్పించి ఆయన భార్య రాధమ్మ పేరు మీద 2019లో పాస్ బుక్స్ తీసుకున్నారు. ఆ తర్వాత వెంటవెంటనే బొల్లినేని శ్రీవల్లి, పత్తిపాటి శ్రీధర్ పేర్ల మీదకి ఆ భూమి వచ్చేసింది. సంజీవని పేరుతో కలర్ ఫుల్ బ్రౌచర్స్ వేయించి ఓపెన్ స్పేస్ అంతా అమ్మకాలు జరిపారు. రీ లే అవుట్ చేసి మూడు నెలల్లోనే రూ.25 కోట్లు దండుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
డీటీసీపీ వర్సెస్ హెచ్ఎండీఏ!
2005 నాటికి అమలులో ఉన్న చట్టానికి అనుకూలంగా లే అవుట్ తో ఉన్న భూమికి హెచ్ఎండీఏ మళ్లీ అనుమతులు ఇవ్వడంతో వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. వృద్ధులైన ప్లాట్ ఓనర్స్ నగరంలోనే ఉండేవారు. దీంతో ఇష్టానుసారంగా సంజీవని ప్రాజెక్ట్స్ ఆ ప్లాట్స్ ను అమ్ముకున్నారని ఆరోపణలు వున్నాయి. రెండేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే ప్లాట్ ఓనర్స్ వెళ్లి చూడగా.. డీటీసీపీ లే అవుట్ ప్లాట్స్ ను భూ మాఫియా మింగేసిందని వాపోతున్నారు. హుటాహుటిన కోర్టుకు వెళ్లి అక్రమ పాస్ బుక్స్ ను సస్పెండ్ చేయించారు. హెచ్ఎండీఏలో ఫిర్యాదు కూడా చేశారు. కానీ, అప్పటికే రూ.25 కోట్లు తీసుకున్న రియల్టర్స్ మాత్రం.. తమకు సంబంధం లేదని మీరంతా కొట్టుకు చావండి అంటున్నారని కొత్తగా ప్లాట్స్ కొన్న వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకుంటే.. 200 నుంచి 500 గజాల వరకు అమ్మకాలు చేసి బిజినెస్ చేస్తారు. కానీ, తప్పుడు సమాచారం ఇచ్చి పూర్తి అనుమతులు అంటూ.. ఒక్కొక్కరికి 700 గజాల నుంచి 2,500 గజాల వరకు అమ్మేశారని అంటున్నారు. గతంలో కొనుగోలు చేసిన వారు.. తాజాగా కొనుగోలు చేసిన వారు కొట్టుకోని చావండని.. తాము, అధికారులు రెండేళ్లలో రూ.25 కోట్లు వెనకేసుకున్నాం అంటూ బొల్లినేని శ్రీవల్లి, పత్తిపాటి శ్రీధర్ నేరుగా చెబుతున్నారంటూ వారంతా వాపోతున్నారు. అక్రమ పాస్ బుక్స్ ను సస్పెండ్ చేయించినా ధన బలం, ఎమ్మెల్యే అంజయ్య అండదండలతో చుట్టూ ప్రహరీ గొడలు నిర్మిస్తున్నారని ప్లాట్ ఓనర్స్ ఆరోపిస్తున్నారు.
హెచ్ఎండీఏ ఎం చేస్తోంది?
సైబర్ మోసగాళ్లు తాము చట్టానికి దొరక్కుండా ఉండేందుకు సిమ్ కార్డులు ఎలా మారుస్తారో.. అలాగే అక్రమ ప్రాజెక్ట్స్ చేసే రియల్టర్స్ కూడా తప్పుడు పత్రాలతో అప్లికేషన్స్ పెట్టి.. జనాలను మోసం చేస్తున్నారని ఆరోపణలు వున్నాయి. తాము చేసేందే కరెక్ట్ అంటూ పోలీసులు, పొలిటిషన్స్ ముందు కలరింగ్ ఇస్తున్నారని చెబుతున్నారు. దోచుకుని.. తలా కొంత ఇచ్చిన వారికే మద్దతు పలకడం కామన్ గా మారిందని వాపోతున్నారు. అసలు రికార్డ్స్ ఏంటి? ఎవరెవరు ఏ ప్రాంతంలో పొజిషన్స్ లో ఉన్నారు? 2019లో వ్యవసాయ భూమి అంటే ఎలా సాధ్యమో కనీసం గుర్తించకపోవడం… మున్సిపాలిటీ ఆథారిటీ అధికారులు ఇప్పటికీ లేకపోవడం నగర శివారులోని వారికి శాపంగా మారిందంటున్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ చేశామని చేతులు దులుపుకున్నారని చెబుతున్నారు.
రిటైర్డ్ ఎమ్మార్వో నిర్వాకంతోనే గొడవలు!
డీటీసీపీ లే అవుట్స్ లో భాగంగా 2005లో 6 ఎకరాలు నాలా కన్వర్షన్ అయింది. గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ లు పూర్తి చేశారు. కానీ, మళ్లీ అదే ప్రాంతంలో 2019లో అక్కడ వ్యవసాయం సాగు చేస్తున్నట్లు అప్పటి తహసీల్దార్ పంచనామా రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. మళ్లీ నాలా కన్వర్షన్ చేశారని, ఒకే భూమికి రెండు సార్లు ఎలా చేశారో వారికే తెలియాలని గ్రామస్తులు అనుకుంటున్నారు. రిటైర్డ్ అయ్యే ముందు అడ్డగోలు వ్యవహారాలు చేసి.. కోట్లాది రూపాయలు రియల్టర్స్ కి దొచిపెట్టేందుకు కారకులు అయ్యారంటూ ప్లాట్ ఓనర్స్ ఆరోపిస్తున్నారు.
ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో కళ్ళముందే మోసాలు
24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే ముదిరాజుల తడాఖా చూపిస్తాం
Friday, June 23, 2023
కేసీఆర్ దారిలో కేజ్రీవాల్....? ఇది కాంగ్రెస్ కు రిక్వెస్ట్ కాదు అల్టిమేటం....!
*కేసీఆర్ దారిలో కేజ్రీవాల్....? ఇది కాంగ్రెస్ కు రిక్వెస్ట్ కాదు అల్టిమేటం....!*
ఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లోసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి.ఇందులో భాగంగా శుక్రవారం బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ నివాసంలో కాంగ్రెస్‌తోపాటు వివిధ ప్రతిపక్షాలు హాజరు అయ్యారు. గతంలోనే ఈ భేటీలో ప్రధాని అభ్యర్థిపై ఎలాంటి చర్చ జరగదని ఈ పార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ తరుణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతి పక్షాలకు సడన్‌గా షాక్ ఇచ్చారు.
*కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ అల్టిమేటం*
శుక్రవారం విపక్షాల సమావేశం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించాలని, లేనిపక్షంలో తాను భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు సంబంధించిన అన్ని సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి సీఎం కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు.
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతి పక్షాలన్నీ సమావేశమైన ఈ సమయంలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ విషయంలో కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. కాగా ఇప్పటికే కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు అరవింద్ కేజ్రీవాల్ పలువురు ఆప్ నేతలను కలిశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని కూడా కలిసేందుకుప్రయత్నించాగా.. అది కుదరలేదు.
*కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే.. కేసీఆర్ దారిలో కేజ్రీవాల్?*
ఒక వేళ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ ఆప్‌కు మద్దతు తెలపకపోతే.. కేజ్రీవాల్ కూడా సీఎం కేసీఆర్ దారిలో నడిచే అవకాశం ఉంది. ఇటీవల టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్.. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండింటిపై దాడి చేస్తూ వివిధ రాష్ట్రాల్లో తన సంస్థాగత బలాన్ని చాటుకుంటూ రానున్న ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నారన్న సంగతి తెలిసిందే.
*సుజీవన్ వావిలాల*🖋️
#ముదిరాజ్ జాగో
Thursday, June 22, 2023
మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం
మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం: ఈడీ
హైదరాబాద్: తెలంగాణ మెడికల్ కాలేజీల్లో సోదాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ గురువారం ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సోదాలు జరిపామని తెలిపింది..
మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. రూ. కోటి 40 లక్షలు నగదు, బ్యాంక్ ఖాతాల్లోని రూ. 2.89 లక్షలు అనధికార నగదు సీజ్ చేసినట్లు తెలిపింది.
'హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల్లో సోదాలు నిర్వహించాం. వరంగల్ పీజ మెడికల్ సీట్స్ స్కామ్‌పై కేసు నమోదు చేశాం. సోదాల్లో పెద్ద ఎత్తున నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నాం. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేశాం. ఇద్దరు మంత్రులకు చెందిన మమత, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు జరిపాం. ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నాం' అని ఈడీ పేర్కొంది..
Courtesy by : సుజీవన్ వావిలాల
Wednesday, June 21, 2023
UAPA లాంటి చట్టాలను దుర్వినియోగం చేస్తుండ్రు
తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు దశాబ్ది ఉత్సవాలా?
డిల్లీలో ఎన్నికల అధికారులను కలిసిన.... గద్దర్
*డిల్లీలో ఎన్నికల అధికారులను కలిసిన.... గద్దర్*
ప్రజాయుద్ధనౌక గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేశారు. కొత్త రాజకీయ పార్టీ దిశగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే గద్దర్ బుధవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు.రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల అధికారులను గద్దర్ కలిశారు. అనంతరం గద్దర్ మీడియాతో మాట్లాడుతూ.. ''గద్దర్ ప్రజా పార్టీ'' పేరుతో పార్టీని ఏర్పాటు చేసేందుకు ఢిల్లీకి వచ్చినట్టుగా చెప్పారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల అధికారులకు అప్లికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు.
ఇది ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న పార్టీ అని గద్దర్ చెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడవాలని అన్నారు. తాను పార్లమెంటరీ మార్గంలోకి వచ్చానని.. ఓట్ల యుద్దంలోకి దిగానని చెప్పారు. తాను ఏర్పాటు చేస్తున్న గద్దర్ ప్రజా పార్టీ ఒక తెలంగాణదే కాదని.. దేశంలోని ఒక పార్టీగా నిర్మాణం చేసేందుకు తాను బుద్దుడిలా కృషి చేస్తానని తెలిపారు. ఇక, గద్దర్ ప్రజా పార్టీ జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది. అందులో ఎరుపు, నీలి, ఆకుపచ్చ ఉండనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అలాగే జెండా మధ్యలో పిడికిలి గుర్తును పెట్టారు.
*సుజీవన్ వావిలాల*🖋️
Tuesday, June 20, 2023
విద్యా దినోత్సవంలో చోటుచేసుకున్న విషాదం
*వెంట పడిన కుక్కలు... ట్రాక్టర్ కింద పడి విద్యార్థి దుర్మరణం*
*విద్యా దినోత్సవంలో చోటుచేసుకున్న విషాదం*
*హనుమకొండ జిల్లా మర్రిపల్లిగూడెంలో దుర్ఘటన*
*కమలాపూర్...* కుక్కలు వెంటపడటంతో తప్పించుకునే ప్రయత్నంలో ఓ బాలుడు ట్రాక్టర్ కిందపడి దుర్మరణం పాలైన విషాదకర ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది.పోలీసుల వివరాల మేరకు.. మర్రిపల్లిగూడేనికి చెందిన ఇనుగాల జయపాల్-స్వప్న దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ధనుష్ (10) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చదువుతున్నాడు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ధనుష్ ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో వీధి కుక్కలు వెంట పడ్డాయి. వాటినుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా అదే గ్రామంలోని రిక్కల నారాయణరెడ్డికి చెందిన ట్రాక్టర్‌ను డ్రైవర్ తోట విజయేందర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి బాలుడుని ఢీకొట్టాడు. ప్రమాదంలో ధనుష్ ట్రాక్టర్ కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు.గమనించిన స్థానికులు వెంటనే కమలాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలే తమ కుమారుడిని బలి తీసుకున్నాయని, ఈ ఉత్సవాలు లేకుంటే తమ కుమారుడు బతికేవాడని ధనుష్ తల్లిదండ్రులు విలపించారు. ధనుష్ తండ్రి జయపాల్ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ యజమాని నారాయణరెడ్డి, డ్రైవర్ తోట విజయేందర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
*ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి: ఈటల*
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విద్యార్థి ధనుష్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ధనుష్ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కమలాపూర్ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబీకులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
*సుజీవన్ వావిలాల*🖋️
Sunday, June 18, 2023
ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.. సెలవులు ఇవ్వాలి
Saturday, June 17, 2023
BSP ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులుగా గంధమల్ల శ్రీనివాస్
తెలంగాణలో ఎం జరుగుతుంది ... మంత్రి KTR...!
*తెలంగాణలో ఎం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలి.... మంత్రి KTR...!*
*వరంగల్...!*
ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడం ద్వారా పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న టెక్స్టైల్ పార్కుకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.261 ఎకరాల్లో రూ.900 కోట్లతో టెక్స్టైల్ పార్కు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. యంగ్ వన్ కంపెనీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయనుంది. భూమిపూజ అనంతనం కేటీఆర్ మాట్లాడుతూ.. కాకతీయ టెక్స్టైల్ పార్కుకు భూములిచ్చిన రైతులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
''వరంగల్‌కు పూర్వ వైభవం తీసుకొస్తాం. పట్టుపట్టి మరీ వరంగల్‌లో కాకతీయ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నాం. నైపుణ్యం ఉన్న నేతన్నలు ఉన్నారు కాబట్టే వరంగల్‌కు మంచి పేరు వచ్చింది. వరంగల్ జిల్లాలో నాణ్యమైన పత్తి పండుతోంది. గణేశా కంపెనీ ఇప్పటికే రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టింది. గణేశా కంపెనీలో వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చాయి. యంగ్ వన్ కంపెనీలో మొత్తంగా 11 పరిశ్రమలు వస్తాయి. తద్వారా వేల ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ నిర్మించే పరిశ్రమల్లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి.మేడిన్ వరంగల్ దుస్తులు అనేక దేశాలకు వెళ్తాయి. యంగ్ వన్ కంపెనీ కొరియాలో పెద్ద పరిశ్రమ. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలి. మన దేశంలో వ్యవసాయ, టెక్స్టైల్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయి. టెక్స్టైల్ రంగంలో మనకంటే బంగ్లాదేశ్, శ్రీలంక ముందున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మేల్కొని పీఎం మిత్ర పథకం తీసుకొచ్చింది. వరంగల్ జిల్లాలో రానున్న 3 కంపెనీల ద్వారా 33 వేల ఉద్యోగాలు వస్తాయి. చల్లా ధర్మారెడ్డి చొరవ వల్లే కాకతీయ టెక్స్టైల్ పార్కు వచ్చింది. పరకాలలో ధర్మారెడ్డిపై పోటీ చేయాలంటే భయపడుతున్నారు. నియోజకవర్గాలు మార్చుకొని మరీ వేరేచోటుకు వెళ్లిపోతున్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
Friday, June 16, 2023
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల మరియు అవినీతి మాయం చేసి బ్రష్టు పట్టించారు
Thursday, June 15, 2023
International Domestic Workers’ Day 2023
రాజస్థాన్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌లపై వేటు
*అర్ధరాత్రి విందు కోసం... హోటల్ సిబ్బందిపై దాడి!*
*రాజస్థాన్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌లపై వేటు*
*రాజస్థాన్...!*
అజ్మేర్ సమీప రెస్టారెంటులో అర్ధరాత్రి జరిగిన గొడవ తాలూకు సీసీ టీవీ దృశ్యాలు వైరల్ కావడంతో ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సస్పెండు చేసింది.వీరితోపాటు మరికొంతమంది సిబ్బందిపైనా సస్పెన్షన్ వేటు పడింది. ఐఏఎస్ అధికారి గిరిధర్ అజ్మేర్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్‌గా ఉన్నారు. గంగాపుర్ సిటీ పోలీసు విభాగానికి ఐపీఎస్ అధికారి సుశీల్‌కుమార్ బిష్ణోయ్ ఓఎస్డీగా నియమితులయ్యారు. ఈ కొత్త నియామకాన్ని పురస్కరించుకొని విందు చేసుకునేందుకు అర్ధరాత్రి రెస్టారెంటుకు వెళ్లి గొడవ పడ్డారు.
''ఆదివారం అర్ధరాత్రి దాటాక ఆ ఇద్దరు అధికారులు స్నేహితులతో కలిసి వచ్చారు. సిబ్బందిని నిద్ర లేపి గొడవకు దిగారు. నాకు సమాచారం అందగానే.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా. నా ఫిర్యాదు అందుకున్న పోలీసులు అదే ఐపీఎస్ అధికారితో కలిసివచ్చి కర్రలు, ఇనుప రాడ్లతో మావాళ్లపై దాడి చేశారు. 11 మంది గాయపడ్డారు'' అని రెస్టారెంట్ యజమాని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై వేటు పడింది.
*సుజీవన్ వావిలాల*🖋️