*గణేశ్ నిమజ్జనం, శోభాయాత్ర వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదు - హైదరాబాద్ సీపీ వి.సి.సజ్జనార్ ఐపీఎస్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 24:
సోషల్ మీడియాలో పాత వీడియోలు, వదంతులతో సమాజంలో చిచ్చుపెట్టాలని చూసే వారిపై మా నిఘా ఉంటుంది.అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసి నిజాలు నిగ్గుతేలుస్తాం.. విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.ఉత్సవాల పేరిట అసభ్యకర పాటలు, అశ్లీల నృత్యాలతో పండుగ పవిత్రతను దెబ్బతీస్తే.. రికార్డైన దృశ్యాల ఆధారంగా తర్వాతైనా సరే కఠిన చర్యలు తప్పవు. ఈ పవిత్ర వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని.. పుకార్లను నమ్మకుండా శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
No comments:
Post a Comment