*సుప్రీంకోర్టు తీర్పు.. కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీలకు చెంపపెట్టు - కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 24:
పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ప్రజాతీర్పును అపహాస్యం చేసిన దానం నాగేందర్ గారి అనర్హతను సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను అని కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.ఒక పార్టీ గుర్తుపై ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ పదవిలో కొనసాగుతూనే మరో పార్టీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి విరుద్ధం అని అన్నారు.ఈ వ్యవహారంలో ప్రజాతీర్పును కాలరాయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల రాజకీయాలకు సమాన బాధ్యత ఉంది. ఒకరు పార్టీ ఫిరాయింపులకు తలుపులు తెరిస్తే.. మరొకరు అదే బాటలో.. ప్రజాభీష్టాన్ని అపహాస్యం చేయడంలో మరో రెండడుగులు ముందుకేశారు అని అన్నారు. ఇప్పుడు, ఖైరతాబాద్ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఖైరతాబాద్ ఓటర్లు ఇప్పుడు తమ తీర్పుతో ఈ రెండు పార్టీలకు సరైన సమాధానాన్ని ఇవ్వబోతున్నారు. రానున్న ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు తథ్యం.సత్యమేవ జయతే!
No comments:
Post a Comment