Wednesday, November 20, 2024

*సీఎం రేవంత్ రెడ్డి..యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం*

“రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు లభించాలంటే పరిశ్రమలు స్థాపించాలి. అవసరమైన చోట భూ సేకరణ జరగాల్సిందే. అయితే, భూమి రైతుల ఆత్మగౌరవంతో ముడివడి ఉంటుంది. భూ సేకరణ చట్టం ప్రకారం తగిన పరిహారం ఇవ్వలేని పరిస్థితి ఉన్నందున, భూ సేకరణ చేసే ప్రాంతాల్లో భూముల విలువ మూడింతలు పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి, కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం” అని ముఖ్యమంత్రి @revanth_anumula గారు చెప్పారు.

✅రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుడి చెరువు మైదానంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

✅నేతన్నలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యార్న్ డిపోను ఈ వేదిక నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. సీఎంగారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ...

✅భూ సేకరణలో భూములు కోల్పోయే రైతుల బాధలను ప్రజా ప్రభుత్వం అర్థం చేసుకోగలదు. శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో త్యాగం చేస్తున్న భూ యజమాన కుటుంబాలను ఆదుకోవడానికి నష్టపరిహారం పెంచాలి. అప్పుడే రైతులు ముందుకొస్తారు. అందుకే నష్టపరిహారానికి సంబంధించిన చట్టాన్ని సవరించాలని ఆదేశాలిచ్చాం.

✅పది సంవత్సరాల ఈ తెలంగాణను ఒక గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. మీ ప్రాంత అభివృద్ధి మా బాధ్యత.

✅ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిందే. తెలంగాణను చూడటానికి రాష్ట్రానికి రావాల్సిందే. ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళదాం. #TelanganaRising

✅రాజన్న సిరిసిల్లా జిల్లా అభివృద్ధికి నిధులిచ్చాం. గత ప్రభుత్వ హయాంలో వేములవాడ ఆలయ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైంది. గత పదేళ్లు చేయలేని పనులను ప్రజా ప్రభుత్వం పది నెలల్లో చేసి చూపిస్తోంది.

✅ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో నవంబర్ 30 లోగా జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్ష చేస్తారు.

✅గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదవశాత్తు మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం.

✅కేవలం పది నెలల్లో రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఈ విషయంలో చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదు.

✅కాళేశ్వరం నుంచి చుక్కనీరు పారకున్నా రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ప్రతి గింజా కొనుగోలు చేయడమే కాకుండా సన్న రకానికి రూ.500 బోనస్ కూడా చెల్లిస్తున్నాం.

✅ఈ కార్యక్రమంలో మంత్రులు @UttamINC గారు, @Min_SridharBabu గారు, @DamodarCilarapu గారు, @Tummala_INC గారు, @iamkondasurekha గారు, @mpponguleti గారు, @Ponnam_INC గారు, ప్రభుత్వ విప్ @aadisrinivasmla గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు @Bmaheshgoud6666 గారు పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. #PrajaPalana #SriRajaRajeshwaraSwamyTemple #Vemulawada 

Courtesy / Source by :  https://x.com/TelanganaCMO/status/1859224766307299704?t=QpPwDkijdLdRLMpJcGOBqw&s=19

No comments:

Post a Comment