Thursday, September 24, 2026

నషా ముక్త భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు జాతీయ స్థాయి గుర్తింపు_

*“నషా ముక్త భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు జాతీయ స్థాయి గుర్తింపు*

*నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ANTF 3వ జాతీయ సదస్సులో తెలంగాణ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అత్యుత్తమ అవార్డును అందుకోవడం అభినందనీయం - సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 23:

మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఈగల్ ఫోర్స్ సాధించిన జాతీయ స్థాయి గుర్తింపు నిదర్శనమని పేర్కొన్నారు.రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ANTF 3వ జాతీయ సదస్సులో  తెలంగాణ ఈగల్ ఫోర్స్ @EAGLE_TELANGANA డైరెక్టర్ సందీప్ శాండిల్య అత్యుత్తమ అవార్డును అందుకోవడం రాష్ట్ర పోలీసు శాఖకు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ TGANB ఆధ్వర్యంలో రాష్ట్రంలో డ్రగ్స్ మరియు గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు విభాగమే EAGLE FORCE Telangana ఈగల్ ఫోర్స్ తెలంగాణ.మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ అనుసరిస్తున్న సమర్థవంతమైన విధానాలకు ఈ జాతీయ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు.మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టడం కేవలం పోలీసు వ్యవస్థ బాధ్యత మాత్రమే కాదని, యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం ప్రతి కుటుంబం, ప్రతి పాఠశాల, ప్రతి సంస్థ, ప్రతి పౌరుడి సమిష్టి బాధ్యత అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.యువతే రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు అని పేర్కొంటూ, మాదకద్రవ్యాల ప్రభావం నుంచి యువతను రక్షించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, డ్రగ్స్‌ విక్రయం, వినియోగంపై సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
“నషా ముక్త భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తెలంగాణ నుంచి బలమైన అడుగు పడాలి. 2029 డిసెంబర్ నాటికి డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించే దిశగా ఈగల్ ఫోర్స్ మరింత దృఢ సంకల్పంతో పనిచేయాలి” అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.మాదకద్రవ్యాలపై పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తూ, యువతను చైతన్యపరచడం, డ్రగ్స్ అక్రమ రవాణా మరియు విక్రయాలపై ఉక్కుపాదం మోపడం, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం ద్వారా సురక్షితమైన, ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో Syneos Health వారి కొత్త గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు_

*హైదరాబాద్‌లో Syneos Health వారి కొత్త గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 23:

బయోఫార్మా, వ్యాక్సిన్‌లు, పరిశోధన మరియు తయారీ రంగాలలో బలమైన పునాదితో, దశాబ్దాలుగా హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ ప్రస్థానం మొదలైంది అని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.ఇప్పుడు ఈ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న తీరు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్త కంపెనీలు అధునాతన ఆర్ అండ్ డి, క్లినికల్ డెవలప్‌మెంట్, డేటా, ఏఐ మరియు టెక్నాలజీ సామర్థ్యాలను నగరానికి తీసుకురావడాన్ని మనం చూస్తున్నాము అని అన్నారు. ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును నిర్మించడానికి లైఫ్ సైన్సెస్, ఏఐ, డేటా, ఇంజనీరింగ్ మరియు అధునాతన టెక్నాలజీని ఒకచోట చేర్చడమే తదుపరి అధ్యాయం.Syneos Health వారి కొత్త 137,000 చదరపు అడుగుల కేంద్రం, ఆసియాలోనే అతిపెద్దదిగా మరియు ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్దదిగా, ఈ పరిణామానికి ఒక బలమైన ఉదాహరణ.సియోస్ హెల్త్ Syneos Health అమెరికాకు చెందిన ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ సొల్యూషన్స్ సంస్థ.ఇది క్లినికల్ డెవలప్‌మెంట్, బయోఫార్మాస్యూటికల్ నైపుణ్యం, ఏఐ, డేటా మరియు టెక్నాలజీని ఒకచోట చేర్చుతుంది. హైదరాబాద్‌లోని బృందాలు ప్రపంచవ్యాప్త ఔషధ అభివృద్ధికి మద్దతు ఇస్తాయి అని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.Syneos Health ఈ వ్యవస్థలో చేరడంతో, ప్రపంచంలోని టాప్ ఐదు CROలలో నాలుగు ఇప్పుడు నగరంలో తమ ఉనికిని కలిగి ఉన్నాయి. ఇది గ్లోబల్ క్లినికల్ రీసెర్చ్ మరియు లైఫ్ సైన్సెస్‌లో హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.AI-ఆధారిత లైఫ్ సైన్సెస్ కోసం హైదరాబాద్ ఒక గ్లోబల్ టెస్ట్‌బెడ్‌గా మారాలన్నది మా దార్శనికత. ఇక్కడ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు కలిసి పనిచేస్తారు, పరిశోధన ప్రయోగశాల నుండి పరిశ్రమకు వేగంగా చేరుకుంటుంది, మరియు గ్లోబల్ కంపెనీలు ఇక్కడి నుండి అత్యున్నత విలువ కలిగిన సామర్థ్యాలను నిర్మించుకుంటాయి అని తెలిపారు.నేను Syneos Health కు హైదరాబాద్‌కు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు మరియు రోగుల కోసం ఈ కంపెనీ ఇక్కడ ప్రత్యేక నైపుణ్యం గల ప్రతిభను, అధునాతన సామర్థ్యాలను పెంపొందించుకోవడం కొనసాగిస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

రిమ్స్, ఆదిలాబాద్‌లో అగ్ని ప్రమాదంలో ముగ్గురు నవజాత శిశువుల మృతిపై నివేదిక కోరిన టీజీహెచ్‌ఆర్‌సీ_

*ప్రెస్ రిలీజ్* 

 *రిమ్స్, ఆదిలాబాద్‌లో అగ్ని ప్రమాదంలో ముగ్గురు నవజాత శిశువుల మృతిపై నివేదిక కోరిన టీజీహెచ్‌ఆర్‌సీ* 

బాపట్ల కృష్ణమోహన్,మీడియా టుడే,సెప్టెంబర్ 23:

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ TGHRC గౌరవ చైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో, 2026 సెప్టెంబర్ 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ RIMSలోని **స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ SNCU**లో సంభవించిన విషాదకర అగ్ని ప్రమాదానికి సంబంధించి పలు పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై కమిషన్ సుమోటోగా స్వీకరించింది.ఈ ఘటనపై 

*(1)*: డెక్కన్ క్రోనికల్ లో “3 infants die of smoke after AC fire in RIMS baby unit”; 

*(2)*: ది హిందూ లో “3 infants killed in fire accident at RIMS Adilabad: 25 rescued”; 

*(3)*: ది టైమ్స్ అఫ్ ఇండియా లో “3 preterm infants die after blaze at RIMS in Adilabad”; 

*(4)*: మన తెలంగాణ లో “రిమ్స్ లో అగ్ని ప్రమాదం”; 

*(5)*: దిశ లో “ముగ్గురు నవజాత శిశువులు మృతి”; 

*(6)*: నవ తెలంగాణ లో “ఆదిలాబాద్ రిమ్స్ అగ్ని ప్రమాదం”; 

*(7)*: సాక్షి లో “ఊపిరాడలె.. ప్రాణాలు నిలవలె”; 

*(8)*: నమస్తే తెలంగాణ లో “అంతులేని విషాదం. ఆదిలాబాద్ రిమ్స్‌లో షార్ట్ సర్క్యూట్.. ముగ్గురు పిల్లల దుర్మరణం”;

*(9)*: ఈనాడు లో “చికిత్సకు వస్తే ప్రాణాలే పోయాయి” అనే శీర్షికలతో వచ్చిన వార్తలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది.వార్తా కథనాల ప్రకారం, ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌కు సంబంధించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి, SNCUలో దట్టమైన పొగ వ్యాపించింది. ఆ సమయంలో సుమారు 27 మంది నవజాత మరియు ముందస్తుగా జన్మించిన శిశువులు చికిత్స పొందుతున్నట్లు వార్తలు పేర్కొన్నాయి. ఈ ఘటన అనంతరం ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందగా, పలువురు శిశువులు పొగ మరియు శ్వాస సంబంధిత ఇబ్బందులకు గురైనట్లు, వారిని ఇతర వార్డులకు మరియు సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.
అదేవిధంగా, SNCUలోని ఎయిర్ కండిషనింగ్ మరియు విద్యుత్ వ్యవస్థల నిర్వహణ, ఫైర్ అలారాలు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర తరలింపు ఏర్పాట్లు మరియు ఇతర అగ్ని భద్రతా చర్యలపై కూడా వార్తా కథనాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అగ్ని భద్రతా సన్నద్ధత మరియు విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో లోపాలు ఉన్నట్లు కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి.ఈ నేపథ్యంలో, అగ్ని ప్రమాదానికి దారితీసిన వాస్తవ పరిస్థితులు, శిశువుల మృతికి దారితీసిన కారణాలు, SNCUలో భద్రత మరియు నిర్వహణ ఏర్పాట్లు, ప్రమాద సమయంలో చేపట్టిన రక్షణ మరియు వైద్య చర్యలు, అలాగే ఈ ఘటనపై నిర్వహించిన విచారణకు సంబంధించిన అంశాలను నిర్ధారించుకోవడం అవసరమని కమిషన్ భావించింది.అందువల్ల, ఘటనకు సంబంధించిన సమగ్ర నివేదికను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి సమర్పించాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, SNCUలో భద్రత మరియు నిర్వహణ ఏర్పాట్లు, ప్రభావిత శిశువుల రక్షణ మరియు చికిత్సకు తీసుకున్న చర్యలు, అలాగే ఘటనపై నిర్వహించిన విచారణలో వెలువడిన అంశాలను నివేదికలో పొందుపరచాలని కోరింది.ఈ వ్యవహారాన్ని తదుపరి పరిశీలన నిమిత్తం 27.10.2026కు వాయిదా వేసింది.

Wednesday, September 23, 2026

పిల్లల రక్షణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత - అనూరాధ రావు,బాలల హక్కుల సంఘం_

*డిల్లిలో జరుగుతున్న వరుస సంఘటనలు మనకు ఒక తీవ్రమైన హెచ్చరిక*

*పిల్లల రక్షణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత - అనూరాధ రావు,బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 22:

దేశ రాజధాని ఢిల్లీ లో నెల వ్యవధిలో 4 ఘటనలు చోటు చేసుకున్నాయి.ఢిల్లీ - దేశ రాజధాని నగరం అని ఎంతో గొప్పగా చెప్పు కుంటాం, కాని అమ్మయిలు బయటికి వెళితే క్షేమంగా ఇంటికి చేరడం చాలా కష్టం.ఇంకా ఎన్ని నిర్భయ ఘటనలను చూడాలి మనం?  
సెప్టెంబర్ 10వ తేదీన డిల్లి స్వరూప్ నగర్ లో 16 సంవత్సరాల అమ్మాయి టెంపోలో స్నేహితున్ని కలవడానికి వెళితే, అతను తన స్నేహితులను పిలిచి మద్యం సేవించి, ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసారు.వాళ్లలో ముగ్గురు మైనర్లే. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అని చెప్పగానే కత్తితో పొడిచి చంపి,నిర్మానుష్య ప్రదేశంలో మూటకట్టి పడేశారు. 13వ తేదీన పోలీసులకు ఈ శవం దొరికింది.సిసి టీవీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.సౌత్ ఢిల్లి సిడిఆర్ చౌక్ దగ్గర పుట్ పాతపై నిద్రిస్తున్న 10 సంవత్సరాల పాపను క్యాబ్ డ్రైవర్ అపహరించి, రేప్ చేసి, రాళ్లతో కొట్టి చంపి పారిపోయాడు.
షాబాద్ డైరీ అపార్టమెంట్ దగ్గర 5 సంవత్సరాల పాపను 34 సంవత్సరాల వ్యక్తి బిస్కెట్లు ఇస్తానని ఇంట్లోకి పిలిచి రేప్ చేసిన ఘటన జరిగింది.అగస్టు చివరి వారంలో నోయిడా నుండి ఢీల్లీ కాశ్మీరీ గేట్  ప్రాంతానికి వెళుతున్న స్లీపర్ బస్సులో 16 సంవత్సరాల మైనర్ "బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. అబ్బయిలను కూడా వదలడం లేదు, 12 సంవత్సరాల బాలుడిపై ధారుణంగా నలుగురు వ్యక్తులు రేప్ చేసి,కొట్టి ప్రాణాపాయ స్థితిలో వదిలేశారు.అన్ని కేసుల్లో కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
నేరం రుజువైతే POCSO చట్ట ప్రకారం శిక్ష పడుతుంది. ఇక్కడ ముగ్గురు మైనర్లకు జువెనైల్ చట్ట ప్రకారం 3 సంవత్సరాల శిక్ష పడుతుంది అని అంటున్నారు.వారిని Correction home లో పెడతారు.మనం పిల్లల భద్రత గురించి చూస్తే రక్షణ కల్పించడంలో మన వ్యవస్థ విఫలం అయింది అని చెప్ప వచ్చు.నేరం జరిగాక చర్యలు తీసుకోవడం కాదు, ముందస్తు భద్రత చర్యలు ఎంటి? 
ఈ ఘోరాలు కదులుత్తున్న బస్సులో, టెంపోల్ జరిగాయి. 
వాహనాలకు ఏదైన ఆలారం లాంటివి అమర్చడం వల్ల, దగ్గర పోలీస్స్టేషన్కు, పోలీసుల పెట్రోలింగ్ వాహనాలకు సమచారం అందే విధంగా పరికరాలను అమర్చాలి.
తల్లిదండ్రులు తప్పని సరి అలర్టుగా ఉండాలి. పిల్లలను ఒంటరిగా పంపిచాల్సి వస్తే తెలియని ప్రైవేట్ బస్సులు, వాహనాలు అవాయిడ్ చేయలి. ప్రభుత్వ రవాణా బస్సులు,మెట్రో ట్రైన్ లేదా రిజిస్టర్డ్ క్యాబ్ మాత్రమే ఉపయోగించాలి.మీరు ప్రయాణించే లోకేషన్ కుటుంబ సభ్యులకు షేర్ చేయాలి.
అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి, తెలియని వ్యక్తులు లిఫ్ట్ ఇస్తాం రమ్మని పిలిస్తే వద్దు అని చెప్పాలి. తినడానికి ఎదైనా ఇస్తే వద్దు అని చెప్పాలి. స్మార్ట్ ఫోన్లో బయటికి వెళ్లిన తర్వాత SOS emergency ఆన్ చేసుకోవాలి, ఏదైన సమస్య వస్తే  బటన్ ఒత్తితే ఆ సమాచారం తల్లిదండ్రుల ఫోన్ కు / పోలీసుస్టేషన్ కు అందుతుంది. కావల్సిన సహాయం అందుతుంది.అత్యవసర నంబర్స్ కు కాల్ చేయాలి 112 / 100 / 1091 / 1098
బాధితులకు న్యాయం జరగాలి, వారికి కావలస్సిన కౌన్సిలింగ్, వైద్యం అందాలి, ఆ కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉండాలి.
పిల్లల రక్షణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత, కుటుంబం, పాఠశాలలు, పోలీసులు, ప్రభుత్వం అందరి బాధ్యత.

ఒక్క భూమి కోసం గ్రామంలో యుద్ధ వాతావరణమా_


*వృద్ధ దంపతుల భూమిపై దౌర్జన్యం!*

*30 మంది రౌడీలతో చొరబాటు యత్నం.. గ్రామంలో భయానక వాతావరణం సృష్టిస్తున్న కప్పల శ్రీనివాస్*

*వృద్ధ దంపతుల ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన – పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్*

బాపట్ల కృష్ణమోహన్,మీడియా టుడే,సెప్టెంబర్ 22:

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఉట్కూర్ గ్రామంలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది, తమ భూమిని ఆక్రమించుకునేందుకు సుమారు 30 మందితో వచ్చి కడీలు పాతే ప్రయత్నం చేశారని 68 ఏళ్ల యంపల్ల శ్రీనివాస్ రెడ్డి, 62 ఏళ్ల యంపల్ల కమలమ్మ అనే వృద్ధ దంపతులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఫిర్యాదు ప్రకారం, కప్పల శ్రీనివాస్ అనే వ్యక్తి భూమి బ్రోకర్‌గా వ్యవహరిస్తూ, మరికొందరిని వెంటబెట్టుకుని తమ భూమిలోకి బలవంతంగా ప్రవేశించి కడీలు పాతేందుకు ప్రయత్నించారని వారు ఆరోపించారు. రెండు కార్లు, ఒక ఆటోలో పెద్ద సంఖ్యలో వ్యక్తులు వచ్చి భూమిలోకి ప్రవేశించడం వల్ల ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.“ఇది కేవలం భూ వివాదం కాదు.. వృద్ధ దంపతుల ప్రాణాలు, ఆస్తి రక్షణకు సంబంధించిన తీవ్రమైన సమస్య” అని వారు ఆందోళన వ్యక్తం చేశారు.తమ భూమికి సంబంధించిన హక్కులపై ఇప్పటికే నకిరేకల్ కోర్టులో O.S.No.153/2025, O.S.No.166/2025 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, కోర్టు పరిధిలో ఉన్న హక్కుల అంశాన్ని పోలీసులు నిర్ణయించాలని తాము కోరడం లేదని వృద్ధ దంపతులు స్పష్టం చేశారు. అయితే కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండగానే తమ ఆధీనంలోని భూమిలోకి గుంపుగా వచ్చి కడీలు పాతడం, బెదిరించడం, బలవంతంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేయడం మాత్రం చట్టవిరుద్ధమని వారు పేర్కొన్నారు.ఇదే భూమికి సంబంధించి O.S.No.135/2025 కూడా పెండింగ్‌లో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

*“మమ్మల్ని చంపి భూమిని ఆక్రమించుకుంటారేమో” అనే భయం*

పెద్ద సంఖ్యలో వ్యక్తులను వెంటబెట్టుకుని పదేపదే భూమిలోకి వస్తే తమకు, తమ ఆస్తికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వృద్ధ దంపతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమపై దాడి చేసి ప్రాణహాని కలిగించి భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతుందేమోననే భయం తమను వెంటాడుతోందని వారు పోలీసులకు తెలిపారు.అయితే ప్రాణహాని జరుగుతుందని నిర్ధారితంగా చెప్పే పరిస్థితి లేదని, ఆ భయం తమకు కలుగుతోందనే విషయాన్ని మాత్రమే ఫిర్యాదుదారులు వెల్లడించారు.

*ఒక్క భూమి కోసం గ్రామంలో యుద్ధ వాతావరణమా?*

భూమిలోకి గుంపుగా చొరబడి కడీలు పాతే ప్రయత్నం చేయడం వల్ల గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడిందని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేశారు.కోర్టులో భూ హక్కులపై పోరాటం కొనసాగుతుండగా.. బయట గుంపులు సమీకరించి బలప్రయోగంతో భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరిగితే చట్టపరిపాలనకు అర్థమేంటి? అని వారు ప్రశ్నించారు.వృద్ధ దంపతుల ఆరోపణలపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి, నిజానిజాలు వెలికితీసి, తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

*సీనియర్ సిటిజన్స్ చట్టం కింద రక్షణ కోరిన వృద్ధ దంపతులు*

తాము 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ కావడంతో మైంటెనెన్సు మరియు welfare of Parents and Senior Citizens Act, 2007లోని Section 22 ప్రకారం తమ జీవితం, ఆస్తికి రక్షణ కల్పించాలని వారు పోలీసులను కోరారు.తమ భూమిలోకి అక్రమంగా ఎవరూ ప్రవేశించకుండా ప్రత్యేక పోలీసు బీట్, పెట్రోలింగ్, ముందస్తు నిరోధక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

*పోలీసుల ముందున్న కీలక ప్రశ్నలు*

*(1)*: 20-09-2026న నిజంగా ఎంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చారు? 
*(2)*: భూమిలోకి ప్రవేశించి కడీలు పాతే ప్రయత్నం జరిగిందా?
*(3)*: ఎవరి ప్రోద్బలంతో ఈ ఘటన జరిగింది?
*(4)*: వృద్ధ దంపతులకు బెదిరింపులు చేశారా?
*(5)*: భవిష్యత్తులో శాంతిభద్రతలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందా?
*(6)*: గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై ఏ చర్యలు తీసుకున్నారు?

ఈ ప్రశ్నలపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.
భూమి హక్కును కోర్టు నిర్ణయించాలి.. బలప్రయోగంతో కాదు.వృద్ధుల ఆస్తిని చట్టం రక్షించాలి.. గుంపుల బలంతో కాదు.భూ వివాదానికి పరిష్కారం న్యాయస్థానంలో ఉండాలి.. రోడ్డుపై కాదు.
వృద్ధ దంపతుల ఫిర్యాదును అత్యంత సీరియస్‌గా పరిగణించి, వారి ప్రాణాలకు మరియు ఆస్తికి ఎటువంటి ముప్పు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, 20-09-2026 ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు

ఔత్సాహిక ఫిలిం మేకర్స్ విజ్ఞప్తి మేరకు అక్టోబర్ 2 వరకు గడువు పొడిగింపు_

*బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌కు మంచి స్పందన*

*ఔత్సాహిక ఫిలిం మేకర్స్ విజ్ఞప్తి మేరకు అక్టోబర్ 2 వరకు గడువు పొడిగింపు-సమీక్షా సమావేశంలో నిర్ణయం* 

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 22:

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఔత్సాహిక ఫిలిం మేకర్స్ విజ్ఞప్తి మేరకు పోటీలో పాల్గొనే గడువును అక్టోబర్ 2  వరకు పొడిగించారు. సోమవారం ఎఫ్‌డీసీ కార్యాలయంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. ముకుంద రెడ్డి, ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ కొండా రాజు, జ్యూరీ కమిటీ చైర్మన్ హరీష్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.యువతలోని సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, ఔత్సాహిక ఫిలిం మేకర్స్‌కు తమ ప్రతిభను చాటుకునేందుకు మరింత అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో గడువును పొడిగించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్, ఎఫ్‌డీసీ ఈడి. కిషోర్ బాబు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, విమలక్క, కాసర్ల శ్యామ్, పొన్నం రవిచంద్ర, అనిల్ జీలా తదితరులు పాల్గొన్నారు.

రామంతాపూర్ మధురానగర్ వర్తక సంఘం గణేశ్ మండపం వద్ద అన్నదానం_



*రామంతాపూర్ మధురానగర్ వర్తక సంఘం గణేశ్ మండపం వద్ద అన్నదానం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 22:
 
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతపూర్ మధురానగర్ లో ప్రతి సంవత్సరం జరిపే వినాయక చవితి నవరాత్రులు *గణేశ్ ఉత్సవాలు*' చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లొ భాగంగా ఈ రోజు భక్తులకు, ప్రజలకు 'అన్న దానం' కార్య క్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వం చారు. ఈ అన్నదాన కార్యక్రమంకు చుట్టు ప్రక్కన ఉన్న కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు  వచ్చి చాలా సంతృప్తి తో సంతోషగా భోజనం ఆరగించారు. మధురానగర్, పి.ఎస్. కాలనీ, భరత్ నగర్, రామ్ శంకర్ నగర్, గోఖలేనగర్, శ్రీని వాసపురం, గణేష్ నగర్  తదితర కాలనీల నుండి ప్రజలు,పెద్ద సంఖ్యలో వృద్ధులు, మహిళలు, షాపు యజమానులు, షాపుల్లో పని చేసే గుమస్తా కార్మికులు,రోడ్లు శుభ్రంచేసే మహిళా కార్మికులు ఈ కార్య క్రమానికి హాజరైనారు.రామంతాపూర్ వర్తక సంఘం సభ్యులు ఎస్.కె. బాషా, తారా చౌధరి, మల్యాల బాలయ్య, ఎం.శ్రీమన్నా రాయణ, ఎం.మురళి,
వినయ్, సునీల్ రాథోడ్,సంగం వేణు, కల్వచర్లమథు, మురికి శంకర్,మురికి శ్రీనివాస్ కొత్తపల్లిరమేశ్, భవాని శంకర్, 
జల్ల శ్రీనివాస్,రాసాని బాల స్వామి,శ్రీమతి తారా చంద్ మీనాదేవి,తూటాడి చంద్రకళ, డాగులూరు స్వాతి గార్ల  ఆధ్వర్యం లో అన్నదానం చక్కని క్రమశిక్షణ తో నిర్వ హించడం జరిగింది.

Monday, September 21, 2026

తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన రెండు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం - సీఎం రేవంత్ రెడ్డి_

*తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన రెండు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం - సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 21:

తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య దివంగత శ్రీమతి పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (#CMRF) నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో లింగాల కేదారి, పుష్పలత అంకితభావంతో అందించిన సేవలను ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకున్నారు. కేదారి దంపతులు ఒక సాధారణ హోటల్ నడుపుతూ, అన్నం పరబ్రహ్మ స్వరూపమని, వృథా చేయకూడదని అవగాహన కల్పిస్తూ, సమాజం పట్ల ఎంతో బాధ్యతగా నడుచుకున్నారు. ఉద్యమ సమయంలో వీరు ఉచితంగా భోజనం, టిఫిన్లు, టీలు అందించారు.హనుమకొండలోని శాంతినగర్, పోస్టల్ కాలనీకి చెందిన లింగాల కేదారి 2026 సెప్టెంబర్ 9న, ఆయన భార్య పుష్పలత 2026 సెప్టెంబర్ 10న జరిగిన ఒక విషాదకర సంఘటనలో మృతి చెందారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి #CMRF నుంచి సీఎం ఓఎస్డీ రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు.
మంజూరైన ఆర్థిక సాయాన్ని అర్హులైన చట్టబద్ధ వారసులు, కుటుంబ సభ్యులకు అందించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ ను ఆదేశించారు.

**తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో అదృశ్యమైన మండల రాజు కుటుంబానికి మానవతా దృక్పథంతో రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు.**

భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన మండల సమ్మిరెడ్డి గారి కుమారుడు మండల రాజు (34) 20.06.2013న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విజ్ఞప్తి మేరకు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.తెలంగాణ ఉద్యమంలో మండల రాజు చురుకుగా పాల్గొన్నారని, ఈ క్రమంలో ఆయన అరెస్టై చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్బంధించబడ్డారని, ఆ తర్వాత కాలంలో అదృశ్యమయ్యాడని ఎమ్మెల్యే తన లేఖలో పేర్కొన్నారు. మండల రాజు తన వృద్ధ తల్లిదండ్రులకు ఏకైక కుమారుడని, ప్రస్తుతం వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, రోజువారీ జీవనోపాధికి ఎలాంటి ఆధారం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
తెలంగాణ అమరవీరుల కోటా కింద మానవతా దృక్పథంతో ఆయన తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొర్లవీడు గ్రామానికి చెందిన మండల సమ్మి రెడ్డికి రూ. 5 లక్షలు ఆర్థిక సాయం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ స్థలాల పరిరక్షణతో పాటు బస్టాండ్, బోరు ప్రజలకు అందుబాటులోకి తేవాలి - వేముల శ్రీను, రిపోర్టర్_

*ప్రెస్‌నోట్*

*శాలిగౌరారం మండలంలో ప్రజా సమస్యలపై అధికారులకు వినతి*

*ప్రభుత్వ స్థలాల పరిరక్షణతో పాటు బస్టాండ్, బోరు ప్రజలకు అందుబాటులోకి తేవాలి - వేముల శ్రీను, రిపోర్టర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే,సెప్టెంబర్ 21: 

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊటుకూరు గ్రామంలో ప్రజా అవసరాల కోసం ఉన్న ప్రభుత్వ భూములు, బస్టాండ్, తాగునీటి సౌకర్యాలకు సంబంధించిన సమస్యలపై గ్రామ ప్రజల తరఫున వేముల శ్రీను మరియు మిత్రులు అధికారులకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
ఊటుకూరు గ్రామ కంఠం పరిధిలోని సర్వే నంబర్లు 43, 44లో ఉన్న ప్రభుత్వ భూమి, బస్టాండ్ మరియు గ్రామానికి చెందిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ మధ్య ఉన్న స్థలంపై ఆక్రమణల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అధికారులు స్థల పరిశీలన నిర్వహించి, ప్రభుత్వ భూమి హద్దులను నిర్ధారించి, ఆక్రమణలు ఉన్నట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు అని వేముల శ్రీను అన్నారు.అదేవిధంగా బస్టాండ్ ఆవరణలో కిరాణా షాప్ పేరుతో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు విచారణ జరిపించాలని, ప్రజల సమక్షంలో బహిరంగంగా మద్యం సేవించడం వల్ల మహిళలు, చిన్నారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని నివారించాలని కోరారు.బస్టాండ్ సమీపంలోని ప్రజా బోరు మోటార్, స్టార్టర్ తదితర పరికరాలు నిరుపయోగంగా ఉండటంతో పాటు బోరు వద్దకు వెళ్లే మార్గం కూడా అడ్డంకులకు గురైనట్లు గ్రామ ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. బోరును మరమ్మతు చేసి, దారిని తెరిపించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విషయాలపై నల్లగొండ జిల్లా కలెక్టర్, శాలిగౌరారం ఎంపీడీఓ, తహసీల్దార్, ఊటుకూరు విలేజ్ సెక్రటరీ తదితర అధికారులకు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు.అలాగే 21-09-2026న మండల స్థాయి ప్రజావాణిలో ఫిర్యాదు నమోదు చేయగా Ref.No. DNALG21092600034 కేటాయించబడిందని, ఫిర్యాదు శాలిగౌరారం మండల పంచాయతీ అధికారికి తదుపరి చర్యల కోసం పంపబడినట్లు వచ్చిన అధికారిక సందేశంలో పేర్కొనబడిందని తెలిపారు.
ప్రజా స్థలాలు ప్రజలకే చెందాలి  బస్టాండ్, తాగునీటి వనరులు ప్రజలకు అందుబాటులో ఉండాలి – ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలి అని గ్రామ ప్రజలు కోరారు అని శ్రీను తెలిపారు.

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను కఠినంగా అమలు చేయాలి - ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్ హేమా సుదర్శన్ జిల్లోజు_

*దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి న్యాయం గెలిచింది - ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ*

*రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను కఠినంగా అమలు చేయాలి - ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్ హేమా సుదర్శన్ జిల్లోజు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 20:

పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయడం కీలక పరిణామం.మిగిలిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి అని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్ హేమా సుదర్శన్ జిల్లోజు అన్నారు.ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆప్ తెలంగాణ స్వాగతిస్తుందని ఆప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు తెలిపారు. బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన అంశాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుని, 2024 ఏప్రిల్ 23 నుంచే ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించింది. అలాగే ఆయన పార్టీ మారలేదంటూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేసే విధంగా తీర్పు ప్రతిని ఎన్నికల సంఘానికి, అసెంబ్లీ స్పీకర్‌కు పంపాలని కూడా ఆదేశించింది. “న్యాయం గెలిచింది. రాజ్యాంగం గెలిచింది. పార్టీ ఫిరాయింపులపై ప్రజల్లో ఉన్న అనుమానాలకు ఈ తీర్పు ఒక ముఖ్యమైన రాజ్యాంగపరమైన సందేశం” అని ఆమె పేర్కొన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాలి. 

**దానం నాగేందర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్లు అనర్హత పిటిషన్లు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు**

*(1)*: కడియం శ్రీహరి – స్టేషన్ ఘన్‌పూర్
*(2)*: పోచారం శ్రీనివాస్ రెడ్డి – బాన్సువాడ
*(3)*: తెల్లం వెంకట్రావు – భద్రాచలం
*(4)*: డాక్టర్ సంజయ్ కుమార్ – జగిత్యాల
*(5)*: అరికెపూడి గాంధీ – శేరిలింగంపల్లి
*(6)*: టి. ప్రకాశ్ గౌడ్ – రాజేంద్రనగర్
*(7)*: బండ్ల కృష్ణమోహన్ రెడ్డి – గద్వాల్
*(8)*: కాలే యాదయ్య – చేవెళ్ల
*(9)*: గూడెం మహిపాల్ రెడ్డి – పటాన్‌చెరు.
పేర్లు నమోదయ్యాయి.

వీరిలో గూడెం మహిపాల్‌రెడ్డి తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన నేపథ్యంలో ఆయనను మినహాయించి మిగిలిన తొమ్మిది మందిపై చర్యలు కోరుతూ బీఆర్‌ఎస్‌ తరఫున హైకోర్టులో పిటిషన్లు దాఖలైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. “ఒక ఎమ్మెల్యే విషయంలో హైకోర్టు స్పీకర్ ఉత్తర్వులను రద్దు చేసి అనర్హతను ప్రకటించిన నేపథ్యంలో, మిగిలిన పార్టీ ఫిరాయింపు కేసులను కూడా పారదర్శకంగా, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పార్టీ మారితే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను గౌరవించాల్సిందే” అని ఆప్ తెలంగాణ డిమాండ్ చేస్తోంది.
ఆప్ తెలంగాణ డిమాండ్లు:
మిగిలిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులను తక్షణమే పరిష్కరించాలి.రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను కఠినంగా అమలు చేయాలి. పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రజలకు పూర్తి పారదర్శకత కల్పించాలి. ప్రజల తీర్పును గౌరవించే విధంగా ఎమ్మెల్యేలపై నిర్ణయాలు తీసుకోవాలి. పార్టీ ఫిరాయింపుల వల్ల ఏర్పడే రాజకీయ అస్థిరతకు అడ్డుకట్ట వేయాలి. “పార్టీ ఫిరాయింపులకు రాజకీయ లాభాల కోసం ప్రోత్సాహం ఇవ్వకుండా, రాజ్యాంగ విలువలు మరియు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికీ, శాసనసభకీ ఉంది. ఈ విషయంలో ఆప్ తెలంగాణ ప్రజల తరఫున నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుంది” అని ఆమె స్పష్టం చేశారు.

తపస్ ఆధ్వర్యంలో ఘనంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుకు సన్మానం_

*పత్రికా ప్రకటన*

*తపస్ ఆధ్వర్యంలో ఘనంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుకు సన్మానం*

*మరికల్ గ్రామ ఉపాధ్యాయులు కమ్మరి పాండురంగయ్య చారి మరియు సమాజ సేవకులు కాసోజు దివ్య ప్రభాకర చారికి సన్మానం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 20:

వికారాబాద్ జిల్లా కేంద్రంలో విద్యా రంగంలో విశిష్ట సేవలు అందించిన ఉపాధ్యాయులను గుర్తించి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో "గురువందనం " కార్యక్రమం నిర్వహించారు.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా చౌడపూర్ మండలం మరికల్ ఉన్నత పాఠశాల లో చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కమ్మరి పాండురంగయ్య చారి ,కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులు సంగెం రమేష్,  కన్మన్ కాల్వ పాఠశాల ఉపాధ్యాయురాలు మంజులత, .మరికల్ పాఠశాలలో విద్యార్థులకు సహాయ సహకారాలు అందించిన సమాజ సేవకులు కాసోజు దివ్య ప్రభాకర చారికి శాసనమండలి సభ్యులు గౌరవనీయ AVN రెడ్డి చే సన్మానం చేసి అభినందించారు. పరిగి నియోజకవర్గం ,కొడంగల్ నియోజకవర్గం తాండూర్ నియోజకవర్గం, వికారాబాద్ నియోజకవర్గం లోని ఉత్తమ ఉపాధ్యాయులకు తపస్ నాయకులు సన్మానించారు.

ఉన్నతమైన కుటుంబం, తండ్రి ఐఏఎస్ ఆఫీసర్, తాను మాత్రం రాజీలేని విద్యార్థి ఉద్యమాలు చేసిన విద్యార్థి పరిషత్ నాయకుడు_

*అశ్రునయనాలతో మా ప్రియతమ భాస్కర్ అన్నకు శ్రద్ధాంజలి - ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్*

*ఏబీవీపీ కార్యకర్తల గుండెల్లో భాస్కర్ అన్న అంటే ఏనుగంత బలం, అపారమైన విశ్వాసం, ఆయన ఒక టైగర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 20:

ఈ జీవన ప్రయాణంలో ఎంతోమందిని కలుస్తుంటాం. కానీ కొందరు మాత్రమే చిరస్మరణీయమైన జ్ఞాపకాలుగా, గుండెల్లో నిలిచిపోయే అనుబంధాలుగా మిగిలిపోతారు. వారిలో భాస్కర్ అన్న ఒకరు. 1985-86 సమయంలో, నల్లగొండ నుండి, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన కొత్తలో భాస్కర్ అన్నను కలిశాను. తాను అప్పటికే పెద్ద నాయకుడు అనే గర్వం లేకుండా, నవ్వుతూ, హుందాగా,  ఆప్యాయతతో పలకరింపు ఆయన ప్రత్యేక లక్షణం.. నాడు హైదరాబాద్ నగరంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమాల్లో ఆయన ఒక 'టైగర్'. ABVP నగర కార్యదర్శిగా విద్యార్థి సమస్యలపై, అదురు బెదురు లేకుండా నిర్మాణాత్మక పోరాటాలు నడిపిన నికార్సైన యోధుడు.ఆయనతో కలిసి విద్యార్థి పరిషత్ కార్యకర్తగా పనిచేసిన రోజులు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనివి. నాడు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌కు ఆయన వచ్చిండంటే చాలు, మేమంతా ఏనుగంత అండగా ఫీల్ అయ్యేవాళ్ళం.ఆ రోజుల్లో ప్రత్యర్థుల, గూండాల చేతుల్లో దారుణమైన దాడికి గురై, తీవ్రంగా గాయపడి, ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనపై కొంతమంది దుండగులు హత్యయత్నం చేస్తే, వంతులవారీగా ఆయనకు రక్షణగా ఉండేవాళ్లం. ఒకానొక రోజు, RSU కి చెందిన కొంతమంది తపంచలు, కత్తులతో దాడి చేస్తే, ప్రస్తుత స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ కృష్ణా రావు, సైదాబాద్ విజయ్, అడ్వొకేట్ పాండన్న, నేను ఆ దాడిని తట్టుకొని, భాస్కరన్న ప్రాణాలు కాపాడుకున్నం.

**ఉన్నతమైన కుటుంబం, తండ్రి ఐఏఎస్ ఆఫీసర్, తాను మాత్రం రాజీలేని విద్యార్థి ఉద్యమాలు చేసిన విద్యార్థి పరిషత్ నాయకుడు.**

తన  ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా, భాస్కర్ అన్న ఏనాడూ వెనకడుగు వేయలేదు; సిద్ధాంతాన్ని వీడలేదు. అంతటి నిఖార్సైన నిబద్ధత కలిగిన ధైర్యశాలి ఆయన.కానీ కాలం క్రూరమైనది.. అందరికీ అన్నీ అవకాశాలను, తగిన గుర్తింపును ఇవ్వకపోవచ్చు. 
జీవితాంతం కష్టనష్టాలు, అవమానాలు చిరునవ్వుతో భరిస్తూ నమ్మిన సిద్ధాంతానికే అంకితమైనప్పటికీ, ఆయనకు ఆశించిన స్థాయిలో తగిన గుర్తింపు, ప్రాతినిధ్యం దక్కకపోవడం నిజంగా విచారకరం. కానీ పదవులు, పార్టీల గుర్తింపు కంటే మిన్నగా సమకాలీనుల, తోటి కార్యకర్తల గుండెల్లో భాస్కర్ అన్న అంటే ఏనుగంత బలం, అపారమైన విశ్వాసం, ఆయన ఒక టైగర్; అపారమైన ప్రేమను పంచే ఒక స్వచ్ఛమైన నిష్కల్మషమైన నాయకుడు.ఈ రోజు ఆయన ఇక లేరనే వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన మరణం తీరని లోటు. అశ్రునయనాలతో మా ప్రియతమ భాస్కర్ అన్నకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
జోహార్ భాస్కర్ అన్న!🙏

పాట్ మార్కెట్‌లో బెంగాలీ కార్మికుల క్రికెట్ జోష్.. రాక్ స్టార్‌పై రాయల్ స్టార్ ఘన విజయం!_

*విశ్వకర్మ జయంతికి క్రీడా కిరీటం!*

*పాట్ మార్కెట్‌లో బెంగాలీ కార్మికుల క్రికెట్ జోష్.. రాక్ స్టార్‌పై రాయల్ స్టార్ ఘన విజయం!*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 19:

విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ పాట్ మార్కెట్‌లో పనిచేస్తున్న బెంగాలీ కార్మికుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఏకే టోర్నమెంట్ ఆధ్వర్యంలో అన్సర్ అలీ మాలిక్ నేతృత్వంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. పలు జట్లు పోటాపోటీగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నాయి.

**ముఖ్య అతిథులుగా 95 న్యూస్ ప్రతినిధులు**

ఈ కార్యక్రమానికి 95 న్యూస్ ఛానల్ చైర్మన్ ఎస్కే సిరాజుల్, 95 న్యూస్ బ్యూరో హెడ్ ఖమ్మం పార్టీ సాయి చంద్ర గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడాకారులను అభినందించారు. టోర్నమెంట్‌ను వీక్షిస్తూ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, సమిష్టి భావనను అలవర్చుకోవాలని సూచించారు.

**రాక్ స్టార్ – రాయల్ స్టార్ మధ్య హోరాహోరీ పోరు**

టోర్నమెంట్‌లో భాగంగా రాక్ స్టార్, రాయల్ స్టార్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్ల క్రీడాకారులు విజయం కోసం హోరాహోరీగా పోరాడటంతో మ్యాచ్‌ను తిలకించిన అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. చివరకు రాయల్ స్టార్ జట్టు విజయం సాధించడంతో క్రీడాకారులు, అభిమానులు, నిర్వాహకుల్లో సంబరాలు నెలకొన్నాయి.

**యువతలో క్రీడా స్ఫూర్తి పెంపే లక్ష్యం**

ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇలాంటి క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తున్న అన్సర్ అలీ మాలిక్‌కు టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల మధ్య స్నేహభావం, ఐక్యతను పెంపొందించడంతో పాటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఇలాంటి టోర్నమెంట్లు దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా అన్సర్ అలీ మాలిక్ మాట్లాడుతూ.. యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు, క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఏకే టోర్నమెంట్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తామని తెలిపారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.విశ్వకర్మ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్‌తో పాట్ మార్కెట్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. క్రీడాకారులు, నిర్వాహకులు, అభిమానుల సందడితో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

మాజీ మేయర్ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ కాంస్య విగ్రహాన్ని అంబర్ పేట లో ఏర్పాటు చేయాలి_

*మాజీ మేయర్  కొరివి  కృష్ణ స్వామి ముదిరాజ్  కాంస్య  విగ్రహాన్ని అంబర్ పేట లో ఏర్పాటు చేయాలి*

*కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ లకు వినతి పత్రాలను సమర్పించిన ముదిరాజ్ సంఘం నేతలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 19:

స్వాతంత్ర సమరయోధుడు, మాజీ మేయర్ స్వర్గీయ కొరివి  కృష్ణ స్వామి ముదిరాజ్  కాంస్య  విగ్రహాన్ని అంబర్ పేటలో ఏర్పాటు చేయాలని ముదిరాజ్ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అంబర్ పేట ముదిరాజ్ సంఘం ప్రతినిధులు శనివారం కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ లను కలిసి  వినతి పత్రాలను సమర్పించారు. స్వాతంత్ర పోరాటంలో  కృష్ణ స్వామి ముదిరాజ్  కీలకపాత్ర పోషించారని, అదేవిధంగా  హైదరాబాద్ నగర మొట్టమొదటి మేయర్ గా నగర అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి ఆయన ఎంతో కృషి చేశారని వారు పేర్కొన్నారు. జర్నలిస్టుగా పత్రికా రంగంలో ఆయన ఎనలేని సేవలందించారని,ఎన్నో పుస్తకాలను ఆయన రచించారని  వారు గుర్తు చేశారు. ఆ మహనీయుడి విగ్రహాన్ని అంబర్ పేట చే నెంబర్ చౌరస్తా, శ్రీ రమణ చౌరస్తా, అలీ కేఫ్ చౌరస్తా మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా ఏర్పాటు చేయగలరని వారు కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సతీష్ ముదిరాజ్, చింతల శ్రీనివాస్ ముదిరాజ్, చింతల శ్రీనివాస్  ముదిరాజ్,గిరవేణి మహేష్ ముదిరాజ్, తవిటి వెంకటేష్ ముదిరాజ్ , కృష్ణంరాజు ముదిరాజ్, వి.లక్ష్మి ముదిరాజ్,డి.భరత్ ముదిరాజ్,శాతం సూరి ముదిరాజ్,డొప్ప అంజయ్య, ఎన్.మహేష్ 
గోవింద్  మురళి, గోవింద్ అర్జున్, మోర బోజీ ముదిరాజ్, మోర నాగులు, జిట్టా కృష్ణ, తూర్పు దీక్షిత్ ముదిరాజ్ లు తదితరులు పాల్గొన్నారు.

వివాహం బానిసత్వం కాదు… ఇద్దరు సమాన వ్యక్తుల జీవిత భాగస్వామ్యం - వి. రవికృష్ణ, న్యాయవాది, సామజిక కార్యకర్త_

*వివాహం బానిసత్వం కాదు… ఇద్దరు సమాన వ్యక్తుల జీవిత భాగస్వామ్యం - వి. రవికృష్ణ, న్యాయవాది, సామజిక కార్యకర్త*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 19:

వివాహం అంటే ఒక వ్యక్తి మరొకరిపై అధికారం సంపాదించడం కాదు. రెండు వేర్వేరు కుటుంబాల్లో, వేర్వేరు పరిస్థితుల్లో, వేర్వేరు ఆలోచనలతో పెరిగిన ఇద్దరు వ్యక్తులు పరస్పర ప్రేమ, నమ్మకం, గౌరవం, బాధ్యతతో కలిసి జీవితాన్ని నిర్మించుకోవడానికి ఏర్పడే పవిత్రమైన బంధం. భర్త యజమాని కాదు… భార్య బానిస కాదు. ఇద్దరూ సమానమైన జీవిత భాగస్వాములు.మన ఆడపిల్లలను చదివిస్తున్నాం, ఉద్యోగాలు చేయిస్తున్నాం, ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటున్నాం. కానీ అదే సమయంలో మన మగపిల్లలకు స్త్రీని తనతో సమానమైన వ్యక్తిగా గౌరవించడం ఎంతవరకు నేర్పిస్తున్నాం అనే ప్రశ్న ప్రతి తల్లిదండ్రులు తమను తాము వేసుకోవాలి.మగతనం అంటే ఆధిపత్యం కాదు. భార్య తన అభిప్రాయం చెప్పడం అవిధేయత కాదు. ఆమె స్వతంత్రంగా ఆలోచించడం అహంకారం కాదు. భార్య ఉద్యోగం, స్నేహాలు, అభిరుచులు, వ్యక్తిత్వం, ఆమె తల్లిదండ్రులతో ఉన్న అనుబంధం, ఇవన్నీ వివాహం జరిగిన రోజుతో అంతరించిపోవు. తాళి కట్టడం ద్వారా ఒక స్త్రీపై యాజమాన్య హక్కు ఎవరికీ సంక్రమించదు. అలాగే కట్నం అనే ఆలోచననే మనం ప్రశ్నించాలి. ఒక అమ్మాయిని పెంచి, చదివించి, జీవితంలో నిలబడేలా చేసిన ఆమె తల్లిదండ్రులు, ఆమెకు పెళ్లి చేస్తున్నందుకు మళ్లీ అబ్బాయి కుటుంబానికి లక్షల రూపాయలు, బంగారం, కారు, ఆస్తులు ఎందుకు ఇవ్వాలి? కూతురికి పెళ్లి చేస్తున్నారా? లేక డబ్బు చెల్లించి వరుడిని కొనుగోలు చేస్తున్నారా? కూతురు ఆర్థిక భారం కాదు; కొడుకు కూడా పెంచిన ఖర్చును కట్నం రూపంలో తిరిగి వసూలు చేసుకునే పెట్టుబడి కాదు.ప్రతి మగపిల్లవాడి తల్లిదండ్రులు తమలో తాము ఒక మాట అనుకోవాలి: “మా కొడుకును చదివించింది అతను తన కాళ్లపై తాను నిలబడటానికి; అతన్ని పెంచిన ఖర్చును అతను పెళ్లి చేసుకునే అమ్మాయి తల్లిదండ్రుల నుంచి వసూలు చేసుకోవడానికి కాదు.” ఈ ఒక్క ఆలోచన ప్రతి ఇంట్లో బలంగా నాటుకుంటే కట్నం అనే సామాజిక దురాచారం చాలా వరకు అంతరించిపోతుంది.
“సాంప్రదాయం”, “లాంఛనాలు”, “అమ్మాయికి ప్రేమతో ఇస్తున్నాం” అనే పేర్లతో మొదలయ్యే వ్యవహారం కొన్నిసార్లు తరువాత “ఇంకా డబ్బు తీసుకురా, బంగారం తీసుకురా, మీ వాళ్లు ఏమీ ఇవ్వలేదు” అనే వేధింపులకు దారితీస్తుంది. ఒక మహిళ తన అత్తింట్లో గౌరవాన్ని పొందడానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక కూతురికి పెళ్లి చేయడానికి ఆమె తల్లిదండ్రులు జీవితాంతం సంపాదించిన ఆస్తులు అమ్ముకోవడం, అప్పుల పాలవడం కూడా సహజమైన విషయంగా మనం అంగీకరించకూడదు.అదే సమయంలో ఆడపిల్లలకు కూడా “ఏం జరిగినా భరించాలి, సర్దుకుపోవాలి, కుటుంబ పరువు కోసం మౌనంగా ఉండాలి, పెళ్లిని ఎలాగైనా కాపాడుకోవాలి” అని నేర్పించడం మానేయాలి. సర్దుబాటు ఇద్దరిదీ కావాలి; త్యాగం కూడా ఒకరిదే కాకూడదు. ఒకరి ఆత్మగౌరవం, స్వేచ్ఛ, భద్రతను నాశనం చేసి నిలబెట్టే బంధాన్ని విజయవంతమైన వివాహం అనలేం.లింగ సమానత్వం చట్ట పుస్తకాలలోనో, సభలలోనో, సోషల్ మీడియా పోస్టుల్లోనో మొదలవదు, మన ఇంట్లోనే మొదలవుతుంది. తండ్రి తల్లితో ఎలా మాట్లాడుతున్నాడు, తల్లి తండ్రిని ఎలా గౌరవిస్తోంది, ఇంటి పనులను ఎవరు చేస్తున్నారు, కుటుంబ నిర్ణయాల్లో ఎవరి మాటకు విలువ ఉంది, ఎవరి ఉద్యోగం ముఖ్యమని భావిస్తున్నారు, భార్య తల్లిదండ్రులకు భర్త తల్లిదండ్రులతో సమానమైన గౌరవం ఇస్తున్నారా, ఇవన్నీ పిల్లలు నిశ్శబ్దంగా గమనిస్తుంటారు. అదే వారికి వివాహం గురించి మొదటి పాఠం.ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిస్తున్నప్పుడు అభిప్రాయ భేదాలు సహజం. ప్రతి విషయంలో ఇద్దరూ ఒకేలా ఆలోచించడం సాధ్యం కాదు. కానీ విభేదాలను మాట్లాడుకొని పరిష్కరించుకోవడం పరిపక్వత. అవసరమైన చోట ఒకరికొకరు సర్దుబాటు చేసుకోవడం దాంపత్యం. కోపం, అనుమానం, అసూయ, అహం, తిరస్కరణ, వీటిలో ఏదీ అవమానించడానికి, నియంత్రించడానికి, బెదిరించడానికి లేదా హింసించడానికి హక్కు ఇవ్వదు. కలిసి జీవించడం సాధ్యం కాకపోతే కూడా చట్టబద్ధంగా, గౌరవప్రదంగా విడిపోవచ్చు; హింస ఎప్పటికీ పరిష్కారం కాదు.మన కూతురిని పెళ్లి చేసేటప్పుడు “అత్తింట్లో అన్నింటికీ సర్దుకుపోతావా?” అని అడిగే ముందు, మన కొడుకును పెళ్లి చేసేటప్పుడు “నీ భార్యను నీతో సమానమైన మనిషిగా గౌరవిస్తావా?” అని కూడా అడగాలి.పెళ్లి సంబంధం చూస్తున్నప్పుడు “నా బిడ్డకు ఎలాంటి భార్య లేదా భర్త దొరుకుతారు?” అని ఆలోచించడం మాత్రమే కాదు…
“నేను నా బిడ్డను ఎలాంటి భర్తగా లేదా భార్యగా తయారు చేస్తున్నాను?” అని ప్రతి తల్లిదండ్రులు తమను తాము ప్రశ్నించుకోవాలి.వివాహం యాజమాన్యం కాదు.
వివాహం పురుషాధిక్యత కాదు.
వివాహం ఆర్థిక లావాదేవీ కాదు.
వివాహం బానిసత్వం కాదు.
వివాహం ఇద్దరు సమాన వ్యక్తుల జీవిత భాగస్వామ్యం.పిల్లల పెంపకంలో మార్పు రావాలి…
ఆలోచనా విధానంలో మార్పు రావాలి…
అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది.

Saturday, September 19, 2026

ప్రతిపాదిత బహుళ ఫ్లైఓవర్ల నుండి ఒకే ఎలివేటెడ్ కారిడార్ వైపు ప్రభుత్వం మళ్లడానికి గల కారణాలు_

*తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కేబీఆర్ జాతీయ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని నిలిపివేసి,వాటి స్థానంలో ఎలివేటెడ్ కారిడార్‌ ను ఎందుకు ఏర్పాటు చేస్తుంది - సేవ్ కేబీఆర్*

*డీపీఆర్ మరియు పూర్తి వాస్తవ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి - సేవ్ కేబీఆర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 18:

హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) జాతీయ పార్కును మరియు దాని చుట్టూ ఉన్న పర్యావరణ సున్నిత మండలాన్ని (Eco-Sensitive Zone) కాపాడుకోవడానికి పౌరులు, పర్యావరణ ప్రేమికులు 'సేవ్ కేబీఆర్' (#SaveKBR) ఉద్యమాన్ని చేపట్టారు.ప్రభుత్వ ప్రతిపాదిత ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాల (H-CITI / SRDP ప్రాజెక్ట్‌లు) వల్ల వందలాది ఏళ్ల నాటి చెట్లు నరికివేతకు గురవుతుండటంతో ఈ ఆన్‌లైన్ పిటిషన్ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది.కేబీఆర్ జాతీయ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని నిలిపివేసి, వాటి స్థానంలో ఎలివేటెడ్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై స్పందించాలని చాలా మీడియా సంస్థలు సేవ్ కేబీఆర్ (SaveKBR) బృందాన్ని అడిగారు.దీనిపై సేవ్ కేబీఆర్ ఇచ్చిన వివరణ.

**ప్రతిపాదిత బహుళ ఫ్లైఓవర్ల నుండి ఒకే ఎలివేటెడ్ కారిడార్ వైపు ప్రభుత్వం మళ్లడానికి గల కారణాలు:**

*(1)*: క్షేత్రస్థాయిలో పౌరుల నిరంతర ప్రతిఘటన,

*(2)*: సుప్రీంకోర్టు జోక్యం - కేబీఆర్ జాతీయ పార్క్ చుట్టూ ఉన్న 25–35 మీటర్ల పర్యావరణ సున్నిత ప్రాంతం (ESZ)లో చెట్లను నరకడాన్ని నిరోధిస్తూ, కాజల్ మహేశ్వరి వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో ఎస్ఎల్పీ (సి) నెం. 17054/2026 కింద సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు ఇప్పటికీ అమలులో ఉంది.

*(3)*: ప్రభావిత భూ యజమానులు హైకోర్టులో వేసిన న్యాయపరమైన సవాళ్లు.

అయితే, అది ఒక ఎలివేటెడ్ కారిడార్ అయినా లేదా బహుళ ఫ్లైఓవర్లు అయినా, ఎప్పటిలాగే జవాబుదారీతనం విషయంలో రాజీ పడకూడదు. రాష్ట్ర ప్రభుత్వం మరియు జీహెచ్‌ఎంసీ ముందుకు వెళ్లే ముందు డీపీఆర్, వివరణాత్మక ట్రాఫిక్ అధ్యయనాలు, పర్యావరణ అంచనాలు మరియు వాటికి మద్దతుగా ఉన్న సాంకేతిక అధ్యయనాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
ప్రజా ఖజానా ఇప్పటికే గణనీయమైన ఖర్చులను భరించిన తర్వాత, దాదాపు 1,000 చెట్లు నష్టపోయిన తర్వాత, న్యాయం కోసం పౌరులు తమ వ్యక్తిగత సమయాన్ని, శక్తిని, నిధులను కోర్టు కేసులపై వెచ్చించిన తర్వాత - కొత్త ప్రతిపాదన యొక్క అవసరాన్ని, సాధ్యతను మరియు పర్యావరణ పరిణామాలను నిర్ధారించకుండా, కేవలం తాము ఆందోళన చెందుతున్నామని చెప్పి, డిజైన్‌ను మార్చి ముందుకు సాగడం జీహెచ్‌ఎంసీ మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు తగదు.ఇది కేవలం ఒక ఫ్లైఓవర్ లేదా ఒక కారిడార్‌కు సంబంధించిన విషయం కాదు. పర్యావరణ సున్నిత మండలాన్ని (ESZ) ప్రభావితం చేసే ఏ ప్రాజెక్టుతోనైనా ముందుకు వెళ్లే ముందు, ప్రభుత్వం ఇప్పుడు పారదర్శకమైన, శాస్త్రీయమైన మరియు చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించి, ఆ ప్రాంతంపై సుప్రీంకోర్టు విచారణల ఫలితాన్ని గౌరవిస్తుందా లేదా అనేదే అసలు విషయం.

ఎన్నికల అఫిడవిట్ తో అడ్డంగా దొరికిన కల్వకుంట్ల ముఠా - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి_

*సున్నా ఎకరాల నుండి  వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్*

*ఎన్నికల అఫిడవిట్ తో అడ్డంగా దొరికిన కల్వకుంట్ల ముఠా - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 17:

తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ లోక్ సభ ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపిన కేసీఆర్ గారికి, ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయి..?.తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తరువాత అధికారంలో ఉన్న పదేండ్లలో కేసీఆర్ గారికి భూములు భారీగా పెరిగిన విషయం, స్వయంగా కేసీఆర్ గారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ల ద్వారా స్పష్టమవుతుంది.బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమకారులకు అప్పులే మిగిలాయి, కానీ కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయి..? ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం ద్వారానే కదా..! ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద లక్షల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించుకున్న కల్వకుంట్ల కుటుంబం..పుట్టుకతోనే కేసీఆర్ గారికి వందల ఎకరాలు ఉన్నాయని బొంకుతున్న డ్రామారావు, ఎన్నికల అఫిడవిట్ లో తప్పులు రాసి మోసం చేసారా? లేక, ప్రజలకు అబద్దాలు చెప్తున్నారా...?

చరిత్రను రాజకీయ ప్రయోజనాలకు కాకుండా... భవిష్యత్ తరాలకు అందిద్దాం-యంపల్ల పురుషోత్తం రెడ్డి - చైర్మన్, తెలంగాణ జేఏసీ, నల్లగొండ జిల్లా_

ప్రెస్ నోట్ 

*చరిత్రను రాజకీయ ప్రయోజనాలకు కాకుండా... భవిష్యత్ తరాలకు అందిద్దాం*

*యంపల్ల పురుషోత్తం రెడ్డి -  చైర్మన్, తెలంగాణ జేఏసీ, నల్లగొండ జిల్లా*

బాపట్ల కృష్ణమోహన్, సెప్టెంబర్ 17:

చరిత్రలో ఒక కీలకమైన చారిత్రక ఘట్టం. ఈ రోజును విలీన దినోత్సవం, విమోచన దినోత్సవం, జాతీయ సమైక్యత దినోత్సవం, ప్రజా పాలన దినోత్సవం వంటి భిన్న పేర్లతో వివిధ రాజకీయ పక్షాలు, సంస్థలు తమ తమ దృక్పథాల మేరకు గుర్తిస్తున్నాయి.భిన్న అభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో సహజమే.అయితే చారిత్రక ఘటనలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు, రాజకీయ ప్రయోజనాలకు లేదా పరస్పర ఆరోపణలకు పరిమితం చేయడం మాత్రం సమాజానికి మేలు చేయదు.1948 నాటి పరిణామాలను రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకుని చెప్పడం కాకుండా, ఆ కాలం నాటి సమగ్ర చరిత్రను ప్రజల ముందుంచాలి. నిజాం పాలన, రజాకార్ల పాత్ర, తెలంగాణ రైతాంగ పోరాటం, ప్రజల త్యాగాలు, భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం ఏకీకరణకు దారితీసిన పరిణామాలు — చరిత్రలోని ప్రతి కోణాన్ని ఆధారాలతో ప్రజలకు, ముఖ్యంగా నేటి యువతకు అందించాలి.

**తెలంగాణ జేఏసీ కార్యాచరణ పిలుపు**

ఈ నేపథ్యంలో తెలంగాణ జేఏసీ తరఫున ప్రజలకు, మేధావులకు, చరిత్రకారులకు, విద్యావేత్తలకు, యువతకు మా విజ్ఞప్తి:

*(1)*: చరిత్రపై చర్చ జరగాలి... కానీ చరిత్ర వక్రీకరణకు తావుండకూడదు.

*(2)*: భిన్న అభిప్రాయాలు ఉండాలి... కానీ పరస్పర ద్వేషానికి తావుండకూడదు.

*(3)*: రాజకీయ కార్యక్రమాలు జరగవచ్చు... కానీ చరిత్రను ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం చేయకూడదు.

*(4)*: ప్రతి గ్రామం, మండలం, పట్టణంలో రాజకీయాలకు అతీతంగా చారిత్రక చర్చలు, సదస్సులు నిర్వహించాలి. పాత పత్రాలు, అరుదైన ఫొటోలు, ప్రత్యక్ష సాక్షుల జ్ఞాపకాలు, చారిత్రక ఆధారాలను సేకరించి భద్రపరచాలి. విద్యార్థులు, యువత చరిత్రపై అధ్యయనం చేసి వాస్తవాలను తెలుసుకునేలా ప్రోత్సహించాలి.

*(5)*: సోషల్ మీడియాలో ఆధారాలు లేని ప్రచారాన్ని నమ్మకుండా, చారిత్రక ఆధారాలతో నిజానిజాలను పరిశీలించే బాధ్యతాయుతమైన పౌర సంస్కృతిని పెంపొందించాలి.

**చరిత్ర ఎవరి సొత్తు కాదు**

సెప్టెంబర్ 17 ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదు. ఏ ఒక్క వర్గానికి చెందినది కాదు. అది తెలంగాణ ప్రజల చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం.అందుకే ఈ చారిత్రక రోజును రాజకీయ విభేదాలకు వేదికగా కాకుండా, చరిత్రను తెలుసుకునే, త్యాగాలను స్మరించుకునే, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే సందర్భంగా మలచాలి.ఓట్ల కోసం చరిత్రను ఉపయోగించకండి...
చరిత్ర నుంచి భవిష్యత్ తరాలు నేర్చుకునేలా చేయండి. రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను మలచకండి...
వాస్తవ చరిత్రను రేపటి తరాలకు అందించండి.చరిత్రను మనకు అనుకూలంగా మార్చుకోవడం కాదు...చరిత్ర నుంచి మనల్ని మనం తెలుసుకోవడం ముఖ్యం.
వాస్తవాలను తెలుసుకుందాం.
భిన్న దృక్పథాలను గౌరవిద్దాం.
చారిత్రక ఆధారాలను పరిరక్షిద్దాం.రేపటి తరాలకు వాస్తవ చరిత్రను అందిద్దాం.
ఇదే తెలంగాణ జేఏసీ ప్రజలకు ఇస్తున్న పిలుపు.

తెలంగాణ ఉద్యమంలో విశ్వకర్మల పాత్ర అనిర్వచనీయం - ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్_

*తెలంగాణ ఉద్యమంలో విశ్వకర్మల పాత్ర అనిర్వచనీయం - ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 17:

ఉప్పల్ బాగాయత్ లోని తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ విశ్వకర్మలు కేవలం సృష్టికర్తలే కాదు… నవనాగరికత, ప్రగతి చోదకులు అని అన్నారు.సబ్బండ వర్గాలకు, ఉత్పత్తి కులాలకు ఆరాధ్య దైవం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు
 మారుతున్న కాలానికి అనుగుణంగా చేతివృత్తుల్లో సాంకేతిక నైపుణ్యం, వ్యాపార మెళకువలు పెంచుకోవాలి. రాజకీయ చైతన్యంతోనే శాసన నిర్మాణంలో భాగస్వామ్యం, హక్కుల సాధన సాధ్యం.సృష్టి నిర్మాణానికే కాక నవనాగరికత, ఆధునిక ప్రగతికి విశ్వకర్మలే ఆద్యులని, సబ్బండ వర్గాలకు, సమస్త ఉత్పత్తి కులాలకు విశ్వకర్మ భగవానుడే మూలకారకుడని తెలంగాణ శాసనమండలి సభ్యులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం / వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా డాక్టర్ దాసోజు శ్రవణ్ కీలక అంశాలను ప్రస్తావించారు:సృష్టికి మూలకారకులు: బ్రహ్మ ఆలోచన చేస్తే, ఆ ఆలోచనకు క్రియారూపం ఇచ్చి, జీవం పోసి సృష్టిని నిలబెట్టిన మహోన్నతుడు విశ్వకర్మ భగవానుడు. బంగారం, లోహం, చెక్క, శిల్పం, వస్త్రం ఇలా ఏ ఉత్పత్తి రంగమైనా సృష్టికి జీవం పోసింది విశ్వకర్మలేనని, సమాజంలోని సమస్త ఉత్పత్తి కులాలకు ఆయనే ఆరాధ్య దైవమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో విశ్వకర్మల పాత్ర అనిర్వచనీయం: తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకులు, బరిశెలు తయారు చేసి పోరాటానికి ఆయుధాలు సమకూర్చిన ఘనత విశ్వకర్మలదేనని గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో 'తెలంగాణ జనసభ' ద్వారా వెయ్యికి పైగా సభలు పెట్టి ఉద్యమించిన మారోజు వీరన్న, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, ప్రాణత్యాగం చేసిన అమరుడు కాసోజు శ్రీకాంతాచారి, ఉద్యమంలో కీలకంగా నిలిచిన సిరికొండ మధుసూదనాచారి వంటి విశ్వకర్మ బిడ్డల పాత్ర ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు.వృత్తులపై దాడి – వ్యాపార మెళకువల ఆవశ్యకత: మార్కెట్ ఎకానమీ, సాంకేతిక మార్పుల వల్ల ఒకప్పుడు సమాజాన్ని శాసించిన విశ్వకర్మలు నేడు యాచన చేసే దుస్థితికి చేరడం బాధాకరమన్నారు. టాటాలు, బిర్లాల వంటి బహుళజాతి సంస్థల వ్యాపార ధోరణి వల్ల పుస్తెమెట్టెల నుంచి కలప పనుల దాకా సంప్రదాయ చేతివృత్తులన్నీ దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2000 సంవత్సరంలో 'కుబుసం' చిత్రంలో గోరేటి వెంకన్న రాసిన 'పల్లె కన్నీరు పెడుతుందో' పాట నాటి పరిస్థితి నుంచి నేటికీ గ్రామీణ చేతివృత్తుల బతుకుల్లో పెద్ద మార్పు రాలేదని గుర్తుచేశారు.విద్యతో పాటు విత్తం, రాజ్యాధికారం: విశ్వకర్మల వద్ద అపారమైన నైపుణ్యం, విద్య ఉన్నప్పటికీ, దానిని వ్యాపారంగా మార్చే యుక్తిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని స్వయంగా పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. విద్యకు విత్తం (ఆర్థిక శక్తి) తోడవ్వాలని, ఆ ఆర్థిక బలం రాజకీయ అధికారంగా మారినప్పుడే మన సమస్యలకు మనమే చట్టాలు చేసుకోగలమని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో ఉన్న నాయకులు రాబోయే రోజుల్లో శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు బాణాల నారాయణాచారి, ప్రధాన కార్యదర్శి నాగారం భాస్కరాచారి, కోషాధికారి మహేశ్వరం వేణుగోపాలాచారి, బీసీ ఉద్యమ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్, భవన నిర్మాణ దాతలు బ్రహ్మశ్రీ జి.ఆర్. సూర్యరాజు, కుందారం గణేశాచారి, వేములవాడ మదన్మోహన్, బొడ్డుపల్లి సుందర్, వెంజమూరి రాఘవాచారి, బొడ్డుపల్లి రవి ప్రశాంతాచార్య, రాగిపల్లి రవీంద్రాచారి, ఎర్రోజు వేణుగోపాల్, దానకర్ణాచారి, తదితరులు పాల్గొన్నారు.

Wednesday, September 16, 2026

జర్నలిస్టులు పిరికి వాళ్ళా.? నాటి దుమ్ము , ధైర్యం ఎక్కడికి పోయింది. డబ్బు సంపాదించిన వాడి చేతుల్లో కీలుబొమ్మలు అయ్యారా?_

*_ఇదే 'నా' జర్నలిజం_*
ఈడీ భారీ దాడులపై *_తెలుగు మీడియా సైలెన్స్ దేనికి రా..?_*
_# యాజమాన్య పాదాల కింద నలుగుతున్న వైనాలు_
_# కొండెక్కిన గుండె ధైర్యం_
_# దమ్మున్నోళ్ళు ఎక్కడ.?_

_(తెలుగు జర్నలిజంపై ఈ దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు, 9440000009 అందిస్తున్న సంచలన కథనం)_

జర్నలిస్టులు పిరికి వాళ్ళా.? నాటి దుమ్ము , ధైర్యం ఎక్కడికి పోయింది. 
డబ్బు సంపాదించిన వాడి చేతుల్లో కీలుబొమ్మలు అయ్యారా.? అంతరాత్మ ఎక్కడికి పోయింది.? బట్ నేను..నేనే. నన్ను కొనెటోడు లేడు. పుట్టలేదు. కేసులు 'వెంట్రుక'తో సమానం‌. జైళ్ళ గోడలు బద్దలు కొట్టుకొని.. 'ఫాంహౌజ్ పశుపతి'ని పడుకోపెట్టిన 'నా' జర్నలిజం ఇంతే ఉంటది. నాకు దుమ్ము, ధైర్యం ఉంది. అందుకే 'తెలుగు జర్నలిస్టు'ల తరఫున 'నా' కథనం ఇలాగే ఉంటుంది ర్రా.. రాజకీయుల్లారా.! 'యూజ్ లెస్ ఫేలోస్'.

*_గ్రూప్‌పై ఈడీ దాడులు, రుణాల మోసం & మీడియా సంబంధాలపై సమగ్ర కథనం…:_*
AMR సంస్థ పై ఈడీ రైడ్స్ కి సంబంధించి తెలుగు దినపత్రికల్లో ఎక్కడా వార్తలు రాయడం లేదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు చేసిన ట్వీట్ చూసి ఆశ్చర్యం వేసింది ..

*_ఏందిరా ఇది.!:_*
'ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఇది తెలుగు మీడియాలో ఎందుకు హైలెట్ కాలేదు' అని స్టడీ చేస్తే . . ఆ సంస్థ యజమానికి తెలుగు మీడియా సంస్థల యజమానులకు ఉన్న ఆర్ధిక సంబంధాలపై సమాచారం తెలిసింది.

*_మాకేం తెల్వద్.. కన్పించద్_*
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్ సంస్థ AMR ఇండియా లిమిటెడ్ (AMR India Limited), దాని ప్రమోటర్ అల్తురు మహేష్ కుమార్ రెడ్డి (A. Mahesh Reddy) నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దేశవ్యాప్తంగా ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద హైదరాబాద్ (కమలాపురి కాలనీ/బంజారాహిల్స్ పరిసరాలు), కోల్‌కతా, బెంగళూరు, చెన్నై నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు.

*_రుణాల బాగోతం_*
ఈడీ దాడుల వెనుక ప్రధాన కారణాలు & ఆరోపణలు
కోల్‌కతాకు చెందిన NBFCలు అయిన SREI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ (SIFL), SREI ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ (SEFL) నుంచి ఒడిశాకు చెందిన ARSS గ్రూప్, AMR గ్రూప్ భారీగా రుణాలు తీసుకున్నాయి.

*_రూ.919 కోట్లా..?_*
నిబంధనలకు విరుద్ధంగా పొందిన ఈ రుణాలను ప్రాజెక్టుల కోసం కాకుండా ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించడం (Fund diversion), ‘ఎవర్‌గ్రీనింగ్’ పేరిట రౌండ్ ట్రిప్పింగ్ చేయడం, తిరిగి చెల్లించకుండా ఎగవేతకు పాల్పడటం వంటి ఆర్థిక నేరాలపై ఈడీ విచారణ జరుపుతోంది. SREI క్లెయిమ్‌లలో ఒక్క ARSS గ్రూప్‌పైనే దాదాపు ₹919 కోట్ల వివాదం ఉంది.

*_రశీదులు ఇచ్చి మరీ.._*
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని మైనర్ ఖనిజాల రవాణాపై సీనరైజ్ ఫీజు వసూలు చేసేందుకు ‘సీనరైజ్ కలెక్టింగ్ కాంట్రాక్టర్ (SCC)’గా AMR ఇండియా కాంట్రాక్ట్ దక్కించుకుంది (గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో సుమారు 650 చెక్‌పోస్టులు).
ప్రభుత్వ అధికారిక ‘OMEPS’ పోర్టల్ నిబంధనలను ఉల్లంఘించి, AMR సంస్థ సొంత ప్రైవేట్ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా అనధికారిక పర్మిట్లు/ రశీదులు జారీ చేసింది.

*_ఇలా గండి కొట్టి‌.._*
వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన UPI క్యూఆర్ (QR) కోడ్ల ద్వారా, అలాగే నేరుగా నగదు (Cash) రూపంలో మైనింగ్ వ్యాపారుల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారనేది విజిలెన్స్, మైనింగ్ అధికారుల ప్రధాన ఆరోపణ. తాజా సోదాల్లో మహేష్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల నుంచి మెర్సిడెస్- మేబ్యాక్, లెక్సస్, ఫెరారీ, లంబోర్ఘిని, నిస్సాన్ జీటీఆర్ వంటి సుమారు 11 అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను అధికారులు గుర్తించి, నిధుల మూలాలపై దర్యాప్తు చేస్తున్నారు.

*_రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలు & మీడియా మౌనం_*
ఈడీ సోదాలు, AMR సంస్థ అక్రమాల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ABV) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

*_ప్రధాన మీడియా మౌనం…:_*
జాతీయ స్థాయిలో ఈడీ ఇంత భారీ ఎత్తున సోదాలు జరిపి, వందల కోట్ల అక్రమ నగదు లావాదేవీలు, లగ్జరీ కార్ల సీజ్ వ్యవహారాలు బయటపెడుతున్నా… తెలుగు ప్రధాన దినపత్రికలు, ప్రముఖ న్యూస్ ఛానెళ్లు దీనిని కావాలనే తొక్కిపెట్టాయని ఆయన ఆక్షేపించారు. ఏ ఒక్క ప్రధాన ఛానెల్‌లోనూ దీనిపై సరైన చర్చగానీ, హెడ్‌లైన్స్ గానీ రాలేదని ఆయన వేలెత్తి చూపారు.

*_మీడియా యజమానులతో సంబంధాలు & నిధుల ప్రవాహం…:_*
AMR సంస్థ ప్రమోటర్లకు ప్రధాన తెలుగు మీడియా సంస్థలు, పలు టీవీ ఛానెళ్ల మేనేజ్‌మెంట్లు/ యజమానులతో ప్రత్యక్ష, పరోక్ష వ్యాపార బంధాలు ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. AMR గ్రూప్ నుంచి అడ్వర్టైజ్‌మెంట్లు, పెట్టుబడులు, స్పాన్సర్‌షిప్‌లు లేదా ఇతర ఆర్థిక రూపాల్లో మీడియా సంస్థలకు నిధులు మళ్లడం వల్లనే… ఈడీ దాడుల విషయాన్ని కప్పిపుచ్చుతూ వార్తలను బ్లాక్ చేశారనే అంశాన్ని ఆయన బహిర్గతం చేశారు.

*_అంతా 'వెధవ'ల రాజకీయమే..!_*
రాజకీయ అండదండలు, మీడియా సంస్థల భాగస్వామ్యంతోనే గత ప్రభుత్వంలో మొదలైన ఈ అక్రమ వసూళ్ల వ్యవహారం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారుల నివేదికలు ఉన్నప్పటికీ సజావుగా విచారణ జరగకుండా అడ్డుకోగలుగుతున్నారని ఆయన విమర్శించారు. ఇంగ్లీష్ ప్రధాన పత్రికలైన డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హన్స్ ఇండియా తదితర పత్రికలు ఈ ఆర్థిక మోసం, నిధుల మళ్లింపు, కోల్‌కతా ఈడీ బృందం జరిపిన తనిఖీల వివరాలను వెలుగులోకి తీసుకురాగా, తెలుగు మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో ఈ వార్త మాయమవడం విచిత్రం…

Monday, September 14, 2026

మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి_

*"మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి"*

*శ్రీనిధి మహిళా ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ - బాపట్ల పుష్పలత*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 13:

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించి భక్తిశ్రద్దలతో పూజించాలని శ్రీనిధి మహిళా ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బాపట్ల పుష్పలత అన్నారు.హెచఎండిఏ సహకారంతో హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం( హైదరాబాద్ జిందాబాద్)మరియు శ్రీనిధి మహిళా ఫౌండేషన్ మరియు ప్రజాసంకల్పం స్వచ్చంద సంస్థ / ప్రజాసంకల్పం మీడియా ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గత పది సంవత్సరాలనుండి మట్టి గణపతుల ఉచిత పంపిణి చేస్తున్నాము అని అన్నారు.రామంతాపూర్ చిన్నచెరువు కట్ట కింద భరత్ నగర్ క్రాస్ రోడ్డు లో మరియు ఆర్టీసి కాలనీలో మట్టి విగ్రహాల పంపిణీ చేశారు. ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించే విధంగా అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాము అని అన్నారు.హెచ్ఎండిఏ ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నదని అన్నారు.హైదరాబాద్ జిందాబాద్, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (HCF) సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టించడం వలన నగరంలో హుస్సేన్ సాగర్ మరియు  చెరువులు కుంటలు కాలుష్యానికి గురవుతున్నాయని, పర్యావరణానికి హానికరం కాని మట్టి గణపతి విగ్రహాలనే  ప్రతిష్టించాలని పిలుపు నిచ్చారు. నగరంలో  వైభవంగా  నిర్వహించుకొనే  “వినాయక చవితి” పండుగ  సందర్భంగా  అందరూ ఇండ్లలోనూ, అపార్ట్‌మెంట్స్, కాలనీ, బస్తీలలో సామూహికంగాను మట్టి గణపతి విగ్రహాలను  ప్రతిష్టించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజెన్  రాలపళ్ళి కుసుమ మేడం,సరిత,ప్రజావాణి సంస్థ ఫౌండర్ ఎర్రం శ్రీనివాస్, రవీందర్ రావు, పోలిశెట్టి సత్యనారాయణ,ముదిగొండ శివ ప్రసాద్,సాయి వర్ధన్, మండల శివకుమార్,వెంకటేష్,బాపట్ల కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖ, ఫైర్ సేఫ్టీ రికార్డుల్లో అసలు వివరాలేమిటి?_

*హబ్సిగూడ ‘యోధ’ అపార్ట్‌మెంట్‌పై ప్రశ్నల వర్షం!*

- ఓసీ జారీ అయిందా? లేకుండానే ఫ్లాట్లలో నివాసం ఎలా?

- దాదాపు 20 ఫ్లాట్లు.. ఒకే విద్యుత్‌ మీటర్‌పై రూ.20–30 వేల బిల్లు ఎలా?

- నీటి కనెక్షన్‌కు ఏ పత్రాలు ఆధారం?.. లిఫ్ట్‌ విద్యుత్‌ సరఫరాపైనా సందేహాలు

- జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖ, ఫైర్ సేఫ్టీ రికార్డుల్లో అసలు వివరాలేమిటి?

మేడ్చల్ బ్యూరో సురేష్ ఇడపాక, హబ్సిగూడ, సెప్టెంబర్‌ 13(మీడియా టుడే): 

హబ్సిగూడ జేఎస్‌ఎన్‌ కాలనీలోని ‘యోధ’ అపార్ట్‌మెంట్‌ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు 20 ఫ్లాట్లు ఉన్న ఈ భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) జారీ అయిందా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేకుండానే కొన్ని ఫ్లాట్లలో కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు స్థానికుల నుంచి సమాచారం అందుతోంది. దీంతో భవన నిర్మాణ అనుమతులు, ఓసీ, నీటి, ఫైర్ సేఫ్టీ,విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించిన అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

**ఓసీ జారీ అయిందా?**

భవన నిర్మాణానికి ఏ అనుమతులు మంజూరయ్యాయి? ఆమోదిత ప్లాన్‌ ప్రకారమే నిర్మాణం జరిగిందా? ఓసీ కోసం దరఖాస్తు చేశారా? చేసి ఉంటే దాని ప్రస్తుత స్థితి ఏమిటి? ఓసీ జారీ కాకముందే భవనంలో నివాసం కొనసాగుతున్నట్లయితే అందుకు సంబంధించిన నిబంధనలు ఏమిటి? అన్న విషయాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

భవనాన్ని అధికారులు ఎప్పుడైనా తనిఖీ చేశారా? నిర్మాణంలో ఏవైనా తేడాలు లేదా ఉల్లంఘనలు గుర్తించారా? నోటీసులు జారీ చేశారా? అన్న వివరాలను అధికారిక రికార్డుల ఆధారంగా వెల్లడించాల్సి ఉంది.

**నీటి కనెక్షన్‌ ఎలా వచ్చింది?**

భవనంలో కుటుంబాలు నివాసం ఉంటున్న నేపథ్యంలో నీటి కనెక్షన్‌ అంశం కూడా ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 20 ఫ్లాట్లకు నీటి సరఫరా కోసం కనెక్షన్‌ ఎప్పుడు మంజూరైంది? ఏ కేటగిరీలో ఇచ్చారు? కనెక్షన్‌ మంజూరు సమయంలో భవన నిర్మాణ అనుమతులు, ఓసీ లేదా ఇతర అవసరమైన పత్రాలను పరిశీలించారా? అన్న ప్రశ్నలకు వాటర్‌ వర్క్స్‌ అధికారులు సమాధానం ఇవ్వాల్సి ఉంది.

నీటి కనెక్షన్‌కు సంబంధించిన దరఖాస్తు, మంజూరు పత్రాలు, కనెక్షన్‌ నంబర్‌, కేటగిరీ తదితర వివరాలను అధికారులు పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

**దాదాపు 20 ఫ్లాట్లు.. మీటర్‌ ఒక్కటేనా?**

అపార్ట్‌మెంట్‌లో ప్రస్తుతం సుమారు ఐదు ఫ్లాట్లలో కుటుంబాలు నివసిస్తున్నట్లు సమాచారం. అయితే భవనానికి ఒకే విద్యుత్‌ మీటర్‌ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ మీటర్‌కు నెలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు విద్యుత్‌ బిల్లు వస్తున్నట్లు సమాచారం. అదే విద్యుత్‌ సరఫరా నుంచి లిఫ్ట్‌ కూడా పనిచేస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

ఇది వాస్తవమైతే.. దాదాపు 20 ఫ్లాట్లకు ఎన్ని విద్యుత్‌ కనెక్షన్లు మంజూరయ్యాయి? ప్రస్తుతం ఉన్న మీటర్‌ ఏ కేటగిరీకి చెందినది? ఒకే మీటర్‌ ద్వారా పలు ఫ్లాట్లకు విద్యుత్‌ సరఫరా జరుగుతోందా? లిఫ్ట్‌కు కూడా అదే కనెక్షన్‌ నుంచి విద్యుత్‌ వినియోగిస్తున్నారా? అన్న అంశాలపై విద్యుత్‌ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

నెలకు రూ.20–30 వేల వరకు బిల్లు నమోదవుతున్నట్లయితే ఆ మీటర్‌ వినియోగ వివరాలు, కనెక్షన్‌ కేటగిరీ, మీటర్‌ సామర్థ్యం, గత బిల్లింగ్‌ చరిత్ర తదితర అంశాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.

**లిఫ్ట్‌ భద్రతపై తనిఖీలు జరిగాయా?**

అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ వినియోగంలో ఉంటే దానికి సంబంధించిన అనుమతులు, నిర్వహణ, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లిఫ్ట్‌కు విద్యుత్‌ సరఫరా ఏ కనెక్షన్‌ నుంచి జరుగుతోంది? సంబంధిత భద్రతా తనిఖీలు, అనుమతులు ఉన్నాయా? అన్న అంశాలపైనా సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.

**బిల్డర్ ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నారా??**

 ఫైర్ ఎక్స్‌టింగిషర్లు (Fire Extinguishers): ప్రతి ఫ్లోర్‌లో, కారిడార్లలో సులభంగా అందుబాటులో ఉండేలా ఫైర్ ఎక్స్‌టింగిషర్లను ఏర్పాటు చేశారా??. 

**సంబంధిత శాఖలు.. సమాధానాలు ఎక్కడ?**

ఈ వ్యవహారంలో జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. భవన నిర్మాణ అనుమతులు, ఆమోదిత ప్లాన్‌, ఓసీ విషయంలో జీహెచ్‌ఎంసీ.. నీటి కనెక్షన్‌ విషయంలో వాటర్‌ వర్క్స్‌.. విద్యుత్‌ మీటర్‌, కనెక్షన్‌ కేటగిరీ, బిల్లింగ్‌ విషయంలో విద్యుత్‌ శాఖ తమ రికార్డుల ఆధారంగా వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.ఫైర్ సేఫ్టీ అధికారులు NOC ఇచ్చారా ??

భవన నిర్మాణం నుంచి నివాసం ప్రారంభమయ్యే వరకు ఆయా శాఖల అధికారులు ఎప్పుడు తనిఖీలు నిర్వహించారు? ఏ పత్రాలను పరిశీలించారు? ఎలాంటి అనుమతులు మంజూరు చేశారు? ఏవైనా అభ్యంతరాలు లేదా ఉల్లంఘనలు గుర్తించారా? అన్న ప్రశ్నలకు అధికారిక సమాధానాలు అవసరమవుతున్నాయి.

**ఫ్లాట్‌ కొనుగోలుదారులకు సమాచారం ఇచ్చారా?**

జీవితకాల పొదుపుతో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవనానికి సంబంధించిన నిర్మాణ అనుమతులు, ఓసీ పరిస్థితి, నీటి, విద్యుత్‌ కనెక్షన్ల వివరాలు ముందుగానే తెలియజేశారా? ఓసీ ప్రక్రియ పెండింగ్‌లో ఉంటే ఆ విషయం కొనుగోలుదారులకు వెల్లడించారా? స్వాధీనం ఇచ్చే సమయంలో అవసరమైన పత్రాలను పరిశీలించారా? అన్న అంశాలపై కూడా స్పష్టత అవసరం.

భవనానికి సంబంధించిన అనుమతులు, సర్టిఫికెట్లు, కనెక్షన్ల వివరాలపై భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు వాస్తవాలను స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

**అధికారిక రికార్డులు వెల్లడించాలి**

భవన నిర్మాణ అనుమతి, ఆమోదిత ప్లాన్‌, ఓసీ దరఖాస్తు మరియు ప్రస్తుత స్థితి, జారీ చేసిన నోటీసులు, నీటి కనెక్షన్‌ వివరాలు, విద్యుత్‌ మీటర్ల సంఖ్య, కనెక్షన్‌ కేటగిరీ,ఫైర్ సేఫ్టీ అధికారులు NOC ఇచ్చారా??బిల్లింగ్‌ వివరాలు తదితర అంశాలను సంబంధిత శాఖలు రికార్డుల ఆధారంగా వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

**స్పష్టత కావాల్సిన ప్రధాన అంశాలు..**

ఓసీ జారీ అయిందా?
నీటి కనెక్షన్‌ ఏ పత్రాల ఆధారంగా మంజూరైంది?
దాదాపు 20 ఫ్లాట్లకు ఎన్ని విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి?
ఒకే మీటర్‌పై నెలకు రూ.20–30 వేల బిల్లు ఎలా నమోదవుతోంది?
అదే మీటర్‌ నుంచి లిఫ్ట్‌కు కూడా విద్యుత్‌ సరఫరా జరుగుతోందా? ఫైర్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి NOC ఇచ్చారా ??
మూడు శాఖల అధికారులు ఇప్పటివరకు ఏ తనిఖీలు నిర్వహించారు?
ఫ్లాట్‌ కొనుగోలుదారులకు అన్ని అనుమతుల వివరాలు ముందుగానే తెలియజేశారా?

ఈ అంశాలపై జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖల అధికారులు అధికారిక రికార్డుల ఆధారంగా స్పష్టత ఇవ్వడంతో పాటు వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు కోరుతున్నారు.

Saturday, September 12, 2026

హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలి - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి_

*హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలి - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గణేశ్ ఉత్సవాలు పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు.శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో #Hyderabad మహానగరంలో గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ వెం నరేందర్ రెడ్డి, నగర ప్రజాప్రతినిధులు,కమీషనర్ ghmc , సైబరాబాద్ మున్సిపల్ కమీషనర్ , మల్కాజ్గిరి మున్సిపల్ కమీషనర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ ,హైడ్రా కమీషనర్ తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలని కోరారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్వాహకులకు తెలిపారు.ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గణేశ్ ఉత్సవాలకు సంబంధించి గత సంప్రదాయాన్ని పునరుద్ధరించామని చెప్పారు. నిర్వాహకుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తానే సమీక్ష నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.గణేశ్ మండపాలకు అతిథులను ఆహ్వానించిన సందర్భాల్లో ఆ వివరాలను నిర్వాహకులు స్థానిక కమిషనరేట్‌కు అందించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు అనుకోని పరిణామాలు జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు నిర్వాహకులు అందించే సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని, అయితే, మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలని చెప్పారు.
ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.నిమజ్జన ప్రక్రియ సాఫీగా సాగడానికి చెరువుల వద్ద చుట్టూ క్రేన్లను ఏర్పాటు చేయడానికి అనుగుణంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - నల్లకుంట ఇన్స్పెక్టర్ SHO మారుతి ప్రసాద్_

*మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - నల్లకుంట ఇన్స్పెక్టర్ SHO మారుతి ప్రసాద్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

వినాయక చవితి పండుగను, భక్తి శ్రద్దలతో, సంప్రదాయాలతో, పర్యావరణాన్ని కాపాడుకుంటూ జరుపుకుందామని నల్లకుంట ఇన్స్పెక్టర్ మారుతి ప్రసాద్ పిలుపునిచ్చారు.నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ NCA, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం HCF ఆధ్వర్యంలో ఈరోజు నల్లకుంటలో జరిగిన మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మారుతి ప్రసాద్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టించడం వలన నగరంలో హుస్సేన్ సాగర్ మరియు  చెరువులు, కుంటలు కాలుష్యానికి గురవుతున్నాయని, పర్యావరణానికి హానికరం కాని మట్టి గణపతి విగ్రహాలనే  ప్రతిష్టించాలని పిలుపు నిచ్చారు. నగరంలో  వైభవంగా  నిర్వహించుకొనే  “వినాయక చవితి” పండుగ  సందర్భంగా  అందరూ ఇండ్లలోనూ, అపార్ట్‌మెంట్స్, కాలనీ, బస్తీలలో సామూహికంగాను మట్టి గణపతి విగ్రహాలను  ప్రతిష్టించాలని అన్నారు.
కార్యక్రమంలోNCA అధ్యక్షులు వి మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి మోహన్ నాయుడు, పి శ్రీనివాసరావు, HCF ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య, రామకృష్ణారావు, రాజీవ్ కుమార్, డాక్టర్ అమర్నాథ్, సత్యనారాయణ,  కృష్ణ బాబు, కిరణ్, గోపాల్, శివకుమార్, వినోద్, సుకుమార్, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

దళితుల ఇల్లు కూల్చివేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి_

*దళితుల ఇల్లు కూల్చివేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

12 సెప్టెంబర్ 2026, శనివారం నాడు డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ ఆధ్వర్యంలో  మానవ హక్కుల వేదిక కార్యకర్త సంజీవ్, అంబేద్కర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి , హైకోర్టు న్యాయవాది ఎద్దు దివాకర్, సామాజిక కార్యకర్త భాస్కర్ లతో కలిసి గద్వాల జిల్లా, గద్వాల మండలం,రేపల్లె గ్రామాన్ని సందర్శించి దళితుల కూల్చివేత ను పరిశీలించారు. బాధిత కుటుంబంతో గ్రామస్తులతో మాట్లాడి సంఘటన సంబంధించిన వివరాలను సేకరించారు.మాదిగ కులానికి చెందిన అబ్బాయి బోయ కులానికి చెందిన అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకళ్ళను ఒకళ్ళు ఇష్టపడ్డారు. 9 సెప్టెంబర్ 2026 న హైదరాబాద్ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాదులో  మాసబ్ ట్యాంకు  పోలీసులను కలిసి తాము పెళ్లి చేసు కొన్నామని రక్షణ కల్పించాలని కోరారు. ఇరు కుటుంబాలను పోలీసులు పిలిసి కౌన్సిలింగ్ ఇచ్చారు. కులాంతర వివాహం పై  ఆగ్రహించిన కుటుంబ సభ్యులు దాదాపు 15 మంది 10 సెప్టెంబర్ 2026 మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో దళితుడైన రంగముని ఇంటిని గడ్డపారలు, ట్రాక్టర్ తదితర వస్తువులతో కాయకష్టం చేసి దళితులు కట్టుకున్న ఇల్లును నేలమట్టం చేశారు. 10వ తారీఖునే FIR నమోదు చేశారు. 6 మందిని అరెస్ట్ చేశారు. అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. 12 వ తారీఖున డీఎస్పీ మోగులయ్య రేపల్లె గ్రామాన్ని సందర్శించారు. నిజనిర్ధారణ బృందం డీఎస్పీ మొగులయ్యని, గద్వాల రూరల్  సబ్ ఇన్స్పెక్టర్ని కలిసి, దాడిలో పాల్గొన్న అందర్నీ, దాడికి ప్రోత్సహించిన వారందర్నీ గుర్తించి అరెస్ట్ చేయవలసిందిగా కోరింది. FIR లో నమోదు చేసిన సెక్షన్లతో పాటు, ఆస్తి నష్టానికి సంబంధించిన సెక్షన్లు కూడా నమోదు చేయమని కోరింది.ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం ఇల్లు కూల్చివేసిన వేసిన నిందితుల నుండి నష్టపరిహారాన్ని జరిమాన రూపంలో వసూలు చేసి తిరిగి దళితుల ఇల్లు నిర్మించాలని నిజ నిర్ధారణ బృందం  డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం నిందితులను గ్రామానికి దూరంగా ఉంచాలని డిమాండ్ చేశారు. సంఘటన కేవలం బోయలు చేసింది మాత్రమే కాదని దీని వెనుక ఆధిపత్య రెడ్డి వర్గం ప్రోత్సహించినట్లు వివరించారు. వారిని సైతం గుర్తించి చర్యలు తీసుకోవాలని వెంటనే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ గ్రామాన్ని సందర్శించాలని డిమాండ్ చేసింది.

ధర్మో రక్షతి రక్షితః - ఖైరతాబాద్ ధర్మరక్షణ సభ_

*ధర్మో రక్షతి రక్షితః - ఖైరతాబాద్ ధర్మరక్షణ సభ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

ఖైరతాబాద్ ధర్మరక్షణ సభ అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో సంఘ పెద్దలు, ఉత్సవ సమితి పదాధికారులు, కన్వీనర్లు, కేంద్ర కమిటీ సభ్యులు మరియు కో-కన్వీనర్లు పాల్గొన్నారు.
**సమావేశంలోని ముఖ్యాంశాలు:**
 ఉత్సవాల ప్రణాళిక: రాబోయే 47వ సామూహిక గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు.
**ప్రత్యేక సందర్భాలు:** వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరియు హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం ప్రాధాన్యతను సభలో ప్రస్తావించారు.ఘనంగా ఉత్సవాలు: రాబోయే వినాయక నవరాత్రులను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు.

పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి_

*ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు విద్యార్థుల ఖాతాల్లోకి డైరెక్టుగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది*

*పాలిలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ జరుగుతుందనే ప్రచారంపై స్పష్టత ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి*

*పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, పాలిటెక్నిక్ విద్యలో తీసుకొచ్చిన మార్పులు, వాటిపై విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు.. వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా స్పష్టమైన వివరణ ఇచ్చారు. రాష్ట్ర విద్యా విధానంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైన సమాధానమిచ్చి ఆయా వర్గాల్లో నెలకొన్న అనుమానాలు, అపోహలను నివృతి చేశారు.
పాలిలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ జరుగుతుందనే ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. విద్యార్థులు ఎవరి చేతుల్లోనో పావులుగా, కీలుబొమ్మలుగా మారొద్దని కోరారు. ముందు యుగం దూతలుగా మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తున్నామని, నిజాయితీగా వివరాలందించిన కాలేజీల రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడతల వారిగా చెల్లిస్తామని చెప్పారు.ప్రజాప్రభుత్వం విద్యా రంగానికి ఎందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందో సభలో వివరించిన ముఖ్యమంత్రి సభ్యులు లేవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానమిచ్చారు. 
ముఖ్యంగా పాలిటెక్నిక్ కళాశాలలను విద్యాశాఖ పరిధి నుంచి స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీయడానికి కాదని, వారిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకేనని తెలిపారు.
ఈ విషయంలో ఇప్పటికీ అనుమానాలుంటే సభ్యులు, నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, చర్యలు చేపట్టి సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

*“విద్య ఒక్కటే మన జీవితాల్లో వెలుగును తీసుకొస్తుంది” అనే సంపూర్ణ విశ్వాసంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.*

సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులు కాకుండా విద్య లేకపోవడమే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
“తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. కమిషన్ సమర్పించిన నివేదికను పరిశీలించేందుకు కే కేశవరావు గారి నేతృత్వంలో కమిటీని నియమించాం. సభ్యులు, విద్యా రంగ నిపుణులు ఎవరైనా తమ సూచనలు, సలహాలను కమిటీకి అందిస్తే వాటిని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
విద్యాశాఖను ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహించడం ఆ శాఖకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం.  తాను విద్యాశాఖపై ఒక తపనతో పనిచేస్తున్నా. ముఖ్యమంత్రి హోదాలో విద్యాశాఖను సమీక్షిస్తే మొత్తం వ్యవస్థపై సమగ్ర సమీక్ష జరుగుతుంది.2023-24లో గత ప్రభుత్వం విద్యాశాఖకు రూ.19,093 కోట్లు కేటాయించగా, తమ ప్రభుత్వం 2024-25లో రూ.21,292 కోట్లు కేటాయించాం. 2025-26లో రూ.23,108 కోట్లకు, 2026-27లో రూ.26,647 కోట్లకు పెంచాం.  కేవలం మూడేళ్లలోనే విద్యాశాఖ బడ్జెట్‌ను రూ.7,554 కోట్ల మేర పెంచాం” అని ముఖ్యమంత్రి గారు సభ ముందు వివరించారు.

*“తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కేవలం 55 రోజుల్లో 10,006 మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేశాం.*

ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం 7,857 మంది ఉపాధ్యాయులను మాత్రమే నియమించింది” అని పేర్కొన్నారు.“జెన్ జీ ఒక్కటే కాదు. రానున్న జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యా విధానాన్ని రూపొందిస్తున్నాం. “దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది.. తలరాతలను మార్చేది విద్య” అనే నమ్మకంతోనే విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నా. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలను, బెస్ట్ ప్రాక్టీసెస్‌ను తెలంగాణకు తీసుకొచ్చేందుకు, దేశానికి తెలంగాణను ఒక రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం” అని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న ఆదరణ
“విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేల మేర పెరిగిందని సీఎం తెలిపారు. ఇది తన పనితీరుకు నిదర్శనమన్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో రెండున్నరేళ్లకే పిల్లలను చేర్చుకుంటుండగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఐదేళ్ల వయసు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. నర్సరీ, ఎల్‌కేజీతో పాటు ఇంగ్లిష్ మీడియం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్తున్నారు.
అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారిగా ప్రీ-ప్రైమరీ విధానాన్ని ప్రారంభించాం. ఈ ఏడాది 64 వేల మంది విద్యార్థులకు ప్రీ-ప్రైమరీ విద్య అందిస్తున్నాం. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా నాణ్యమైన, పరిశుభ్రమైన బ్రేక్‌ఫాస్ట్, భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు పోషకాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం” అని వివరించారు.

**పాలిటెక్నిక్‌లపై అపోహలు వద్దు**

“పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన జీఓ ఎంఎస్ నెం.97పై కొన్ని వివాదాలు తలెత్తాయని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తారనే ప్రచారాన్ని తోసిపుచ్చారు. “పాలిటెక్నిక్ కళాశాలల ప్రైవేటీకరణ అనే ప్రసక్తే లేదు” అని సభలో స్పష్టం చేశారు.ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు ఇకపై కూడా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయి.  కేవలం సాంకేతిక విద్యా వ్యవస్థను స్కిల్స్ యూనివర్సిటీ పరిధితో అనుసంధానం చేస్తున్నాం.
ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి టాటా సంస్థ సహకారంతో నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. అంతమాత్రాన ఐటీఐలను ప్రైవేటు పరం చేసినట్లు కాదు. ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్కాలర్‌షిప్ అందించాలని నిర్ణయించాం” అని చెప్పారు.పాలిటెక్నిక్‌ల విషయంలో భూములు అమ్ముకుంటారని, ఉద్యోగాలు పోతాయని కొందరు విద్యార్థుల్లో అపోహలు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ప్రభుత్వం అదనంగా 282 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏటీసీలకు బదలాయించిందని, ఒక్కో ఏటీసీపై సుమారు రూ.46 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

**పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా... **

సాంకేతిక విద్యను పరిశ్రమల అవసరాలకు అనుసంధానించడమే పాలిటెక్నిక్‌లను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వెనుక ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి గారు వివరించారు. రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్ లను టాటా టెక్నాలజీ సంస్థ సహకారంతో రూ. 4 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు.
విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశాలను పెంచడమే లక్ష్యమన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు అనుగుణంగా టాటా టెక్నాలజీస్ సంస్థ సహకారంతో కోర్సులను ఆధునీకరిస్తామని చెప్పారు.
సాంకేతిక విద్య–నైపుణ్యాభివృద్ధి విభాగాల అనుసంధానంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక వసతులు, ల్యాబ్‌లు, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధిని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. విద్యార్థుల్లో నెలకొన్న అపోహలను తొలగిస్తామని, జీఓలో సవరణలు అవసరమైతే వాటిని కూడా చేస్తామని హామీ ఇచ్చారు. స్కిల్స్ యూనివర్సిటీకి ఏఐసీటీఈ అనుమతి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
పేద విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని అన్నారు. వారి భవిష్యత్తును మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవాలని సభ్యులను కోరారు.

**ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లెక్కలు...**

ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపైనా ముఖ్యమంత్రి సభలో స్పష్టత ఇచ్చారు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.5,435 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వదిలివెళ్లిందని తెలిపారు. అందులో గత ప్రభుత్వం పెట్టిన బకాయిల నుంచి రూ.1,410 కోట్లు తమ ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందన్నారు.అదేవిధంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రూ.1,465 కోట్లను చెల్లించామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం చెల్లించిన వాటితో కలిపి మొత్తంగా 32 నెలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.3,488 కోట్లు చెల్లించినట్లు సభలో వెల్లడించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు విద్యార్థుల ఖాతాల్లోకి డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ విధానం అమలు చేస్తున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల కోసం అడ్వాన్స్‌గా గ్రీన్ చానెల్‌లో డబ్బు చెల్లిస్తున్నామని చెప్పారు. బకాయిల విషయంలో విజిలెన్స్ నివేదికను పరిశీలించిన తర్వాత నిజాయితీగా ఉన్న వాటన్నింటినీ బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు.విద్యను కేవలం ఒక శాఖగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే సాధనంగా భావిస్తున్నామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి  విద్య, నైపుణ్యం, ఉద్యోగం, ఉపాధిని అనుసంధానించేలా సంస్కరణలు చేపట్టామని తెలిపారు