Friday, September 4, 2026

అంబర్పేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర మాజీ మేయర్ కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు_

*అంబర్పేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర మాజీ మేయర్ కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 04:

అంబర్ పేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త. బహుముఖ ప్రజ్ఞాశీలి. ముదిరాజ్ సంఘపు స్థాపకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంఘం నాయకుడు, సీనియర్ జర్నలిస్ట్  సతీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అంబర్ పేట స్విమ్మింగ్ పూల్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలలో పెద్ద సంఖ్యలో ముదిరాజ్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డిసిపి జోగుల నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొని కొర్వి  కృష్ణ స్వామి ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా అడిషనల్ డిసిపి నర్సయ్య మాట్లాడుతూ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ 1893, ఆగష్టు 25 న కృష్ణాష్టమి రోజు జాల్నాలోని ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు అని ఎంతో కష్టపడి చదువుకొని చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్, ఆ తరువాత నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు అని రచయితగా, సాహితీవేత్తగానే కాకుండా పాత్రికేయుడిగా కూడా ఆయన సేవలందించారు అని సామాజిక రుగ్మతలపై అనేక పుస్తకాలు వ్రాశాడు అని గుర్తుచేశారు.ఈ సందర్భంగా  ముదిరాజ్ సంఘం నాయకురాలు మాట్లాడుతూ అంబర్ పేటలో మాజీ మేయర్ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అంబర్ పేట శ్రీ రమణ చౌరస్తా, చే నంబర్, ఎమ్మార్వో ఆఫీస్, అలీ కేఫ్ చౌరస్తాలలో ఏదైనీ ప్రాంతంలో కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.

No comments:

Post a Comment