Sunday, December 7, 2025

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 DAY-1 (DEC 8) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025

*DAY 1 (DEC 8)  CM SIR Schedule*

రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025  ఈరోజు (డిసెంబర్​ 8) మధ్యాహ్నం 1.30కు ప్రారంభమవుతుంది. 

ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి మధ్యాహ్నం 12.30కు ఫ్యూచర్​ సిటీకి చేరుకుంటారు. ముందుగా గ్లోబల్ సమ్మిట్​ వేదిక వద్ద  ఏర్పాటు చేసిన  స్టాళ్లను పరిశీలిస్తారు. 

1:30 కు వేడుక ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. 

ఈ వేడుకపై ముఖ్యమంత్రి  ప్రసంగిస్తారు.  ప్రజా ప్రభుత్వం రెండేళ్ల  విజయోత్సవాలతో పాటు  తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల అభివృద్ధి లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలను వివరిస్తారు. 

ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా  తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు దాదాపు 3 వేల మంది ఇందులో పాల్గొంటున్నారు. 

ప్రారంభోత్సవ వేడుకల అనంతరం ముఖ్యమంత్రి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల బృందంతో విడివిడిగా సమావేశమవుతారు.  

దేశ విదేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులను ఈ సందర్భంగా సీఎం కలుసుకుంటారు. 

ప్రతి 15 నిమిషాలకో వన్ టు వన్​ రౌండ్​ టేబుల్​ మీటింగ్​ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 

మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు  దాదాపు 15  సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. 

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి,  రిపబ్లిక్​ ఆఫ్​ కొరియా ప్రతినిధులు,  ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్. ఐకియా ప్రతినిధులు, టెక్స్​టైల్​,  ఫర్నిచర్ తయారీ  MSME, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ ​ రంగ ప్రతినిధులు, SIDBI, వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధులతో ఈ రౌండ్​ టేబుల్​ సమావేశాలు ఏర్పాటు చేశారు. 

ఏరోస్పేస్, డిఫెన్స్  రంగంలో పేరొందిన కంపెనీల ప్రతినిధులు,  యూనివర్సిటీ ఆఫ్ లండన్‌ ప్రతినిధులు,  వంతార, VinGroup  ప్రతినిధులు,  వివిధ దేశాల నుంచి వచ్చిన రాయబారులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశమవుతారు. 

రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొంటారు

No comments:

Post a Comment