Thursday, September 18, 2025

ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు

ఈరోజు గౌరవనీయులైన ఓయూ రిజిస్ట్రార్ ఆచార్య.G. నరేష్ రెడ్డి గారికి మరియు గౌరవనీయులైన OSD ఆచార్య.జితేందర్ కుమార్ నాయక్ గారిని ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యచందర్ మరియు ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా వెంకటేష్ గార్ల ఆధ్వర్యంలో పలువురు నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిసి  ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను అటు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఓయూ అధికారులు పరిష్కరించడం లేని కారణంగా మేము ఈనెల 23-09-2025 నుండి తలపెట్టిన నిరసన కార్యక్రమాల గూర్చి వివరిస్తూ పత్రము ఇవ్వడం  జరిగినది.మేము గత 25 నుండి 30 సంవత్సరాలుగా తక్కువ జీతాలతో విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషిచేస్తూ నిరంతరం పనిచేస్తున్నాము.అయినప్పటికీ,గత నాలుగు సంవత్సరాలుగా వేతనాల పెంపు జరుగలేదు.మేము పలు దఫాలుగా అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ మా సమస్యలు పరిష్కరించబడలేదు.రోజు రోజుకి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు,ఇంటి అద్దెలు పెరగడం వలన,జీవన వ్యయం అధికమై పిల్లల చదువు,వైద్య ఖర్చులు భరించలేని స్థితి ఏర్పడింది. కనుక మేము ఇట్టి సమస్యలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి  తీసుకపోవుటకు గాను ఈనెల 23-09-2025 నుండి శాంతియుత నిరసన కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము.       

మాయొక్క ప్రధాన డిమాండ్లు:-1.ఓయూలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు "మినిమం టైంస్కేల్"ఇవ్వాలి. 2.EPF ఏరియర్స్ ను వెంటనే ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఖాతాలో జమచేయాలి. 3.రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వయోపరిమితిని61 సంవత్సరాలకు పెంచాలి. 4.రిటైర్మెంట్ మరియు మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీసం 5 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలి.   5.పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు 30,000 వేలు అంత్యక్రియల ఖర్చులు ఇవ్వాలి.                                                      
మాయొక్క నిరసన కార్యక్రమాల షెడ్యూల్:-         1.బ్లాక్ రిబ్బన్ ధరించి పెన్ డౌన్-23-09-2025         2.బైక్ ర్యాలీ- 24-09-2025                                   3.మహా ర్యాలీ-25-09-2025                                 4.మానవహారం-26-09-2025                               5.మహాధర్నా-27-09-2025                                   6.రిలే నిరాహారదీక్షలు -29-09-2025 నుండి ప్రారంభమగును.

No comments:

Post a Comment