Thursday, July 3, 2025

#GHMC కమీషనర్ అక్రమ నిర్మాణాలను ప్రోత్సాహిస్తున్నాడా?

జిహెచ్ఎంసి జూబ్లీహిల్స్ సర్కిల్ 18 బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ప్రధాన రహదారిపై ఉన్న వంశీరాం జ్యోతి వెలెన్సియా వాణిజ్య భవనం పైన 15,000 sft లో  స్టీల్ స్ట్రక్చర్ తో అక్రమంగా నిర్మిస్తున్న అదనపు అంతస్తు. దీనిని నిర్మిస్తున్నది విశ్వసముద్ర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత చింత శశిధర్. చింత శశిధర్ కోసం ఈ అదనపు అంతస్తుని నిర్మిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడానికి పూర్తిస్థాయి అండదండలు అందించడానికి అక్షరాల 50 లక్షల రూపాయలను కంపెనీ చైర్మన్ పర్సనల్ సెక్రెటరీ  సంజయ్ ద్వారా సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ని మధ్యవర్తిగా పెట్టుకొని పలుమార్లు కంపెనీ ప్రిమిసెస్ లో కూర్చుని అంతేకాకుండా రవీంద్ర భారతి పక్కన ఉన్న కామత్ హోటల్ లో కూడా కూర్చుని  మొత్తానికి అటూ ఇటూ చేసి కంపెనీ యజమాని నుండి 50 లక్షల రూపాయలను రెండు ఇన్స్టాల్మెంట్ల రూపేనా మొదటి ఇన్స్టాల్మెంట్ 25 లక్షల రూపాయలు నాలుగు (నెలల ముందు మొదటి ఇన్స్టాల్మెంట్ తీసుకున్నారు ) రెండవ ఇన్స్టాల్మెంట్ 25 లక్షల రూపాయలను( 20 రోజుల ముందు తీసుకున్నారు ) ఈ 50 లక్షల ను  లంచం రూపేనా  సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ని మధ్యవర్తిగా పెట్టి వసూలు చేసిన ఘనపాటి సర్కిల్ 18 ఏసిపి ఇంజ శ్రీనివాస్.ఏసీబీ వాళ్లు ఇవన్నీ అబద్ధాలు అని అనుకుంటే అసిస్టెంట్ సిటీ ప్లానర్ అమాయకత్వాన్ని గనక నమ్మితే జిహెచ్ఎంసి లోని ఉన్నతాధికారులు అందరు కూడా మా ఏసీపీ చాలా మంచివాడు చాలా అమాయకుడు నోట్లో నాలుక కూడా లేదు ఇలా అతని గురించి అనుకునే అధికారులందరూ వాళ్ళ వాట్స్అప్ కాల్ రికార్డ్స్ ని కంపెనీ సీసీ టీవీ ఫుటేజ్ లను కామత్ హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ లను బయటికి తీస్తే అన్ని నిజానిజాలు బయటికి వస్తాయి అలా అని ఈ బిల్డింగ్ కి ఏ నోటీసులు ఇవ్వలేదు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు స్పీకింగ్ ఆర్డర్లు ఇవ్వలేదు అని అస్సలు అనుకోకండి ఉన్నతాధికారులను బురిడీ కొట్టించడానికి ఎవరైనా ఫిర్యాదు చేసిన వాళ్లను మభ్య పెట్టడానికి పక్కా ప్లాన్ తో ఇంజా శ్రీనివాస్ అన్ని నోటీసులు కూడా ఇచ్చాడు అంతే కాకుండా వాళ్లకి అనుకూలంగా ఉన్న చంద్రశేఖర్ అనే వ్యక్తి ద్వారా సివిల్ కోర్టులో కేసు కూడా వేయించారు ఆ కేసుకి వీళ్ళు కౌంటర్ వెయ్యరు ఆ కేసు తెగదు ఈలోపు నిర్మాణం పూర్తవుతుంది ఇలా ఉన్నతాధికారులను బురిడీ కొట్టించడానికి జిహెచ్ఎంసి లోని అన్ని చట్టాలను న్యాయవ్యవస్థలను పూర్తిస్థాయిలో తనకు ఆర్థికంగా ఉపయోగపడేటట్టు వాడుకుంటూ ఏసీబీ కళ్ళుగప్పి 50 లక్షల రూపాయల లంచాన్ని వసూలు చేశాడు. ఈ అక్రమ వాణిజ్య అదనపు అంతస్తులో.          5000 10000 ఇలా చిన్నచిన్న అమౌంట్లను లంచం రూపేనా తీసుకుంటున్న ఏ అధికారిని కూడా ఏసీబీ వాళ్ళు వదలడం లేదు అలాంటిది ఇంత చాకచక్యంగా ఏసీబీ అధికారులకు దొరకకుండా జిహెచ్ఎంసి లోని ఉన్నతాధికారుల దృష్టిలో పడకుండా అమాయకపు చక్రవర్తిలా యాక్టింగ్ చేసుకుంటూ కోట్ల అవినీతికి పాల్పడుతున్న అవినీతి అధికారి ఇంజా శ్రీనివాస్ పై ఏసీబీ అధికారులు దృష్టి పెడితే జిహెచ్ఎంసి లోనే అతిపెద్ద తిమింగలం దొరికినట్టు అవుతుంది ఏసీబీ. అధికారులకు అంతేకాకుండా ఉన్నత స్థాయి అధికారులు శాఖాపరమైన విచారణ జరిపించి  అన్ని అక్రమ నిర్మాణాల విషయంలో మెమోలు జారీ చేసి నిజాయితీగా అన్ని నిజాలను వెలికి తీసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఇంజా శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేస్తే తప్ప జిహెచ్ఎంసి పరువు మూసిలో కలవకుండా ఆపగలరు. ఇలా తనపై అన్ని ఉత్తుత్తి వార్తలు తనకు సంబంధం లేకుండా తనని కొందరు బద్నాం చేస్తున్నారని ఒకవేళ ఏసీపి భావిస్తే తాను నిజాయితీపరుండని ఉన్నతాధికారులకు చెప్పుకుంటున్నట్టు నిజంగా ఏ లంచాలు తీసుకోకుండా నిజాయితీగా నిప్పులాంటి వ్యక్తిగా అతను పని చేసినట్లయితే  ఈ అక్రమ నిర్మాణాలన్నిటిని ఉన్నత అధికారుల సమక్షంలో అక్రమ నిర్మాణాలన్నిటిని  కూల్చగలిగితే  అక్రమ నిర్మాణదారులు ఎన్ని కోట్ల డబ్బుని లంచం రూపేనా సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ కి ఏసీపీ శ్రీనివాస్ కి ఇచ్చారో అన్ని నిజాలు అక్రమ నిర్మాణదారుల నోటి నుండే ఉన్నతాధికారుల ముందు బయటికి వస్తాయి లంచం ఇచ్చి మరి అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తి అక్రమ నిర్మాణాన్ని కోలుస్తుంటే నోరు మెదపకుండా కూర్చోలేడు కదా ఇలా ఉన్నతాధికారులు ప్రయత్నిస్తే మీ ఏసిపి శ్రీనివాస్ మీ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ఎంతటి సత్యహరిశ్చంద్రులు మీకే తెలిసిపోతుంది.
(Source)

No comments:

Post a Comment