*నల్లగొండ జిల్లా అధికారులపై తిరగబడిన ఆక్రమణదారులు* మాదారం కలాన్ రామసముద్రం చెరువు ను ఆక్రమించి రాత్రి పూట చెరువును పూడ్చడానికి ప్రయత్నించిన విషయమై పదిరోజుల క్రితం తెలంగాణ సీ ఎం కు పిర్యాదు చేశారు రాజకీయ పలుకుబడితో విచారణ ను ఆలస్యం చేయాలని ఆక్రమణదారులు చూశారు ఈ క్రమంలో పర్యావరణ వేత్తలు సామాజిక ఉద్యమకారులు అండగా నిలబడి పలువురు ఉన్నతాధికారులకు రిజిస్టర్ పోస్టు ద్వారా పిర్యాదు లు చేశారు ఎమ్మెల్యే సతీమణి అండతో బాధితులపై భౌతిక దాడులకు దిగడమే కాకుండా అండగా నిలిచిన వారిని సైతం అంతం చేస్తామని బెదిరింపులకు దిగినారు నల్లగొండ జిల్లా ఆర్ డీ వో వై అశోక్ రెడ్డి గారి సొంత ఊరికి చెందిన సమస్య కావడంతో పై అధికారుల ఒత్తిడి తో నిన్న పొలీస్ బందోబస్తు తో శాలీ గౌరారం ఎమ్ ఆర్ వో సీఐ ఎస్ ఐ ల సమక్షంలో విచారణ కు రాగా ఆక్రమణ దారులైనలు అధికారులను అడ్డుకునారు ఆర్ డీ వో పై ఎస్ ఐ ఎమ్ ఆర్ వో ల సమక్షంలోనే ఆక్రమణ దారులు దాడులకు తెగించినారు అంటే వీరివెనకాల ఎంత పెద్ద నాయకత్వం ఉంటుందోనని ప్రజలు ఆందోలన చెందుతున్నారు వీల్లను ఇలాగే వదిలేస్తే..ఐదేళ్లకోసారి వచ్చిపోయే ప్రజాప్రతినిధుల అండ చూసుకుని చెరువులను పట్టాభూములను ఆక్రమించి ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే వీరిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు
*****
https://x.com/Praja_Snklpm/status/1931641398438314306?t=SMuJ4Z_XgObBvEcU2iki2Q&s=08
No comments:
Post a Comment