Thursday, November 7, 2024

*_ప్రభుత్వంలో బిఆర్ఎస్ కోవర్ట్ లు_*

*_ప్రభుత్వంలో బిఆర్ఎస్ కోవర్ట్ లు_*
_# ముందే లీకవుతున్న విషయాలు_
_# కాంగ్రెస్ లో ఎవరికి వారే యమునా తీరే.!_
_# పట్టు సంపాదించలేక ప్రచార హడావుడి_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*https://epaper.mediatodaydaily.in/view/719/07-11-2024*

*_పదేళ్ళ నిరంకుశ పాలన తర్వాత ప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చుకుంది. గత ప్రభుత్వంలో ఎన్నో అవినీతి, అక్రమ సంఘటనలకు బాద్యులైన అధికారులకే తిరిగి అందలం దక్కటం కాంగ్రెస్ ప్రతిష్ఠను కొంత మసకబార్చిందనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు కన్పించక పోవడం ఓ కారణం. వలస నాయకుల పెత్తనం పెట్రేగిపోవడం కూడా మరో కారణం. వీటికి తోడు ప్రభుత్వంలోని కొందరు అధికారులు బిఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా పనిచేయడం, ప్రభుత్వంలో జరుగుతున్న అనేక విషయాలు ముందే బయటకు పొక్కడం ఓ బలహీనతకు నిదర్శనం._*

*_ఇటీవల ఏం జరిగింది.?_*
నిరుద్యోగులతో రాహుల్ 'భేటీ, మాటామంతీ' అని ఎవరో పోలీసాయన లీక్ చేశాడు. కేటీఆర్ బ్యాచ్ వెళ్ళి అర్జెంటుగా అక్కడ సీట్లన్నీ కబ్జా చేశారు.! రేవంత్ టీమ్ కు, సర్కారుకు ఏదీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ చేతకాదు కదా..! దేభ్యం మొహాలు వేశారు. చివరకు తమ బాస్ రాహుల్ ప్రోగ్రామ్ మీద కూడా ఓ సరైన దశ, దిశ, పర్‌ఫెక్ట్ స్ట్రాటజీ లేదు రేవంత్ టీమ్‌కు..! _(ఈ విషయంలో రేవంత్ రెడ్డికి మినాహాయిం. ఒక్కడే ఎంత లాక్కొస్తాడు మరి.!)_

*_మచ్చుకు మరి కొన్ని..!_*
అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల శాఖ విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతుందో... ముందే ప్రతిపక్ష నాయకులకు చేరడం. అవినీతి, అక్రమాల్లో భాగస్తులైన అధికారులు ప్రభుత్వాన్ని పక్కాగా పక్కదారి పట్టించడం వంటివి చాలా జరిగాయి.

*_కాళేశ్వరం కమీషన్ ను సైతం.._*
కాళేశ్వరం ప్రోజెక్ట్ లో ఎంతో అవినీతి జరిగిందని గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ గగ్గోలు పెట్టింది. అందుకు తగ్గట్టుగానే ఆ ప్రోజెక్ట్ కుంగిపోవటం కాంగ్రెస్ కు ఊహించని వరంలా మారింది. నీటిపారుదల వ్యవస్థలో జరిగిన లోపాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా అదనపు బాధ్యతలు అప్పగించిన వింత వైనం తెలంగాణలో మాత్రమే సాధ్యం. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రోజెక్ట్ అవినీతిపై విచారణ చేస్తున్న కమీషన్ కే తప్పుడు సమాచారం ఇవ్వడం. కమీషన్ సీరియస్ అయిన విషయం తెలిసిందే.!

*_ఏం జరుగుతోంది..?_*
_1) ఈ సర్కారుకి ఈ రోజుకూ పాలనపై, పోలీసులపై, సీనియర్ అధికారులపై పట్టు లేదు._

_2) పోలీసుల్లో, అధికార యంత్రాంగంలో 'బీఆర్ఎస్ మనుషులదే పెత్తనం' అనే సోయి కనిపించడం లేదు._

_3) రోజుకు వంద అంశాలపై రేవంత్‌ను హరీష్, కేటీయార్ ఆడుకుంటుంటే పార్టీపరంగా, ప్రభుత్వపరంగా రేవంత్‌కు నిల్ సపోర్ట్._

_4) అసలు కౌంటర్ మెకానిజం అంటూ రేవంత్ టీం దగ్గర ఉంటే కదా..!_

బాక్స్:

*_ఇవి తప్పులు కావా.?_*

_(1) టిఆర్ఎస్ హయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన నాటి పోలీస్ బాస్ మహేందర్ రెడ్డికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యతలు అప్పగించడం._

_(2). మునుగోడు ఎన్నికల్లో బిఆర్ఎస్ తో అంటకాగి ప్రయోజనం పొందిన పార్టీకే ప్రెస్ అకాడమీ చైర్మన్ అప్పగించడం._

_(3) ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ కు సీటు ఇవ్వటం. ఈ స్థానంలో మరే కాంగ్రెస్ నాయకుడైనా గెలిచే అవకాశం ఉండేది._

_(4) హైడ్రా విషయంలో ప్రభుత్వం తరఫున మంత్రులు కాకుండా అధికారులు మాట్లాడటం ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఈ పబ్లిసిటీ వల్ల దారుణంగా రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది._

_(5). ఎన్నికల సందర్భంగా 17 కుంభకోణాలతో కాంగ్రెస్ పార్టీ చార్జిషీట్ విడుదల చేసింది. ఏం ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయకపోవడం._

_(6). ఎన్నికల ఫలితాల తర్వాత టిఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల పాత కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని పలువురు కార్యకర్తలు భావిస్తున్నారు.  కొందరు మంత్రులు ప్రజలకు దూరంగా ఉంటూ 'దర్పం' ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి._

_(7). పదవుల విషయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు బలంగా ప్రజల్లోకి వెళుతుంది._

_(8). రైతులకు హామీ ఇచ్చిన రూం. 2 లక్షల మాఫీ విషయంలో లోపాలను సరిదిద్ది .. అందరికీ అందేలా చేయండి._

_(9). సంపదను సృష్టించటం చేతగాక అప్పులు తెచ్చిన కేసీఆర్ ను ప్రజలు దించారు. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం సంపదను సృష్టించే ప్రక్రియలను సమర్థవంతంగా ముందుకు తీసుకురావాలి._

*_నోట్:_*
ఇదే అవకాశం కేసీఆర్ కు ఉంటే... ఎంత మంది రాజకీయ నాయకులను, అధికారులను తొక్కి నార తీసే వాడు కదా.! మీరు నార తీయకపోయినా పర్వాలేదు. నిస్సత్తువగా ఉండకండి. ప్రజలకు అన్యాయం జరగకుండా చూడండి. మరో పదేళ్లు మీరే ఉంటారు. లేదంటే కమలం లాజికల్ ప్లే ఆడుతుంది. తస్మాత్ జాగ్రత్త.!

No comments:

Post a Comment