Friday, November 15, 2024

_# ఇదే సంస్కృతి కొనసాగితే మళ్ళీ ప్రభుత్వం కష్టమే.!_

*_కాంగ్రెస్‌లో ఈ ధోరణి పోదా..?!_*
_# పరుగు తీసే కాళ్లల్లో కట్టెపుల్లలు ఇంకెన్నేళ్ళు.?_
_# ఇదే సంస్కృతి కొనసాగితే మళ్ళీ ప్రభుత్వం కష్టమే.!_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*https://epaper.mediatodaydaily.in/view/732/15-11-2024*

*_కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా చాలా ఎక్కువ. కానీ గతంలోలాగా లేదు ఇప్పుడు పరిస్థితి… తెలంగాణ విషయానికే వస్తే… హైకమాండ్ మ్యాండేట్ ఇచ్చింది. సీఎం‌గా రేవంత్ రెడ్డికి చాన్స్ ఇచ్చింది. ఓకే.! మరి ఆయన కాళ్ళకు వేస్తున్న 'అడ్డంకు బంధాలు' తీసేది ఎవరు.?_*

*_నాయకులు, కేడర్ సపోర్ట్..:_*
దాన్ని అన్ని దశల్లోని నాయకులు, కేడర్ సపోర్ట్ చేయాలి. కానీ కొందరు నేతలు రేవంత్ నాయకత్వం మీద 'తెల్ల వార్లూ' కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. పార్టీ కిమ్మనదు. జనంలోకి నెగెటివ్ సంకేతాలు వెళ్తుంటాయి. ఇప్పటికే వెళుతున్నాయి. _మరి ప్రజెంట్ సక్సెస్‌ఫుల్ వ్యూహకర్తలుగా గొప్పలు ఆపాదించబడుతున్న 'సునీల్ కనుగోలు' వంటి వ్యక్తులు వీటి మీద ఎందుకు దృష్టి సారించరు..?_

*_తెలంగాణలో కాంగ్రెస్‌కు ఇరువైపులా ముప్పే..:_*
ఒకవైపు గత ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ క్రమేపీ బలం పుంజుకుంటోంది. కేటీయార్, హరీష్ ప్రతి ఇష్యూలో కాళ్లువేళ్లు పెట్టి రేవంత్ మీద ముప్పేటదాడి చేస్తున్నారు. గత ఎన్నికల నాటి ప్రజావ్యతిరేకత మొత్తం పోయిందని చెప్పలేం గానీ బీఆర్ఎస్ గతంతో పోలిస్తే మరీ అంత దయనీయంగా ఏమీ లేదు ఇప్పుడు. _( ఇది కాంగ్రెస్ హైకమాండ్ తక్షణమే గుర్తించాలి)_

*_మరోవైపు బీజేపీకి..:_*
బాగా ఆశలున్నాయి. నాయకత్వ సమస్య, అంతర్గత కుమ్ములాటలతో అది మరో కాంగ్రెస్‌లా కనిపిస్తోంది గానీ.! రాబోయే హైదరాబాద్ నగర ఎన్నికల మీద బాగా ఆశలున్నాయి దానికి. స్థానిక ఎన్నికల సంగతి చెప్పలేం. సో, ఈ స్థితిలో కాంగ్రెస్ జాగ్రత్తగా అడుగులు వేయాలి, అది చిన్న విషయమైనా సరే, లేదంటే బీఆర్ఎస్ లేదా బీజేపీకి చేజేతులా చాన్స్ ఇచ్చినట్టే అవుతుంది. జాగ్రత్త సుమీ.!

*_ఉదాహరణకు..'మొగుళ్ల పంచాయతీ'..:_*
హైదరాబాద్ వాటర్ బోర్డు కార్మిక సంఘం విషయం తీసుకుందాం. ఐఎన్‌టీయూసీకి అనుబంధంగా ఉన్న కామ్‌గార్ యూనియన్ ప్రస్తుత అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి… తను సీఎం రేవంత్‌రెడ్డికి కుటుంబసభ్యుడు. చాలా దగ్గరి బంధువు. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి ఎన్నికకు తన సోదరుడు కొండల్ రెడ్డితోపాటు పర్యవేక్షక బాధ్యతలు నిర్వర్తించాడు. తనకు ఏ నామినేటెడ్ పోస్టూ దక్కలేదు.! సరే, ఆ వాటర్ బోర్డు కార్మిక సంఘం ఎన్నికల్లో నిలబడటానికి ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి మ్యాండేట్ ఇచ్చాడు. రాజిరెడ్డి ఐఎన్‌టీయూసీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా..! ఆరేడు వేల మంది సిబ్బందికి ప్రాతినిధ్యం కల్పించే ఎన్నిక అది.

*_ఇందులోనూ మళ్లీ కాంగ్రెస్ వైరుధ్యాలు..:_*
మధు యాష్కి ఇంకెవరినో పోటీగా తీసుకొచ్చి పాలిటిక్స్ మొదలు పెట్టాడు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఒకరకంగా చాన్స్ 'చేజేతులా ఇచ్చినట్టే' అనే సోయి కాంగ్రెస్ పార్టీలో లేకుండా పోయింది. బీజేపీకి ఆ బోర్డు స్టాఫులో పెద్ద బేస్ లేదు, కానీ బీఆర్ఎస్ కాస్త శ్రమపడితే అది కేటీయార్, హరీష్ ఖాతాలో పడే అవకాశం ఉంది. జారీ జాగ్రత్త మరి.!

*_పీసీసీ యాక్టివ్ రోల్ ప్లే ఎక్కడ.?_*
ఇదుగో ఇలాంటి విషయాల్లోనే పీసీసీ యాక్టివ్ రోల్ ప్లే చేయాలి. పార్టీ కోసం పనిచేసే వాళ్ల కాళ్లల్లో కట్టెపుల్లలు పెట్టే ధోరణులకు అడ్డుకట్ట వేయగలిగితేనే… మళ్లీ బలం పుంజుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రమైనా చెక్ పెట్టగలదు… లేకపోతే..?!

*_…అన్నట్టు… ఆ స్టాఫ్ కోరుకునే ప్రధాన అంశం…_*
ప్రభుత్వ ఉద్యోగుల్లాగే వైద్యచికిత్స బీమా…
వాటర్, సీవరేజీ పనులు చేసే ఆ స్టాఫ్ కోరిక న్యాయబద్ధం… ప్రభుత్వం దాని గురించి పాజిటివ్‌గా ఆలోచించాలి..!! జస్ట్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త కోసం ఈ విశ్లేషణ. వింటే ఓకే.. లేకుంటే కేసిఆర్ గతే.!

No comments:

Post a Comment