ప్రతీ సారి ఎన్నికల సమయం లో, ఎన్నికల కోడ్ పేరు చెప్పి ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేయడం జరుగుతోంది. ప్రజావాణి కార్యక్రమం సమస్యల నివారణకు ఉద్దేశించినది, ఇది MRO , RDO, District Collecter కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించ బడుతుంది. ఈ కార్యక్రమం పౌరులకు అధికారులకు మధ్య జరిగేదే కానీ రాజకీయ సభ కాదు. సమస్యల పరిష్కారం అనేది ప్రభుత్వ యంత్రాంగ బాధ్యత, ఎన్నికలు ఉన్నా లేకపోయినా సరే. మానవ హక్కుల వేదిక ఈ విషయాన్ని 5 నవంబర్ 2023 న తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లగా, 7 నవంబర్ 2023 రోజున చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు , GHMC కమిషనర్ కు, ఈ విషయమై చర్య తీసుకోవలసిందిగా మెమో జారీ చేయడం జరిగింది.
No comments:
Post a Comment