Wednesday, August 30, 2023

జీవో 84 రద్దు చేసేలా ఆదేశాలివ్వండి..!

జీవో 84 రద్దు చేసేలా ఆదేశాలివ్వండి.. భాగ్యనగర్‌‌ సిటిజన్స్‌‌ అసోసియేషన్‌‌ పిల్

  • ఆ జీవోను సవాలుచేస్తూ భాగ్యనగర్  సిటిజన్స్ అసోసియేషన్  పిల్
  • కౌంటర్  వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • విచారణ వచ్చే నెల 14కి వాయిదా

హైదరాబాద్, వెలుగు : నోటరీతో కొనుగోలు చేసిన ఇండ్ల స్థలాలను రెగ్యులరైజ్‌‌  చేస్తామని పేర్కొంటూ గత నెల 28న ప్రభుత్వం జారీ చేసిన జీవో 84ను రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. జీవో 28 చట్టవ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ భాగ్యనగర్‌‌  సిటిజన్స్‌‌ అసోసియేషన్‌‌  అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌‌  పిల్  వేశారు. ఆయన తరపున అడ్వొకేట్‌‌  డి.నరేంద్ర నాయక్‌‌ వాదించారు. 125 చదరపు గజాలు, అంతకన్నా తక్కువ ఉన్న స్థలం కొన్న వాటిలో కట్టిన ఇండ్లను రెగ్యులరైజ్‌‌ చేయడం అన్యాయమన్నారు. 

125 గజాల వరకు ఎలాంటి స్టాంపు డ్యూటీ, జరిమానా ఉండదన్నారు. 125 గజాల నుంచి 3 వేల గజాల వరకు స్థలం ఉంటే ఇప్పటి మార్కెట్‌‌  విలువ ప్రకారం స్టాంపు డ్యూటీ వసూలుకు అనుమతించడం అన్యాయమన్నారు. దీనివల్ల సివిల్‌‌  వివాదాలు పెరిగిపోతాయన్నారు. వెంటనే జీవో 84ను రద్దు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని నరేంద్ర నాయక్  కోరారు. గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్‌‌  వేస్తామని ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్‌‌  చెప్పారు. దీంతో విచారణను హైకోర్టు వచ్చే నెల 14కి వాయిదా వేసింది. 

ఈలోగా కౌంటర్  వేయాలని ప్రతివాదులైన చీఫ్‌‌  సెక్రటరీ, రెవెన్యూ, మునిసిపల్‌‌  అధికారులను ఆదేశించింది. అలాగే జీవో 84ను సవాల్‌‌  చేస్తూ పిల్‌‌ దాఖలు చేయడాన్ని హైకోర్టు సమర్థించింది. పిల్‌‌కు నంబర్‌‌ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. నంబర్‌‌  కేటాయించాలని, పిల్‌‌పై వచ్చే నెల 14న విచారిస్తామని ప్రకటించింది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌  అలోక్‌‌  అరధే, జస్టిస్‌‌  వినోద్‌‌  కుమార్‌‌ల డివిజన్‌‌  బెంచ్‌‌  బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Courtesy / Source by : V6velugu media 

పార్టీ ఎన్నికల అభ్యర్థులపై నిఘా...BRS చీఫ్ కేసీఆర్....!

*పార్టీ ఎన్నికల* *అభ్యర్థులపై నిఘా....ప్రత్యేక బృందాలను రంగంలోకీ దింపిన....BRS చీఫ్ కేసీఆర్....!*

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత పార్టీ అభ్యర్థులపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.ఇప్పటికే 115 సెగ్మెంట్లలో మార్పులతో అభ్యర్థులను ప్రకటించినందున 10 నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ బృందాలు అభ్యర్థుల పనితీరుపై బ్యాక్ డోర్ సర్వే చేపట్టి పార్టీ సీనియర్ నేతలకు రోజువారీ నివేదికలు ఇస్తాయి. సీనియర్ నేతలు రోజువారీ నివేదికలను ట్రాక్ చేసి తుది నివేదికను బీఆర్ఎస్ చీఫ్ కు సమర్పిస్తారు.

ఇటీవల ప్రకటించిన పార్టీ అభ్యర్థుల రాజకీయ కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి, ఈ నాయకుల పనితీరుపై, ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్ట్ కార్డ్ ఇవ్వడానికి 20 మంది నాయకులతో నియోజకవర్గాల వారీగా ఒక బృందాన్ని నియమించారు. ఇప్పటికే 115 సెగ్మెంట్లలో మార్పులతో 10 మంది అభ్యర్థులను ప్రకటించినందున నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలనుపర్యవేక్షించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ బృందాలు అభ్యర్థుల పనితీరుపై బ్యాక్ డోర్ సర్వే చేపట్టి పార్టీ సీనియర్ నేతలకు రోజువారీ నివేదికలు ఇస్తాయి. సీనియర్ నేతలు రోజువారీ నివేదికలను ట్రాక్ చేసి తుది నివేదికను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సమర్పిస్తారు.

ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో సహా పలువురితో ఈ బృందాలు సంభాషిస్తాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రవర్తన, ప్రజలకు అందుబాటులో ఉన్నారా, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా, అభ్యర్థి పార్టీ మారే అవకాశం ఉందా వంటి ఐదు అంశాలపై వారు అభిప్రాయాలు తీసుకోనున్నారని సమాచారం. తాజా పరిణామాలతో అభ్యర్థుల్లో 'బీ-ఫారం' కత్తి వేలాడుతూ భయాందోళనలు నెలకొన్నాయి. జాబితాను ప్రకటించే సమయంలో బీఆర్ఎస్ చీఫ్ ఒక ప్రశ్నకుసమాధానమిస్తూ, పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోతే అభ్యర్థుల్లో మార్పులు ఉండవచ్చునని చెప్పారు.

అయితే, దీనిపై కొందరు నేతలకు అవగాహన లేకుండా పోయింది. అందువల్ల వారు ఇంకా ప్రచారాన్ని ప్రారంభించలేదు. ఇప్పుడు ప్రచారానికి ఖర్చు చేసి అభ్యర్థిని మారుస్తే వృధా ఖర్చు అవుతుందని కొందరు భావిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతల డిమాండ్ మేరకు అభ్యర్థులను మారుస్తారనే టాక్ వినిపిస్తోంది. అభ్యర్థులను మార్చాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతివ్వబోమని పలు నియోజకవర్గాల్లోని నాయకులు కోరారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, కోదాడ ఎమ్మెల్యే బి.మల్లయ్యయాదవ్, కె.వెంకటేష్ (అంబర్ పేట), కల్వకూర్తి ఎమ్మెల్యే సహా పలువురు నాయకులకు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది.

*సుజీవన్ వావిలాల*🖋️

చెరువులను మింగుతున్న ప్రభుత్వ అధికారులు

https://youtu.be/qnnFOdMJyYA?si=KtEY0avnvXv19Yij                                             
*_ప్రజలారా మేలుకోండి.చెరువుల సుందరీకరణ ఎవడికి లాభమో తెలుసు.చెరువులను కాపాడుకోకపోతే భవిష్యత్ లో చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది.చెరువులను పరిరక్షించుకుందాం.... Bplkm🪶_*                                                     
*@TelanganaCMO @MinisterKTR @KTRBRS @TelanganaCS @arvindkumar_ias @CommissionrGHMC* *@LubnaSarwath*                                                                              https://twitter.com/Praja_Snklpm/status/1694938026051510507?t=zGp9xg2alrZkINU7xuSh_Q&s=19                                                                 
 *****---*****---*****                                         https://www.instagram.com/reel/CwhujvVKF_h/?igshid=NmQ4MjZlMjE5YQ==

Monday, August 28, 2023

KCR Likely to Replace MLA Mynampally

KCR Likely to Replace MLA Mynampally


Courtesy / Source by : Deccan Chronicle.| DC Correspondent

Published on: August 29, 2023 | Updated on: August 29, 2023
Speculation is rife in BRS circles that CM Rao has decided to replace Malkajgiri MLA Mynampally Hanumantha Rao. (DC File Photo)

Speculation is rife in BRS circles that CM Rao has decided to replace Malkajgiri MLA Mynampally Hanumantha Rao. (DC File Photo)

HYDERABAD: The BRS which announced candidates for 115 Assembly constituencies on August 21, even before the Election Commission issued poll notification, is set to name candidates for the remaining four seats this week.

Sources said that party president and Chief Minister K. Chandrashekar Rao had finalised the candidates.

Speculation is rife in BRS circles that CM Rao has decided to replace Malkajgiri MLA Mynampally Hanumantha Rao, who created a political storm by making adverse comments against finance minister T. Harish Rao, after the party decided to deny ticket to Mynampally Rohit, son of Hanumantha Rao.

It is believed that the BRS boss is considering naming MLC Shambhipur Raju as a replacement for Hanumantha Rao. In this context, Raju's meeting with Harish Rao here on Monday assumed significance.

Advertisement

CM Rao has kept the announcement of candidates on hold for Jangaon, Narsapur, Nampally and Goshamahal. Party sources informed that Chandrashekar Rao had finalised Rythu Bandhu Samithi chairman and MLC Palla Rajeshwar Reddy for Jangaon to replace MLA Muthireddy Yadagiri Reddy and TS Women's Commission chairperson Vakiti Sunitha Laxma Reddy in place of MLA Chilumula Madan Reddy.

For Goshamahal and Nampally constituencies, Chandrashekar Rao reportedly finalised the candidature of Nand Kishore Vyas Bilal and Munukutla Anand Goud respectively. Interestingly, Kishore and Goud were unsuccessful in 2018.

Party working president and IT minister K.T. Rama Rao, on a visit to the US since August 20, is expected to return to the city by September 1. The names of the four remaining candidates will be released after his return.

If Yadagiri Reddy and Madan Reddy are left out, the number of MLAs dropped by the BRS will increase to nine. If Hanumantha Rao is also dropped, the number will increase to 10.  Seven MLAs were dropped from the  candidates list announced on August 21.

Although the name of Korutla MLA Kalvakuntla Vidyasagar Rao and Kamareddy MLA Bajireddy Goverdhan did not figure in the first list, the party leadership is not treating them as dropped. Vidyasagar Rao had cited ill-health and asked the party to nominate his son son K. Sanjay.

Goverdhan stayed away from Kamareddy to pave way for Chandrashekar Rao to contest a second seat, besides Gajwel.


వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై ఏం చర్యలు తీసుకున్నారు...?

*వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై ఏం చర్యలు* *తీసుకున్నారు...?*
       
 *హైకోర్ట్*

హైదరాబాద్‌: వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతి మృతికి కారణమైన నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ చేశామని కాకుండా ఘటనపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో ర్యాగింగ్‌ నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంది. ఎండీ అనస్థీషియా మొదటి సంవత్సరంలో చేరిన ప్రీతిని రెండో సంవత్సరం విద్యార్థి సైఫ్‌ కులం పేరుతో ర్యాగింగ్‌ చేయడంతోపాటు తన మిత్రులతో కలిసి దారుణంగా హత్య చేశారని, బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు సీబీఐతో దర్యాప్తు చేయించాలని తెలంగాణ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.మల్లయ్య రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విశ్వజాగృతి మిషన్‌ వర్సెస్‌ కేంద్రం కేసులో ర్యాగింగ్‌ నియంత్రణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటి అమలుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️

Sunday, August 27, 2023

ఇండియాలో చేరుతారా...కేసీఆర్ ?

*ఇండియాలో చేరుతారా...? భాజాపా కు మద్దతిస్తారా...? కేసీఆర్ స్పష్టంచేయాలి*

ముంబయి : అమీబా ' జీవి మాదిరిగానే భాజపా నేతృత్వంలోని ఎన్డీయే (NDA)కూ ఒక కచ్చితమైన ఆకారం, పరిమాణం లేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ఎద్దేవా చేశారు.ఆదివారం ఇక్కడి హింగోలీలో నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి ఉద్ధవ్‌ (Uddhav Thackeray) ప్రసంగించారు. భారాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ (KCR).. 'ఇండియా (INDIA)' కూటమికి మద్దతిస్తారా? లేదా భాజపాకా? అనేది స్పష్టం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. 'ఇండియా' కూటమిని 'ఘమండియా (దురహంకారి)'గా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. ఎన్డీయేను 'ఘమండా (ghama-NDA)' అని పిలవాలన్నారు.

'దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునే జాతీయవాద పార్టీలు 'ఇండియా' కూటమిలో ఉన్నాయి. కానీ, ఎన్డీయేలోని చాలా పార్టీల్లో ద్రోహులు, ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేసి భాజపాతో మిత్రపక్షంగా చేరిన వారు ఉన్నారు' అని ఠాక్రే మండిపడ్డారు. ప్రస్తుత ఎన్డీయే.. అమీబా లాంటిదని, దానికి కచ్చితమైన ఆకారం, పరిమాణం లేదని విమర్శించారు. భాజపాను ఇండియా కూటమి ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు 'ఇండియా'కు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష కూటమి అనేది.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టలేదని, దేశం కోసమే ఇదంతా అని పేర్కొన్నారు.భారాస అధినేత కేసీఆర్‌.. దేశం కోసం పోరాడాలా? లేదా భాజపాకు మద్దతివ్వలా? అనేది తేల్చుకోవాలని ఉద్ధవ్‌ అన్నారు. 'ఒకవేళ దేశంతో ఉంటే.. ఇండియా కూటమిలో చేరండి. లేదా, భాజపాతో మీ పొత్తును బహిరంగంగా ప్రకటించండి. కానీ, ఓట్లను చీల్చకండి' అని వ్యాఖ్యానించారు. భారాస తొలుత సొంత రాష్ట్రంపై దృష్టి సారించాలని, అక్కడ పార్టీ పరిస్థితులు బాగోలేవని విమర్శించారు. కొన్నాళ్లుగా మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్‌ దృష్టిసారించడాన్ని స్థానిక 'మహావికాస్‌ అఘాడీ' నేతలు ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబయిలో 'ఇండియా' కూటమి సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఠాక్రే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

*సుజీవన్ వావిలాల*🖋️ 

డ్రగ్స్ కేసులో ఎస్ఐ.... రాజేందర్ అరెస్ట్

*డ్రగ్స్ కేసులో ఎస్ఐ.... రాజేందర్   అరెస్ట్*

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలన ఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్‌ కేసులో ఎస్‌ఐ రాజేందర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, రాజేందర్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగంలో ఎస్‌ఐగా బాధత్యలు నిర్వర్తిస్తున్నారు.వివరాల ప్రకారం.. డ్రగ్స్‌ కేసులో ఎస్‌ఐ రాజేందర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, ఇటీవల మహారాష్ట్రలో చేసిన ఓ ఆపరేషన్‌లో ఎస్‌ఐ రాజేందర్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలో పట్టుబడిన డ్రగ్స్‌ను కోర్టులో ప్రవేశపెట్టలేదు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ఎస్‌ఐ రాజేందర్‌ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజేందర్‌ ఇంట్లో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు రాజేందర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు. కాగా, దాచిపెట్టిన డ్రగ్స్‌ను అమ్ముకోవడానికి ప్లాన్‌ చేసినట్టు విచారణలో తెలిసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Saturday, August 26, 2023

ఎస్సి, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్

*ఎస్సి, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్*

చేవెళ్లలో ప్రజా గర్జన పేరుతో ఏర్పాటు చేసిన కాంగ్రెస్  బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  హాజరయ్యారు.వేదికపై గద్దర్ చిత్రపటానికి ఖర్గే, రేవంత్, భట్టి, తదితరులు నివాళులు అర్పించారు. చేవెళ్ల ప్రజాగర్జన సభలో చేరికలు మొదలయ్యాయి. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆర్మూర్ నేతలు గోర్త రాజేందర్, వినయ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి చేరారు. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కోట శ్రీనివాస్ చేరారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. డిక్లరేషన్‌ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చదివి వినిపించారు."ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చదవడంతో నా జన్మ ధన్యమైంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తాం. అంబేద్కర్ అభయహస్తం పేరుతో 12 లక్షల ఆర్థిక సహాయం. ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు పెంచుతాం. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఇందిరమ్మ ఇంటి స్కీమ్, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి రూ. 6 లక్షల ఆర్థిక సహాయం చేస్తాం. అసైన్డ్, అటవీభూములు, పొడు భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం." అని రేవంత్ రెడ్డి అన్నారు

*సుజీవన్ వావిలాల*🖋️ 

మైనంపల్లి ఇంటికి భారీగా చేరుకున్న అభిమానులు....!

*మైనంపల్లి ఇంటికి భారీగా చేరుకున్న అభిమానులు....!*

హైదరాబాద్‌: మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసం వద్ద ఉత్కంఠ నెలకొంది. మైనంపల్లి నివాసానికి మల్కాజిగిరి, మెదక్‌ నియోజకవర్గాల నుంచి భారాస కార్యకర్తలు, కార్పొరేటర్లతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.ఇటీవల తిరుమలలో మంత్రి హరీశ్‌ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భవిష్యత్‌ కార్యాచరణపై విస్తృత చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తన కుమారుడు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ టికెట్‌ను భారాస నిరాకరించడంతో అనుసరించాల్సిన వ్యూహాలపై అనుచరులతో మైనంపల్లి చర్చించనున్నట్లు సమాచారం. కాసేపట్లో కార్యకర్తలతో మాట్లాడనున్నారు. ఆయన నివాసానికి కాంగ్రెస్ నాయకులు కూడా వస్తున్నారు. ఇప్పటి వరకైతే హనుమంతరావు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. మైనంపల్లి నాయకత్వం వర్థిల్లాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Friday, August 25, 2023

తెలంగాణ లో ఉద్యోగ ఉపాధి కల్పన,అవినీతిని, కులగణన మీద చర్చ

ప్రియమైన మిత్రులకు
SDF నుండి శుభాభివందనములు..
మేము రేపు అనగా 26-08-2023 ఉదయము 10.30 గంటల నుండి 2 గంటల వరకు ప్రెస్ క్లబ్ , సోమాజిగూడ , హైదరాబాద్ లో 
' తెలంగాణ లో ఉద్యోగ ఉపాధి కల్పన ఎట్లా చెయ్యాలి ? అవినీతిని ఎట్లా నిర్మూలించాలి ? కుల గణన ఎందుకు చెయ్యాలి ? ' అనే అంశాల మీద ఒక సమావేశం పెడుతున్నాము. 
ఈ మీటింగ్ లో ప్రజలకు రాజకీయ పార్టీలకు రాష్ట్రం లో ఉపాధి కల్పన, అవినీతి, కులగణన మీద ప్రభుత్వ విధానాలు ఎట్లుంటే బాగుంటుందో SDF ప్రతిపాదిస్తుంది.
SDF Recommended manifesto on Employment, Corruption , Caste census in Telangana to be adopted by all political
Parties in their manifestos. దీనిని పుస్తక రూపంలో విడుదల చేయడం జరుగుతుంది. 
అందరు హాజరు కాగలరని కోరుతున్నాము.
Likeminded వాళ్ళను రమ్మని ఆహ్వానించగలరు 

Courtesy / Source by :
Regards - ఆకునూరి మురళి IAS (retd ), కన్వీనర్ , సోషల్ డెమోక్రాటిక్ ఫోరమ్ ( SDF ) 
హైదరాబాద్

woman deliver on the road!

A BROKEN HEALTHCARE SYSTEM lets a woman deliver on the road! 

Korukanti Lavanya, an adivasi pregnant woman is robbed of basic human decency when she delivered in the middle of the street in #Khanapur #Telangana because the local PHC ambulance denied to pick her up saying there isn’t enough DIESEL to come till Tulasipuram village.
The family had to call for another ambulance from the Mandal headquarters that arrived 3 hrs later. Meanwhile, Lavanya went into labor & delivered on the road.
#Healthcare #HealthForAll

Courtesy / Source by :
https://twitter.com/revathitweets/status/1694918353146814864?t=54zRfmHuxldnaqlUVsX87Q&s=19

Thursday, August 24, 2023

_సి.పి. ఐ. ఎం.ఎల్(జనశక్తి) కూర రాజన్న,కూర అమర్ పోలీసుల అదుపులో?

పత్రిక ప్రకటన
*మానవ హక్కుల వేదిక*
(Human Rights Forum)
తెలంగాణ 

సి.పి. ఐ. ఎం.ఎల్( జ న శక్తి) పార్టీ వ్యవస్థాపక నాయకుడు,*కూర రాజన్న,కూర అమర్ తో బాటు ఇంకొక కార్యకర్త ను* మిర్యాలగూడ మండలం లోని మాడుగుల పల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని,మా సంస్థ కు సమాచారం వచ్చింది.

కూర రాజన్న గారు వృద్దాప్యంలో ఉన్నారని,ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని,వారి బంధువులు తెలిపారు.
అరెస్ట్ చేసిన వారిని ప్రశ్నించి వదిలి వేయాలని,వాళ్ళు ఏదైనా నేరంలో అనుమా నీతిలుగా ఉంటే కోర్టు లో
హాజరు పరచాలని మా సంస్థ డిమాండ్ చేస్తుంది.

*S. జీ వన్ కుమార్
ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు.
*Dr.తిరుపతయ్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
Dt.24-08_2023

గద్వాల్ MLA గా డీకే అరుణ

*గద్వాల్ MLA గా డీకే అరుణను  ప్రకటించిన తెలంగాణ హైకోర్ట్.*

తెలంగాణలో మరో ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడింది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్ట్ గురువారం అనర్హత వేటు వేసింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని రుజువవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది. 2018 ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి తర్వాతి స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ప్రకటించింది.

మహబూబ్ నగర్: గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది.ఈ తీర్పుపై డీకే అరుణ స్పందించారు. తీర్పు ఆలస్యమైనా న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందని అన్నారామె. 

'తీర్పు ఆలస్యమైన న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు ఈ తీర్పును స్వాగతిస్తారు.. గౌరవిస్తారు. ప్రభుత్వం కూడా బేషజాలకి పోకుండా కోర్టు తీర్పును గౌరవించాలి. కోర్టు ఆర్జర్ కాపీ రాగానే ఎలక్షన్ కమీషనర్, అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ ను కలుస్తాను'' అని తెలిపారామె.

*సుజీవన్ వావిలాల*🖋️


Wednesday, August 23, 2023

_Thank You @isro & team!_

*_Proud moment of being an #Indian #Chandrayan3 Congratulations & Thank You @isro & team!....#Prajasankalpam... Bplkm🪶_*

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg (youTube)
https://prajasankalpam1.blogspot.com/
https://www.instagram.com/p/CwS9NiIvBWj/?igshid=MTc4MmM1YmI2Ng==

Tuesday, August 22, 2023

తెలంగాణలో రేపు 6.30 వరకు స్కూల్స్ ఓపెన్.‌!

✍️విద్యాశాఖ కీలక నిర్ణయం..

*తెలంగాణలో రేపు 6.30 వరకు స్కూల్స్ ఓపెన్.‌!*

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (బుధవారం) సాయంత్రం 6.30 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను నడపాలని నిర్ణయించింది.ఈ మేరకు విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 ప్రాజెక్ట్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ రేపు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చంద్రుడిపై ల్యాండ్ కానుంది. ఈ విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగే అద్భుత ఘట్టాన్ని విద్యార్థులు నేరుగా చూడాలనే ఆలోచనతో రేపు స్కూళ్లను 6.30 వరకు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అద్భుత ఘట్టాన్ని స్టూడెంట్స్ వీక్షించేందుకు స్కూళ్లలో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో రేపు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు 6.30 వరకు నడవనున్నాయి. 

మహేందర్ రెడ్డి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న.... పైలెట్ రోహిత్ రెడ్డి....!

*మహేందర్ రెడ్డి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న.... పైలెట్ రోహిత్ రెడ్డి....!*

మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కలిసిపోయారు. బద్ధ శత్రువులైన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిన్న దోస్తులయ్యారు.నిన్నటి వరకు శత్రువుల్లా కొట్టుకున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.. కేసీఆర్ చొరవతో కలిసిపోయారు. మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనని కలిసి, కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు పైలెట్ రోహిత్ రెడ్డి. కాగా పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల్లోనే మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకోనున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, August 20, 2023

_ఎల్.బి. నగర్ పోలీస్ స్టేషన్ సంఘటనపై HRf నిజ నిర్ధారణ నివేదిక_

*ఎల్.బి. నగర్ పోలీస్ స్టేషన్ సంఘటనపై నిజ నిర్ధారణ నివేదిక* 

తేదీ : 20 ఆగష్టు 2023

ఆగష్టు 15 వ తారీఖు రాత్రి 11 గంటల సమయం లో   వర్ద్య లక్ష్మి (గిరిజన ఒంటరి మహిళ) అనే మీర్పేట్ నివాసి మరియు మరికొందరు ట్రాన్సజెండెర్ లను ఎల్.బి. నగర్ పోలీసులు, వాహనం లో ఎక్కించుకొని, బాధితురాలిని పోలీస్ స్టేషనులో చిత్రహింసలు పెట్టి మరుసటి రోజు వదిలిన సంగతి తెలిసినదే. ఈ వార్త, పత్రికలో, ఎలక్ట్రానిక్ మీడియా లో చాల ప్రాముఖ్యం పొందింది. దానికి స్పందిస్తూ రాచకొండ కమీషనర్ గారు, పోలీసులు చేసింది తప్పే అని విన్నపించుకుని  ఒక మహిళా పోలీసుతో సహా ఇద్దరు కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేశారు. ఈ విషయం పై వివిధ సంఘాలతో నిజ నిర్ధారణకు వెళ్ళిన బృందానికి ఆశ్చర్యకర విషయాలు తెలిసాయి.

15 వ తారీఖు పోలీస్ స్టేషన్ లో లక్ష్మి మీద హింస ప్రయోగించారు, తనని పొలిసు వాహనం లో తీసుకు వెళుతున్నప్పుడు మహిళా పొలిసులు ఎవరు లేరు  అన్న విషయం మాత్రమే బాధితురాలు మరియు పొలిసు డిపార్ట్మెంట్ ఒప్పుకున్న ఒకే ఒక్క విషయం. 

జరిగిన విషయం 

లక్ష్మి , దేవరకొండ ప్రాంతం నుంచి వలస వచ్చి , మీర్పేట్ ప్రాంతంలో ఇళ్లలో పని చేస్తోంది. ఈమె ST లంబాడ వర్గానికి చెందినది.  కూతురి పెళ్ళి కోసం కొంత ఆస్తి తాకట్టు పెట్టి 3 లక్షలు అప్పు తీసుకొని, ఆ డబ్బుతో ఎల్.బి. నగర్ సమీపం నుండి ఇంటికి వెళ్తుండగా పోలీసులు కొందరు ట్రాన్సజెండర్ వ్యక్తులతో పాటు తనని తీసుకెళ్ళారని, పొలిసు స్టేషనులో తన మొబైల్ కావాలని గట్టిగ అడిగినందుకు హింసకు పాల్పడ్డారు అని, అప్పుడు హింసించిన వారు నలుగురు మగవారు అని లక్ష్మి గారు ఆసుపత్రిలో కలిసిన మా బృందంతో చెప్పారు. జరిగిన సంఘటన  మీడియా లో బాగా రావడంతో, పోలీసులు ఆవిడను వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ లో చికిత్సకు పంపారు. ఆ తరువాత కర్మన్‌ఘాట్ లో ఉన్న జీవన్ హాస్పిటల్ లో చేర్చారు. అక్కడ అయ్యే ఖర్చును పోలీసులు భరిస్తారని మాట ఇవ్వడం జరిగింది. 20 వ తారీఖు తెల్లవారాక ముందే ఆవిడను అక్కడి నుంచి టీచర్స్ కాలనీ లోని శ్యామ్ హాస్పిటల్ కి మార్చారు. జీవన్ హాస్పిటల్ దారిగుండా ముఖ్యమంత్రి వెళ్ళే అవకాశం ఉండడంతో, చాల ప్రాచుర్యం పొందిన ఈ సమస్య పట్ల హాస్పిటల్ ముందు రాస్తా రోకో జరిగే అవకాశం ఉందని అందుకే పోలీసులు అక్కడి నుంచి వెళ్ళమని చెప్పారని తెలిసింది. జీవన్ హాస్పిటల్ లో బిల్లు అప్పటికి ఒక లక్ష ముప్పై వేల దాకా అయ్యింది కానీ, ఇంకా ఎవరు బిల్లు కట్టలేదని తెలిసింది. 

శ్యామ్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడిన మా బృందానికి, లక్ష్మి గారికి ఎక్కడా ఎముకాలు విరగలేదని తెలిసింది. తన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది అని తెలిపారు. "assault with polytrauma" కింద చికిత్స చేస్తున్నారు.

బాధితురాలు లక్ష్మి, తనని పొలిసు స్టేషన్ కి తీసుకువెళ్తున్నపుడు మహిళా పోలీసులు ఎవరు లేరని, తన మీద హింస ప్రయోగించింది నలుగురు మగ పోలీసులని తెలిపారు. తన మొబైల్ తనకి ఇమ్మని గట్టిగ అడగడం వల్లనే తనని బూతులు తిడుతూ కొట్టారని చెప్పారు. బాధితురాలుని కొట్టారు అని సస్పెండ్ చేసిన మహిళా పొలిసు గురించి అడగగా, మహిళా పోలీసు కొట్టలేదని కాకపోతే తనని కొడుతుంటే అడ్డుపడలేదని అన్నారు. పోలీసులు కొట్టడం వల్ల స్పృహ తప్పింది అని, తరువాత లేచి చూస్తే తన మూడు లక్షల రూపాయలు, చెవులకు ఉండే రెండు తులాల బంగారం, తన పర్సు తన ఫోన్ కనబడలేదని అన్నారు. ఈ విషయం ఇంత ప్రచారం పొందటం వల్ల , ఇంకో అద్దె ఇల్లు చూసుకోవాల్సిన పరిస్థితి కలుగుతోంది అని వాపోయారు. 

17 వ తారీఖున, లక్ష్మి గారి కూతురు ఎల్. బి నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఎఫ్.ఐ.ఆర్. నమోదు చెయ్యడం జరిగింది. IPC 324 (ఆయుధాలతో దాడి ), 354 (మహిళపై గౌరవ భంగం), 379 (దొంగతనం) మరియు SC /ST అట్రాసిటీస్ చట్టాలు రాశారు. IPC 166 (అధికార దుర్వినియోగం ద్వారా ఒక వ్యక్తికీ శారీరక హాని కలిగించడం) మాత్రం వాడలేదు.  పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో 3 లక్షల నగదు మరియు చెవి దుద్దులు గురించి ఉండగా, ఎఫ్.ఐ.ఆర్  లో దొంగతనం కాబడ్డ వస్తువులు గురించి పొలిసు వారు నమోదు చేయాల్సిన చోట ఖాళీగా వదిలేశారు. అలాగే అనుమానితులు ఎవరు అన్న చోట  సంబంధిత పోలీసు అధికారులు అని మాత్రమే రాయడం జరిగింది కానీ పేర్లు రాయలేదు. 

పొలిసు స్టేషన్ కి వెళ్ళి విచారించగా, అక్కడ SHO మరియు ACP అందుబాటులో లేరు.  ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన S.I మరియు ఇతర సిబ్బంది మొత్తం పాము చావకుండా కర్ర విరగకుండా మాట్లాడారు. ఎల్. బి. నగర్ సర్కిల్ దగ్గర  వేశ్య  వృత్తి చేస్తూ ప్రజలకు  ఇబ్బంది కలిగిస్తున్నారు అన్న కారణం వల్ల ముగ్గురు ట్రాన్స్ మహిళలను, బాధితురాలిని తీసుకొచ్చారని , బాధితురాలు పోలీసులను బాగా తిట్టిందని, ఆవిడని కొట్టిన వారిలో మహిళా పొలిసు కూడా ఉన్నారని చెప్పారు. లక్ష్మి గారి మీద తప్ప మిగితా వారి మీద పెట్టీ కేసులు మోపడం జరిగిందని, బాధితురాలిని పొలిసు స్టేషన్ కి తీసుకు వచ్చిన విషయం జనరల్ డైరీ లో రాశాము అని, స్టేషన్లో CC టీవీ లు ఉన్నాయి, అవి పని చేస్తున్నాయని చెప్పారు. అయితే జనరల్ డైరీ, CC టీవీ ఫుటేజీ చూపించడం కుదరదు అని చెప్పారు. మూడు లక్షల సంగతి ఎఫ్.ఐ.ఆర్ లో ఎందుకు పొందు పరచలేదని అని అడిగితే అసలు ఆ డబ్బు ఉన్న విషయం తెలియదు అని మసి పూసి మారేడుకాయ చేద్దామని ప్రయత్నించారు. బంగారం మరియు ఫోన్ గురించి అడుగగా, రెండు తులాల బంగారంతో అసలు చెవి దుద్దులు ఉంటాయా అని తిరిగి ప్రశ్నించి, ఫోన్ బాధితురాలి దగ్గరే ఉందని ముగించారు. 

1. బాధితురాలు చెప్పిన దానికి పొలిసులు చెప్పే కథనానికి పొంతన కుదరడం లేదు. బాధితురాలు ఆవిడను నాలుగురు మగ పోలీసులు హింసకు గురి చేసారు అని చెబుతుంటే, డిపార్ట్మెంట్ ఇద్దరు కాన్స్టేబుల్స్  ని దానిలో ఒక మహిళా పోలీసును సస్పెండ్ చేశారు. దీనిపై పారదర్శకంగా విచారణ జరపాలి, పోలీసుల తప్పుని కప్పిపుచ్చడానికి మహిళ పోలీసుని బలిపశువు చేయొద్దు. అధికార దుర్వినియోగం చేసిన పోలీసులపై విచారణ జరగాలి. 

2. బాధితురాలి 3 లక్షల రూపాయలు ,బంగారం మరియు ఆవిడా ఫోన్ సంగతి ఎక్కడ తేలడం లేదు. ఈ విషయాలను కూడా ఎఫ్.ఐ.ఆర్ లో పొందుపరచాలి.

3. మహిళను పొలిసు స్టేషన్ తీసుకు వస్తున్నపుడు , మహిళా పోలీసులు ఉండాలి అన్న నియమాన్ని అతిక్రమించడం జరిగింది, ఈ ప్రోటోకాల్ ని అతిక్రమించిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి.

4. లక్ష్మి గారి చికిత్సకు సంబందించిన ఖర్చు మొత్తం పోలీసులే భరిస్తారన్న నమ్మకం పోలీసులు కలిపించాలి. 


ఈ నిజ నిర్దారణ బృందం లో మానవ హక్కుల వేదిక నుండి సంజీవ్, నరసింహ, వెంకట నారాయణ, రాజు నాయక్, సురేష్, రోహిత్, అమన్ వేదిక నుండి ఆర్.ఇందిర, గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ నాయకులు మంజుల, సంధ్య, మాధవి పాల్గొన్నారు.

Courtesy / Source by : HRf (మానవ హక్కుల వేదిక) హైదరాబాద్ కమిటీ 

Saturday, August 19, 2023

ప్రతిపక్షాలకు ఈ సారి సినిమా చూపిస్తాం.... మంత్రి KTR....!

*ప్రతిపక్షాలకు ఈ సారి సినిమా చూపిస్తాం.... మంత్రి KTR....!*

హైదరాబాద్: ఇందిరా పార్కును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. దక్షిణ భారత దేశంలోనే అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్‌ (వీఎస్టీ-ఇందిరా పార్క్‌)ను మంత్రి ఇవాళ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌లో ప్రారంభించిన ఫ్లైఓవర్లలో ఇది 36వదన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నాయిని నర్సింహారెడ్డి పేరును ఈ స్టీల్‌ బ్రిడ్జ్‌కు పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు చెప్పారు. లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, అప్పడర్‌ ట్యాంక్‌ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తామని తెలిపారు.

మరోవైపు, రాష్ట్రంలో కొంతమంది మతం పేరుతో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రతిపక్షాలకు 2023లోనే సినిమా చూపిస్తామన్నారు.

రూ.450 కోట్ల వ్యయంతో

మొత్తం 2.63 కి.మీల పొడవైన వీఎస్టీ-ఇందిరా పార్క్‌ వంతెనను రూ.450 కోట్ల వ్యయంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద జీహెచ్‌ఎంసీ నిర్మించింది. రాష్ట్రంలోనే తొలి సారిగా మెట్రో బ్రిడ్జిపై నుంచి స్టీల్‌ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ వల్ల ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ స్టీల్ ఫ్లై ఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) వలన రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇందిరా పార్క్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా బాగ్ లింగంపల్లి వీఎస్టీ జంక్షన్ వరకు సులభంగా వెళ్లొచ్చు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Friday, August 18, 2023

పెండింగ్‌లో 12 వేల అప్పీళ్లు.. సీఎస్‌కు ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

పెండింగ్‌లో 12 వేల అప్పీళ్లు.. సీఎస్‌కు ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

Courtesy / Source : by Disha Web Desk 19  18 Aug 2023 7:15 PMదిశ, తెలంగాణ బ్యూరో: స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌ను నియమించాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి కోరారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సహచట్టం కమిషనర్ల నియామకంపై లేఖ రాశారు. రాష్ట్రంలో గత ఆరునెలలుగా సమాచార కమిషనర్లు లేక కమిషన్ ఎలాంటి పనిచేయలేకపోతుందన్నారు. ప్రస్తుతం 12వేలకు పైచిలుకు అప్పీళ్లు కమిషన్‌లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సమాచార కమిషనర్ల నియామకంపై ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వం కమిషనర్ల నియామకానికి చర్యలు తీసుకుందని, ఈ నెల 12న దరఖాస్తు గడువు ముగిసిందని, మొత్తం 281 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వారం రోజులు గడిచినా నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదని, పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లను దృష్టిలో ఉంచుకొని 10 మంది కమిషనర్ల నియామకం చేపట్టాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున సత్వరం చర్యలు చేపట్టాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి❓️

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి❓️*

మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్‌ సంగ్రామ్‌ కన్నుమూసినట్లు తెలుస్తోంది.

అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్లు సమాచారం. 

మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్‌ పరిధిలోని శాస్త్రులపల్లి. గ్రామానికి చెందిన వాడు 

మల్లారెడ్డి కొద్దిరోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా దండకారణ్యంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. సంగ్రామ్‌, సాయన్న, మీసాల సాయన్న, అలోక్‌, అలియాస్‌ దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది..

మల్లా రాజిరెడ్డికి స్నేహాలత అనే ఒక కూతురు ఉంది.. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ లో పనిచేస్తున్న కాలంలో ఆమెను ఉద్యమ సహచరుడు ఓయూ ప్రొఫెసర్ కాశీం పెళ్లి చేసుకున్నాడు.

Source by : social media 

ఆక్సీ్ఫర్డ్ డిక్షనరీలో స్వేరో

*_Dr RS Praveen Kumar IPS retd సర్ గారికి మరియు #SWAERO టీం కు అభినందనలు & శుభాకాంక్షలు తెలియచేస్తుంది 'ప్రజాసంకల్పం & Link Media' for this unique global recognition ✊.... Bplkm🪶_*

#GHMC ఉప్పల్ సర్కిల్ పరిశుద్ధకార్మికుల ధర్నా

https://twitter.com/Praja_Snklpm/status/1692432389505794339?t=ClNsgwZaMliDh2sks76XWA&s=08

*_@TelanganaCMO సారూ దండాలు 🙏.#తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @MinisterKTR @KTRBRS సారూ మీకూ దండాలు 🙏. సీఎం సారూ మీరు మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు జీతాలు పెంచుతాము అన్నారు,ఉద్యోగాలు పేర్మినెంట్ చేస్తాము అన్నారు.ఆరోగ్యభద్రత కార్డులు ఇస్తాము అన్నారు. మరి ఈరోజు వరకు ఎందుకు అమలు చేస్తలేరు సారూ? ఇదేనా #బంగారుతెలంగాణ అంటే సారూ?...' #కేసీఆర్ సారూ 'కరోనా విపత్కర' సమయంలో ఈ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మనందరి ఆరోగ్య భద్రత కోసం అహర్నిశలు విధులు నిర్వహించారు సారూ అలాంటి వీళ్ళ న్యాయమైన డిమాండ్లను ఎందుకు నెరవేర్చలేదు అని ప్రజాసంకల్పం' ప్రశ్నిస్తుంది సీఎం సారూ?_*

*_ఈరోజు (18/08/2023)  #GHMC #ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ లో పనిచేస్తున్న పారిశుద్దకార్మికులు అందరు #కేసీఆర్ సారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని న్యాయమైన డిమాండ్లతో ధర్నా చేస్తున్నారు. వీరికి 'ప్రజాసంకల్పం' మద్దత్తు ఇస్తుంది✊... Bplkm🪶_*

*COPY TO GROUP LINK MEDIA*
https://www.instagram.com/reel/CwE8P86KV4J/?igshid=MTc4MmM1YmI2Ng==

Thursday, August 17, 2023

ఉద్యమ సహచరుడికి సీఎం కేసీఆర్ అపూర్వ గౌరవం

*ఉద్యమ సహచరుడికి సీఎం అపూర్వ గౌరవం...స్టీల్ బ్రిడ్జ్ కీ నాయిని నర్సింహారెడ్డి పేరు.....!*

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పేరు చిరకాలం గుర్తిండిపోయేలా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ నుండి విఎస్టి వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ కు తన ఉద్యమ సహచరుడు నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.ముషీరాబాద్ నియోజకవర్గంలో సుదీర్ఘకాలం రాజకీయ నాయకుడిగా, అంతకుముందు కార్మిక సంఘం నాయకుడిగా చేసిన సేవలకు గుర్తుగా ఆ ప్రాంతంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి నాయిని పేరు పెడుతోంది బిఆర్ఎస్ ప్రభుత్వం.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం భారీగా ప్లైఓవర్ల నిర్మాణం చేపడుతోంది. స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ) లో భాగంగా ఇప్పటికే అనేక ప్లైఓవర్ల నిర్మాణం పూర్తవగా మరికొన్ని నిర్మాణ దశలో వున్నాయి. ఇందులో భాగంగా ఇందిరాపార్క్ నుండి అశోక్ నగర్, ఆర్టిసి క్రాస్ రోడ్ మీదుగా విఎస్టి వరకు రూ.450 కోట్లతో స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారు. ఈ స్టీల్ బ్రిడ్జిని రేపు(శనివారం) మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 2020 లో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన జరగ్గా 2021 లో పనులు ప్రారంభమయ్యాయి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని హైదరాబాద్ లో మొదటి స్టీల్ బ్రిడ్జిని పూర్తిచేసారు. 2.63 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఇందిరాపార్క్, ఆర్టిసి క్రాస్ రోడ్, విద్యానగర్ ప్రాంతాల ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టడంపై ముషిరాబాద్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

_మూసీలో నివాసం ఉంటున్న పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు_

మూసీ నది అడ్డంకులు తొలగించేలా… మూసీలో దుర్బర పరిస్ధితులలో నివాసం ఉంటున్న పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనున్న ప్రభుత్వం

అన్నీ ప్రాథమిక సౌకర్యాలున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రాంతాల్లో... మూసీ పేదలకు పునరావాసం 

సూమారు 10 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇందుకు ఉపయోగించుకోనున్న ప్రభుత్వం

మూసీ అక్రమణల తొలగింపు, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు కోసం ప్రభుత్వానికి నగర ఎమ్మెల్యేల ఎకగ్రీవ వినతి

మూసీ అడ్డంకులు తొలగిన తర్వత మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం

ఇప్పటకే మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం ప్రాథమిక ప్లానింగ్ పూర్తి చేసిన ప్రభుత్వం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేల సమావేశం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల పైన విస్తృతంగా చర్చించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరం కోసం ప్రత్యేకంగా చేస్తున్న అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపైన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో వరద నివారణ కోసం చేపట్టిన SNDP కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని, గతంలో కురిసిన భారీ వర్షాలకు వరద చేరి మునిగిపోయిన అనేక ప్రాంతాలు, ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురిసినా వరద ప్రమాదం నుంచి తప్పించుకున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో SNDP కార్యక్రమం తో పాటు మూసీ నదిని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలకు ప్రభుత్వానికి అండగా ఉంటామని ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 10 వేలకు పైగా ఇండ్లను మూసీ నది ఒడ్డున దుర్భర పరిస్ధితుల్లో నివసిస్తున్న పేద ప్రజలకు అందించి, మూసి పైన కబ్జాలను తొలగించేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారికి ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా కోరారు.

ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో వరద నివారణ కోసం చేస్తున్న కార్యక్రమాలకు మద్దతుగా స్వయంగా ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనపైన ఎమ్మెల్యేలను అభినందించిన మంత్రి కేటీఆర్, ఈ మేరకు ప్రభుత్వం మూసి నదికి అడ్డుగా ఉన్న అక్రమణల నుంచి విముక్తం చేసేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వాడుకుంటుందని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే గుర్తించిన మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న పేద ప్రజలను, అక్కడి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తుందని తెలిపారు. అత్యంత పేదరికం వలన మూసీ నది పక్కన దుర్భరమైన స్థితిలో జీవనం సాగిస్తున్న వీరందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల రూపంలో గొప్ప ఉపశమనం కలుగుతుందన్నారు. దీంతోపాటు మూసీ నది వరద నివారణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలకు, భవిష్యత్తు ప్రణాళికలకు ఈ అక్రమణల బెడద కూడా తగ్గుతుందన్నారు. మూసీ వెంట వరదకు అడ్డంకిగా ఉన్న నిర్మాణాలను తొలగించి, మూసిని బలోపేతం చేస్తామని తెలిపారు. మూసీ అడ్డంకులు తొలగిన తర్వత మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఇప్పటకే మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం ప్రాథమిక ప్లానింగ్  ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు.

మూసీ వరద నుంచి పేద ప్రజలను, నగరాన్ని కాపాడే ఉదాత్తమైన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలే స్వయంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటామని తెలపడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కబ్జాలను అడ్డంకులను తొలగిస్తే భవిష్యత్తులో మూసి పరివాహక ప్రాంతాలకు వరద ప్రమాదం తగ్గుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. SNDP రెండవ దశ కార్యక్రమానికి సంబంధించిన పనులను త్వరలోనే మంజూరీ చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో వాననీటి నిర్వహణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతదన్నారు. 

ఇప్పటికే ప్రకటించిన విధంగా వచ్చే వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపిన కేటీఆర్, ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో గుర్తించిన లబ్ధిదారులకి ఇల్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నచోటనే నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు తెలియజేశారు. 

హైదరాబాద్ నగరంలో గత పది సంవత్సరాల లో జరిగిన విస్తృతమైన అభివృద్ధి పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారన్న నివేదికలును తమకు ఉన్నాయని మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో తెలిపారు. తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి, రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతు అడగాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

Courtesy / Source by :
#KTR Official Media 

_అదనపు వరి పండించడమేలా ? ఆక్షన్ పెట్టి అమ్మడమేలా ?_

అదనపు వరి పండించడమేలా ? 
ఆక్షన్ పెట్టి అమ్మడమేలా  ?

Courtesy / Source by :
కన్నెగంటి రవి, రైతు 
స్వరాజ్య వేదిక, 
ఫోన్ : 9912928422
-----------------------------------------------
తెలంగాణా రాష్ట్రంలో రైతుల నుండీ 2022 వానాకాలం (55 లక్షల టన్నులు ) , 2022-2023 యాసంగి  సీజన్  (65 లక్షల టన్నులు ) లలో సేకరించిన సుమారు కోటీ 10 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని గ్లోబల్ టెండర్లు పిలిచి బహిరంగ మార్కెట్ లో అమ్మాలని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

 ధాన్యం అమ్మకం ధర ఇంకా  నిర్ణయించలేదు కానీ , ఆ వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ ప్రక్రియలో తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసిన కంపెనీలకు లాభమూ, తక్షణ భారం దించుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఉపశమనమూ లభించవచ్చు కానీ, దీర్ఘ కాలంలో వివిధ కోణాలలో రాష్ట్రం తీవ్రంగా నష్ట పోబోతున్నది. ఈ ధాన్యం అమ్మకాల వల్ల , రైతులకు అదనంగా వచ్చే లాభమేమీ ఉండక పోగా, భవిష్యత్తులో బియ్యం  వినియోగదారులకు మాత్రం  భారమే  మిగులుతుంది.  

రైతుల నుండీ ప్రభుత్వం ధాన్యాన్ని కొనేశాక , వాటిని ఏం చేసుకుంటే మనకెందుకు ? అని అనిపించవచ్చు .  బిల్లుల భారం లేకుండా, ఉచిత విద్యుత్ రైతులకు అందుతున్నప్పుడు, విద్యుత్  పంపిణీ వ్యవస్థలు అప్పులలో కూరుకు పోతే మాత్రం మనకెందుకు? అని గతంలో కొందరిలాగే  వ్యాఖ్యానించారు. 

రైతుల నుండీ ధాన్యం సేకరించిన పౌర సరఫరాల శాఖ అప్పుల్లో కూరుకుపోయినా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసే డిస్కం లు అప్పుల్లో కూరుకుపోయినా అధికార పార్టీకీ , రాష్ట్ర ప్రభుత్వానికీ వచ్చే  తక్షణ నష్టం ఏమీ లేదు . ఆ ఆర్ధిక భారాన్ని భవిష్యత్తులో మోయవలసినది రాష్ట్ర ప్రజలే.  నిజానికి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు  అప్పుల ఊబిలో  కూరుకు పోకుండా కాపాడడం , అందుకు బడ్జెట్ నుండీ అవసరమైన నిధులను  ప్రతి సంవత్సరం కేటాయించడం రాష్ట్ర  ప్రభుత్వ బాధ్యత . 

కానీ  సంక్షేమ పథకాల పేరుతో  రాజకీయ ప్రయోజనం పొంది, వచ్చే ఎన్నికలలో ప్రజల ఓట్లు కొల్ల గొట్టి మళ్ళీ అధికారంలోకి రావాలనే యావలో కూరుకుపోయిన  ఈ ప్రభుత్వం తన పాలనా బాధ్యతలను పూర్తిగా మర్చిపోయింది. ఆయా సంస్థలను  నష్టాల పాలు చేసింది. 

CACP సంస్థ అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2022 -2023 లో క్వింటాలు ధాన్యం సమగ్ర ఉత్పత్తి ఖర్చు (C2) 1877 రూపాయలు.  ఒకవేళ కేంద్ర ప్రభుత్వం  స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం కనీస మద్ధతు ధర కు చట్టబద్ధత  కల్పిస్తే , తెలంగాణ రైతులకు క్వింటాలుకు 2815 రూపాయలు మద్ధతు ధర అందాలి. 

 కానీ ఈ సిఫారసును అమలు చేయకుండా, 2022 లో కేంద్రం ధాన్యానికి  ప్రకటించిన కనీస మద్ధతు ధర  క్వింటాలుకు  2060 రూపాయలు  మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బడ్జెట్ నుండీ అదనపు బోనస్ ఏమీ ఇవ్వలేదు. ప్రతి క్వింటాలుపై తెలంగాణ రైతులు నష్ట పోయింది  755 రూపాయలు . అంటే గత రెండు సీజన్ లలో రాష్ట్రం సేకరించి,ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో అమ్మాలనుకుంటున్న కోటి టన్నుల ధాన్యం పై   రైతులు నష్ట పోయింది 7550 కోట్ల రూపాయలన్నమాట.  ఒక ఎకరం వరి ధాన్యం పండించే రైతుకు నికర నష్టం 18,120 రూపాయలన్నమాట. 

కేంద్రం  ప్రకటించిన  MSP అయినా గత రెండు సీజన్ లలో రైతులకు పూర్తిగా చెల్లించారా ? చెల్లించలేదు. తేమ ఎక్కువుందనే పేరుతో , ధాన్యం నల్లబడి నాణ్యత లేదనే పేరుతో సేకరణ సంస్థలు, రైస్ మిల్లర్లు , ధాన్యం రైతుల నుండీ ప్రతి క్వింటాలుపై  10 శాతం కోత పెట్టి కొన్నారు . ఫలితంగా  రైతులకు ప్రతి క్వింటాలుకు  నికరంగా దక్కిన ధర   కేవలం 1800-1900 రూపాయలు మాత్రమే. 

అంటే రాష్ట్రంలో కోటి టన్నుల సేకరణలో  క్వింటాలుకు 200 రూపాయల చొప్పున రైతులకు జరిగిన  నష్టం 2000 కోట్ల రూపాయలన్నమాట. కేంద్రం MSP ప్రకటనలో చేసిన మోసం వల్లా, ధాన్యం సేకరణలో చేసిన అన్యాయం  వల్లా  రైతులు మొత్తం కోటి టన్నులపై 9550 కోట్ల రూపాయలు నష్టపోయారన్నమాట.

 రైతులకు ఇంత నష్టం చేసి , ఇప్పుడు గ్లోబల్ టెండర్లు  పిలిచి ధాన్యం అతి తక్కువ ధరలకు మార్కెట్ లో అమ్మడం వల్ల వ్యాపారులకు తప్ప , నిజంగా ప్రభుత్వానికి , ప్రజలకు, రైతులకు  ఏమైనా లాభం ఉందా? 

ఇండియన్ కౌన్సిల్  ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సంస్థ ప్రతి మనిషికి ఆరోగ్యం కోసం రోజుకు నాలుగు వందల గ్రాముల ఆహార ధాన్యాలు అవసరమని సిఫారసు చేసింది. అంటే  నెలకు 12 కిలోలన్నమాట . ఇందులో సగం ( 6 కిలోలు) రేషన్ కార్డులపై బియ్యంగా  సరఫరా చేసినా,  మిగిలిన సగం  జొన్నలు, ఇతర చిరు ధాన్యాల రూపంలో  తక్కువ ధరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే చిరు ధాన్యాల పంటలను రైతుల నుండీ సేకరించడానికి ఆహార బధ్రత చట్టం కింద కేంద్రం అనుమతించి, ఆర్ధికంగా కూడా సహకరిస్తుంది . కర్ణాటక లాంటి రాష్ట్రాలు చాలా కాలంగా ఈ పద్ధతిని అమలు చేస్తున్నాయి. 

దీనివల్ల కేవలం వరి ధాన్యం పండించే రైతులకే కాకుండా , చిరు ధాన్యాలు  పండించే  రైతులకు కూడా కనీస మద్ధతు ధరలు దక్కుతాయి. పప్పు ధాన్యాలను, నూనె గింజలను కూడా అలా రైతుల నుండీ మద్ధతు ధరలకు సేకరించి ప్రజలకు తక్కువ ధరలకు సరఫరా చేయవచ్చు. అప్పుడే వరి మాత్రమే కాకుండా ఈ అన్ని పంటలనూ రైతులు పండిస్తారు. 

కానీ ఇవాళ తెలంగాణ లో ఒక మనిషికి నెలకు 6 కిలోల వరి బియ్యం తప్ప, రేషన్ కార్డులపై మరేమీ సరఫరా చేయడం లేదు.  ఫలితంగా కుటుంబానికి అవసరమైన అదనపు బియ్యాన్ని పేదలు , ఇతర వినియోగదారులు ఎక్కువ ధరలకు మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. ఇది వ్యాపారులకు లాభం, వినియోగదారులకు భారంగా పరిణమించింది. 

ప్రపంచ  ఆకలి సూచీలో  భారత దేశం 121 దేశాలలో 107 వ స్థానంలో ఉంది.   ప్రజలకు అవసరమైన పౌష్టిక ఆహారం దొరకక పోవడం వల్ల, మహిళలలో, పిల్లలలో  రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 వ రౌండ్ నివేదిక కూడా బయట పెట్టింది.  తెలంగాణ రాష్ట్రంలో 15-49 సంవత్సరాల మధ్య వయస్సు గర్భిణీ స్త్రీలలో 53.2 శాతం  మంది, 15-49 సంవత్సరాల మొత్తం మహిళలలో 57.6 శాతం మంది మహిళలు  రక్త హీనత తో బాధ పడుతున్నారని ఈ నివేదిక బయట పెట్టింది.  అంటే  ప్రజలకు కడుపు నిండా ఆహారం దొరకడం లేదని అర్థం. 

 ఈ స్థితిని నివారించడానికి  గ్రామీణ, పట్టణ పేదలకు  నెలకు మనిషికి   ఆరు  కిలోలు కాకుండా,  12 కిలోల బియ్యాన్ని సరఫరా చేయవచ్చు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేయడం లేదు. 

ఇవాళ బహిరంగ మార్కెట్ లో నాణ్యమైన సన్న బియ్యం ధర కిలో 55 నుండీ 60 రూపాయలు పలుకు తున్నాయి. రైతుల నుండీ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన  ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి ఆ  బియ్యాన్ని పట్టణాలలో మధ్యతరగతి కుటుంబాలకు  రైతు బజార్ల ద్వారా  కిలో  35-40 రూపాయల చొప్పున అందించేందుకు అవకాశం ఉంది. రైతు బంధు కార్పొరేషన్ ద్వారా ఈ పని చేస్తామని గతంలో జీవో కూడా ఇచ్చిన ప్రభుత్వం   ఆ పని కూడా చేయడం లేదు.  కానీ బహిరంగ మార్కెట్ లో ధాన్యం  అమ్మకానికి సిద్ధమైంది. 

అసలు మన రాష్ట్రం ఇంత ఖర్చు పెట్టి మన అవసరాలకు మించి, వరిని పండించాల్సిన అవసరం ఉందా ? ఒక మనిషికి నెలకు 12 కిలోలు, సంవత్సరానికి 144 కిలోలు బియ్యం అవసరం. వలస కార్మికులతో సహా,  రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది  ఉన్నారనుకుంటే సంవత్సరానికి  57,60,000 టన్నుల బియ్యం కావాలి. ఇందుకు అవసరమైన  ధాన్యం ఎకరానికి 24 క్వింటాళ్ల దిగుబడి చొప్పున సుమారు 86,40,000 టన్నులు. ఈ ధాన్యం  పండించడానికి సంవత్సరానికి అవసరమైన సాగు భూమి కేవలం 36 లక్షల ఎకరాలు మాత్రమే.   ఈ ధాన్యం రెండు సీజన్ ల లోనూ పండించుకునే అవకాశం ఉంది .  

కోటి ఎకరాల మాగాణం పేరుతో, ప్రభుత్వం రైతులను వరి వైపు నెట్టడం వల్ల 2020 నుండీ  మన రాష్ట్ర అవసరాలకు మించి  మొత్తం రెండు సీజన్ లలో కలిపి కోటి ఎకరాలకు పైగా వరి సాగవుతున్నది. ఉచిత విద్యుత్ ఇచ్చి,  రైతు బంధు పెట్టుబడి పెట్టి పండించిన ఈ ధాన్యాన్ని పూర్తిగా FCI కొనే అవకాశం లేదు.  పండిన పంటను కొంత కాలం దాచుకోవడానికి గ్రామ స్థాయిలో గిడ్డంగుల సౌకర్యం లేదు. ఈ నేపధ్యంలో స్థానికంగా అమ్ముకోలేక  గ్లోబల్ టెండర్ లు పిలిచి అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడింది. 

వరి సాగు విస్తీర్ణం పెరగడం అనేక పర్యావరణ సమస్యలను కూడా సృష్టిస్తున్నది. రసాయన ఎరువుల వినియోగం పెరిగి భూములు నిస్సారమైపోతున్నాయి.  గ్రీన్ హౌజ్ వాయువులు  ముఖ్యంగా గాలిలో మిథేన్ విపరీతంగా పెరుగుతున్నది. కలుపు , పురుగు విషాల వినియోగం పెరిగి ఆహారం  పూర్తిగా విష పూరితమైపోతున్నది.  వరి సాగు కోసం చేసే లోతు దుక్కులు, దమ్ము, మొత్తం సాగు భూములను ఇతర పంటల సాగుకు పనికి రాకుండా  చేస్తున్నాయి. వరిలో అత్యధిక నీటి వినియోగం వల్ల  భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతున్నది. 

మరో వైపు ఆరోగ్యానికి అవసరమైన పౌష్టిక విలువలు అందించే పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు రాష్ట్రంలో తగినంత ఉత్పత్తి కావడం లేదు.  ఇవన్నీ బయట ప్రాంతాల నుండీ మన రాష్ట్రం లోకి  దిగుమతి అవుతున్నాయి.  ఈ సరుకుల ధరలు కూడా పేద, మధ్య తరగతి కుటుంబాలకు అందనంత  ఎత్తున ఉంటున్నాయి . 
అన్ని పంటలనూ చంపేసి, వరిని ప్రోత్సహించి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ లో వేలం వేయడమేమిటి ? అన్యాయంగా లేదూ .. 

ఈ దశలో తెలంగాణ ప్రభుత్వమూ, రైతులూ కూడా తెలంగాణ లో వరి సాగు  విస్తీర్ణం  పై సీరియస్ గా ఆలోచించి నిర్ణయించుకోవాల్సిన సందర్భమిది.

Wednesday, August 16, 2023

hydcitypolice culture - FriendlyPolicing

Had a marathon 6 hour VC with about a 1000 SI and above rank officers of Hyderabad City Police, HCP .As per the rules of the election commission , many in the Inspector , ACP and Addl DCP ranks have come freshly to the City police .

So I thought it’s time to acquaint them with the various challenges HCP faces , the highlights of reorganisation of city police after 35 years and the creation of several new wings , the methodology and tactics we use to maintain absolute peace , the various technologies used to monitor and quickly detect crimes , challenges of cyber - narcotics - organised crimes , an in-depth review of pending arrests and detections and action plans , control over rowdy gangs , how traffic flow is maintained despite 82 lakh vehicles on the road , leadership roles and job charts of Sector SI s, SHO s , ACP s and DCP s, the upcoming elections, Ganesh - Milad processions  and so on.

Throat went sore but feel more confident that the new officers are now in tune with @hydcitypolice culture🤗

Courtesy / Source by :

https://twitter.com/CVAnandIPS/status/1691862496741835058?t=NTLNon57EJLSBq2w0MJFQw&s=19

_మీరేం పరిపాలన చేస్తున్నారో మీకు అర్ధం అవుతుందా ⁦@KTRBRS⁩ ??_

https://twitter.com/Murali_IASretd/status/1691425057002946560?t=cZMDEkmEfa0J5jo59JXjKg&s=08                                                                    
*_మీరేం పరిపాలన చేస్తున్నారో మీకు అర్ధం అవుతుందా ⁦@KTRBRS⁩ ??మీ తప్పు పద్దతులను మీ అవినీతిని ఎత్తి చూపిస్తున్నారని మీరు అంత పెద్ద మీడియాను ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకావడానికి పిలవరా??అధికారం మత్తులో ఉండి ప్రజాస్వామ్యం లో ఉన్నామని మరచిపోతున్నారు.ఇది మీ సొంత కార్యక్రమం కాదుకదా??... @ఆకునూరి మురళి IAS retd_*                                      *****---*****---*****                                                                                                        
*_@మురళి సర్ #తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఎవరి ప్రయోజనాల కోసం ఆ కుర్చీలో కూర్చున్నాడు?? ఆయన గారు ఎక్కడ వున్నారు?? అసలు #తెలంగాణ లో ఏ 'మీడియా' ఎవరికోసం పనిచేస్తుందో అర్ధం కావడం లేదు....పాలకులకు అమ్ముడుపోతున్న చాలా మీడియా యాజమాన్యాలు... చట్టాలను గౌరవించి ప్రజల పక్షాన నిలబడ్డ #జర్నలిస్ట్ల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు... ఇది #బంగారుతెలంగాణ..... Bplkm🪶_*

https://twitter.com/Praja_Snklpm/status/1691434761108230144?t=b4n6V3h4rGL5xV7eS-zRvw&s=19

#GHMC టౌన్ ప్లానింగ్ లో అవినీతి తిమింగిలాలు

*_@GHMC అన్ని సర్కిల్ కార్యాలయాల పరిధి నుంచి 'ప్రజాసంకల్పం Link Media' కు వచ్చిన #చట్టాలను ఉల్లంఘించి నిర్మాణాలు చేసిన #అక్రమనిర్మణాల ఫిర్యాదులను మన 'లీగల్ బృందం' సంబంధిత శాఖల ఉన్నతాదికారుల దృష్టికి వాస్తవాలతో తీసుకెళ్లడం జరిగింది. దానికి వారు స్పందించారు. అక్రమనిర్మణాల  ఫిర్యాదుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోని అధికారుల లిస్ట్ ను #తెలంగాణఉన్నతన్యాయస్థానం లో పిటిషన్ వేయడం జరుగుతుంది. ఇదివరకే ఉన్నత న్యాయస్థానం ఈ #అక్రమానిర్మాణల మీద ఘాటుగా స్పందించినా అవినీతి అధికారులలో మార్పు రావడం లేదు. న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించని అవినీతి ప్రభుత్వ అధికారుల భరతం పట్టాల్సిందే ✊.... Bplkm🪶_*

Monday, August 14, 2023

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ....!

*ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ....!*

దిల్లీ...దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. దిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధాని..ఆ తర్వాత ఎర్రకోట వద్దకు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారతీయులకు ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పారు. బాపూజీ చూపిన అహింసా మార్గంతో స్వాతంత్ర్యం సాధించామని మోదీ గుర్తుచేశారు. ఈ ఏడాది అరవిందుడు, దయానంద సరస్వతి 150వ జయంతిని నిర్వహిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. రాణి దుర్గావతి, మహాభక్తురాలు మీరాబాయిని స్మరించుకోవాల్సిన తరుణమిదని చెప్పారు. కొద్దివారాల క్రితం మణిపుర్‌లో జరిగిన హింస అత్యంత బాధాకరమని మోదీ అన్నారు.

ఎర్రకోట వద్ద జరుగుతున్న వేడుకలకు పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర వేడుకల నేపథ్యంలో దేశరాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

_కాంగ్రెస్ అధికారంలోకీ వచ్చాక వైన్ షాప్ లకు... మళ్ళీ టెండర్లు...రేవంత్ రెడ్డి_

*కాంగ్రెస్ అధికారంలోకీ వచ్చాక వైన్ షాప్ లకు... మళ్ళీ టెండర్లు.... రేవంత్ రెడ్డి*

హైదరాబాద్‌: భారాస ఓడిపోతుందని అన్ని సర్వేలు చెబుతున్నందునే.. సీఎం కేసీఆర్‌ అన్ని ఆస్తులు అమ్ముకుని విదేశాలకు పారిపోవాలనుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టడానికి జాగా లేదన్న కేసీఆర్.. నగరంలోని వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని నిలదీశారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, భూములు కొన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. 

గాంధీభవన్‌లో అలంపూర్‌, దేవరకద్ర, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు.. ఇవాళ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారందరికి రేవంత్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మద్యం దుకాణాలను సొంత మనుషులకు అప్పగించేందుకే ముందుగానే టెండర్లు వేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక వైన్‌ షాపులకు మళ్లీ టెండర్లు పిలుస్తామన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని పోలీసు అధికారులనుద్దేశించి రేవంత్‌ మాట్లాడారు.

*సుజీవన్ వావిలాల*🖋️

_టీచర్లు పెళ్లి చేసుకుంటేనే బదిలీ అంటే ఎలా?: హైకోర్టు_

*_టీచర్లు పెళ్లి చేసుకుంటేనే బదిలీ అంటే ఎలా?: హైకోర్టు_*

Courtesy / Source by : 
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_బదిలీల ప్రక్రియలో ఏ ప్రాతిపదికన టీచర్ల మధ్య వివక్ష చూపిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టీచర్లు పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తామంటే ఎలా? అని నిలదీసింది. భార్యాభర్తలు ఒకేచోట ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు ఇచ్చినట్టు తెలిపారు. బదిలీలకు సంబంధించి నిబంధనలను సవరించామని.. వాటిని అసెంబ్లీ కౌన్సిల్‌ ముందు ఉంచినట్లు కోర్టుకు వివరించారు. ఈ మేరకు నిబంధనల మార్పులపై ఏజీ కోర్టుకు మెమో సమర్పించారు. స్టే ఉన్నందున బదిలీల ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. ఎన్నికలు వస్తున్నందున త్వరగా విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. ఏజీ.. మెమో, కౌంటర్లు ఇవాళే ఇచ్చినందున కొంత సమయం కావాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ నెల 23న బదిలీలపై వాదనలు వింటామని తెలిపింది._*

హైదరాబాద్ పాత బస్తీలో దారుణ హత్యకు గురిఅయిన 'సామాజిక ఉద్యమకారుడు'

https://twitter.com/RSPraveenSwaero/status/1691033633082273794?t=jJFtX_z62lb_yw55SFzXsA&s=08                                                  
*నన్ను కొందరు దుండగులు చంపే ప్రయత్నం చేస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, హోం మంత్రి మహమూద్ అలీ గారికి గోడు వెళ్లబోసుకున్నా, హైదరాబాద్ పాత బస్తీలో దారుణ హత్యకు గురయ్యాడు 'సామాజిక ఉద్యమకారుడు...షేక్ సయీద్ బవాజీర్'. ఈ ఆడియో హోం మంత్రి తో బాధితుడు మాట్లాడినది. ఒక ఉద్యమకారుడికే ఈ పరిస్థితి ఉంటే, ఇక సామాన్యుల గోసలు ఎట్లుంటయో?*

*This is the audio clip of telephonic conversation between the social activist Shaik Sayeed #Bawazir and HM of Telangana. In this one can see that he is desperately requesting hon’ble HM Mr Mehmood Ali ji for protection as he is suspecting a conspiracy to kill him. Yet this dysfunctional HM and Police couldn’t save the life of Bawazir.* *Eventually he was brutally murdered by a gang on 10th Aug 2023!*

*Is this what we deserve in your No.1 Telangana, #KCR ji?? Pl dismiss your HM*

Courtesy / Source by :
https://twitter.com/RSPraveenSwaero/status/1691033633082273794?t=DF8cDTkIJy0gun3Xtx6Gzg&s=19

గెలుపు ఓటములు నిర్ణయించే శక్తి 'పద్మశాలి' కులస్తులకు వున్నది.

నిన్న కోరుట్ల లో జరిగిన "పద్మశాలి రాజకీయ యుద్ధభేరి" లో దామాషా ప్రకారం అసెంబ్లీ ఎన్నికలలో పద్మశాలి కులస్తులకు సీట్లు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేసారు.

తెలంగాణలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపు ఓటములు నిర్ణయించే శక్తి పద్మశాలి కులస్తులకు వున్నది.

సిరిసిల్ల , కోరుట్ల & జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలలో పద్మశాలి ఎమ్మెల్యే ఉండాలి.

కానీ దురదృష్టవశాత్తు 0.001 శాతం వున్నా వెలమలు ఆధిపత్యం చేస్తున్నారు.

Next.... గౌడ్, యాదవ్ & ముదిరాజ్ కులస్థులు కూడా రాజకీయ బల ప్రదర్శన చేయాలి.

Courtesy / Source by : డాక్టర్ చిగురు ప్రశాంత్  (ట్విట్టర్)


Sunday, August 13, 2023

_వచ్చే ఎన్నికల ఫలితాలు.. ధమాకేదార్_

75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో..
దేశాన్ని దోచుకున్న తోడు దొంగలే – కాంగ్రెస్, బీజేపీ
AICC అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటి
BJP అంటేనే భ్రష్టాచార్ జనతా పార్టీ 

మీ పార్టీలే... 
అసమర్థ పాలనకు కేరాఫ్..
అవినీతి ప్రభుత్వాలకు చిరునామా..

మీ దశాబ్దాల..
పాలనా వైఫల్యాల పాపమే
దేశానికి, రాష్ట్రానికి శాపమై
ఇంకా వెంటాడుతూనే ఉంది.

మమ్మల్ని..
నేరుగా ఢీకొనే దమ్ములేక.. 

MIM భుజంపై తుపాకీపెట్టి 
BRSను కాల్చే కుట్ర చేస్తోంది.. BJP

BJP భుజంపై తుపాకీపెట్టి
BRS ను కాల్చే కుతంత్రం చేస్తోంది.. కాంగ్రెస్

వెన్నుపోటు వారసుడిని నమ్ముకుని.. 
వెన్నుముక లేని పార్టీగా మిగిలిపోయింది...  కాంగ్రెస్

కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా..
BRS అంటేనే భారత రైతు సమితి

తెలంగాణ ప్రజలకు తెలుసు..
మేం తెలంగాణ రైతులకు.. రిష్తేదార్
మేం తెలంగాణ ప్రజలకు.. వఫాదార్

మా ప్రతి పథకం.. దిల్ దార్
మా ప్రతి నిర్ణయం.. దమ్ దార్

మా ముఖ్యమంత్రి.. ఇమాన్ దార్ 
మా ప్రభుత్వం పూర్తిగా.. జిమ్మేదార్
మా తొమ్మిదేళ్ల పరిపాలన.. జోర్ దార్

వచ్చే ఎన్నికల ఫలితాలు.. ధమాకేదార్
దేశంలోనే తెలంగాణ మోడల్.. అసర్ దార్

మీ కాంగ్రెస్ పార్టీ అంటేనే బేకార్
మీ కాంగ్రెస్ చరిత్ర అంతా భ్రష్టాచార్
మీ కాంగ్రెస్ ను నమ్ముకుంటే మళ్లీ అంధకార్

Courtesy / Source by : @KTRBRS
https://twitter.com/KTRBRS/status/1690386653062512641?t=YHI0jMKCvXw9qBi15cH3Jw&s=19

Saturday, August 12, 2023

తిరుమలలో చిరుత దాడి....చిన్నారి కుటుంబానికి 10 లక్షల సాయం....!

*తిరుమలలో చిరుత దాడి....చిన్నారి కుటుంబానికి 10 లక్షల సాయం....!*

తిరుమల: తిరుమల నడక దారిలో శుక్రవారం రాత్రి చిరుత దాడికి గురై మరణించినట్టు భావిస్తున్న చిన్నారి లక్షిత కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.చిన్నారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తితిదే రూ.5లక్షలు, అటవీశాఖ రూ.5లక్షలు కలిపి మొత్తం రూ.10లక్షలు లక్షిత కుటుంబానికి అందజేస్తామన్నారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులపై శనివారం సాయంత్రం అధికారులతో ఆయన మాట్లాడారు. లక్షిత మృతదేహం లభించిన ప్రాంతాన్ని అధికారులతో భూమన పరిశీలించారు. జూన్‌ 22న ఇలాంటి ఘటనే జరిగిన నేపథ్యంలో భక్తుల భద్రత విషయంపై తితిదే ఇప్పటికే అనేక జాగ్రత్తలు తీసుకుందన్నారు. అటవీ, పోలీస్‌, తితిదే అధికారులతో చర్చించి భద్రతా పరమైన ప్రతిపాదనలు చేస్తే తితిదే ఖర్చుతో ఏర్పాటు చేస్తామని చెప్పారు.అటవీ సంరక్షణ చట్టాలు సమర్థంగా అమలు జరుగుతున్నందువల్ల వన్య ప్రాణుల సంఖ్య కూడా పెరిగిందని, భక్తులు వీటి బారిన పడకుండా ఎలా రక్షణ కల్పించాలనేదే తితిదేకి ముఖ్యమన్నారు. బాలిక కనిపించడం లేదన్న సమాచారం అందిన వెంటనే తితిదే అటవీ, పోలీస్, విజిలెన్స్, ప్రభుత్వ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అడవిలో గాలింపు చేపట్టారని తెలిపారు. ఇందులో ఎవరి నిర్లక్ష్యం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బాలిక కుటుంబాన్ని తితిదే తరపున ఆదుకుంటామని చెప్పారు. చిన్న పిల్లలతో నడక మార్గంలో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను పక్కకు వదలొద్దని విజ్ఞప్తి చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

మాదాపూర్ నారాయణ కాలేజ్ విద్యార్థి బలవన్మరణం

*మాదాపూర్ నారాయణ కాలేజ్ విద్యార్థి బలవన్మరణం*

హైదరాబాద్‌: కార్పోరేట్‌ చదువులు మరో విద్యార్థిని బలిగొన్నాయి!. రాజేంద్రనగర్‌లో ఓ కార్పొరేట్‌ కళాశాల ఉదంతం మరువకముందే.. మాదాపూర్ నారాయణ కాలేజీలో సెకండ్‌ ఇయర్‌ విద్యార్థి ఒకరు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు.తన గదిలో ఫ్యాన్‌కి తాడుతో ఉరేసుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు.

కనక రాజు అనే విద్యార్థి.. మాదాపూర్‌ నారాయణ కాలేజీలో ఇంటర్‌ బైపీసీ సెకండియర్‌ చదువుతున్నాడు. మధ్యాహ్న సమయంలో అటెండెన్స్‌ సమయంలో కనకరాజు లేకపోవడంతో.. సిబ్బంది అతని గదికి వెళ్లి చూశారు. అక్కడ విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు కనకరాజు.

చదువులో బాగా రాణించేవాడని, ఫస్ట్‌ ఇయర్‌లో కూడా మంచి మార్కులు వచ్చాయని, అతనికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తమకు తెలియదని కళాశాల యాజమాన్యం చెబుతోంది. మరోవైపు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులకు సమాచారం అందించామని, వాళ్లను ప్రశ్నిస్తే కనరాజుకి ఉన్న సమస్యేంటో బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

_stop vandalism of natural resources

#Hyderabadis need to stop vandalism of natural resources of our beloved city.  TGovt seems to have declared war on our water spaces, rivers, parks, trees, forests, bio diversity, rocks, hills, open spaces. #Hyderabad is nature-centric, Govt converting it into climate crisis city.

Courtesy / Source by :
@Dr Lubna Sarwath 

కఠినమైన శిక్షలకు సుప్రీం కోర్టు కు సిఫార్సు

రాష్ట్రమంతటా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షన్ నిధులు వినియోగంపై మున్సిపాలిటీలలో. మరియు. గ్రామ పంచాయతీలలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ACB విజిలెన్స్ అధికారులు, విజిలెన్స్ ఆడిటింగ్ అధికారులు.CB. CiD.  ACB అధికారులు తక్షణం కళ్ళు తెరవండి నీతి నిజాయితీ గల అధికారులు మీరు ఎక్కడ ఇది ప్రజల ప్రశ్న  🙏🙏 ఇది  ప్రజా ఫిర్యాదుగా పరిగణంలోకి తీసుకోండి🇮🇳  దర్యాప్తులు జరపాలి  నిజాయితీగల అధికారులు, ఈ అవినీతి రెవెన్యూ అధికారుల అక్రమస్తులు తక్షణం  ED మరియు  it. ఆదాయ పన్ను శాఖ స్వాధీనం చేసుకొని  కఠినమైన శిక్షలకు సుప్రీం కోర్టు కు సిఫార్సు చేయవలసిందిగా విజ్ఞప్తి,🙏🙏. అవినీతి  అనకొండ లు బయట పడతారు క రోణాల వ్యాపిస్తున్న ఈ అవినీతికి అంతం లేదా టోల్ ఫ్రీ నెంబర్స్ స్పందన కి,,1902,14400 కి ప్రజలు ఆన్లైన్లో కంప్లైంట్లు చేయవచ్చు నిరుద్యోగ యువ యువతీ యువకుల్లారా మేధావులు  స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి రండి చేయి చేయి కలపండి 🤝జై హింద్ వందేమాతరం  🙏🇮🇳🙏

దాసరి సురేష్... జర్నలిస్ట్ 

గౌరవ న్యాయస్థానాల మీద నమ్మకం వుంది

*_'చెరువుల పరిరక్షణ' కోసం Dr లుబ్నా సర్వత్ మేడం గారి ఆధ్వర్యంలో 'ప్రజాసంకల్పం & Link Media' మరియు కొన్ని NGO's & పర్యావరణ ప్రేమికులు గౌరవ #న్యాయస్థానాలలో (HRC / లోకాయుక్త / తెలంగాణ హై కోర్ట్) పోరాటం చేస్తున్నాము. మాకు న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం వుంది...  చట్టాలను ఉల్లంఘించి చెరువుల పరిరక్షణను గాలికి వదిలేసిన సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల మీద & ప్రజాప్రతినిధుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని గౌరవ న్యాయస్థానాలకు 'ప్రజాసంకల్పం ఫౌండర్ బాపట్ల కృష్ణమోహన్ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ✊

Bplkm🪶
Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
https://prajasankalpam1.blogspot.com/