ఎవరు గుర్తెరగని పలానా వాడు కాదు... భారత దేశంలో అందరికీ సుపరిచితులైన పద్మశ్రీ అవార్డు గ్రహీత "వనజీవి రామయ్య.."
సాధారణంగా చిన్న చిన్న పొగడ్తలకే ఉబ్బి తబ్బిబ్బై పొతం.. చిన్న సన్మానం లభించందంటే చాలు... ఇక చాలురా బాబు ఈ జీవితానికి అని చాటింపు వేస్తాం... మరి ఇన్ని చేసే మనం సాక్షాత్తూ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు పొందిన రామయ్య గారి గురించి ఏం ఊహించుకుంటాం..? తప్పు తప్పు.. ఆయన గురించి ఊహించుకునే స్థాయి మనకు లేదు... ఎందుకంటే మన లాగా ఆయన వచ్చిన దానితో సంతృప్తి చెందలేదు.. ఈ సమాజం కోసం ఇంకా ఏదో చెయ్యాలనే తపనతో... మండుటెండలో...
వృద్ధాప్యం కూడా లెక్క చెయకుండా.. తాను నాటిన భారీ వృక్షాలనుంచి నేలరాలిన నిద్రగానేరు గానుగ విత్తనాలను మండుటెండలో ఏరుతున్నారు. ఇప్పటికే 40kg ల విత్తనాలను సేకరించిన ఆయన వర్షాలు కురిశాక అడవుల్లో చల్లడానికి సిద్దమవుతున్నారు..
-ఇది కాదా నిజమైన సమాజసేవ అంటే..! ఇలాంటి సేవ చేసే వారికి అవార్డులు కొలబద్ద కాదు..!
సమాజ హితం అనేది వారి నిబద్దత...!
No comments:
Post a Comment