Wednesday, November 20, 2024
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
*సీఎం రేవంత్ రెడ్డి..యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం*
“రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు లభించాలంటే పరిశ్రమలు స్థాపించాలి. అవసరమైన చోట భూ సేకరణ జరగాల్సిందే. అయితే, భూమి రైతుల ఆత్మగౌరవంతో ముడివడి ఉంటుంది. భూ సేకరణ చట్టం ప్రకారం తగిన పరిహారం ఇవ్వలేని పరిస్థితి ఉన్నందున, భూ సేకరణ చేసే ప్రాంతాల్లో భూముల విలువ మూడింతలు పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి, కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం” అని ముఖ్యమంత్రి @revanth_anumula గారు చెప్పారు.
✅రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుడి చెరువు మైదానంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
✅నేతన్నలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యార్న్ డిపోను ఈ వేదిక నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. సీఎంగారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ...
✅భూ సేకరణలో భూములు కోల్పోయే రైతుల బాధలను ప్రజా ప్రభుత్వం అర్థం చేసుకోగలదు. శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో త్యాగం చేస్తున్న భూ యజమాన కుటుంబాలను ఆదుకోవడానికి నష్టపరిహారం పెంచాలి. అప్పుడే రైతులు ముందుకొస్తారు. అందుకే నష్టపరిహారానికి సంబంధించిన చట్టాన్ని సవరించాలని ఆదేశాలిచ్చాం.
✅పది సంవత్సరాల ఈ తెలంగాణను ఒక గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. మీ ప్రాంత అభివృద్ధి మా బాధ్యత.
✅ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిందే. తెలంగాణను చూడటానికి రాష్ట్రానికి రావాల్సిందే. ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళదాం. #TelanganaRising
✅రాజన్న సిరిసిల్లా జిల్లా అభివృద్ధికి నిధులిచ్చాం. గత ప్రభుత్వ హయాంలో వేములవాడ ఆలయ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైంది. గత పదేళ్లు చేయలేని పనులను ప్రజా ప్రభుత్వం పది నెలల్లో చేసి చూపిస్తోంది.
✅ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో నవంబర్ 30 లోగా జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్ష చేస్తారు.
✅గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదవశాత్తు మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం.
✅కేవలం పది నెలల్లో రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఈ విషయంలో చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదు.
✅కాళేశ్వరం నుంచి చుక్కనీరు పారకున్నా రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ప్రతి గింజా కొనుగోలు చేయడమే కాకుండా సన్న రకానికి రూ.500 బోనస్ కూడా చెల్లిస్తున్నాం.
✅ఈ కార్యక్రమంలో మంత్రులు @UttamINC గారు, @Min_SridharBabu గారు, @DamodarCilarapu గారు, @Tummala_INC గారు, @iamkondasurekha గారు, @mpponguleti గారు, @Ponnam_INC గారు, ప్రభుత్వ విప్ @aadisrinivasmla గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు @Bmaheshgoud6666 గారు పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. #PrajaPalana #SriRajaRajeshwaraSwamyTemple #Vemulawada
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1859224766307299704?t=QpPwDkijdLdRLMpJcGOBqw&s=19
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Tuesday, November 19, 2024
*#GHMC లో మొత్తం #Corruption అధికారులు*
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
*_KCR అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్ళీ మొలవనివ్వ: సీఎం రేవంత్_*
*#CasteCensus #SkillCensus*
*_#PawannKalyan ట్రెండే వేరు_*
*_న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయని #SALVOINDUSTRIES యజమాని జయరాం రెడ్డి._*
*_ప్రజాసంఘాల మహిళా ఉద్యమకారుల మీద పోలీసుల జులుం ఏందీ?_*
Monday, November 18, 2024
అవినీతి అధికారికి #శ్రీశైలం దేవస్థానం EO గా నియమించడం ఏమిటి
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
_# వందల కోట్ల విలువైన 225 ఎకరాలు అక్రమార్కుల పాలు_
Sunday, November 17, 2024
*తెలంగాణ ఓటరుమహాశయులను "మోసం దగా" చేసిన చేస్తున్న పాలకులు,ప్రజాప్రతినిధులు*
“transgender” nuisance on Hyderabad roads?
_*న్యాయం కోసం మూడు సంవత్సరాలనుండి పోరాటం చేస్తున్న ఆడబిడ్డ*_
Friday, November 15, 2024
"----??----" మాత్రమే "జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు"*_
_# ఇదే సంస్కృతి కొనసాగితే మళ్ళీ ప్రభుత్వం కష్టమే.!_
Thursday, November 14, 2024
_*మహానందీశ్వరా నీ భూములకే ఎసరు పెట్టినారు!!*_
పిల్లల మాక్ అసెంబ్లీ తీర్మానం దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి పంపించాలి రేవంత్ రెడ్డి
దేశంలో చట్ట సభలకు పోటీ చేయడానికి వయో పరిమితిని 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ పిల్లల మాక్ అసెంబ్లీ తీర్మానం చేసి దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి పంపించాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు కోరారు. వయోపరిమితి 21 ఏళ్లకు తగ్గించడం వల్ల యువత చట్ట సభల్లోకి రావడానికి అవకాశం ఏర్పడటమే కాకుండా వారి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు చేసి రాణిస్తారని అన్నారు.
♦️దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున బాలల దినోత్సవం పురస్కరించుకుని #SCERT ప్రాంగణంలో 18 ఏళ్ల లోపు బాలబాలికలు మాక్ అసెంబ్లీని అద్భుతంగా నిర్వహించారు.
♦️ఈ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం @Bhatti_Mallu గారు, మంత్రి @Ponnam_INC గార్లతో కూర్చొని వీక్షించించిన అనంతరం ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఎంతో క్రమశిక్షణతో చిల్డ్రెన్ మాక్ అసెంబ్లీ నిర్వహించారంటూ అభినందించారు. సీఎంగారు ఇంకా ఏం చెప్పారంటే...
♦️ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ నాయకత్వంలో దేశంలో ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తుచేస్తూ చట్ట సభలకు పోటీ చేయడానికి విధించిన వయో పరిమితిని కూడా 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ తీర్మానం చేయాలి.
♦️ఆ తీర్మానాన్ని రాష్ట్ర ఎంపీలకు పంపించాలి. తద్వారా పార్లమెంట్ సమావేశాల్లో వారు ఈ అంశాన్ని లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది.
♦️భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా, భవిష్యత్తు సమాజానికి అవసరమైన శాసనాలు చేయాలన్న సంకేతాలిస్తూ మాక్ అసెంబ్లీ నిర్వహించడం ప్రశంసనీయం.
♦️ఈ రోజుల్లో కొందరు చట్ట సభలను ఎప్పుడు వాయిదా వేయిద్దామన్న దిశగా ఆలోచన చేయడం దురదృష్టకరం.
♦️రాజకీయాలంటే ఈనాడు ఒక రకమైన భావన నెలకొంది. మాక్ అసెంబ్లీ నిర్వహించిన వారిలో కొందరైనా రాజకీయాల్లోకి రావాలి.
♦️మాక్ అసెంబ్లీలో అండర్ 18 హెడ్ క్వార్టర్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ, హైడ్రా వంటి బిల్లులపై చర్చించడం అభినందనీయం.
♦️పండిట్ నెహ్రూ గారు దేశంలో తీసుకొచ్చిన విద్య, వ్యవసాయ విప్లవం వల్ల సమాజంలో అనేక అవకాశాలు వచ్చాయి.
♦️యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కృషితో దేశంలో నిర్బంధ విద్య అమలులోకి వచ్చింది.
♦️ఇలాంటి మాక్ అసెంబ్లీ సమావేశాలు సమాజానికి చాలా అవసరం. చట్ట సభల్లో జరుగుతున్న చర్చలు, ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలి. #ChildrensDay #JawaharlalNehru #MockAssembly #RisingTelangana
Courtesy / Source by :https://x.com/TelanganaCMO/status/1857062426681671848?t=TJpK5np8E5ORMSIqXq6knw&s=19
*హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లు*
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు అధికారులను ఆదేశించారు. గతంలో నిర్ణయించిన విధంగా తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్ల సేవలు వినియోగించాలని సూచించారు.
♦️సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల నియమించాలని చెప్పారు. నగరంలో నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భాల్లోనూ వారి సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. తద్వారా తాగి వాహనాలు నడపే వారి సంఖ్యను తగ్గించవచ్చన్నారు.
♦️ట్రాన్స్‌జెండర్స్‌కు ఒక గుర్తింపు నివ్వడంతో పాటు వారికి అవసరమైన శిక్షణ, హోమ్ గార్డ్ తరహాలో జీత భత్యాలు సమకూర్చేలా విధి విధానాలతో పాటు ప్రత్యేక డ్రెస్ కోడ్‌ను రూపొందించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రయోగాత్మకంగా నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం గారు అదేశించారు.
@TelanganaDGP @CPHydCity #Telangana
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1857110154267005385?t=gqFLzDupG-0Iyt3VV1Bw9Q&s=19
*I will soon see you in court... Advocate*
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Wednesday, November 13, 2024
*#ChildrensDay*
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
ఈరోజు #కాళోజీ సారు వర్ధంతి సందర్బంగా నివాళులు 💐
Saturday, November 9, 2024
#Footpathenchrochments
ఈ రెస్టారెంట్ #Footpathenchrochments కూడా చేస్తుంది అయినా #GHMC & #police అధికారులు ఎలాంటి శాశ్వత పరిష్కారం చేయడం లేదు.
@GHMCOnline @CommissionrGHMC @RachakondaCop @RCKTRAFFIC @DcpMalkajgiri @UppalTrPS @uppalps_ @Dc_Ghmc @BplplH @UNTGAPS @krishna_avs
Bplkm✍️
Sri Regarding footpath encroachment pertaining to the above restaurant. Challans are being imposed to the vehicles parked irregularly on the road. How ever action will be taken ...Uppal police
https://x.com/Praja_Snklpm/status/1855100321179086872?t=NFm-uOSLCDRzWt3xDNIuqw&s=19
Friday, November 8, 2024
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
*_చిన్న దొరా.. సిగ్గేస్తోంది.!_*
Thursday, November 7, 2024
_*#కేటీఆర్ కు అరెస్టు భయమా ?*_
సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలి...CS శ్రీమతి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.
_*ఏమైనా రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయా అంటే ప్రస్తుతం అలాగే అనిపిస్తుంది.*_
*_ప్రభుత్వంలో బిఆర్ఎస్ కోవర్ట్ లు_*
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Tuesday, November 5, 2024
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
*_కేటీఆర్ పై ఏసీబీ కేసు.?_*
_*2014 జూన్ నుండి ఈరోజు వరకు లక్షల కోట్ల దోపిడీ..*_
సైబర్ నేరగాళ్ళతో జాగ్రత్త...
Monday, November 4, 2024
జలమండలి ఓటీఎస్-2024 గడువును ప్రభుత్వం పొడిగించింది
ఓటీఎస్ గడువు పెంపు
=================
# ఈ నెల 30 వరకు పొడిగింపు
# వినియోగదారుల డిమాండ్ మేరకు నిర్ణయం
ఓటీఎస్-2024 గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పథకం గడువును పెంచాలని వినియోగదారుల నుంచి భారీ ఎత్తున డిమాండ్ లు రావడంతో జలమండలి ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖకు స్పందించిన ప్రభుత్వం.. పథకం గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన నల్లా కనెక్షన్ బిల్లులను వసూలు చేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న నల్లా బిల్లుల్ని.. ఎలాంటి ఆలస్య రుసుం, వడ్డీ లేకుండా చెల్లించే అవకాశాన్ని కల్పించింది. మొదటగా ఈ పథకాన్ని అక్టోబర్ 1 నుంచి 31 వరకు ప్రకటించి అమలు చేశారు. కానీ ఇదే నెలలో దసరా, దీపావళి వంటి పండగలు రావడంతో వినియోగదారులపై ఆర్థిక భారం పడింది. మరి కొందరు సొంతూళ్లకు వెళ్లారు. అలాంటి వారు ఈ పథకాన్ని వినియోగించుకోలేకపోయారు. దీంతో మరో అవకాశం ఇవ్వాలని అధికారుల్ని కోరారు. దీంతో జలమండలి.. ప్రభుత్వానికి లేఖ రాయగా, అందుకు సానుకూలంగా స్పందించి.. పథకం గడువును నవంబర్ 30 వరకు పొడిగించింది.
#బిల్లులు_చెల్లించే_విధానం
# జలమండలి కార్యాలయాలు, ఆన్ లైన్ విధానంలో మీ-సేవ, ఏపీ ఆన్ లైన్ కేంద్రాలు, # ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, NEFT, RTGS, BPPS, జలమండలి అధికారిక వెబ్ సైట్, లైన్ మెన్ల ద్వారా చెల్లించవచ్చు.
# జలమండలి అందించిన QR Code ను స్కాన్ చేయడం ద్వారా.. వినియోగదారులు తమ బకాయిలు, చెల్లించే మొత్తం, రాయితీ తదితర వివరాలు తెలుసుకోవచ్చు.
ఓటీఎస్ పథకంపై ఏవైనా సందేహాలుంటే.. జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313 కు ఫోన్ చేసి వాటిని నివృతి చేసుకోవచ్చు.
@TelanganaCMO @TelanganaCS @PrlsecyMAUD @MDHMWSSB
Courtesy / Source by : https://x.com/HMWSSBOnline/status/1853469487598862691?t=uieZWX8GFJRELEtG6WSrcA&s=19