Thursday, November 30, 2023
#తెలంగాణ @TS_bPASS లో మొత్తం అవినీతి అధికారులలే
ఓటు హక్కును వినియోగించుకున్న 93 ఏళ్ల లక్ష్మయ్య.
ఓటు హక్కును వినియోగించుకున్న బాపట్ల ఫ్యామిలీ
Tuesday, November 28, 2023
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో... రూ.500 నోట్ల రద్దు...?
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో... రూ.500 నోట్ల రద్దు...?
* తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో రిజర్వ్ బ్యాంక్ తీవ్ర నిర్ణయం.?
*తెలంగాణలో చలామనీలో ఉన్న సిరీస్ నెంబర్లన్నీ నిఘా వర్గాలకు పంపిన వైనం.!
* సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వీడియోలో సంచలన విషయాలు (ఆ లింక్ కూడా ఇస్తున్నాం)
# భరాస పంచుతున్న నోట్లు అన్నీ అవే.! పంచకుంటే నో ఫిగర్, నో ఫియర్
* అందుకే సొంత డబ్బులు తీయని 'గులాబీ' నేతలట.!
* ప్రజలను 'వెర్రి పువ్వు'లా భావిస్తున్న కేసీఆర్.?
* ఒక్కో నియోజకవర్గానికి డమ్మీ రూ.30 కోట్లు అట.!..!
* పాపం.! మహిళలు, తాగుబోతులే టార్గెట్..అట.!
* యువతకు క్రికెట్ కిట్స్, ఆ, ఆ లతో గాలం..!
* అవి తీసుకుంటే ఆ తరువాత తీవ్రమైన కేసులతో ఫిక్స్. అట..!
* ఎలాంటి సమస్యలు లేకుండా మధ్యవర్తుల ద్వారా పంపిణీ.. అట.!
Courtesy / Source by : (దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత అనంచిన్ని వెంకటేశ్వరరావు, 9440000009)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం ప్రవాహానికి ఎన్నికల కమిషన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినా రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని గత నాలుగు నెలల క్రితమే వ్యూహాత్మకంగా స్థానిక నియోజకవర్గాలకు డబ్బులు పంపినట్లు ఆరోపణలు తలెత్తాయి. (అందుకే కాబోలు ఒక్క అధికారపార్టీ నాయకుడి దగ్గర ఒక్క రూపాయి దొరికిన ఆనవాలు లేవు. అందుకే కేంద్ర ఎన్నికల కమిషన్ భారత ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసం.. రాజ్యాంగం పరిరక్షిచటం కోసం ఓ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అసలేం జరిగిందంటే..?
తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కేంద్రం దేశ శ్రేయస్సు కోసం ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నల్లడబ్బు (బ్లాక్ మనీ) నియంత్రణలో భాగంగా.. రూ.500ల నోట్లను రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సామాన్యుల డబ్బు సేఫ్.. కానీ..:
ఈ సదుద్దేశంలో భాగంగా సామాన్యుల డబ్బుకు ఎలాంటి అవరోధం లేకుండా... ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉన్న రెండు అవకాశాలను పరిగణనలోకి తీసుకొని చెలామణీలో లేని బ్లాక్ మనీ నెంబర్లను ఇప్పటికీ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.
అధికార పార్టీలోనే..:
అత్యధికంగా పన్నులు చెల్లించని (నల్ల డబ్బు) బ్లాక్ మనీ వేల కోట్లు ఉన్నట్లు నియోజకవర్గాలకు చేరినట్లు తెలుస్తోంది. ఒక్క తెలంగాణలోనే ఓటరు ఒక్కోకరికి ఐదు వేలు పంచుతున్నారంటే.. ఆశ్చర్యం. అందుకే ఎన్నికల సంఘం రిజర్వ్ బ్యాంకును ఆశ్రయించి... కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ముందుకు వెళ్ళానున్నట్లు తెలుస్తోంది.
బాక్స్:
దమ్ముంటే రద్దు చేయండి -సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతుంటే, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ లు ఏం చేస్తున్నాయని, పేదలకు సామాన్యులకు ఎలాంటి సమస్యలు లేకుండా వెంటనే రూ. 500ల నోట్లను రద్దు చేయాలి.
ఒక్కోసారి చేయండి:
ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక వ్యవస్థాపక సభ్యులు
ఎన్నికల్లో ధోనీ ప్రవాహం తగ్గించాలంటే ఎక్కడో ఒక దగ్గర తొలి అడుగు పడాలని, ఇది మంచి తరుణమని తెలంగాణ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షులు కె.కోటేశ్వర్ రావు, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, నామాల విశ్వేశ్వరావు, బెలిద హరినాథ్, రవికుమార్, సిహెచ్.వెంకటేశ్వర్లు తదితరులు పేర్కొన్నారు.
స్పెషల్ బాక్స్:
సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వీడియో లింక్ ఇది
https://youtu.be/SE6y7yT596s?si=n7OG1zkmgEJz2LXz
కోవర్ట్ ఆపరేషన్ సక్సెస్... కింద మంట
కోవర్ట్ ఆపరేషన్ సక్సెస్... కింద మంట
* కోవర్టు ఆపరేషన్ సక్సెస్
* ఆల్ ఆర్ సేమ్
* రంగంలోకి నమ్మకంగా..
* డౌటనుమానాలు ఎన్నో..
* వ్యూహాలను పసిగడుతూ..
Courtesy / Source by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)
ప్రతికూల పరిస్థితులను అధిగమించి టికెట్ సాధించి గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన అభ్యర్థులను కోవర్టు భయం వెంటాడుతోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఇలాంటి కోవర్టు వ్యవస్థ పటిష్టంగా ఉంది. అనేక నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి నాయకులను కోవర్టులుగా రంగంలోకి దించారు. ఇతర పార్టీల్లోకి వ్యూహాత్మకంగా పంపారు. అధికార పార్టీలో ఈ విధమైన కోవర్టుల బెడద ఎక్కువగా ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతో 'కోవర్టు'లు జాత కట్టడంతో అభ్యర్థులకు ఏ సమాచారం నిజమో తెలియని పరిస్థితి నెలకొంది.
ఆల్ ఆర్ సేమ్:
తమ వారిని కావాలని ప్రత్యర్థుల దగ్గరకు పంపిస్తూ, అక్కడ వారు చేస్తున్న రాజకీయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్ లో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయిన అధికార పార్టీ బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీలు అనేక నియోజకవర్గాలలో కోవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు.
రంగంలోకి నమ్మకంగా..:
కోవర్టులను రంగంలోకి దింపి ప్రత్యర్థులను నిలువరించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అయితే అన్ని పార్టీల్లోకి చేరికలు కొనసాగుతున్న క్రమంలో ఎవరు తమకోసం పనిచేసేవారు? ఎవరు కోవర్టులు? అనేది తెలియక అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగడం ప్రధానంగా కనిపిస్తుంది.
డౌటనుమానాలు ఎన్నో..:
ఈ చేరికలు అన్నీ నిజంగానే కొనసాగుతున్న చేరికలా లేక కోవర్ట్ ఆపరేషన్ లో భాగంగా కొనసాగుతున్న చేరికలా అనేది మాత్రం అంతుబట్టడం లేదు. ఏదేమైనా ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం అన్ని పార్టీల అభ్యర్థులకు ప్రతిష్టాత్మకం కావడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నియోజకవర్గాల వేదికగా సాగుతున్న కోవర్టు రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి.
వ్యూహాలను పసిగడుతూ..:
గతంలో పన్నిన వ్యూహాలు మార్చుకుంటున్న అభ్యర్థులు కోవర్టుల సమాచారంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రస్తుతం వ్యూహాలు బెడిసికొడితే ఏం చేయాలోననే ఆందోళనల్లోనూ పడుతున్నారు. మరోవైపు తాము కష్టపడి పన్నిన వ్యూహాలు అవతలి పార్టీల వారికి తెలిసి పోతుండటంతో నాయకులు వారి అస్త్రశస్త్రాలను ఆప్పటికప్పుడు మార్చుకోవాల్సి అవసరం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కోవర్టులు అధికమవ్వడం కూడా అభ్యర్థులను కలవరపెడుతోంది. ఈ పరిణామాలతో పార్టీలో ఎవ్వరిని నమ్మాలో ఎవ్వరిని నమ్మకూడదో తెలియని సంకట స్థితిలో అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు.
Monday, November 27, 2023
రైతుబంద్..కాకా షాక్.!
రైతుబంద్..కాకా షాక్.!
* తెలంగాణ సర్కార్‌కు ఈసీ యూటర్న్
* నోరు జారిన మంత్రి హరీష్‌రావు
* తీవ్రంగా స్పందించిన 'ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక'
Courtesy / Source by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)
ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. సోమవారం ఉదయం వరకు 'రైతుబందు' డబ్బులు పడితే రైతులు గంపగుత్తగా ఓట్లు వేస్తారని గులాబీ పార్టీ నేతలు భావించారు. ఒకవిధంగా చట్టబద్దంగా జరుగుతున్న ఈ పంపిణీ పట్ల ఓటర్లు అందరూ ఎన్నికల సంఘాన్ని అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది.
గులాబీ శ్రేణుల్లో గుబులు:
ఇప్పటికే కాంగ్రెస్‌కు పెరుగుతున్న గ్రాఫ్‌తో ఆందోళన చెందుతున్న గులాబీ శ్రేణులకు ఈసీ సంచలన షాకిచ్చింది. రైతుబంధు పంపిణీ విషయంలో ఎలక్షన్ కమిషన్ యూటర్న్ తీసుకుంది. రైతుబంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.
రెండు విడుతల్లో ఆర్థిక సాయాన్ని అందిస్తుండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రబీ సీజన్‌కు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో సాయాన్ని జమ చేయలేకపోయింది. అయితే, ప్రభుత్వం రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతి కోరగా.. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. తాజాగా.. ఈసీ అనుమతిపై విపక్షాలు తీవ్రంగా రియాక్ట్ కావడంతో పాటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూరేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశాయి. దీంతో రైతుబంధు పంపిణీపై ఈసీ యూటర్న్ తీసుకున్నట్లు సోమవారం ప్రకటించింది.
ఎన్నికల వేళ:
ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. 28వ తేదీ 70 లక్షల రైతుల ఖాతాల్లో సుమారు 7 వేల కోట్ల రూపాయలు రైతుబంధు నిధులు వేసేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు వెలువడిన ఈసీ తాజా ఆదేశాలతో రైతుల ఖాతాల్లో నగదు జమ నిలిచిపోయింది.
బాక్స్:
నోరుజారిన మంత్రి హరీష్‌రావు:
ఆదివారం ఓ బహిరంగ సభలో రాష్ట్ర ఆర్థిశాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. మీరు సోమవారం ఉదయం టీ తాగే సమయానికి టింగ్ టింగ్ టింగ్ అంటూ రైతుల ఫోన్లకు రైతు బంధు నిధులు జమ అయిన మెసేజ్‌లు వస్తాయని ప్రకటించారు. అయితే, ఈ రోజు బ్యాంకులకు సెలవు ఉంది. గురుపౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది.. కానీ, హరీష్‌రావు. సోమవారమే డబ్బులు పడతాయని ప్రకటించారు.
బాక్స్ 2:
తీవ్రంగా స్పందించిన 'ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక':
తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఈ నెల 30వ తేదీన జరగనుంది. ఇప్పుడు రైతు బంధుకు అనుమతి ఇవ్వడం ఏంటి? అనే ఫిర్యాదులు కూడా ఎన్నికల కమిషన్‌కు వెళ్లాయి. 'ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక' ఎన్నికల కమిషన్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని బకాయిలు చెల్లించాలని, అందరికీ ఒకే విధమైన న్యాయం చేయాలని కోరింది. దీంతో రైతుబందు
అనుమతిని ఉపసంహరించుకుంది.
కుమ్ముడే కుమ్ముడు
కుమ్ముడే కుమ్ముడు
* 17 భారీ కుంభకోణాలు
* 4 లక్షల కోట్లు..
* కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ ఛార్జ్‌షీట్..!
Courtesy / Source by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)
తెలంగాణను కేసిఆర్ దోపిడీ చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ 17 రకాలు కుంభకోణాలు చేసిందంటూ..
వాటి విలువ 4 లక్షల 10వేల కోట్లుగా లెక్కలు కట్టి మరీ చూపి కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది.
అవినీతి మయం అంటూ..:
కేసీఆర్ పాలన మొత్తం 'అవినీతి మయం' అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ప్రజల కోసం అంటూ చేపట్టిన ప్రతి పనిలోను స్వలాభం చూసుకున్నారని ఆ పార్టీ ఎద్దేవా చేశారు
అధికారంలోకి రాగానే..:
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న 17 కుంభకోణాలకు సంబంధించి విచారణ చేపడతామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ వెంటనే దోషులను గుర్తించి వారిని జైలుకు కూడా పంపిస్తామని పేర్కొంది.
బాక్స్:
జాబితాలో..
1). కాళేశ్వరం ప్రాజెక్టు: లక్ష కోట్ల రూపాయలు
2). జీవో 111 రద్దు: 1 లక్ష 40 వేల కోట్లు
3). ధరణి పోర్టల్ : 50 వేల కోట్లు
4). పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు: రూ. 25వేల కోట్లు
5). హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ వసూలు టెండర్లు: రూ. 22,620 కోట్లు
6). మిషన్ భగీరథ: 21,600 కోట్లు
7). ఏఎంఆర్ కు తాటిచర్ల కోల్ బ్లాక్ మైనింగ్‌ను లీజు: రూ.16,000 కోట్లు
8). మిషన్ కాకతీయ: రూ.12,000 కోట్లు
9). హరితహారం: రూ.8,000 కోట్లు
10). ప్రతిమ సంస్థకు నిషేధిత భూమలు కట్టబెట్టిన వైనం: రూ.5,000 కోట్లు
11). ప్రైవేటు మెడికల్ కాలేజీల సీట్లలో అక్రమాలు: రూ.3,513కోట్లు
12). నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత ఆయన భూములు కబ్జా: రూ. 2,000 కోట్లు
13). హైదరాబాద్ షేక్‌పేటలో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఓ హౌసింగ్ సొసైటీకి కేటాయించపు: రూ.1500 కోట్లు
14). దళితబంధులో కమీషన్లు: రూ.1,150 కోట్లు
15). మధుకాన్ గ్రూప్ బ్యాంక్ లోన్లు: రూ.1,064 కోట్లు
16). మార్క్‌ఫెడ్ మక్కల కొనుగోళ్లలో అవకతవకలు: రూ.1,000 కోట్లు
17). ఢిల్లీ లిక్కర్ స్కామ్: రూ.100 కోట్లు
Saturday, November 25, 2023
ఎంతకు అమ్ముడుపోయారు కలెక్టర్ గారు?
ఎందుకంటే వీళ్ల లాయల్టీ మొత్తం వాళ్ళని ప్రమోట్ చేసిన వాళ్లపైనే తప్ప జీతాలు ఇచ్చే ప్రజల పైన కాదు ప్రమాణం చేసిన రాజ్యాంగం పైన కాదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఐఏఎస్‌లు ఐపీఎస్‌లు నిజంగా నిజాయితీగా నిబద్ధతగా, మరియు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు అవినీతికి పాల్పడడం అసాధ్యం. #TelanganaElections2023 #TelanganaAssemblyElections2023 #TelanganaElections2023 @TelanganaCS @arvindkumar_ias @DrTamilisaiGuv @Praja_Snklpm
https://twitter.com/RaviVattem/status/1728258113508393359?t=wSiNyzlSvzdLrn7dg4q4zw&s=19
@RaviVattem వకీల్ సాబ్ మీరు చెప్పింది అక్షరాలా సత్యం 👍
#తెలంగాణ లో #IAS #IPS అధికారులు ప్రజాప్రయోజనాలకోసం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయడం లేదు. వీళ్ళు పాలకులకు, ప్రజాప్రతినిధులకు బానిసలుగా పనిచేస్తున్నారు.
Bplkm🪶
బాపట్ల కృష్ణమోహన్
ప్రజాసంకల్పం.
https://twitter.com/Praja_Snklpm/status/1728279853823365392?t=N1xpv06FfwR4b8_klg0WLQ&s=19
Wednesday, November 22, 2023
Students of Nizam College Organized Huge Protest on the road
Monday, November 20, 2023
మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో, ఆఫీస్ ల్లో ఐటీ సోదాలు
Posted by admin on 2023-11-21 02:25:45 | Last Updated by admin on 2023-11-21 03:10:59
మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో, ఆఫీస్ ల్లో ఐటీ సోదాలు.
బీజేపీలో ఉన్నన్ని రోజులు జరగని దాడులు.
హుజురాబాద్, మునుగోడు ఎన్నికలకు వందల కోట్లు ఇచ్చింది వివేక్ కంపనీయే.
భూములు తాకట్టు పెట్టుకుని ఎన్నికలకు డబ్బులు సర్దే వ్యాపారంలో వివేక్ దిట్ట.
ఈటలకు - వివేక్ చెడింది ఆ అగ్రిమెంట్ల వ్యవహారంలోనే.
కాంగ్రెస్ లోకి వెళ్లగానే ఐటీ , లోకల్ పోలీసుల దాడులు.
మంచిర్యాలలో 8 కోట్లు పట్టుకున్నవి ఆయన సొమ్మే.
కాంగ్రెస్ సొమ్ములను భయటకు తియకుండా అడుగడుగున అంక్షలు.
బీఆర్ఎస్ బినామి కంపనీ అయిన ఫినిక్స్ 2500 కోట్లు సర్దుబాటు
అయినా పత్తాలేని ఐటీ ,ఈడీ అధికారులు.
కాంగ్రెస్ నేతల టార్గెట్ గానే ఆదాయపు పన్నుశాఖ గురి
Courtesy / Source by : ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ బ్యూరో
9848070809
Devender Reddy
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆర్ధికంగా బలంగా ఉంటే వారి పై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి వివేక్ వెకంటస్వామి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన కంపనీల పై అనుచరుల ఇళ్ల పై బంధువుల ఇండల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. 25 టీంలు పనిచేస్తున్నట్లు సమాచారం.
బీజేపీలో ఉంటే అన్ని మాఫి.
ఇదే వివేక్ వెంకటస్వామి మొన్నటి వరకు బీజేపీ లో కీలక నేతగా ఉన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో 50 కోట్లు ఇచ్చి భూములు వ్రాయించుకున్నారు. ఆ ఫండింగ్ కిరికిరి పై అప్పట్లో ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ .కామ్ కథనాలు ఇచ్చింది. మరోవైపు మునుగోడు ఎన్నికల సమయంలో కోకాపేటలో 2.5 ఎకరాల భూమిని 140 కోట్లకు రాజగోపాల్ రెడ్డి వద్ద నుంచి కొనుగోలు చేశారు. ఎన్నికల్లో డబ్బులు అఫిషియల్ గా కంపనీ నుంచి బదిలాయింపులు, నగదు రూపంలో అడ్జెస్ట్ చేయడంలో వివేక్ బరి తెగిస్తారు. అందులోనే బిజినెస్ కూడా వెతుక్కుంటారని అరోపణలు ఉన్నాయి.
@KTRBRS మీ అబద్దాల హోరు కు తెలంగాణ సిగ్గుపడుతుంది.
Sunday, November 19, 2023
దొంగల బ్యాచ్...మానిఫెస్టో..
దొంగల బ్యాచ్...మానిఫెస్టో..
# కేసీయార్ మీద ఈగ వాలనివ్వని బీజేపీ
# అక్రమ సంబంధం బయటపడిన వేళ
Courtesy / Source by : (అనంచిన్ని వెంకటేశ్వరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)
'ఇద్దరూ దొంగలే' అంటూ కాంగ్రెస్, ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణలకు ఊతం ఇస్తూ... భాజపా విడుదల చేసిన మానిఫెస్టో.. ఆధారంగా ఈ కథనం. దయచేసి భాజాపాలోని నిబద్దత కలిగిన నాయకులు, కార్యకర్తలు తప్పక చదవండి.
అసలేం జరిగిందంటే..?:
ఈరోజు కూడా ఎక్కడో మాట్లాడుతూ అమిత్ షా కాళేశ్వరం రూపంలో నిధులన్నీ కేసీయార్‌ను చేరాయని ఆరోపించాడు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కూడా పదే పదే కాళేశ్వరం అవినీతి అంటారు.! అవన్నీ మాటల వరకే..! వాస్తవంగా కేసీయార్ మీద ఈగ కూడా వాలదు. వాలనివ్వరు.! కావాలంటే బీజేపీ మేనిఫెస్టోయే సరదాగా చూడండి.! దయచేసి వాళ్ళను అసహ్యంగా చూడకండి.
కాళేశ్వరం..టాటా:
ఆచరణలో ఏమీ ఉండకపోయినా సరే, అయ్యేది లేదు, పొయ్యేది లేదు. కనీసం కాంగ్రెస్ మేనిఫెస్టో కాళేశ్వరం అవినీతి మీద జుడిషియల్ ఎంక్వయిరీ వేస్తామంటోంది. కేసీయార్ తిన్న అవినీతి సొమ్మంతా కక్కించి మా గ్యారంటీ పథకాలకు ఖర్చుచేస్తాం అంటోంది.! కనీసం ఆ సీరియస్‌నెస్ కనిపిస్తోంది.! కానీ బీజేపీ..? (ఎందుకురా తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారు..ఛీ..ఛీ)
గు....గు..ండెల్లో దుమ్ము లేదా..?:
మేనిఫెస్టోలో కుంగిన మేడిగడ్డ ఫోటో కూడా పెట్టారు. కానీ ఏమంటారంటే.! ‘‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికల నేపథ్యంలో ప్రాజెక్టును సమీక్షిస్తాం, సీడబ్ల్యూసీతో సంప్రదింపులు చేసి ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం.!’’ ఎక్కడా ఆ ప్రాజెక్టు అవినీతి మీద మాట లేదు.! పైగా పునరుద్ధరిస్తాట.! పెండింగ్ ప్రాజెక్టుల మీద ఏ ప్రస్తావన లేదు.! నదుల అనుసంధానం పేరిట గోదావరి జలాల్నే తమిళనాడుకు తరలించుకుపోయే పన్నాగాలున్నాయి కదా.! దీనిపై సమగ్ర వివరణ లేదు.! పైగా గోదావరి మీద స్టెప్ అండ్ లేడర్ పద్ధతిలో బరాజులు, రిజర్వాయర్లు నిర్మిస్తారట.! అయ్యా, కేసీయార్ కట్టినవే తెలంగాణ సమాజం మీద మోయలేని భారాలయ్యాయి మహాప్రభో.!
ఏందిరా భయ్యా..ఇది:
విద్యుత్తు ప్రాజెక్టులు, డిస్కమ్స్ నష్టాల మీద మాటల్లేవు.! కీలకమైన చాలా అంశాల మీద ఏమీ లేదు.! పైగా ఏమున్నాయి..? అయోధ్య, కాశీలకు వయోవృద్ధులను ఉచితంగా తీసుకెళ్తారట.! అధికారంలోకి వచ్చే చాన్స్ అసాధ్యం కానీ కనీసం మేనిఫెస్టోనైనా జనరంజకంగా రాయొచ్చు కదా.! అదీ చేతకాలేదు. పైగా పర్ఫెక్ట్ హిందూ ముద్ర వేసుకునే ప్రయత్నమైతే కనిపించింది.
ఏం పీకటానికి..:
మతపరమైన రిజర్వేషన్లను (ముస్లిం రిజర్వేషన్లు) తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తారట.! ఓకే, హైదరాబాద్‌కు రాను రాను సంకటంగా మారుతున్న రోహింగ్యా వలసదారులపై దృష్టి పెడతామంటున్నారు.! కేసీయార్ వారి విషయంలో కూడా ఫ్లాప్.! ఏటా 4 సిలిండర్లు ఫ్రీ అన్నారు… సంతోషపడకండి. అవి కేవలం ఉజ్వల వినియోగదారులకు మాత్రమే. మోడీ మార్క్ ప్రజోపయోగానికి ఎప్పుడూ ఏదో కిరికిరి కంపల్సరీ. కరోనా వేళ చూశాం కదా, ఉచిత రేషన్ తప్ప ఇచ్చిందేమీ లేదు.
సాధ్యం కాని ..సోదులు ఎందుకు..?:
డీజిల్, పెట్రోల్ పై వ్యాట్ తగ్గిస్తామంటున్నారు.! కేంద్రమే ఓ నిర్ణయం తీసుకుని సెంట్రల్ ఎక్సయిజు తగ్గించొచ్చు కదా, వాళ్ల చేతుల్లో పని కదా.! అది మాత్రం చేయదు.! మహిళలకు ల్యాప్టాపులు సరే.! కానీ 10 లక్షల ఉద్యోగాలు అనేది సాధ్యమేనా..? ప్రైవేటు రంగంలో ఉద్యోగకల్పన ప్రభుత్వం చేతుల్లో ఏముంది..? ఏది తోస్తే అది రాసుకుంటూ పోయారు.! రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ, స్మారకాలకు ప్రయారిటీ అట. అనవసర విద్వేషాలకు శ్రీకారం మాత్రమే ఇది.!
ఉమ్మడి పౌరస్మృతికి కమిటీ అట.!:
అదేదో కేంద్రమే చేస్తోంది కదా, రాష్ట్రం చేయదగిందేముంటుంది..? సేమ్, హిందూ మార్క్ హామీ.! గోవధ మీద కఠినవైఖరి. వైద్యాశ్రీ, విద్యాశ్రీ పథకాల మీద, ఇళ్లస్థలాలు, ఇళ్ల మీద కూడా ఏదో ప్రస్తావనలే తప్ప నిర్మాణాత్మక వివరణలేమీ లేవు… బెల్టు షాపులు నిర్మూలిస్తాం, ప్రైవేటు స్కూళ్ల ఫీజులు నియంత్రిస్తాం వంటివి జస్ట్, కాగితాల్లో రాసుకోవడం కోసమే.! బీజేపీ చేసిందీ అదే.!
బీజేపీకి అధికార సీన్ లేదు.. కనీసం..:
సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్నురీయింబర్స్మెంట్ అట. వాళ్లకు మాత్రమే ఎందుకు..? ఎలాగూ గనుల ఆదాయంలో వాటా ఇస్తున్నారు కదా.! స్థూలంగా చూస్తే.! బీజేపీకి అధికారంలోకి వచ్చేంత సీన్ లేదు. కనీసం మేనిఫెస్టోనైనా 'నిర్మాణాత్మక రీతిలో రూపొందించొచ్చు కదా' అనిపిస్తోంది. అఫ్కోర్స్, మరీ బీఆర్ఎస్, కాంగ్రెస్ లాగా అలవిమాలిన వరాల జోలికి పోలేదు, గుడ్… అదే సమయంలో మేనిఫెస్టోలో ఎన్నికల పంచ్ కూడా లేదు. పైగా కేసీయార్ మీద ఈగవాలనివ్వని ధోరణి. దోస్త్ మేరా దోస్త్…!!
(ఇద్దరికీ సహజీవన అక్రమ సంబంధం ప్రాప్తిరస్తు..)
Phoenix Scam
Phoenix Scam.
Politics Telangna War 2023Posted by admin on 2023-11-19 06:13:21 |
- తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్ర డబ్బు.
- ఫినిక్స్ భారీ వాణిజ్య భవంతులు అగ్రిమెంట్స్.
- 2500 కోట్ల క్యాచ్ రెడీ.
- 60 నియోజకవర్గాల టార్గెట్ గా 1800 కోట్లు పంపకం.
- ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పై 33 కథనాలు ప్రజల ముందు
- భయటపడుతున్న ఏపీ-తెలంగాణ బంధాలు.
- కళ్ల ముందు కదలాడుతున్న పట్టించుకునే నాథుడే లేడు.
- తూతూ మంత్రంగా ఐటీ దాడులు
- కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం ఉన్నా గప్ చిప్.
- బీఆర్ఎస్ తో 14 ప్రాజెక్ట్స్ లో భారీగా లబ్దిపొందిన ఫినిక్స్.
- సాక్షాదారాలతో సహా ప్రత్యేక కథనాలు ఇచ్చిన దేవేందర్ రెడ్డి.
- ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఎక్ల్సూజివ్ స్టోరీ.
Courtesy / Source By :
Devender Reddy
9848070809
ఎన్నికలంటే డబ్బులు వస్తునే ఉంటాయి.
ఎన్నికల్లో డబ్బులు ఇస్తారని తెలుసు కాని అవి ఎలా వస్తాయో చాలా మంది తెలియదు. పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆయా కంపనీలను పెంచిపోషిస్తాయి. ఆ కంపనీలు రూ. 100 ఖర్చు చేస్తే 10,000 రూపాయలు సంపాదిస్తాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కి రాగానే బంగారుబాతులా ఉండే హైదరాబాద్ భూములను అక్రమంగా కట్టపెట్టారు. ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారు. దీంతో వేల కోట్ల రూపాయలు మైహోం, వంశీరాం బిల్డర్స్, డీఎస్ఆర్ ఇన్ఫ్రా, ఫినిక్స్ , వాసవి, హానర్ హోమ్స్, రామ్కీ, ఇలా 15 రియల్ ఎస్టేట్ కంపనీలకు వివాదస్పద, అసైన్డ్ భూములను క్లియర్ చేసి ఇవ్వడంతో లక్షల కోట్ల అదాయం కొన్ని కంపనీలే పొగుచేసుకున్నాయి. పేరు చెప్పిన ప్రతి కంపనీ అక్రమ అనుమతుల పై పై ల్యాండ్స్ అండ్ రికార్డ్స్.కామ్ వద్ద పూర్తి సాక్షాదారాలు ఉన్నాయి. ఇప్పుడు ఫినిక్స్ భవంతులను ఏపీ ప్రభుత్వ పెద్దలు కొనుగోలు చేయడంతో పెద్ద ఎత్తున నగదు రూపంలో తెలంగాణకు చేరుకుంటుంది.
4 కమర్షియల్ బిల్డింగ్స్ విలువ 2500 కోట్లు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి భారీగా లబ్దిపొందిన ఫినిక్స్ సంస్థ బీఆర్ఎస్ పార్టీ కోసం ఎన్నికల్లో భారీ భవంతులను అమ్మెస్తుంది. ప్రధాన కూడల్లో ఉన్న 35 లక్షల స్వ్కేయిర్ ఫీట్ల భవంతులకు అగ్రిమెంట్లు జరిగినట్లు సమాచారం.
లిక్కర్ మాఫియా, ఇసుక దందా సొమ్మే.
ఏపీలో భారీగా నగదు నిల్వ ఉండడానికి కారణం లిక్కర్ , ఇసుక బిజినెస్ లే. అక్కడ ఉన్న నగదు ఇప్పుడు హైదరాబాద్ లోని ఫినిక్స్ బిల్డింగ్స్ ని అగ్రిమెంట్స్ చేయించుకుని అప్పగిస్తున్నారు. ప్రత్యేక హెలిక్యాప్టర్స్ లో హైదరాబాద్ కు చేరుకున్నట్లు సమాచారం.
అప్పుడు, ఇప్పుడు కారు చౌకగానే
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ నేతల భూములను తక్కువ ధరకు అగ్రిమెంట్లు చేసుకుని కొనుగోళ్ల వ్యవహారం నడిపించారు బీఆర్ఎస్ బినామిల కంపనీలు. ఇప్పుడు తెలంగాణలో డబ్బు సరిపోవడం లేదని ఫినిక్స్ భవంతులను 12 వేలకు స్వ్కోయిర్ ఫీట్ అమ్మే ప్రాంతంలో 7 వేలకు అమ్మేస్తున్నారు.
60 సీట్లలో 30 కోట్ల చొప్పున వెళ్లాల్సిందే.
టార్గెట్ 60గా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ. అవలీలగా గెలిచే 10 నియోజకవర్గాల్లను కలుపుకొని మొత్తం 60 అభ్యర్దులకు 30 కోట్ల చొప్పున పంపించేలా పక్క ప్లాన్ వేసుకున్నారు. అందుకే వారం రోజుల్లోనే అన్ని సర్దుకున్నారు. మరో పది రోజుల్లో ఏపీ డబ్బుల కుప్పలు తెలంగాణలో పారనున్నాయి.
నోట్ల పంపిణీ ఆపలేమా..?
సాదారణ ప్రజలు లక్ష రూపాలయు తీసుకెళ్లితే నానా ఇబ్బంది పెడుతున్న అధికారులు. అధికార పార్టీలు వేల కోట్ల రూపాయలను సప్లై చేస్తున్నా పట్టించుకోవడం లేదు. నిఘా వర్గాలకు సమాచారం ఉన్నా చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారు. డబ్బులు తీసుకోవద్దని ప్రచారం చేస్తున్నారు. కాని డబ్బులు పంచే సమయంలో యువత అడ్డుకట్ట వేస్తే ప్రజాస్వామ్యం పదికాలాల పాటు వర్ధిల్లుతుంది.
Saturday, November 18, 2023
YSRTP Sharmila & Co Cheating
YSRTP Sharmila & Co Cheating
Cheating Politicians Excusive StoriesPosted by admin on 2023-11-17 06:58:21 | Last Updated by admin on 2023-11-18 17:47:13
- YSRTP షర్మిలా వెనకాలే ఆనకొండలు
- ఆరేండ్లుగా బిల్లులు ఇవ్వకుండా వేధింపులు.
- బంజారాహిల్స్ లో కేసు నమోదు సిసిఎస్ కు బదిలీ.
- సరిచప్పుడు చేయవద్దని అమె పీఏ, నిందుతుడు సతీష్ నాటకాలు.
- సెటిల్మెంట్ల పేరుతో రంగంలోకి బ్రదర్ అనిల్.
- ఏండ్లు గడుస్తున్న బాధితులకు జరగని న్యాయం
- షర్మిల బినామిల వ్యవహారం పై పూర్తి అధారాలు.
- ఈడీకి , సిబిఐకి పిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్న బాధితులు.
- బీనామిలకు రక్షణగా ఓ మత ఛానల్ .
- లక్షలు లేని వారికి వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో.?
- షర్మిలా బినామిల చరిష్మాలతో జరిగే మోసాల పై
- ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ప్రత్యేక కథనాలు.
Cpurtesy / Source By:
Devender Reddy
9848070809
బర్రెలక్క శిరీష కంటే వైఎస్ఆర్ బిడ్డ షర్మిలా కు రవ్వంత కూడా రేషం లేదని తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో దుమ్మేత్తి పొస్తున్నారు. అవినీతి అక్రమాల పై ఫైటింగ్ చేస్తా అంటూ పైసలతో మాత్రమే పాదయాత్ర చేసి.. పోటీలో లేకుండా పోయింది. మెగా పై ఫైటింగ్ అంటునే డబ్బులకు డూప్లికేట్ లా వ్యవహారించిందనే విమర్శలు ఉన్నాయి. ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ దేవేందర్ రెడ్డి సహాయసహాకారాలతోనే గవర్నర్ నుంచి సిబిఐకి, ఈడీకి పిర్యాదులు చేసింది. ఏదో చేస్తామని ఏమి చేయలేకపోయినా వైఎస్ఆర్టీపీ తాజాగా బినామిలతో మోసాలకు పాల్పడుతుంది. డబ్బులు ఇవ్వకుండా 6 ఎండ్ల నుంచి తిప్పించుకుంటున్నారు. పెండ్లీడుకు వచ్చిన కూతుర్లతో కొంత మంది, పక్షవాతంతో ఫైట్ చేస్తున్న మరొకొంత మంది ఉన్నారు. 10 మందికి 15 కోట్లు ఇవ్వకుండా 6 ఏండ్లుగా నానా ఇబ్బందులు పెడుతున్నారు. బంజారాహిల్స్ లో కేసు నమోదు అయినా మేనేజ్ చేసుకుని ముందస్తు బెయిల్ తీసుకున్నారు. సిసిఎస్ కి బదిలీ అయితే అక్కడ పొంతనలేని పత్రాలు చూపించాలని జాప్యం చేస్తున్నారు. బినామిలుగా ఉన్న పీఏ తాటి సతీష్, కొండల్ రావు లకు బాధితులను అదుకోవాలని అదేశించడం లేదు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ అప్పటికప్పడు కల్లిబొల్లి కబుర్లు చెప్పి వేధింపులకు గురిచేస్తున్న తీరు అశ్చర్యానికి గురిచేస్తుంది.
రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రవ్వంత కూడా రేషం లేకపోవడానికి కారణం ఏంటీ.
బినామిలకు రక్షణగా ఏఏ కంపనీలు ఉన్నాయి.
పాదయాత్ర కు ఎక్కడ నుంచి బ్లాక్ మనీ వచ్చింది.
కొల్లూరు లో పేదలను కొట్టి లాక్కున్న భూముల చరిత్ర ఏంటీ.?
త్వరలోనే ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ప్రత్యేక కథనలు మీ ముందుకు ఉంచబోతుంది.
అదివారం పార్ట్ -1 లో పాపం బాధితుల పేరుతో ఎలా మోసాలకు పాల్పడ్డారో మీ ముందుకు రాబోతుంది.