Tuesday, October 31, 2023

ఒకరిద్దరు వెళ్ళిపోయినా...టీడీపీ కీ నష్టం లేదు.... బక్కని నర్సింలు

*ఒకరిద్దరు వెళ్ళిపోయినా...టీడీపీ కీ నష్టం లేదు.... బక్కని నర్సింలు*

*కాసాని రాజీనామా, వ్యాఖ్యల్ని తప్పుబట్టిన నేతలు...!*

హైదరాబాద్‌: తెదేపాకు కార్యకర్తలే బలం, బలగమని.. ఒకరిద్దరు నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన బలహీనపడదని ఆ పార్టీ నాయకులు స్పష్టంచేశారు.తెదేపా ముఖ్యనేతలు మంగళవారం ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింలు మాట్లాడుతూ.. అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా, కష్టకాలంలో పార్టీని వీడి వెళ్లారంటూ కాసాని జ్ఞానేశ్వర్‌పై మండిపడ్డారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏకపక్షంగా వ్యవహరించారనీ..పార్టీ రాష్ట్ర కమిటీలన్నింటినీ రద్దుచేశారన్నారు.

కొందరు వ్యక్తుల కోసం పార్టీ నిర్ణయాలు ఉండవని పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. జాతీయ అధికార ప్రతినిధి టి.జ్యోత్స్న మాట్లాడుతూ కాసాని అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనివ్వలేదని ఆక్షేపించారు. జాతీయ నాయకత్వం కోర్‌కమిటీ వేస్తే కాసాని సహకరించలేదని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. 

*సుజీవన్ వావిలాల*🖋️

BRS అభ్యర్థులకు.... భద్రత పెంపు....!

*BRS అభ్యర్థులకు.... భద్రత పెంపు....!*

హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తి దాడి నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది.ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంచుతూ ఇంటెలిజెన్స్ ఏడీజీ అనిల్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం 2+2 భద్రతను 4+4గా పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు భద్రతను తక్షణమే పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.... ఈసీ నోటిఫికేషన్ జారీ

*ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.... ఈసీ నోటిఫికేషన్ జారీ*

దిల్లీ: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు  జరగనున్నాయి. నవంబర్‌ 7 నుంచి మొదలుకొని నవంబర్‌ 30 వరకు పలు దఫాల్లో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై  నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం  తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవంబర్‌ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్‌ 30 సాయంత్రం 6.30గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించడం, ప్రచారం చేయడం, ఫలితాలు ప్రచురించడం వంటివి చేయరాదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎవరైనా నిబంధనల్ని ఉల్లంఘిస్తే చట్టప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఇదిలా ఉంటే, ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. నవంబర్‌ 7న తొలిదశ పోలింగ్‌; నవంబర్‌ 17న రెండో దశ పోలింగ్‌ నిర్వహించనున్నారు. మిజోరంలో నవంబర్‌ 7, మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 17, రాజస్థాన్‌లో నవంబర్‌ 25, తెలంగాణలో నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనుంది.


*సుజీవన్ వావిలాల*🖋️

Monday, October 30, 2023

చరిత్రలో ఎంతోమంది నిరంకుశ పాలకులు వచ్చారు పోయారు

https://x.com/RaviVattem/status/1718831186297212967?t=NkvFiLsdMOFO2sQC_kH80A&s=08                                                     
 *తెలంగాణలో 2014 వరకు రాజకీయాలు ఒకలా ఉంటే 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయాల్లో పూర్తిగా మార్పు కనిపిస్తోంది.తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని టిఆర్ఎస్పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసి తొమ్మిదేళ్లు నిరంకుశ పాలను కొనసాగించింది.ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులను నయానో భయానో లొంగదీసుకుని తమ పార్టీలోకి చేర్చుకొని ప్రశ్నించే గొంతులను లేకుండా చేస్తోంది.కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి చరిత్రలో ఎంతోమంది నిరంకుశ పాలకులు వచ్చారు పోయారు ఈరోజు వారి నామరూపాలు కూడా లేవు. భవిష్యత్తులో కూడా ఇది పునరావృతం కాబోతోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ప్రజలకు ఒక వెన్నుముక్కలాంటిది అది లేకుండా చేసి పాలించడం అంటే ఇక మీరే ఊహించుకోవచ్చు.* *#TelanganaElections2023* *#TelanganaAssemblyElections2023* *#TelanganaElections #Telangana*                                                            *Praja_Snklpm*

Sunday, October 29, 2023

హ్యాట్రిక్ కొట్టాలని.... చరిత్రలో నిలవాలని... ఎమ్మెల్యేల ఆరాటం

*హ్యాట్రిక్ కొట్టాలని.... చరిత్రలో నిలవాలని... ఎమ్మెల్యేల ఆరాటం*

హైదరాబాద్‌: ఓటర్లను మెప్పించి వరసగా మూడుసార్లు గెలవడం అభ్యర్థులకు పెద్ద సవాలే. సిటీలో కొందరే ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. *రాజేంద్రనగర్‌ నుంచి టి.ప్రకాశ్‌గౌడ్‌* *ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆసిఫ్‌నగర్‌ నుంచి దానం నాగేందర్‌* ఇదివరకే హ్యాట్రిక్‌ కొట్టారు.
వీరు ఈసారీ బరిలో ఉండగా మరికొంత మంది హ్యాట్రిక్‌ రేసులో ఉన్నారు.

సనత్‌నగర్‌నుంచి మంత్రి తలసాని 2014లో తెదేపా, 2018లో భారాస నుంచి విజయం సాధించారు. హ్యాట్రిక్‌ సాధిస్తాననే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కుత్బుల్లాపూర్‌లో భారాస తరఫున ఎమ్మెల్యే కేపీ వివేకానంద పోటీచేస్తున్నారు. 2014లో తెదేపా నుంచి తొలిసారి, 2018లో భారాస నుంచి విజయం సాధించారు.
కూకట్‌పల్లి నుంచి మాధవరం కృష్ణారావు 2014లో తెదేపా, 2018లో భారాస నుంచి విజయం సాధించి తాజాగా అదేపార్టీ తరఫున బరిలో నిలిచారు.
శేరిలింగంపల్లి నుంచి భారాస తరఫున ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ హ్యాట్రిక్‌ విజయం కోసం బరిలో దిగారు. 2014లో తెదేపా నుంచి, 2018లో భారాస నుంచి గెలుపొందారు.
జూబ్లీహిల్స్‌ నుంచి భారాస అభ్యర్థిగా గోపీనాథ్‌ 2014లో తెదేపా, 2018లో భారాస తరఫున గెలుపొంది మరోసారి బరిలో నిలిచారు.
చేవెళ్ల నుంచి యాదయ్య 2014లో కాంగ్రెస్‌ నుంచి, 2018లోగెలుపొంది మరోసారి బరిలో నిలిచారు.
చేవెళ్ల నుంచి యాదయ్య 2014లో కాంగ్రెస్‌ నుంచి, 2018లో భారాస తరఫున విజయం సాధించారు. భారాస నుంచి మళ్లీ పోటీలో ఉన్నారు.
*ఒకే పార్టీ నుంచి..*

సికింద్రాబాద్‌ నుంచి భారాస తరఫున టి.పద్మారావు బరిలో ఉన్నారు. 2004లో సికింద్రాబాద్‌ నుంచి గెలుపొందారు. 2009లో సనత్‌నగర్‌ నుంచి ఓడిపోయినా.. తిరిగి సికింద్రాబాద్‌ నుంచి 2014, 2018లో విజయం సాధించారు. ఈసారి హ్యాట్రిక్‌పై గురిపెట్టారు.
పటాన్‌చెరు మహిపాల్‌రెడ్డి భారాస నుంచి 2014, 2018లో గెలుపొందారు. మూడోమారు విజయం కోసం శ్రమిస్తున్నారు.
షాద్‌నగర్‌ నుంచి అంజయ్య యాదవ్‌ హ్యాట్రిక్‌ కోసం బరిలో ఉన్నారు.
గోషామహల్‌ నుంచి భాజపా తరఫున రాజాసింగ్‌ హ్యాట్రిక్‌ ఖాయమంటున్నారు

*సుజీవన్ వావిలాల*🖋️

విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం...!

*విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం...!*

విజయనగరం : ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం దగ్గర జరిగిన రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్టుగా రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం పలు రైళ్ల రద్దయ్యాయి.విశాఖ-రాయపూర్ ప్యాసింజర్ రైలు రద్దు, విశాఖ రాయపూర్ మధ్య నడిచే కొర్చా రైలు రద్దు, పారదీప్-విశాఖపట్నం, రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం - గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్నం, విజయనగరం-విశాఖపట్నం రైళ్లు రద్దయ్యాయి. ఇక కోణార్క్, ఫలక్ నుమా, నాగవల్లి రైళ్లను విజయనగరం, టిట్లాగఢ్, నాగపూర్, కాజీపేట మీదుగా దారి మళ్లించారు. పూరీ- తిరుపతి రైలును బల్గాం దగ్గర నిలిపివేశారు.

రైలు ప్రమాద స్థానిక రెస్క్యూ ఆపరేషన్ టీం చేరుకుంది. రైల్వే అధికారులు బాహుబలి క్రేన్ ను రంగంలోకి దించారు. నుజ్జునుజైన బోగీలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటికే 10 మంది మృతి చెందారు. 54మందికి పైగా గాయపడ్డారు.

*సుజీవన్ వావిలాల*🖋️

_దేశ పౌరులుగా మన బాధ్యత నిర్వహిద్దాం_

*_దేశ పౌరులుగా మన బాధ్యత నిర్వహిద్దాం_*

*_మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా ఆహ్వానం_*
*_జర్నలిస్టుల సంఘాలు, పౌర సంఘాలు, వారి ప్రతినిధులు ముంచుకొస్తున్న "ధనతంత్రం - చోరతంత్రం -ధనస్వామ్యం" ప్రమాదాల నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి  తక్షణ ఓటు హక్కు వినియోగించుకునే దేశభక్తి కర్తవ్యంపై "ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక" ఆధ్వర్యంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారు._*

_దయచేసి ఈ సమావేశానికి తప్పకుండా హాజరై ఈ కార్యక్రమాన్ని కవర్ చేయగలరని మా ప్రార్థన. సమాజ ప్రయోజనాల కోసం మీ, మా, మన మీడియాలలో విస్తృత ప్రచారం చేద్దాం._

*_తేదీ: అక్టోబర్ 30 (సోమవారం), 2023 మధ్యాహ్నం 2 గంటలకు వేదిక: సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాద్._*

*_సీనియర్ జర్నలిస్టులు_*

_పాశం యాదగిరి 9966003455_

_కే.కోటేశ్వర్ రావు 9052477378_

_మామిడి సోమయ్య  9100933723_

_అనంచిన్ని వెంకటేశ్వరావు 9440000009_

_కరుణాకర్ దేశాయి  9849436246_

Friday, October 27, 2023

జూబ్లీహిల్స్ టికెట్ నిరాకరించడంతో విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం

⚪జూబ్లీహిల్స్ 

*||జూబ్లీహిల్స్ టికెట్ నిరాకరించడంతో విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం||*

*జూబ్లీహిల్స్ టికెట్ పీజేఆర్ కొడుకుకి కాకుండా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు*  *కేటాయించడంతో ఆగ్రహంగా ఉన్న విష్ణు*

*టికెట్ ఇస్తే బీజేపీ నుండి లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్న విష్ణువర్ధన్ రెడ్డి.*

*సుజీవన్ వావిలాల*🖋️

#FriendlyPolicing అంటే యువకులను బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్లు కొట్టడమా??

https://x.com/Praja_Snklpm/status/1717789650256007411?t=7dV1KN9ID1qHyneD9tiBYg&s=08                                                                       *Thank you for calling Dial112 your Case ID 20230006037256 is assigned to @uppalps_ and concerned officer will contact you soon-TSDIAL112*
*Thank you for calling Dial112 your Case ID 20230006037212 is assigned to @uppalps_ and concerned officer will contact you soon-TSDIAL112*                                                                                                               
*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'    #FriendlyPolicing  అంటే  యువకులను బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్లు కొట్టడమా??_*

*#TelanganaHighCourt*
*@ECISVEEP*
*@ElectionT*
*@TelanganaDGP*
*@Collector_MDL*
*@RachakondaCop*
*@DcpMalkajgiri* *@TelanganaCOPs*
*@dr_mvreddy*
*@AnooradhaR*
*@Narhariyarabotu*
*@HRF_Humanrights*

*#Dial100 #Dial112*

*Update plz*

*Bapatla Krishnamohan*
*Bplkm🪶*

Thursday, October 26, 2023

అందరికి అన్ని హామీలు ఇస్తున్న నాయకులకు పిల్లలు కనిపిస్తలేరా? బాలల హక్కుల సంఘం

అందరికి అన్ని హామీలు ఇస్తున్న నాయకులకు పిల్లలు కనిపిస్తలేరా? బాలల హక్కుల సంఘం

మ్యానిఫెస్టోలో మహిళలకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, వ్యవసాయదారులకు రకరకాల హామీలు ఇచ్చారు,మరి పిల్లలకు ఏం చేశారు, వారికి ఓటు హక్కు లేదని చిన్న చూపా? వారు ఫ్యూచర్ ఓటు బ్యాంకు అని అన్ని రాజకీయ పార్టీలు గుర్తు పెట్టుకోవాలి.వారి తరపున బాలల హక్కుల సంఘం అడుగుతుంది ఏం చేస్తారు అని? ఈ కార్పోరల్ పనిష్మెంట్స్ లేకుండా, అమ్మాయిలు డ్రాపౌవుట్స్ కాకుండా స్వేచ్ఛగా చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలి.ఫీజుల నియంత్రణ పై హామీ ఇవ్వాలి పిల్లల పై రకరకాల అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.కార్పొరేట్ పాఠశాలల నుండి వీధి బడుల వరకు రకరకాల కార్పోరల్ పనిష్మెంట్స్ ఇస్తున్నారు. తెలుగుఅక్షరాలు 56 ఉంటే, అన్ని రకాల పనిష్మెంట్స్ ఇస్తున్నారు కీచక టీచర్స్.తిరిగి ఏమి అనలేని చిన్నారులను హింసించి రాక్షసానందం పొందుతున్న టిచర్లు. ఏం దౌర్భాగ్యమో ఏమో కానీ పిల్లల పట్ల విపరీతమైన ద్వేషం, తప్పులు చేయకున్నా పనిష్మెంట్స్ ఇస్తున్నారు.

  1. రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఎండలో నిలబెట్టడం.
  2. చేతులు ఇరవడం
  3. వాతలు తేలేలా కొట్టడం
  4. నేలపై అరచేతులతో నడిపించడం
  5. గోడ కుర్చీ వేయించడం
  6. రెండు వేళ్ళ మధ్య పెన్సిల్ పెట్టి ట్విస్ట్ చేయడం
  7. పెన్సిల్ కొనతో అరచేతుల పై కుచ్చడం
  8. నీల్ డౌన్/ మొకాళ్ళ పై నిలబెట్టడం
  9. వంగొ బెట్టడం
  10. బెంచి ఎక్కించడం
  11. క్లాస్ బయట నిలబెట్టడం
  12. మానసికంగా హింసించడం అంటే నీకేం రాదు అని, మొద్దువి అని, నీకు చదువు రాదు అని అందరి ముందు హేళన చేయడం
  13. క్లాస్ మొత్తాం తో ఒకరిని చెంపలు వాయించడం
  14. అమ్మాయిలను శారీరకంగా హింసించడం.
    చైల్డ్ రైట్స్ కమిషన్ వేయాలి ,నేటి బాలలే రేపటి పౌరులు అంటారు వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని దేశ రాజకీయనాయకులు మరియు ప్రభుత్వాలు తప్పకుండ ఎంతో కొంత వారి మానసిక శారీరక ఆహ్లాద వాతారణం కల్పించాలి అని బాలల హక్కుల సంఘం కోరుతుంది.
అనురాధ రావు బాలల హక్కుల సంఘం

Tuesday, October 24, 2023

​ఇంటర్,డిప్లొమా చేసినవారికి సువర్ణవకాశం

IOCL Jobs 2023: ఇంటర్​, డిప్లొమా చేసినవారికి సువర్ణవకాశం.. ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​లో ఉద్యోగాలు..!
Courtesy / Source by : Jyothi Kommuru (hmtv media)24 Oct 2023 10:05 AM
IOCL Jobs 2023: ఇంటర్​, డిప్లొమా చేసినవారికి సువర్ణవకాశం.. ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​లో ఉద్యోగాలు..! IOCL Jobs 2023: ఇంటర్​, డిప్లొమా చేసిన విద్యార్థులకు ఇది సువర్ణవకాశమని చెప్పాలి. ఎందుకంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) లో అప్రెంటిస్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1720 అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఐఓసీఎల్ అధికారిక వెబ్ సైట్ iocl.com సందర్శించి అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్​కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Also Read - Airports Authority of India Jobs 2023: ఇంటర్​ చదివిన నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. ఎయిర్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు..! మొత్తం పోస్టులు, అర్హత ఐఓసీఎల్ (IOCL) లో మొత్తం 1720 అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు iocl.com. వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అక్టోబర్ 21వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ నవంబర్ 20వ తేదీతో ముగుస్తుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్ స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి రెగ్యులర్ ఫుల్ టైమ్ ఇంటర్మీడియట్ (Class XII) / గ్రాడ్యుయేట్/డిప్లోమా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆయా అర్హత పరీక్షలో వారు కనీసం 50% మార్కులు పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల వారు కనీసం 45% మార్కులు సాధించాలి. Also Read - Teacher Jobs: అమెరికాలో టీచర్‌ ఉద్యోగాలకు డిమాండ్‌.. ఒక ప్రైవేట్‌ టీచర్‌ జీతం తెలిస్తే షాకవుతారు..! వయో పరిమితి, ఎంపిక ప్రక్రియ ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు IOCL అధికారిక వెబ్ సైట్ iocl.com. సందర్శించి తెలుసుకోవచ్చు.

https://www.hmtvlive.com/education-careers/airports-authority-of-india-job-notification-2023-check-for-all-details-104495?infinitescroll=1

Monday, October 23, 2023

ఎట్లా ఎట్లా..చరిత్ర తిరగరాస్తారా ??

*చరిత్రను తిరగరాద్దాం.. బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీలకు కేటీఆర్‌, హరీశ్‌ పిలుపు*                                                                                           https://www.ntnews.com/telangana/ktr-harish-rao-direction-to-brs-constituency-in-charges-1302061                                                                                    *****---*****---*****    *_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*                                                                                                                                  *ఎట్లా ఎట్లా  🤔*                                                              

*చరిత్ర తిరగరాస్తారా  ??*

*అంటే #తెలంగాణ లో* *#రైతులఆత్మహత్యలు* *#నిరుద్యోగులఆత్మహత్యలు #ప్రభుత్వబడులుమూసివేత*   *#కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ* *#విద్యార్థుల ఆత్మహత్యలు*    *#ప్రభుత్వఆసుపత్రుల నిర్వాకం*
*#ప్రజాప్రతినిధులదోపిడీ*
*#ప్రభుత్వఅధికారుల అవినీతి* *#ప్రభుత్వఅధికారులు IAS నుంచి చెప్రాసి వరకు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయలేదు*
*#GHMCపరిధిలో, మునిపాలిటీ, కార్పొరేషన్ లలో చెరువులుకబ్జాలు, చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు*

*#TelanganaHighCourt*
*#న్యాయస్థానాలఆదేశాలను పాలకులు & ప్రభుత్వఅధికారులు గౌరవించలేదు*  *#రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా న్యాయంగా ప్రశ్నించేవారిమీద అక్రమంగా అరెస్టులు*

*👆#PublicVoice 👆*
*#మీ పాలనలో పైన చెప్పినవి 100% జరిగినవి... #తెలంగాణ ప్రజలకు  సమాధానం చెప్పండి??*
*Bplkm🪶*                                               *NOTE : COPY TO GROUP LINK MEDIA*
https://x.com/Praja_Snklpm/status/1716325486719340755?t=lKR2MEmseCrUg7YvD-Tb1A&s=08

Saturday, October 21, 2023

పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయం... సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర...!

*పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయం... సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర...!*

రాయదుర్గం : పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిగా సిబ్బంది విధుల పట్ల దూరంకితం కావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పిలుపు ఇచ్చారు.పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా శనివారం కమిషనరేట్ ఆవరణలోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రత్యేక పోలీస్ బలగాలు పోలీసు లాంఛనాలతో అమరవీరులకు గౌరవ వందనం చేసి.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను కమిషనర్ పరామర్శించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 189 మంది పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాసినట్లు తెలిపారు. దేశం సమాజం, భావితరాల కోసం పోలీసులు ప్రాణాలు పణ్ణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తుంటారని చెప్పారు. వివిధ సమస్యలు, కష్టాలతో తమ వద్దకు వచ్చే బాధితులకు పోలీసులు న్యాయం చేయాలనిసూచించారు. అలా సేవలందించే పోలీసులు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తారన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు సీపీ అవినాష్ మహంతి, జాయింట్ సీపీ నారాయణ నాయక్, డిసిపిలు తదితర పోలీసు అధికారులు అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. డీసీపీలు శ్రీనివాసరావు, శబరీష్, సందీప్, జగదీశ్వర్ రెడ్డి, నారాయణరెడ్డి, ఎల్ సీ నాయక్, రవి చందన్ రెడ్డి, ఏడీసీపీలు షమీర్ ,శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Friday, October 20, 2023

Appeal to High Court to set up Ecological Heritage Bench

Hyderabad 20 October 2023
To
The Chief Justice
High Court at Hyderabad
On southern bank of Musi river
Opposite to Heritage Osmania General Hospital,
Hyderabad
Sub: Eviction of land fill concretized & Parking in Musi river , opposite to
Osmania General Hospital, Opposite to High Court Building, Hyderabad
Ref: https://www.youtube.com/watch?v=WfW9yLeXPmQ - Screen recording of historical
satellite imagery of the Musi nadi, in the stretch opposite to Osmania General
Hospital and opposite to The High Court, Hyderabad
Your Honour,
On October 16, 2023, it was World Food Day and the theme of this year was
'Water is Food. Water is Life'.
This appeal is to save lives and human dignity, as the standards of our lives
are jeopardized due to polluted and encroached and compromised natural
resources. Screen Recording of historical satellite imagery from Google Earth
is uploaded on this link for your perusal: https://www.youtube.com/watch?
v=WfW9yLeXPmQ
The above link demonstrates how the river is compromised by concretization of
Musi river right opposite High Court/Osmania General Hospital. The very purpose
of constructions of public welfare institutions on the banks of the river Musi
so as to prevent encroachments inside the river stands defeated by state itself
manufacturing land inside the river.
This is a video petition containing an appeal to the Hon'ble Chief Justice of
High Court Hyderabad, to set up Green/Ecological Heritage Bench for restoration
of Musi nadi and for restoration of the Ecological Heritage of Hyderabad and
Telangana, in light of the utter disrespect and invasion on the space and
integrity of River Musi and thousands of water bodies in Hyderabad and
Telangana.
This is an appeal for prompt setting up of exclusive bench for day to day
hearings of Ecological Heritage that we are losing by the minute.

All people from Hyderabad & Telangana who use water, air and food.
--
https://youtu.be/WfW9yLeXPmQ

Courtesy / Source by :
Dr Lubna Sarwath, PhD(Indonesia),
i-WIL(IIM-B)
former Visiting Lecturer, Trisakti University, Jakarta, Indonesia
m:9963002403; e:sarwath.lubna@gmail.com


Tuesday, October 17, 2023

_#తెలంగాణ లో రాబోయేరోజుల్లో భూగర్భజలాలు ఏమిటో తెలియని పరిస్థితులు_

https://x.com/Praja_Snklpm/status/1714512412664304024?t=PSZ6GpJFQe0WxLZqf5Vyqw&s=08                                                       
*_#తెలంగాణ సాధించుకున్నాక #చెరువులపరిరక్షణ #waterbodies ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఈ పాలకులు & సంబంధిత శాఖల ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా జిల్లాల#కలెక్టర్లు.మరీముఖ్యంగా మౌనంగా వున్న #ప్రజలు.రాబోయే రెండు/మూడు సంవత్సరాలలో భూగర్భజలాలు అంటే ఏమిటి అనే పరిస్థితులు ఉంటాయి.... Bplkm🪶_*                                                                                                                                  
*@nwmgoi @CWCOfficial_GoI @LubnaSarwath* *@DonthiNreddy*
*@KVishReddy*
*@madhulikaS2 @Narhariyarabotu* *@RaviVattem @hyderabadzinda2 @veeruveeru1 @BplplH @PushpaFashions*

*#TelanganaHighCourt*
*#TelanganaLokayuktha* 
*#RamanthapurPeddaCheruvu*
*#RamanthapurChinnaCheruvu*

Sunday, October 15, 2023

S P నీ బదిలీ చేయాలనీ... RS ప్రవీణ్ కుమార్ పట్టు

*S P నీ బదిలీ చేయాలనీ... RS ప్రవీణ్ కుమార్ పట్టు*

మంచిర్యాల: ఎస్పీ సురేశ్‌కుమార్‌ను బదిలీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పట్టుబట్టడం జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.మూడురోజుల క్రితం ఆర్‌ఎస్పీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సురేశ్‌కుమార్‌ ఎస్పీగా కొనసాగితే జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా పార్టీ ప్రెస్‌మీట్‌లోనూ ఇదే విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

ఓ మాజీ ఐపీఎస్‌ అధికారి.. విధుల్లో ఉన్న ఐపీఎస్‌ అధికారిపై ఇలాంటి ఆరోపణలు చేయడంతో అటు పోలీస్‌శాఖ, రాజకీయ, వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఎస్పీ సురేశ్‌కుమార్‌ స్పందిస్తూ.. సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను తాను సన్మానించిన ఫొటోలు పాతవని, షెడ్యూల్‌ విడుదలయ్యాక పక్కాగా ఎన్నికల కోడ్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్నట్లు ఎస్పీ సురేశ్‌కుమార్‌ వివరించారు. అయితేబీఎస్పీ మాత్రం అందుకు సంతృప్తి చెందక ఎస్పీని బదిలీ చేయాలంటూ పట్టుబడుతోంది. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని అధికారవర్గాలు ఆరా తీస్తున్నాయి.

*ఎన్నికల కమిషన్‌ ఆరా?*
ఎస్పీని బదిలీ చేయాలని ఫిర్యాదు రావడం, అందులో కొన్ని ఆధారాలు కమిషన్‌కు ఇవ్వడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. అలాగే రాష్ట్ర పోలీస్‌శాఖ కూడా ఈ వ్యవహారంలో ఇప్పటికే సమాచారం తీసుకుంది. ఈ ఫిర్యాదులో వాస్తవమెంత? అనే కోణంలో ఆధారాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సిర్పూర్‌ ఎమ్మెల్యేగా బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌పై రాజకీయ కోణంతో పాటు ఇతర కోణాల్లోనూ వివరాలు సేకరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన క్షణం నుంచే కోడ్‌ అమల్లోకి వచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ష న్‌ కమిషన్‌ అధీనంలోనే పని చేయాల్సి ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్‌తో పాటు ఎస్పీ కూడా కమిషన్‌ ఆదేశాలు పాటించాల్సిందే. బదిలీలు, ఇతర చర్యలు తీసుకోవచ్చు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అధికార పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల పది మంది ఐపీఎస్‌లు, నలుగురు కలెక్టర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచితప్పించి బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో వేరే అధికారులను నియమించింది. ఈ క్రమంలో జిల్లాలో ఎస్పీ పైనా ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠ జిల్లా ప్రజల్లో నెలకొంది.

*సుజీవన్ వావిలాల*🖋️

Political parties must focus on development and community-centric welfare: FGG

Political parties must focus on development and community-centric welfare: FGG

MLAs, ministers and chief minister should make public their annual property statements. 

Courtesy / Source by : THE NEW INDIAN EXPRESS Media.. Published: 15th October 2023 08:35 AM  |   Last Updated: 15th October 2023 08:35 AM  |  A+A-

Political parties must focus on development and community-centric welfare: FGG

For representational purposes

Express News Service

HYDERABAD: There is an acute need to maintain a balance between welfare and development, feels Forum for Good Governance (FGG). The manifesto of any political party should focus on development and community-centric welfare and not voter-centric welfare programmes. However, various political parties are loading their manifesto with welfare programmes with the sole aim of luring voters. 

If all the announced welfare programmes are added up, they will cost more than the entire annual budget of the State. The manifestos, if implemented may leave the State bankrupt, the FGG says, adding that it is nothing but luring voters with public money. 

The political parties must calculate the funds required for all the promises made in their election manifesto and tell the people where they intend to get the funds from.

Keeping in view of the situation, the FGG has prepared a ‘’Peoples Manifesto’’ after consultations with students, farmers, employees and a cross-section of society. 

Based on the opinions expressed, as many as 35 issues were flagged. The People’s Manifesto demands 25% of the State budget be earmarked to health and education. Budget allotment to welfare programmes should be limited to 30% of the annual budget of the state. Funds released to gram panchayats and municipalities as recommended by the State Finance Commission, and taxes reduced on petrol and diesel.
Rythu Bandhu should be limited to landholdings up to 10 acres. If a tenant farmer is cultivating the land he should be given Rythu Bandhu, crop insurance to cover all farmers in the State. Free electricity to farmers should be limited to three borewells. There should be strict control on spurious seed supplies, cultivation of oil seed and millets to be encouraged. 

A high-power technical committee should be constituted to inquire into all the irrigation projects taken up during the last 10 years regarding their technical soundness, cost-effectiveness etc. White paper on power sector, transparency in working of government, controlling corruption in the administration, economy in administrative expenditure, maintains of cordial relations with the Union government.

MLAs, ministers and chief minister should make public their annual property statements. There should be clear guidelines for the selection of beneficiaries in welfare programmes, persons with criminal records should not be given the tickets. There should be a total ban on the sale of government lands, and price control on essential commodities. Skill development and employment generation.

‘’The way things are happening people are losing confidence in democracy. Political parties have become law by themselves. It is happening because who wins, wins all. Politicians are abusing each other in an uncultured and uncivilised manner,” retired Supreme Court judge, Justice B Sudharshan Reddy said, releasing the Peoples Manifesto.

‘’The manifestos issued by various political parties have no legal sanctity. They are just waste paper. People should not be carried away by the assurances mentioned in the party manifesto while casting their vote,’’ retired High Court judge, Justice Ramalingeswara Rao said.

"మీడియా ప్రకటన" _👉 ప్రవళిక ఆత్మహత్యపై ప్రభుత్వం రాజకీయం చేయడం సిగ్గుచేటు: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్_

                                                                                              *మీడియా ప్రకటన*
*తేదీ:15-10-2023*
*బెజ్జూర్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా*

*_👉 ప్రవళిక ఆత్మహత్యపై ప్రభుత్వం రాజకీయం చేయడం సిగ్గుచేటు: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్_*

*👉 టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల కాల్ డేటా సంభాషణలు బయట పెట్టాలి*

*ప్రవళిక ఆత్మహత్యపై పోలీసులను అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్,కవితలు మృతురాలి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ,వ్యక్తిగత దూషణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రవళిక ఆత్మహత్యపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.ప్రవళిక ఆత్మహత్య అనంతరం పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. విషాదకరమైన పరిస్థితుల్లో కుటుంబానికి బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం ఆమె వాట్సాప్ చాటింగ్ వివరాలు బయటపెట్టి, రాజకీయం చేయడాన్ని తప్పుబట్టారు.* 

*టీఎస్పీఎస్సీ  పేపర్ లీకేజీ చేసి వేల కోట్ల రూపాయలకు పేపర్లు అమ్ముకొని చీకటి దందాకు తెరతీసిన టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు కేసీఆర్, కేటీఆర్ లతో జరిపిన ఫోన్ సంభాషణల వివరాలను సిట్ అధికారులు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. పోలీసులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వారి కాల్ డేటా వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ కనీసం కాల్ డాటా తీసుకోలేని పోలీసులు కేవలం ఆరు గంటల్లనే మృతురాలి ఫోన్, వాట్సాప్ కాల్ డేటా ఎలా బయటకు తీశారని ప్రశ్నించారు. టెలికాం ప్రైవసీ నియమ నిబంధనలు పోలీసులు పాటించరా అని అన్నారు.*

*పేద వర్గాలకు చెందిన ఓ యువతి ఆత్మహత్యపై బీఆర్ఎస్ నేతలు మీడియాలో అబద్ధాలను ప్రచారం చేస్తూ రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. బీఎస్పీ వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు.కేవలం బీఎస్పీ వలనే గ్రూప్-1 తో సహా 16 పరీక్షల పేపర్లు లీకేజీలు బయట పడ్డాయని, గ్రూప్ -II పరీక్షలు వాయిదా పడ్డాయని నిరుద్యోగులకు న్యాయం చేసే పార్టీ బీఎస్పీయేనన్నారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్పీఎస్సీని రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తామన్నారు.* *కేసీఆర్,కేటీఆర్ లు తెలంగాణ ఉద్యమకారులపై కక్షగట్టి ఏ విధంగా రాజకీయంగా దూరంగా పెట్టారో అదేవిధంగా నిరుద్యోగులను పోలీసులను అడ్డంపెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.*
*#Pravalika #TSPSC #IamRSP #BSP4Telangana #KCRFailedTelangana* *#Justice2Unemployed #LiberateTelanganaAgain #BRSKilledPravalika @RSPraveenSwaero*   *@Praja_Snklpm*

Courtesy / Source by :
https://x.com/BSP4Telangana/status/1713444728971403535?t=kl7GQesrXwXYhWUrWis0CQ&s=08

Saturday, October 14, 2023

#తెలంగాణ లో ఆడపిల్లకు కన్నీళ్లు!!

https://www.instagram.com/reel/CyYJnXahYgJ/?igshid=MTc4MmM1YmI2Ng==                                                                                      *_#తెలంగాణ లో పాలకులు & కొందరు పోలీస్ అధికారులు ఆడపిల్లలకు / విద్యార్థినులకు / మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో  వాస్తవాలు తెలియచేసిన రేణుక చౌదరి మేడం గారికి మద్దత్తుగా 'ప్రజాసంకల్పం'✊... Bplkm🪶_*

Thursday, October 12, 2023

'ప్రజాసంకల్పం' ఛాలెంజ్ చేస్తుంది @KTRBRS సారుకు!!

*_'#ప్రజాసంకల్పం' ప్రశ్నిస్తుంది  #తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRBRS సారును... అయ్యా పురపాలక శాఖకు మీరు మంత్రియేనా?? ఎందుకంటే గౌరవ #TelanganaHighCourt       కు అన్నీ తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు మీ అధికారులు ఎందుకు??2005 లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్KL వ్యాస్ (స్వర్గీయ) సర్ గారు ప్రజాప్రయోజనాలకోసం #రామంతాపూర్ పెద్దచెరువును పరిరక్షించాలని హైకోర్ట్ ను ఆశ్రయిస్తే అప్పటి AP ప్రభుత్వం నుంచి ఇప్పుడు వున్న #తెలంగాణ ప్రభుత్వం ఈరోజు వరకు ఎలాంటి పరిరక్షణ చేయలేదు ఈ చెరువును ఎందుకు??   ఇప్పుడు #GHMC కమీషనర్ సారు చెరువు ఆక్రమణల గురించి ఎందుకు మాట్లాడటలేదు?? అసలు చెరువు #FTL అధికారికంగా రికార్డ్ లో ఎందుకు లేదు?? ఇంకా చాలా ఇష్యూస్ మీరు దాచిపెట్టారు వాటి గురించి మేము Dr లుబ్నా సర్వత్ మేడం & పర్యావరణ ప్రేమికులు & స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో గౌరవ న్యాయస్థానానికి వాస్తవాలతో నివేదిక ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత శాఖల అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేసి 'స్వర్గీయ KL వ్యాస్' సారు గారి 'సంకల్పానికి' న్యాయం చేసి చెరువులను కాపాడుతాము అని ఛాలెంజ్ చేస్తున్నాము ... Bplkm🪶_* https://www.ntnews.com/hyderabad/telangana-high-court-pulls-up-municipal-commissioner-for-inaction-to-protect-ramanthapur-lake-1287563

హైదరాబాద్ పోలీస్ కమీషనర్ ఎవరు....?

*హైదరాబాద్ పోలీస్ కమీషనర్ ఎవరు....?*

*మొత్తం 17 మందితో జాబితాఉత్తరాది అధికారులకు అవకాశాలుంటాయనే ప్రచారం*

హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఖాళీ అయిన పోలీస్‌ పోస్టుల్లో ఎవర్ని నియమిస్తారనే ఉత్కంఠ ప్రస్తుతం ఆ వర్గాల్లో నెలకొంది.ముఖ్యంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఎవర్ని నియమిస్తారనే అంశంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఖాళీ అయిన స్థానాల్లో నియమించేందుకు అర్హులైన ముగ్గురి పేర్లు సూచించాలని ఈసీ కోరింది. హైరాబాద్‌ సీపీ సహా కమిషనర్ల పోస్టుకు సంబంధించి మాత్రం రాష్ట్రంలో పనిచేస్తున్న అదనపు డీజీ స్థాయి అధికారుల పేర్లన్నీ పంపాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి మొత్తం 17 మందితో కూడిన అదనపు డీజీ స్థాయి అధికారుల జాబితాను పంపడంతోపాటు..వారిలో ముగ్గురి జాబితాను వేరుగా పంపినట్లు సమాచారం. మిగిలిన కమిషనర్ల పోస్టులకు సీనియర్‌ ఐపీఎస్‌లు, ఎస్పీల పోస్టులకు 2014, 2015, 2016, 2017 బ్యాచ్‌ల ఐపీఎస్‌ల పేర్లను ప్యానల్‌లో చేర్చినట్లు తెలుస్తోంది.
*సందీప్‌శాండిల్య, సంజయ్‌కుమార్‌ జైన్‌, శ్రీనివాసరెడ్డి?*
ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అధికారినే హైదరాబాద్‌ సీపీగా నియమించేందుకు ఎన్నికల కమిషన్‌ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణ పోలీసు అకాడమీ సంచాలకులుగా పనిచేస్తున్న సందీప్‌శాండిల్య, శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌లకు అవకాశాలు ఎక్కువగా ఉండే వీలుంది. లేనిపక్షంలో చాలాకాలంగా అప్రాధాన్య పోస్టుల్లోనే కొనసాగుతున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేరు సైతం తెరపైకి రానుంది. ముక్కుసూటి అధికారిగా పేరున్న శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం అదనపు డీజీ (ఆర్గనైజేషన్స్‌)గా పనిచేస్తున్నారు. మహేష్‌భగవత్‌కు అవకాశం దక్కవచ్చన్న ప్రచారం జరిగినప్పుటికీ మునుగోడు ఎన్నికలప్పుడు ఆయన రాచకొండ కమిషనర్‌గా ఉండటం, చౌటుప్పల్‌ ప్రాంతం మునుగోడు నియోజకవర్గం పరిధిలోకి రావడం ఆటంకంగా మారింది. ఇక వేటుకు గురైన పది మందిఎస్పీలలో సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు మాత్రమే ఐపీఎస్‌ హోదా ఉంది. మిగతా వారంతా నాన్‌క్యాడర్‌ ఎస్పీలే. వీరందరి స్థానంలో ఐపీఎస్‌లనే నియమించాలని ఎన్నికల కమిషన్‌ భావిస్తున్నట్లు సమాచారం.

*సుజీవన్ వావిలాల*

Wednesday, October 11, 2023

మేడ్చల్ బీజేపీ అభ్యర్థిగా ఈటల జమున....?

*మేడ్చల్ బీజేపీ అభ్యర్థిగా ఈటల జమున....?*

హైదరాబాద్:మొదటి నుంచీ ఈటల కుటుంబానికి మేడ్చల్‌ నియోజకవర్గానికి సమీప సంబంధాలు ఉండటంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున మేడ్చల్‌ నుంచి హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సతీమణి జమునను రంగంలోకి దించేందుకు ఆ పార్టీ అధిష్టానం వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.ఈటల రాజేందర్‌ మేడ్చల్‌ మండల పరిధిలోని పూడూర్‌ దగ్గర ఔటర్‌ రింగురోడ్డు సమీపంలో నివాసముంటున్నారు.

ఆయన గోదాంలు, గతంలో పౌల్ట్రీలు, ఇతర వ్యాపారాలు నియోజకవర్గ పరిధిలోనే ఉండటంతో వారి కుటుంబానికి మేడ్చల్‌కు చాలా రోజులుగా సత్సంబంధాలు ఉన్నాయి. జమున నివాసం పూడూర్‌ పరిధిలో ఉండటంతో పాటు స్థానిక నాయకులతో పరిచయాలు ఉన్నాయి.ఈటలకు అర్థ బలం పరిపుష్టిగా ఉండటం, టికెట్‌ ఆశిస్తున్న మిగతావారికి ఆ బలం లేకపోవడం, రాజేందర్‌ బీసీ అయినా జమున రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడం, ఆ సామాజికవర్గ పెత్తనం మేడ్చల్‌లో ఎక్కువగా ఉండటంతో ఆమె అభ్యర్థిత్వం తమకు కలిసి వస్తుందని బీజేపీ అధిష్టానం ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ మేడ్చల్‌ టికెట్‌ తన భార్య జమునకు కేటాయించాలని ఎమ్మెల్యే ఈటల రాజెందర్‌ అధిష్టానాన్ని కోరినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Tuesday, October 10, 2023

చెరువుల పరిరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు

చెరువుల పరిరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు

రామంతాపూర్‌ పెద్దచెరువుతోపాటు ఇతర చెరువుల రక్షణకు చర్యలు తీసుకోకపోవడంపై వ్యక్తిగతంగా హాజరైన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తోపాటు రెవెన్యూ, హెచ్‌ఎండీఏ శాఖ అధికారులపై హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది

Courtesy / Source by : ఈనాడు మీడియా 
Published : 11 Oct 2023 03:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: రామంతాపూర్‌ పెద్దచెరువుతోపాటు ఇతర చెరువుల రక్షణకు చర్యలు తీసుకోకపోవడంపై వ్యక్తిగతంగా హాజరైన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తోపాటు రెవెన్యూ, హెచ్‌ఎండీఏ శాఖ అధికారులపై హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రామంతాపూర్‌ చెరువులో మురుగు కలవకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు ఆదేశించింది. చెరువు పరిరక్షణకు పురపాలకశాఖ ఏం చర్యలు తీసుకుంటుందో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. రామంతాపూర్‌ పెద్దచెరువును డంపింగ్‌ యార్డుగా మారుస్తున్నారని ఉస్మానియా ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె.ఎల్‌.వ్యాస్‌ 2005లో రాసిన లేఖను హైకోర్టు పిటిషన్‌గా స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ వ్యక్తిగతంగా హాజరయ్యారు.  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. విచారణను ఈనెల 12కు వాయిదా వేస్తూ ఆ రోజు కూడా హాజరుకావాలని కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది.

బీజేపీ లోకీ BRS MLA. మూడు రోజుల్లో చేరిక...?

*బీజేపీ లోకీ  BRS MLA. మూడు రోజుల్లో చేరిక...?*


హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు టికెట్‌ దక్కని ఆశావహులు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఊహాగానాలు వినవస్తున్నాయి.తాజాగా.. ఉప్పల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి బీజేపీలోకి చేరతారనే ప్రచారం ఊపందుకుంది.

ఉప్పల్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డిని అధిష్టానం ఎంచుకుంది. ఆ సమయంలో.. భేతి సుభాష్‌రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వెల్లగక్కారు. ఉద్యమకారుడిని పార్టీ కోసం తొలి నుంచి పని చేస్తున్న తనకు.. అవమానకర రీతిలో టికెట్‌ కేటాయించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. అయితే ఎమ్మెల్సీ కవిత హామీతో ఆయన కాస్త చల్లబడ్డారనే అంతా భావించారు. ఆ తర్వాత ఆయన ఎందుకనో అధికారిక కార్యక్రమాల్లో ఆయన పెద్దగా కనిపించలేదు. ఈ లోపు కొందరు అసంతృప్తులకు నామినేటెడ్‌ పదవులు దక్కగా.. భేతికి మాత్రం మొండి చెయ్యే దక్కింది. ఈ తరుణంలో..

భేతి ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ చేరతారనే ప్రచారం నడుస్తోంది ఇప్పుడు. బీజేపీ అగ్రనేతల నిర్ణయంతో.. భేతితో కమలం నేతల సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. అంతేకాదు.. భేతిపై సర్వేలు చేయించిన తర్వాతే ఆయన్ని బీజేపీలోకి తీసుకోవాలని బీజేపీ భావిస్తోందని.. ఉప్పల్‌ బీజేపీ అభ్యర్థిగా ఆయన్నే నిలబెట్టాలని నిర్ణయించిందని సమాచారం. మరో మూడు రోజుల్లో ఆయన లాంఛనంగా బీజేపీలో చేరతారనే మాట బలంగా వినిపిస్తోంది ఇప్పుడు.

*సుజీవన్ వావిలాల*🖋️

Monday, October 9, 2023

సార్ త్వరగా టాయిలెట్ రూమ్స్ నిర్మాణం చేయించండి

*'సార్ త్వరగా టాయిలెట్ రూమ్స్ నిర్మాణం చేయించండి'*                                                                                                                                   https://www.dishadaily.com/telangana/nizamabad/sir-construct-the-toilet-rooms-soon-261351                                                             *****---*****---*****          *_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*                                                                                                              https://twitter.com/Praja_Snklpm/status/1711556072945934815?t=uxkNZtvJ3txo0nfbeV-P6w&s=08                                                                         *@TelanganaCMO @TelanganaCS @KTRBRS*

*ఈ 👆 ముగ్గురూ సమాధానం చెప్పాలి*

*#బంగారుతెలంగాణ లో విద్యార్థినుల(ఆడపిల్లలు) అవస్థలు అన్నీ ఇన్నీ కావు 😔*

*#ప్రజాప్రతినిధులు / #IAS అధికారులు / @TSEduDept అధికారులు సిగ్గుపడాలి... మరీ ముఖ్యంగా #తెలంగాణ ప్రజలు సిగ్గుపడాలి... ఆడపిల్లలు మాకు టాయిలెట్స్ (శోచాలయాలు)ఏర్పాటు చేయండి అని మొరపెట్టుకుంటున్నారు😔*

*@RSPraveenSwaero @Murali_IASretd @sdf4thepeople @VenkatBalmoor @RaniRudrama*                                                                                                                       *Bplkm🪶*

తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..!

తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..!
భారీ విజయం.. భారత రాష్ట్ర సమితిదే..!

రెండు సార్లు  నిండుమనసుతో ప్రజాఆశీర్వాదం..!
మూడోసారి మనదే జయం..!

డిసెంబర్ మూడున వచ్చే ఫలితాల్లో 
ముచ్చటగా మూడోసారి గెలిచేది 
మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారే..!

దక్షిణ భారతంలోనే సరికొత్త అధ్యాయం
దక్షత గల నాయకత్వానికే మరోసారి పట్టం..!

పదేండ్ల ప్రగతి మా పాశు పతాస్త్రం..!
విశ్వసనీయతే మా విజయ మంత్రం…!

జన  నీరాజనంతో గులాబీదే ప్రభంజనం..!
ప్రతిఘాతుక ప్రతిపక్షాలకు తప్పదు మళ్లీ పరాభవం..!

మా కెప్టెన్ కేసీఆర్.. అందుకే మా టీంలో హుషారు
Hattrick విక్టరీ ఖరారు.. ప్రతిపక్షాలు బేజారు

మంచి చేసే బీఆర్ఎస్ పార్టీకే ప్రజల ఓటు
ముంచే పార్టీలపై తప్పదు వేటు 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. 
గులాబీ శ్రేణుల సమరోత్సహంతో
కదం తొక్కుతోంది  తెలంగాణ నేల..!

ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు
గుండె గుండెలో ఎగురుతోంది మన గులాబీ జెండా!
తెలంగాణలో గాంధీ సిద్ధాంతం తప్ప
ఈ గడ్డపై గాడ్సే రాద్దాంతం నడవదు..!

2014 లో తొలి అసెంబ్లీ ఎన్నికను నడిపించింది.. 
" ఉద్యమ చైతన్యం "

2018 లో రెండో ఎన్నికను గెలిపించింది..
"సంక్షేమ సంబురం"

2023 లో  మూడో ఎన్నికను శాసించేది..
ముమ్మాటికీ... మన "పదేళ్ల సమగ్ర ప్రగతి ప్రస్థానం" 

సమరానికి బీఆర్ఎస్ సర్వసన్నద్ధం
యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్రసన్యాసం 
పోటీకి ముందే పూర్తిగా కాడి పడేసిన కమలం 

బీఆర్ఎస్.. 
తన పాత రికార్డులు తిరగ రాయడం ఖాయం..!
ఈ సారి సెంచరీ కొట్టడం తథ్యం..!

బీఅర్ఎస్ తోనే తెలంగాణ చరిత
కేసిఆర్ గారితోనే తెలంగాణకు భవిత

అఖండ విజయం మనదే... 

జై తెలంగాణ
జై కేసీఅర్
జై బీఆర్ఎస్

Courtesy / Source by :
https://twitter.com/KTRBRS/status/1711343887707463860?t=8dn5jZdS6UhB8as9Tz6BJg&s=19

Sunday, October 8, 2023

అభ్యర్థుల జాబితా ఖరారుపై కాంగ్రెస్.... చర్చ

*అభ్యర్థుల జాబితా ఖరారుపై కాంగ్రెస్.... చర్చ*

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం దిల్లీలో కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై నేతలు చర్చిస్తున్నారు.ఈ సమావేశంలో జాబితాను ఖరారు చేసి అధిష్ఠానానికి పంపనున్నారు. అనంతరం మంగళవారం లేదా బుధవారం భేటీ కానున్న ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఈనెల 14లోపు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయనుంది.

మరోవైపు, సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని ఓబీసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం 35 సీట్లు ఇవ్వాలని అధిష్ఠానానికి ఇప్పటికే వినతి పత్రాలు అందజేశారు. సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కమ్మ సామాజిక వర్గ నేతలు కూడా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు. గత నెల 22న నిర్వహించిన కమిటీ సమావేశంలో దాదాపు 80కుపైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారంనాటి సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై చర్చించలేదు. ఇవాళ జరిగే సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 శాసనసభ స్థానాలతో పాటు ఇతర జిల్లాల్లో మిగిలిపోయిన నియోజకవర్గాలపైన కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ నెల 10న సాయంత్రం 4 గంటలకు జరగనున్న కాంగ్రెస్‌ పీఏసీ సమావేశంలో బస్సు యాత్రపై చర్చించనున్నారు. తెలంగాణలో ఈ నెల 15, 16న ప్రియాంక గాంధీ, 18, 19న రాహుల్‌ గాంధీ బస్సు యాత్ర చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రూట్‌ మ్యాప్‌పై చర్చించనున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

ఈ నెల 15, ను లేదా 16న... బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా

*ఈ నెల 15, ను లేదా 16న... బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా*

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఖరారు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15 లేదా 16న అభ్యర్థుల తొలి జాబితాను భాజపా వెల్లడించనుంది.ఈ మేరకు 38 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను దాదాపు సిద్ధమైంది. మొత్తం మూడు జాబితాల్లో 119 మంది అభ్యర్థులను భాజపా ప్రకటించనుంది.

*సుజీవన్ వావిలాల*🖋️

మేధావులు అనుకునే మూర్కులకు

*_Imp Note :చదువులను కొని చదువుకున్న మేధావులు అనుకునే మూర్కులకు(ఈళ్లకు  సామాజిక స్పృహ ఉండదు కదా అందుకే ) కథనం అంకితం 👍... Bplkm🪶_*                                                                                            *ఒక విద్యుత్ శాఖా కార్యాలయం (electricity board branch office) బయట ఒక అరటిపండ్ల వ్యాపారి అరటిపండ్లు అమ్ముకుంటున్నాడు...*

*Eb officer :  అరటిపండు రేటు ఎంత?*

*వ్యాపారి : సార్, ఈ అరటిపండ్లు మీరు ఎందుకు తీసుకుంటున్నారో తెలిస్తే గానీ రేటు చెప్పలేను...*

*Eb officer. : యేమి మాట్లాడుతున్నావ్ నీవు, నేనెందుకు తీసుకుంటే నీకెందుకు..?* 

*వ్యాపారి : లేదు సార్, మీరు ఈ పండు గుడికి తీసుకెళ్ళేదానికి అయితే పండు పది రూపాయలు,*

*పిల్లలకోసం తీసుకున్నట్లైతే ఒకటి ఇరవై రూపాయలు...*

*తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడానికి అయితే ఇరవై అయిదు రూపాయలు.....*

*మీరు తినడానికి తీసుకుంటే ముప్పై రూపాయలు మాత్రమే....*

*Eb officer : రేయ్, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావ్... ఒకటే పండు ఎలా డిఫరెంట్ డిఫరెంట్ రేట్లకి అమ్మాలనుకుంటున్నావ్...*

*వ్యాపారి : this is my tariff plan.*
*యేమయ్యా.... మీరు మాత్రం ఒకే కరెంట్, ఒకే transmussion system పెట్టుకుని..... ఇంటికి సెపరేట్, షాప్ కి సెపరేట్, ఫ్యాక్టరీకి సెపరేట్ అని, వాటిలో మళ్ళీ వాడకాన్ని బట్టి సెపరేట్ రేట్.... అడిగితే tariff అని చెప్తారు .. మీకో రూలు మాకో రూలా..*

*This is my tariff plan..*

*Banana vendor rocked and EB officer shocked.*
😛😜😴 
*Source From fb*

Saturday, October 7, 2023

_మాకెలాంటి నిధులూ రాలేదు: న్యూస్‌ క్లిక్‌_

_మాకెలాంటి నిధులూ రాలేదు: న్యూస్‌ క్లిక్‌_
*_అందితే తాటి తీసేవాళ్ళు.._*
Courtesy / Source by : 
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_భారత్‌ వ్యతిరేక ప్రచారం కోసం, దేశ సార్వభౌమత్వాన్ని భంగపరిచేందుకు న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి భారీ మొత్తాల్లో నిధులు వచ్చాయంటూ దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను న్యూస్‌ పోర్టల్‌ ఖండించింది._*

*_అబ్బో... ఇప్పుడు తెలిసిందా..?_*
తమకెలాంటి నిధులూ రాలేదని, దిల్లీ పోలీసులు చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేసింది. మీడియా స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను హరించే కుట్రగా దీన్ని అభివర్ణించింది.

*_అసలేం జరిగిందంటే..?_*
న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పురకాయస్థ, ఆ సంస్థ మానవ వనరుల విభాగాధిపతి అమిత్‌ చక్రవర్తిపై దిల్లీ పోలీసులు ఉపా కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. న్యూస్‌ క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందాయని, కొంత మంది వ్యక్తులతో కలిసి 2019 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు వీరు ప్రయత్నించారని ఎఫ్‌ఐఆర్‌లో దిల్లీ పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ తాజాగా వెలుగుచూసిన నేపథ్యంలో న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ స్పందించింది.

*_స్పందన ఇదే..!_*
చైనా నుంచి గానీ, ఆ దేశానికి చెందిన సంస్థల నుంచి గానీ తమకు ఎలాంటి నిధులూ అందలేదని న్యూస్‌క్లిక్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. హింసను ప్రేరేపించడం, ప్రోత్సహించడం వంటి చర్యలకు తాము పూర్తిగా వ్యతిరేకమని తెలిపింది. వాస్తవిక అంశాలను అందించడమే తమ ఉద్దేశమని, న్యూస్‌క్లిక్‌ ఆన్‌లైన్‌ కవరేజీ చూస్తేనే ఆ విషయం అవగతమవుతుందని తెలిపింది.

Friday, October 6, 2023

_బంజారా హిల్స్ ఏసీబీ కేసులో ట్విస్ట్.._

*_బంజారా హిల్స్ ఏసీబీ కేసులో ట్విస్ట్.._*
_# పబ్ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు_

_రూ.4.5 లక్షలు అడిగారు అని ఫిర్యాదు.._

_ఇవ్వకపోవడంతో తనను వేధిస్తున్నారనీ ఫిర్యాదు.._

_గత నెల 30 న పబ్ నిర్వాహకుడిని  ps కు తీసుకు వెళ్ళారని ఫిర్యాదు చేసిన యజమాని లక్ష్మన్ రావు._

_మిస్ కండక్ట్ కింద కేసు నమోదు చేసిన ఏసీబీ._

_నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్న ఏసీబీ అధికారులు_

_Ao 1 గా నరేందర్_
_Ao 2 గా ఎస్ ఐ నవీన్_ 
_Ao 3 గా హోం గార్డు హరి_

_అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా.._

_అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా.._
*_అక్టోబర్‌ 8-10 మధ్య షెడ్యూల్‌ ప్రకటన.?_*

Courtesy / Source by :
_(_అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_ 

*_దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్‌ 8 నుంచి 10వ తేదీ మధ్య ఎన్నికల సంఘం (EC) ప్రకటించే అవకాశం ఉన్నట్లు  తెలుస్తోంది._*

ఈ ఏడాది  తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో పోలింగ్‌ నవంబర్‌ మధ్య నుంచి డిసెంబర్‌ తొలి వారంలోపు జరపవచ్చని ఈసీ వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనాలు పేర్కొన్నాయి. తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్‌ 17నే ముగియనుండగా.. తెలంగాణ, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో వివిధ తేదీల్లో ముగుస్తాయి. 

అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వ్యూహాన్ని ఖరారు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం నేడు దిల్లీలో ఎన్నికల పరిశీలకులతో భేటీ జరపనుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధనం, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని ఈసీ అమలు చేయనుంది. ఇందుకోసం పోలీసులు, వ్యయాలు, సాధారణ విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో శుక్రవారం మొత్తం సమీక్ష జరిపి.. తుది ప్రణాళికకు ఆమోదం తెలపనుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు జరిపిన విషయం తెలిసిందే.

Thursday, October 5, 2023

కాంగ్రెస్ లో గెలిచి బీజేపీ లోకీ జంప్ అవుతారు.... KTR

*కాంగ్రెస్ లో గెలిచి బీజేపీ లోకీ జంప్ అవుతారు.... KTR*

షాద్‌నగర్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ మాటల యుద్ధం పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు.అధికారం ఇచ్చినపుడు ప్రజలకు ఏమీ చేయని కాంగ్రెస్‌ పార్టీ.. ఇవాళ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని ఎద్దేవా చేశారు. 

కాగా, మంత్రి కేటీఆర్‌ గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. అమలు చేయలేని హామీలతో ప్రజలను ప్రలోభపెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోంది. మోసాన్ని మోసంతోనే జయించి.. ఓటు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వేయాలన్నారు. బీజేపీ వాళ్లకు అదానీ నుంచి బాగా పైసలు వస్తున్నాయట. కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లను దబాయించి పైసలు అడగండి. రైతుబంధు అందితేనే.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు వస్తేనే మాకు ఓటేయండి. తొమ్మిదేళ్లలో ఎన్నో మంచి పనులు చేసుకున్నాం. షాద్‌నగర్‌కు నీళ్లు ఇచ్చేది కేసీఆర్‌.. తెచ్చేది అంజయ్య యాదవ్‌. కాంగ్రెస్‌ నేతలు కడుపులో గుద్ది.. నోట్లో చాక్లెట్‌ పెడతారు. బీజేపీ నేతలు నీళ్ల వాటా తేల్చరు.. కాంగ్రెస్‌ వాళ్లు ప్రాజెక్టులపై కేసులేసి ఇబ్బంది పెడతారు. రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ మనిషి అని కాంగ్రెస్‌ నేతలే చెప్పారు. ఈ విషయంపై పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ సోనియాగాంధీకి లేఖ రాశారు. రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి పోయారు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు బీజేపీలోకి జంప్‌ అవుతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Wednesday, October 4, 2023

Tragic Incident at Krishnaveni Talent School, Ramanthapur

*Subject: Urgent Complaint Regarding Tragic Incident at Krishnaveni Talent School, Ramanthapur, Hyderabad*
To: <cp.ncpcr@nic.in>
Cc: <registrar.ncpcr@nic.in>



*Dear Honorable Chairperson of NCPCR, New Delhi*

*I hope this message finds you well. I am writing to you today in my capacity as the President of Balala Hakkula Sangham, a devoted organization dedicated to safeguarding the rights and well-being of children across our nation.*

*It is with a heavy heart and an immense sense of urgency that I bring to your attention a tragic incident that occurred at Krishnaveni Talent School in Ramanthapur, Hyderabad, which has shocked our organization and the entire community. On Saturday, September 30th, a deeply distressing incident transpired within the school premises, resulting in the untimely and heartbreaking demise of a young child named Hemanth, who was just 5 years old.*

*Hemanth, a promising young soul, was subjected to a horrifying act of violence by one of the school's teachers. It has come to our knowledge that this teacher brutally struck Hemanth for the alleged reason of not completing his homework. The severity of this physical assault was so grave that Hemanth was immediately rushed to the hospital, fighting for his life.*

*Tragically, despite the efforts of medical professionals, Hemanth succumbed to his injuries and passed away on October 2nd, leaving his family shattered and our entire nation in mourning. The loss of a child is a loss to our society as a whole, and it is an irreplaceable tragedy that must not be taken lightly.*

*We, at Balala Hakkula Sangham, stand in solidarity with Hemanth's grieving family and the community at large. We firmly believe that it is our collective responsibility to ensure that justice is served for Hemanth and that such heinous acts against children are not allowed to persist with impunity.*

*In light of this distressing incident, we earnestly request the immediate intervention of the National Commission for Protection of Child Rights (NCPCR) in Delhi. We respectfully urge you, Honorable Chairperson, to initiate a thorough and impartial investigation into this incident, ensuring that all responsible parties are held accountable for their actions.*

*Furthermore, we implore the NCPCR to take necessary steps to prevent such incidents from occurring in the future, not only within Krishnaveni Talent School but also across educational institutions throughout our nation. The safety and well-being of our children are paramount, and this incident serves as a stark reminder of the importance of enforcing strict measures to protect them.*

*We trust in the unwavering commitment of the NCPCR to champion the rights and welfare of children in India. We beseech you to use your authority and influence to bring justice to Hemanth and to send a resounding message that child abuse in any form will not be tolerated.*

*We eagerly await your prompt action and response to this grievous matter. Together, we can work towards a safer and more secure environment for all of our children.*

*Sincerely,*
*Anuradha Rao*
*President:Balala Hakkula Sangham*

https://youtu.be/Ai9FtzpQExA?si=0cWVGbxE4D6DpNtD                                                          *****---*****---*****                                                       *_ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు 🙏. ప్రజాసమస్యలను మీ ద్రుష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు ఈ  వాస్తవ వార్త కథనాలను మీ మీ మాధ్యమాల ద్వారా ప్రచురణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము_ ....కృష్ణవేణి టాలెంట్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి అని   National Commission for Protection of Child Rights (NCPCR) in India కు 4/10/2023 రోజు #apbalalahakkulasangham NCPCR అధికారిక మాద్యమం మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది.ఇదే 'ప్రెస్ నోట్' గా భావించవచ్చు Bplkm🪶*

న్యూస్‌క్లిక్ పై దాడులు చట్టవిరుద్ధం

NewsClick.in  అధికారిక ప్రకటన

 ఈరోజు, 3 అక్టోబర్, 2023న, న్యూస్‌క్లిక్ కార్యాలయం, జర్నలిస్టుల నివాసాలు మరియు న్యూస్‌క్లిక్‌తో అనుబంధించబడిన ఉద్యోగులతో సహా వివిధ ప్రదేశాలలో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం దాడులు నిర్వహించింది.

 చాలా మంది వ్యక్తులను విచారించారు మరియు ప్రస్తుతానికి, మా డైరెక్టర్ శ్రీ ప్రబీర్ పుర్కాయస్తా మరియు మిస్టర్ అమిత్ చక్రవర్తి అరెస్టు చేయబడ్డారు.

 మాకు FIR కాపీని అందించలేదు లేదా మాపై అభియోగాలు మోపబడిన నేరాల యొక్క ఖచ్చితమైన వివరాల గురించి తెలియజేయబడలేదు.  జప్తు మెమోలు, స్వాధీనం చేసుకున్న డేటా యొక్క హాష్ విలువలు లేదా డేటా కాపీలు వంటి ఎలాంటి ప్రక్రియకు కట్టుబడి ఉండకుండా, Newsclick ప్రాంగణంలో మరియు ఉద్యోగుల ఇళ్ల నుండి ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.  మా రిపోర్టింగ్‌ను కొనసాగించకుండా మమ్మల్ని నిరోధించే కఠోర ప్రయత్నంలో Newsclick కార్యాలయం కూడా మూసివేయబడింది.

 మేము సేకరించగలిగినది ఏమిటంటే, న్యూస్‌క్లిక్ పై ఈ దాడులు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)  కింద ఇవి జరుగుతున్నాయని.  వెబ్‌సైట్‌లో కొన్ని వార్తలను ప్రసారం చేసినందుకు ఇది జరుగుతున్నదట.

 పాత్రికేయ స్వాతంత్య్రాన్ని గౌరవించడానికి నిరాకరించే మరియు విమర్శలను దేశద్రోహం లేదా "దేశ వ్యతిరేక" ప్రచారంగా పరిగణించే ప్రభుత్వం యొక్క ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.

 న్యూస్‌క్లిక్ 2021 నుండి భారత ప్రభుత్వానికి చెందిన వివిధ ఏజెన్సీల ద్వారా వరుస చర్యలకు లక్ష్యంగా మారింది. దీని కార్యాలయాలు మరియు అధికారుల నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మరియు ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించాయి.

 అన్ని పరికరాలు, ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్‌లు, ఫోన్‌లు మొదలైన వాటిని గతంలో స్వాధీనం చేసుకున్నారు.  అన్ని ఇమెయిల్‌లు మరియు కమ్యూనికేషన్‌లు మైక్రోస్కోప్‌లో విశ్లేషించబడ్డాయి.  అన్ని బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఇన్‌వాయిస్‌లు, చేసిన ఖర్చులు, న్యూస్‌క్లిక్‌కి గత అనేక సంవత్సరాల్లో వచ్చిన నిధుల మూలాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలచే పరిశీలించబడుతున్నాయి.  వివిధ డైరెక్టర్లు మరియు ఇతర సంబంధిత వ్యక్తులు ఈ ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అనేక సందర్భాలలో విచారించబడుతున్నప్పుడు లెక్కలేనన్ని గంటలు గడిపారు.

 అయినప్పటికీ, గత రెండు సంవత్సరాలుగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యూస్‌క్లిక్‌పై మనీ లాండరింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ ఒక్క ఫిర్యాదును కూడా దాఖలు చేయలేకపోయింది.  ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం న్యూస్‌క్లిక్‌పై ఇండియన్ పీనల్ కోడ్ కింద నేరాలకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేయలేకపోయింది.  ఆదాయపు పన్ను శాఖ న్యాయస్థానాల ముందు తన చర్యలను సమర్థించుకోలేకపోయింది.

 గత కొన్ని నెలలుగా, శ్రీ ప్రబీర్ పుర్కాయస్థను ఈ ఏజన్సీలు ఏవీ కూడా విచారణకు పిలవలేదు.

 అయినప్పటికీ, న్యూస్‌క్లిక్‌కి సంబంధించిన మొత్తం సమాచారం, డాక్యుమెంటేషన్ మరియు కమ్యూనికేషన్‌లను కలిగి ఉన్నప్పటికీ దానిపై ఎటువంటి ఆరోపణలను రుజువు చేయలేకపోయిన ప్రభుత్వానికి, న్యూయార్క్ టైమ్స్‌లో ప్రేరేపిత మరియు బూటకపు కథనం ద్వారా క్రూరమైన UAPAని న్యూస్ క్లిక్ పై అమలు చేయడానికి మరియు ఆ సంస్థను మూసివేయడానికి ప్రయత్నిస్తున్నది.  నిజమైన భారతదేశం యొక్క కథను చిత్రించే స్వతంత్ర మరియు నిర్భయ స్వరాలను అణచివేయలేరు. రైతులు, కార్మికులు మరియు సమాజంలోని ఇతర తరచుగా విస్మరించబడిన వర్గాలకోసం మేము కింది విషయాలు చెప్పాలనుకుంటున్నాము:

 1. న్యూస్‌క్లిక్ ఒక స్వతంత్ర వార్తా వెబ్‌సైట్.

 2. మా పాత్రికేయ కంటెంట్ వృత్తి యొక్క అత్యున్నత ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

 3. న్యూస్‌క్లిక్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏదైనా చైనీస్ సంస్థ లేదా అధికారం యొక్క ఆదేశానుసారం ఎటువంటి వార్తలను లేదా సమాచారాన్ని ప్రచురించదు.

 4. న్యూస్‌క్లిక్ తన వెబ్‌సైట్‌లో చైనీస్ ప్రచారాన్ని ప్రచారం చేయదు.

 5. న్యూస్‌క్లిక్ తన వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన కంటెంట్‌కు సంబంధించి నెవిల్లే రాయ్ సింఘమ్ నుండి ఆదేశాలు తీసుకోదు.

 6. Newsclick ద్వారా అందిన నిధులన్నీ సముచితమైన బ్యాంకింగ్ మార్గాల ద్వారా అందించబడ్డాయి మరియు ఢిల్లీ హైకోర్టులో విచారణలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రుజువు చేయబడిన చట్టం ప్రకారం సంబంధిత అధికారులకు నివేదించబడింది.

 Newsclick వెబ్‌సైట్‌లో ఇప్పటివరకు ప్రచురించబడిన అన్ని జర్నలిస్టిక్ కంటెంట్ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. దానిని ఎవరైనా చూడవచ్చు.  ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం వారు చైనా ప్రచారంగా భావించే ఒక్క కథనం లేదా వీడియోను ప్రస్తావించలేదు.  వాస్తవానికి, ఢిల్లీ అల్లర్లు, రైతుల నిరసనలు మొదలైన వాటిపై రిపోర్టేజీకి సంబంధించి ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం  మాపై అనుసరించిన ప్రశ్నా విధానం, ప్రస్తుత చర్యల వెనుక ఉన్న వారి ప్రేరేపిత మరియు దురుద్దేశపూరిత ఉద్దేశాన్ని ప్రదర్శిస్తాయి.

 కోర్టులు మరియు న్యాయ ప్రక్రియలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది.  భారత రాజ్యాంగం ప్రకారం మన పాత్రికేయ స్వేచ్ఛ మరియు మా జీవితాల కోసం పోరాడుతాము.

Courtesy / Source by : HRF
*****---*****---*****---*****

*Protest Rally*
I request you to join protest march against the oppressive police raids on NewsClick office at Delhi and arbitary arrests of several journalists. The march will start at Desoddharaka Bhavan,
 *Bashirbagh at 11:00 AM* on *05 Oct 2023* and culminate at Ambedkar statue, Tankbund. Please attend. 
Best regards 
K. Sreenivas Reddy,
President, 
Indian Journalists Union.

Tuesday, October 3, 2023

మోదీ యాక్టింగ్ కు ఆస్కార్ ఖాయం... KTR...!

*మోదీ యాక్టింగ్ కు ఆస్కార్ ఖాయం... KTR...!*

ప్రధాని మోదీ యాక్టింగ్‌కు ఆస్కార్‌ అవార్డు తప్పకుండా వస్తుందని మంత్రి కేటీఆర్‌ (KTR) ఎద్దేవా చేశారు. ఆయన స్క్రిప్టు రాస్తే సినిమా బాగా విజయవంతమవుతుందన్నారునిజామాబాద్‌ సభలో మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మంత్రి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి గురించి తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో ఆయన మాట్లాడారని చెప్పారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అబద్ధాలు మాట్లాడటం బాధాకరమన్నారు. ఇకపై ఎవరైనా ప్రధాన మంత్రిని కలిస్తే సంభాషణను రికార్డు చేసుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు.

'' ఎన్డీయేలో కలవాలని ఎవరూ అనుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటకి వచ్చాయి. ఎన్డీయే వీడిన పార్టీలపైకి ఈడీ, సీబీఐని పంపుతున్నారు. భాజపాలో చేరిన వారిపై ఉన్న కేసులు మరుగున పడుతున్నాయి. భాజపాలో చేరే నేతలను దర్యాప్తు సంస్థలు వదిలేస్తాయి. ఈ 9 ఏళ్లలో తెలంగాణకు ఏం ఇచ్చారని ఓట్లు అడుగుతున్నారు. భాజపా అంటే.. బిగ్గెస్ట్‌ జుమ్లా పార్టీ ఇన్‌ ఇండియా'' అని కేటీఆర్‌ విమర్శించారు.ఎన్డీయే అనేది మునిగిపోయే నావ, మునిగే నావ ఎక్కాలని ఎవరూ అనుకోరని కేటీఆర్‌ అన్నారు. '' నన్ను ఆశీర్వదించాలని కేసీఆర్‌.. మోదీని కోరారట.. నేను సీఎం కావడానికి మోదీ అనుమతి అక్కర్లేదు. 70 ఏళ్ల వయస్సులో మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. అబద్ధాలతో ప్రధాని పదవి గౌరవాన్ని మోదీ తగ్గించారు. కేసీఆర్‌ ఒక ఫైటర్‌.. చీటర్‌తో కలవరు. వాళ్లతో కలిసేందుకు మాకేమైనా కుక్క కరిచిందా? ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్డీయే నుంచి బయటకి వచ్చాయి. ప్రస్తుతం ఆ కూటమిలో సీబీఐ, ఈడీ, ఐటీ మాత్రమే ఉన్నాయి.'' అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Monday, October 2, 2023

టీచర్ కర్కశత్వం.... UKG బాలుడి మృతి

*టీచర్ కర్కశత్వం.... UKG బాలుడి మృతి*

ఉప్పల్‌(హైదరాబాద్‌): ఓ టీచర్‌ కర్కశత్వం పసి ప్రాణాన్ని బలితీసుకుంది. ఇంకా బలపమే సరిగా పట్టుకోలేని చిన్నారిపై టీచర్‌ అమానుషంగా ప్రవర్తించాడు. హోంవర్క్‌ చేయలేదంటూ పలకతో తలపై బలంగా కొట్టాడు.అసలు ఏం జరుగుతుందో తెలియని ఆ చిన్నారి.. టీచర్‌ కొట్టిన దెబ్బతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.
*వివరాల్లోకి వెళితే..*
ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామాంతపూర్‌ వివేక్‌ నగర్‌లో స్ట్రీట్ నెంబర్10 లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో యూకేజీ విద్యార్థిని టీచర్‌ తలపై బలంగా కొట్టాడు. శనివారం రోజున స్కూల్ హోమ్ వర్క్ చేయలేదని తలపై పలుకతో కొట్టడం తో స్పృహ తప్పి పడిపోయాడు అభం శుభం తెలియని చిన్నారి. దాంతో ఆ పిల్లాడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఈ రోజు ఉదయం చనిపోయాడు. చనిపోయిన అబ్బాయి మృతదేహాన్ని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ దగ్గర ఉంచి తల్లిదండ్రులు, బంధువులు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు.

*సుజీవన్ వావిలాల*🖋️

హైదరాబాద్ లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల.... దీక్ష

*హైదరాబాద్ లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల.... దీక్ష*

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు.ఈ దీక్షలో ఎన్టీఆర్‌ కుమార్తె గారపాటి లోకేశ్వరి, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, గారపాటి శ్రీనివాస్‌, చలసాని చాముండేశ్వరి, నారా రోహిత్‌ తల్లి ఇందిర, తారకరత్న సతీమణి అలేఖ్యరెడ్డి, నందమూరి జయశ్రీ, సుధ, శిల్ప, దీక్షిత, రాహుల్‌, తారకరత్న కుమార్తె నిష్క తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలు దీక్షకు కూర్చొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు తెదేపా నేతల దీక్ష కొనసాగనుంది.

మరోవైపు ఎన్టీఆర్‌ ఘాట్‌లో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని దీక్ష చేపట్టారు. ఆమెతో పాటు కేంద్రమాజీ మంత్రి పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. 'సైకో పోవాలి.. సైకిల్ రావాలి' అంటూ నినాదాలు చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Sunday, October 1, 2023

తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు

*తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు*

తెలంగాణకు పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.ఆదివారంనాడు మహబూబ్ నగర్ లో నిర్వహించిన సభలో ప్రధాని ఈ విషయాన్ని ప్రకటించారు. తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా తర్వాత పసుపుపై పరిశోధనలు పెరిగాయని మోడీ పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్ర పసుపు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మోడీ పేర్కొన్నారు.ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సమ్మక్క, సారలమ్మ పేరుతో గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామన్నారు. రూ. 900 కోట్లతో యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

అంత‌కు ముందు హైద్రాబాద్ నుండి రాయిచూర్, రాయిచూర్ నుండి హైద్రాబాద్ కు తొలి రైలు సర్వీస్ ను ప్రధాని ప్రారంభించారు. హైద్రాబాద్ యూనివర్శిటీకి ఐదు కొత్త భవనాలను ప్రధాని ప్రారంభించారు. చర్లపల్లికి గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టకు శంకుస్థాపన చేశారు. రూ. 500 కోట్లతో 37 కి.మీ. నిర్మించిన జక్లేర్-కృష్ణా న్యూ రైల్వే లైన్ ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఖమ్మం నుండి విజయవాడకు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహాదారి పనులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మోడీ తన పర్యటనలో రూ. 6,404 కోట్ల విలువైన జాతీయ రహదారులకు శంకుస్థాపన చేశారు.


*సుజీవన్ వావిలాల*🖋️