Monday, May 30, 2022

పాలనలో కేంద్ర సర్కార్ విఫలం.....MLC కవిత.....!మోదీకి 8 ప్రశ్నలు సంధించిన ఎమ్మెల్సీ కవిత

*పాలనలో కేంద్ర సర్కార్ విఫలం..... MLC కవిత.....!*

*మోదీకి 8 ప్రశ్నలు సంధించిన ఎమ్మెల్సీ కవిత*

*హైదరాబాద్‌,....!*
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనలో విఫలం అయిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.ఈ మేరకు బీజేపీ పాలనా వైఫల్యాలపై సోమవారం ప్రధాని మోదీకి ట్విటర్‌ వేదికగా 8 ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. ''తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ పక్షపాతానికి ముగింపు ఎప్పుడు? రాష్ట్రానికి రావాల్సిన రూ.7000 కోట్ల పెండింగ్‌ నిధులను కేంద్రం ఎప్పుడు విడుదల చేస్తుంది?

''మెహంగై ముక్త్‌ భారత్‌'' అని ప్రకటించుకున్న మీరు అసలు అలాంటి ''అచ్ఛే దిన్‌'' ఎప్పుడు తెస్తారు? విఫలమైన లా అండ్‌ ఆర్డర్‌, విఫలమైన వ్యవస్థలు.. భారతదేశ ప్రజలకు కృత్రిమ ప్రచారాలు లేని నిజమైన ''అమృత్‌ కాల్‌'' ఎప్పుడు వస్తుంది? దేశ జీడీపీ పడిపోతున్నా..

గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయి. విచిత్రంగా అవి దేశ ప్రభుత్వ నియంత్రణలో ఎందుకు లేవు? పీఎం కేర్స్‌ నిధుల గురించిన నిజమైన సమాచారాన్ని దేశ ప్రజలకు తెలియజేసే రోజు వస్తుందా? మహిళా సాధికారత, వారి శక్తికి సమాన ప్రాధాన్యం కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఎప్పుడు అమలులోకి తెస్తారు? తెలంగాణలోని వరి, పసుపు రైతులు తమ కష్టానికి కనీస గుర్తింపు కోరినందుకు బీజేపీ చేతిలో నష్టపోతున్నారు. వారికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది?'' అంటూ కవిత ప్రశ్నలు సంధించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

డాక్టర్....... K. లక్ష్మణ్ కు..... రాజ్యసభ!

*డాక్టర్....... K. లక్ష్మణ్ కు..... రాజ్యసభ!*

*హైదరాబాద్.....*
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు లభించింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆయనకు ప్రాతినిధ్యం కల్పిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.సోమవారం రాత్రి విడుదల చేసిన నలుగురు రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరుంది. సుమిత్ర వాల్మికి మధ్యప్రదేశ్‌ నుంచి, లహర్‌సింగ్‌ సిరోయ కర్ణాటక నుంచి, మిథిలేశ్‌ కుమార్‌ ఉత్తరప్రదేశ్‌ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం నామినేషన్‌ వేసేందుకు లక్ష్మణ్‌ లఖ్‌నవూకు వెళుతున్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతల్లో ఒకరికి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం ఇస్తుందని మొదటి నుంచీ అనుకుంటున్నారు.

లక్ష్మణ్‌తో పాటుగా తెలంగాణకు చెందిన మాజీ ఎంపీలు విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డిల పేర్లను అధిష్ఠానం పరిశీలించింది. చివరికి ఓబీసీ నేత లక్ష్మణ్‌కే మొగ్గు చూపించింది. ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు. లక్ష్మణ్‌ 1999లో, 2014లో ముషీరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016 నుంచి 2020 దాకా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా పని చేశారు.

link Media ప్రజల పక్షం🖋️

Sunday, May 29, 2022

నాపై జరిగిన దాడి వెనుక..... రేవంత్ రెడ్డి కుట్ర.....!

*నాపై జరిగిన దాడి వెనుక..... రేవంత్ రెడ్డి కుట్ర.....!*

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లో నిర్వహించిన రెడ్ల సింహగర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే!తొలుత ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు వ్యతిరేక నినాదాలతో గందరగోళం సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ఉందని, సీఎం కేసీఆర్ అనేక పథకాల్ని అమలు చేస్తున్నారని మల్లారెడ్డి ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో సభికుల నుంచి ఒక్కసారిగా వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. దీంతో ఆయన తన ప్రసంగం ముగించుకొని కాన్వాయ్‌లో వెళుతుండగా.. నిరసనకారులు కుర్చీలు, చెప్పులు, రాళ్ళతో దాడి చేశారు. వారిని అదుపు చేస్తూ.. మంత్రి వాహనాల్ని పోలీసులు ఎలాగోలా సురక్షితంగా బయటకు పంపించారు.

ఈ దాడి విషయమై ప్రముఖ మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి.. ఇదంతా రేవంత్ రెడ్డి కుట్రేనని ఆరోపించారు. ఆయన ప్రజావ్యతిరేక చర్యల్ని ప్రశ్నిస్తున్నాననే అక్కసుతోనే తన అనుచరుల్ని సభకు పంపించి, రేవంత్ దాడి చేయించాడని అన్నారు. ఇలాంటి చర్యలకు తాను భయపడే ప్రసక్తే లేదని, దేనికైనా సిద్ధమేనని మల్లారెడ్డి చెప్పారు. అన్ని సామాజిక వర్గాల్ని న్యాయం చేసేందుకు కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారని, మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్టు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే, కరోనా కారణంగా ఆలస్యమైందని తాను వివరిస్తున్న తరుణంలోనే నినాదాలు చేశారంటూ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Saturday, May 28, 2022

Job fair in Hyderabad: Over 20 companies to recruit 3K candidates on May 30

Job fair in Hyderabad: Over 20 companies to recruit 3K candidates on May 30

Both freshers and experienced candidates are invited

మంచి డిజైన్ చెప్పండి ప్రైజ్ మనీ పొందండి.. సజ్జనార్

మంచి డిజైన్ చెప్పండి ప్రైజ్ మనీ పొందండి.. సజ్జనార్

Courtesy by Disha Web  28 May 2022 6:45 PM దిశ,వెబ్‌డెస్క్: ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పనుండి ప్రయాణికులకు ఆఫర్స్ ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆర్టీసీని లాభాల బాటల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రయాణీకుల కోసం 500 ml, 1 లీటర్ వాటర్ బాటిళ్లను ఆర్టీసీ అమ్మకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. అయితే ఆ వాటర్ బాటిళ్ల డిజైన్, నేమ్ సూచించాలని సజ్జనార్ ప్రయాణిలను కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. Also Read - ఈమెను కలెక్టర్ అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ, అసలు విషయం తెలిస్తే గొప్పగా ఫీలవుతారు యాణీకుల కోసం 500 ml & 1 లీటర్ వాటర్ బాటిళ్లను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాం. సీసాల కోసం టైటిల్, డిజైన్‌ను సూచించడానికి మీకు స్వాగతం. ఉత్తమ సూచనకు బహుమతి లభిస్తుంది. మీ సూచనను WhatsApp 9440970000 నంబర్‌కు మాకు పంపండి. టీఎస్‌ ఆర్టీసీ చేసే చరిత్రాత్మక మార్పునకు మీ తోడ్పాటు ఇవ్వండి. చరిత్రలో నిలిచిపోండి. వాటర్ బాటిల్‌కు మంచి పేరు డిజైన్ చెప్పండి.. రివార్డ్స్ పొందండి అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

Friday, May 27, 2022

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్... కళ్యాణ్ రామ్....!

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్... కళ్యాణ్ రామ్....!

హైదరాబాద్‌: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు.ఈ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్ఛాలు ఉంచి తాతను స్మరించుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌ జయంతి వేళ ఆయన అభిమానులు, తెదేపా కార్యకర్తలు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

నదిలో పడ్డ వాహనం....7గురు జవాన్ల దుర్మరణం

*నదిలో పడ్డ వాహనం....7గురు జవాన్ల దుర్మరణం*

శ్రీనగర్‌: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జవాన్లు ప్రయాణిస్తోన్న ఓ వాహనం నదిలో పడి ఏడుగురు దుర్మరణం చెందారు.మరో 19 మంది గాయపడ్డారు. శుక్రవారం ఉదయం పార్థాపూర్‌ శిబిరం నుంచి 26 మంది సైనికులు వాహనంలో హనీఫ్‌ సబ్‌ సెక్టార్‌ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

టుర్టుక్‌ సెక్టార్‌ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదవశాత్తు రోడ్డుపై నుంచి జారి షియోక్‌ నదిలో పడింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లను ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌ అంబులెన్స్‌లో సైనికులను పశ్చిమ కమాండ్‌కు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది.

link Media ప్రజల పక్షం🖋️ 

పోలీసు నియమకాలు....7:33 లక్షల మంది అభ్యర్థులు 12:91 లక్షల దరఖాస్తులు

*పోలీసు నియమకాలు....7:33 లక్షల మంది అభ్యర్థులు 12:91 లక్షల దరఖాస్తులు*

హైదరాబాద్‌: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు 7.33 లక్షల మంది అభ్యర్థులు 12.91 లక్షల దరఖాస్తులు చేసుకున్నట్లు పోలీసు నియామక మండలి వెల్లడించింది. వీటిలో ఎస్సై పోస్టులకి 2.47 లక్షలు, కానిస్టేబుల్‌ పోస్టులకు 9.50 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు నియామక మండలి తెలిపింది. 3.55 లక్షల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో 2.76 లక్షల మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్ పోస్టులకు ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.తేదీల్లో ఏమైనా మార్పులు ఉంటే ముందే ప్రకటిస్తామని నియామక మండలి ఛైర్మన్‌ శ్రీనివాస్‌ రావు తెలిపారు.

మొత్తం దరఖాస్తుల్లో.. 7.65% ఓసీలు, 8.27% బీసీ (ఏ), 17.7% బీసీ (బీ), 0.26% బీసీ (సీ), 20.97% బీసీ (డీ), 4.11% బీసీ (ఈ), 22.44 % ఎస్సీ, 18.6% ఎస్టీ అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట్, జనగాం, సిరిసిల్ల జిల్లాల నుంచి తక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్లు నియామక మండలి తెలిపింది. తెలుగులో పరీక్ష రాసేందుకు 67 శాతం మంది అభ్యర్థులు, ఆంగ్లంలో పరీక్ష రాసేందుకు 32.8 శాతం మంది ఆప్షన్‌ ఎంచుకున్నట్లు నియామక మండలి తెలిపింది.

link Media ప్రజల పక్షం🖋️ 

Thursday, May 26, 2022

మోదీ హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వని.... ఏవియేషన్ అధికారులు....!

*మోదీ హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వని.... ఏవియేషన్ అధికారులు....!*

హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి బేగంపేట వెళ్లేందుకు హెలికాఫ్టర్‌లో వెళ్లాల్సి ఉండగా ఏవియేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు.హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారి భారీగా ఈదురుగాలులు వీచాయి. దీనికి తోడు పలు చోట్ల వాన కూడా పడింది. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో మోదీ హెలికాఫ్టర్‌కు ఏవియేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రధాని మోదీ రోడ్డు మార్గం గుండా 18 కిలోమీటర్లు ప్రయాణించి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి చెన్నై బయలుదేరారు.

link Media ప్రజల పక్షం🖋️

Wednesday, May 25, 2022

నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురి చేసింది..... ఎమోషనల్ అయిన రాహుల్ గాంధీ

*నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురి చేసింది..... ఎమోషనల్ అయిన రాహుల్ గాంధీ*

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురిచేసిందని, అయినప్పటికీ ఆ ఘటన నా జీవితంలో ఎంతో జీవిత అనుభవాలను నేర్పించిందని అన్నారుబ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ క్రేం బ్రిడ్జ్ లో ఏర్పాటు చేసిన ఓ ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత సంతతి విద్యావేత్త డాక్టర్ శ్రుతి కపిలా రాజీవ్ గాంధీ వర్ధంతిని ప్రస్తావించి హింస, వ్యక్తిగతంగా మనుగడ సాగించడం ఎలా అని ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీ బదులిస్తూ.. నా జీవితంలో అతిపెద్ద అభ్యసన అనుభవం మా నాన్న మరణం. అంతకంటే అతిపెద్ద ఘటన ఏదీలేదు. అయితే మా నాన్నను చంపిన దళం చేసిన పని నాకు అత్యంత బాధను మిగిల్చింది. ఓ కొడుకుగా నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురిచేసిందిఅయినప్పటికీ ఆ ఘటన నా జీవితంలో ఎంతో జీవిత అనుభవాలను నేర్పించింది. అందుకే మీరు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నంతకాలం దుర్మార్గులు ఎలా ఉన్నా పర్వాలేదు అంటూ రాహుల్ గాంధీ బదులిచ్చారు. బలమైన శక్తులను ఎదుర్కొనే సమయం ఎప్పుడూ బాధపడాల్సి వస్తుంది. అదే సమయంలో అటువంటి శక్తులపై ఎలా పోరాడాలో తెలుస్తుందంటూ రాహుల్ పేర్కొన్నారు. రాజకీయాలు అనేవి సరదాగా చేసుకొనే వ్యాపారం మాత్రం కాదు. రాజకీయ నాయకుడు ప్రజల కోసం, ప్రజల మధ్య ఉండి వారి బాగోగుల కోసం ఎల్లప్పుడూ పని చేయాలి అంటూ రాహుల్ పేర్కొన్నారు. భారత ప్రత్యేకతను చాటే కీలక వ్యవస్థలపై ప్రణాళికాబద్ధ దాడి జరుగుతోందని రాహుల్ ఆరోపించారు. కీలక వ్యవస్థల గొంతు నొక్కేసి, ఆ స్థానంలోకి ప్రవేశించిన తెరవెనుక శక్తులు, తమ సొంత బాణీని వినిపిస్తున్నాయన్నారు.దేశానికి ఆత్మగా భావించే కీలకమైన పార్లమెంట్, ఎన్నికల సంఘం, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఒకే సంస్థ గుప్పిట్లో ఉంచుకుందని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ చెప్పే దార్శనికత దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను సమ్మిళితం చేసేది కాదన్న రాహుల్.. 20 కోట్ల మంది ప్రజలను ఏకాకులుగా మారుస్తూ వారిని దుష్టులుగా చిత్రీకరించడం అత్యంత ప్రమాదకరమని ముస్లింలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ విధానాలపై అవసరమైతే జీవితకాలం పోరాడతామంటూ రాహుల్ తెలిపారు

link Media ప్రజల పక్షం🖋️ 

ఎమ్మెల్యే అండతో నా ఇల్లు కబ్జా చేశారు జవాన్

https://twitter.com/major_pawan/status/1529014387217813504?t=HRz2HGep9VFJxjcT8fZWpA&s=08            Sorry can you tell me how can I help you...Major Pawan Kumar

---------------------------------------------------------------

Major,Khureshi has grabbed the property of a soldier while he was delivering his duties. The matter was reported to the additional collector in a program called 'Praja Wani' seeking immediate justice. Need your interference and helping hand in the matter to do justice.... AVR(Prajasankalpam Honorary Advisor)

  ప్రజావాణి లో అదనపు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ని కలిసి భారత జాతీయ జెండా ను చేత బూని ఒక సైనికుడు ఫిర్యాదు చేసాడు అంటే నిజానిజాలు వెంటనే తెలుసుకొని ఖురేషి పై చట్టపరమైన చర్యలు చేపట్టి బాధితునికి న్యాయం చేయాలి. సమస్య తీవ్రముగా ఉంటే రాజకీయ వత్తిడులు ఉంటే సైన్యం సహాయం కోరాలి.... AVR(ప్రజా సంకల్పం గౌరవ సలహాదారులు)

https://twitter.com/Praja_Snklpm/status/1529012671810441216?t=4OHlUxclgol1PguP44z8pQ&s=19

 prajasankalpam1.blogspot.com

Tuesday, May 24, 2022

చెల్లికి న్యాయం కోసం.... ఢిల్లీకి..తల్లితో కలిసి ఎడ్లబండిపై ప్రయాణం

*చెల్లికి న్యాయం కోసం.... ఢిల్లీకి*

*తల్లితో కలిసి ఎడ్లబండిపై ప్రయాణం*

*బోనకల్‌....*
అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి కుమిలిపోయాడా అన్న.కుటుంబ సభ్యులతో కలిసి పోరాడినా.. తమ రాష్ట్రంలో న్యాయం దొరకదన్న ఆవేదనతో తల్లితో కలిసి ఎడ్ల బండిపై దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామ యువకుడు నేలవెల్లి నాగదుర్గారావు వ్యథ ఇది. తన సోదరికి న్యాయం చేయాలని వేడుకుంటూ ఈ నెల 23న తల్లి జ్యోతితో కలిసి ఢిల్లీ యాత్ర ప్రారంభించాడు.

మంగళవారం సాయంత్రం ఖమ్మం జిల్లా బోనకల్‌ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. తన సోదరి నవ్యతను అదే మండలంలోని చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌కిచ్చి 2018లో వివాహం చేశామని చెప్పాడు. కట్నంగా రూ.23 లక్షల నగదు, 320 గ్రాముల బంగారం, 3 ఎకరాల పొలం ఇచ్చామని తెలిపాడు.

పెళ్లి తర్వాత భర్త సక్రమంగా లేడని, పైగా అత్తింటివారు నవ్యతను బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని, ఆ తర్వాత ఆమెను వేధిస్తుండడంతో పుట్టింటికి వచ్చేసిందన్నాడు. జరిగిన ఘటన గురించి చందర్లపాడు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారని.. నవ్యత అత్తమామలు తమ పరపతి ఉపయోగించడంతో కేసులో ఎలాంటి పురోగతీ లేకపోయిందని వాపోయాడు. దీంతో విసిగిపోయిన తాను ఇక తమకు ఏపీలో న్యాయం దొరకదని భావించి, తన తల్లితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీ చేరుకుని సుప్రీంకోర్టు, హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.

link Media ప్రజల పక్షం🖋️ 

మంత్రి పువ్వాడ కు సామాజిక కార్యకర్త కోయిని వెంకన్న భహిరంగ లేఖ

*"మంత్రి పువ్వాడ చేస్తున్న అభివృద్ధి- గిట్టని వారు చేస్తున్న ఆరోపణలు*

*మంత్రి పువ్వాడ కు సామాజిక కార్యకర్త కోయిని వెంకన్న భహిరంగ లేఖ*

*స్వాగతిస్తార? తిరస్కరిస్తార?*

 మంత్రి మనుషులు పోలీసులతో కుమ్ను మాపై పెదుతున్న అక్రమ కేసులు, చేస్తున్న బెదిరింపులు చేస్తున్న అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, మేం చేస్తున్న చట్టపరమైన పోరాటాల గురించి తెలియ పరుచుట,

1. సామాజిక/RTI Activistని అయిన నాపై మూడు అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపించారు. 1) FLR. No. 157/21. Kmm I Town PS, 2) F.L.R.No.16/22 Chinthakkani P% 3.F.L.R.: No. 80/22, Raghunadhapalem) PS. (సెలవులు చూసి జైళ్ళో పెట్టించాడు).

2. వారి యొక్క అవినీతి, అక్రమాలను వెలికి తీస్తున్నానని నాపై సామ దాన, భేద దండోపాయలతో పాటు మా Yotube. Chunei BMAP INDIA కార్యాలయంపై అకస్మాత్తుగా పోలీసులతో దాడిచేయించి మంత్రి వీడియోలను తీసేశారు.

3. రఘునాధపాలెం మండలం, పువ్వాడ నగర్ గ్రామంలో 2127 ప్రభుత్వ ఇండ్ల స్థలాలను సుమారు రూ.35 కోట్ల కు అమ్ముకున్నారు. మేము లోకాయుక్తలో ఫిర్యాదు చేసాము. ఫిర్యాదు నెం. 856/2020/బి1. (విచారణలో ఉంది).

4. అక్కడే కోయచెలక రెవిన్యూ సర్వే నెం.192/1 లో 10యకరాలలో మట్టి తవ్వుకొనుటకు అనుమతి తీసుకుని ప్రక్కన వున్న మంచుకొండ, చింతగుర్తి, రఘునాదపాలెం రెవిన్యూ గుట్టలలో సర్వే నెం. 361, 362, 363, 364 & 266 & 30, 280 లలో సుమారు 150 యకరాలల కోటి క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి త్రవ్వి 150 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. దీనిపై మేము లోకాయుక్తలో ఫిర్యాదు చేసాము. ది.21-02-2022న లోకాయుక్త వారు రూ.16 కోట్లు జరిమాన విధించారు. ఫిర్యాదు నెం. 901/2020/బి1,

5. పోడు భూముల్లో 192 మంది యస్ టి. రైతులు ఇబ్బందులపై లోకాయుక్తలో ఫిర్యాదు 353/2020/బి1. చేశాం.

6. పురాన్ తండ్రి లో సర్వేనెం. 100. లో ఉన్న 86. మంది యస్.టి రైతుల పట్టా భూములలో ఉన్న మట్టి గుట్టను ఆ ఆక్రమించి రూ. పది కోట్ల విలువైన మట్టి ని అమ్ముకున్నారు. మాకు తెలిసిన రెండోవాడే మేం దాన్ని ఆపించాం.

7. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ యొక్క మమతా ఆసుపత్రి ప్రక్కన వున్న పేదలు టి.ఆర్.యన్. కు ఓటు వేయలేదని కక్షతో వర్షాకాలంలో కరోనా సమయంలో 68 ఇండ్లను నిర్ధాక్ష్యంణ్యంగా కూలగొట్టించ్చారు. దీనిపై మేము లోకాయుక్తలో ఫిర్యాదు చేసాము. ఫిర్యాదు నెం. 753/2021/01.

8. ఇదే మంత్రి పువ్వాడ అజయ్ మద్దులపల్లి గ్రామ సర్పంచ్ ను ప్రోటోకాల్ కి విద్దంగా అవమానించిన దానిపై మేము లోకాయుక్తలో ఫిర్యాదు చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చేట్లు చేసాము. ఫిర్యాదు నెం. 781/2020/బి1.

9. మమత ఆసుపత్రి ప్రాంతంలో మంత్రి క్రమబద్ధీకరణ చేయించుకున్న 70 కోట్ల విలువైన 15000 చ.గ.లు ఏమిటి.

10. అదే సమయంలో ఆయన అనుచరులు 69. మంది రూ.150, కోట్ల విలువైన స్థలాలను క్రమబద్ధీకరణ చేయించుకున్నారు.

11. ఖమ్మం నగరంలో జరుగుతున్న ప్రతిపని గురించిన పూర్తి వివరాలు బోర్డు పెట్టాలి. కాని మంత్రి బొమ్మలు పెడుతున్నారు.

12, ఖమ్మం నగరంలో కావి జిల్లాలో కాని ఎక్కడా సమాచార హక్కు చట్టం-2005, సక్రమంగా అమలు జరుగట్లేదు.

13. 1/70 చట్టం ను భూచిగా చూపించి రెవిన్యూ అధికారులు రైతులను పీక్కు తింటున్నారు. పోడు భూములు పట్టాలు వేటికి గిరిజనులకు నూరు శాతం అందించలేదు. పైగా వారిపై బెదిరింపులు, దాదులు చేస్తున్నారు.

14. పాత బస్టాండ్, పాత రైతుబజార్ లను అర్ధంతరంగా మూసివేసిన దానిపై లోకాయుక్తలో ఫిర్యాదు 531/02 చేసాము.

15. కొత్త బస్టాండ్ నాణ్యతాలోపాలపై లోకాయుక్తలో ఫిర్యాదు 483/2 చేసాము, ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు

వందలు చెప్పొచ్చు. మా Yotube Channel BMAP INDIA ఇతని అవినీతి అక్రమాలను ప్రచారం చేస్తున్నది.

16. మేము సమాచార హక్కు ద్వారా తీసుకున్న సమాచారంతో ప్రస్తుత Lokuyuktha, HRC, RTI Commission లో 13 మంది జడ్జీల నియామకానికి హైకోర్టులో ఫిల్ నెం. 209/19 వేసి విజయం సాధించాము.

17. ఇప్పటి వరకు 1,456 స.హ. ధరఖాస్తులు చేశాము, చేయించాము. నిరంతరం పువ్వాద, టి.ఆర్.యస్.. ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాము, ప్రజలను చైతన్యం చేస్తున్నాము.

18. మంత్రి మాట వినని అధికారులపై పలురాకలుగా కక్ష తీర్చుకుంటున్నాడని తెలిసింది. అతికొద్దిమంది అతనికి

బానిసలుగా, టి.ఆర్.యస్. కార్యకర్తలుగా మారారు. అందులో ఖమ్మం అర్బన్ తహశీల్దార్ ప్రముఖంగా వున్నారు.

19. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఐ.ఎ.యస్సా..1? టి.ఆర్. యస్సా..17 అనేట్లుగా వారి తీరు వున్నది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి 7.కి.మీ దూరంలో వున్న పువ్వాడ నగర్ లో 2127 ప్రభుత్వ ప్లాట్లను సుమారు రూ. 35 కోట్లకు టి.ఆర్.యస్. కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి అమ్ముకున్నారు. అలాగే అక్కడే ప్రభుత్వ ప్రయివేటు భూములలో సుమారు రూ.150 కోట్ల విలువైన మట్టిని త్రవ్వి అమ్ముకున్నారు. ఆ రెండు విషయాలపై మేము పలుమార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ సంవత్సరం కావస్తున్నా ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు.

20. ప్రస్తుతం మంత్రి పువ్వాడకు కొరకరాని కొయ్యగా ఉన్నవారిలో మేము ప్రధములుగా ఉన్నాము. అందుకే కేసులు,

21. నేను, నాభార్య 30సం||లు సి.పి.యం పార్టీలో పూర్తి కాలం కార్యకర్తలుగా జిల్లాలో అన్ని ప్రాంతాలలో పనిచేసాము. ప్రస్తుతం RTI Activist,లుగా నిరంతరం ఇదే పనిచేస్తున్నాము. మా వలన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్నివేల మందికి దేవాలయ, అటవీ భూములు దక్కాయి. ప్రయోజనాలు జరిగాయి నీతి నిజాయితీయే మాకు రక్షణగా ఉ న్నది. కొనఊపిరి ఉన్నంత వరకు చట్టపరిధిలో ఇదే విధంగా ప్రజల మేలు కొరకు మా బృందం పనిచేస్తుంది.

22. మంత్రి గారు నిజాయితీ పరులే అయితే ది. 15-06-2022. లోపు ఖమ్మంలో ప్రశాంత విశాల ప్రదేశంలో "మంత్రి పువ్వాడ చేస్తున్న అభివృద్ధి- గిట్టని వారు చేస్తున్న ఆరోపణలు" అనే అంశంపై ఇష్టా గోష్టి చర్చకు అన్ని ఏర్పాట్లు చేసి సమయం నిర్ణయించి తన యొక్క నిజాయితీ, సమర్ధం నిష్పక్షపాతం చేస్తున్న అభివృద్ధి ప్రజా ప్రయోజనం వంటివి నిరూపించుకోవాలి. ఆరోపణలు చేస్తున్న వారిని సావధానంగా ఆహ్వానించి చర్చకు ఆహ్వానించాలి. అవకాశం ఇవ్వాలి. తన యొక్క శ్వేత సేవలను తెలియపరచాలి. ప్రజలందరి సహకారం కోరాలి. ఇటువంటి మంచి సత్ సంప్రదాయానికి పునాధి చేయాలి. ఖమ్మం చరిత్రలో మిగిలిపోవాలి. అలా చేయుటకు మంత్రి పువ్వాడ గారు సిద్ధంగా లేకపోతే మేము, ఇతర పెద్దలు, ప్రజలు చేస్తున్న ఆరోపణలు నిజాలుగా భావిస్తాం అన్నారు

Monday, May 23, 2022

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ.... తహసిల్దార్!

*లంచం తీసుకుంటూ పట్టుబడ్డ.... తహసిల్దార్!*

పెద్దపల్లి : భూమి సర్వే కోసం ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయాలు లంచం తీసుకుంటూ జిల్లాలోని అంతర్గాం తహసీల్దార్‌ సంపత్, ఆర్‌ఐ అజీం, ప్రైవేట్‌ ఉద్యోగి లింగస్వామి రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.అంతర్గాం మండలంలోని అకినపల్లి గ్రామానికి చెందిన రైతు పెద్దంపేట్ శంకర్ తన భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

కాగా, భూమి సర్వే చేయాలంటే మూడు లక్షల వరకు అవుతుందని ఆర్‌ఐ అజీమ్ శంకర్‌కు చెప్పగా.. లక్ష రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకు లక్ష రూపాయలను మధ్యవర్తికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. తాసిల్దార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

link Media ప్రజల పక్షం🖋️ 

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన....10ఏళ్ల చిన్నారి....!

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన....10ఏళ్ల చిన్నారి....!*

ముంబైకి చెందిన రిథమ్ మమానియా అనే 10 ఏళ్ల బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది.ఈ నెల ప్రారంభంలో ఉత్కంఠభరితమైన ఫీట్ సాధించిన భారతీయ పర్వతారోహకులలో ఒకరిగా ఆ బాలిక నిలిచింది. ఆమె సబర్బన్ బాంద్రాలోని ఎంఈటీ రిషికుల్ విద్యాలయంలో ఐదవ తరగతి చదువుతోంది. రిథమ్‌ మే 6న సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న నేపాల్‌లోని సౌత్ బేస్ క్యాంప్‌కు చేరుకుంది.

11 రోజుల పాటు సాగిన యాత్ర బేస్‌క్యాంప్‌కు చేరుకోవడంతో విజయవంతంగా పూర్తయింది. అత్యంత కష్టతరమైన దుర్భేద్యమైన పర్వతమే కాకుండా కఠినతరమైన వాతవరణ పరిస్థితులు తట్టుకుని అధిరోహించే సాహసయాత్ర అయినప్పటికీ ఇవేమి ఆమె లక్ష్యాన్ని నిలువరించలేకపోయాయి. ఐతే రిథమ్‌ బేస్‌క్యాంప్‌కి చేరుకున్న తర్వాత ఆమెతోపాటు పాల్గొన్న ఇతర సభ్యలు విమానంలో తిరిగి వెళ్లేలని నిర్ణయించుకుంటే ఆమె మాత్రం నడచే వెళ్తానని పట్టుబట్టడం విశేషం.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ... "తొలిసారిగా కాలినడకన దూద్‌ సాగర్‌ ట్రెక్కింగ్‌ని విజయవంతం పూర్తి చేశాను. తదనంతరం సహ్యాద్రి పర్వత శ్రేణులలో కర్నాలా, లోహగడ్, మహులి కోటలతో సహా కొన్ని శిఖరాలను అధిరోహించాను. అంతేకాదు ఈ ట్రెక్కింగ్‌ బాధ్యయుతమైన ట్రెక్కర్‌గా పర్వత వ్యర్థాల నిర్వహణ సమస్యను పరిష్కరించడం ఎంత ముఖ్యమో నేర్పింది" అంటూ చెప్పుకొచ్చింది.

link Media ప్రజల పక్షం🖋️

Saturday, May 21, 2022

800 కోట్ల భూమి కబ్జా!

800 కోట్ల భూమి కబ్జా!

Courtesy by : ABN ఆంధ్రజ్యోతి మీడియా Twitter 
800 కోట్ల భూమి కబ్జా!

  • రెవెన్యూ, పోలీస్‌ అండతో దర్జాగా ఆక్రమణ
  • హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ స్థలంలో దౌర్జన్యం
  • అర్ధరాత్రి పొక్లెయిన్లు, డంపర్లతో చొరబాటు.. 
  • ప్రహరీ కూల్చి, కంచె వేసి భూమి స్వాధీనం
  • షూటింగ్‌లు జరిగే చోట సినీ పక్కీలో పాగా.. 
  • కార్మికుల క్వార్టర్లకు నీళ్లు, విద్యుత్తు కట్‌
  • తక్షణమే ఖాళీ చేయాలని హుకుం.. 
  • హైకోర్టు ఆదేశాలూ బేఖాతర్‌.. స్పందించని సర్కారు
హైదరాబాద్‌ సిటీ, మే 20 (ఆంధ్రజ్యోతి): అది రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న భూమి. చుట్టూ ఐటీ కారిడార్‌. పక్కనే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ. ఆ భూమి విలువ ఎకరం యాభై కోట్లపైనే. అరవయ్యేళ్ల క్రితమే కంపెనీ పేరిట అల్యూమినియం ఫ్యాక్టరీ కోసం 45 ఎకరాలు కొన్నారు. కొన్నారు. మరో 53 ఎకరాలు ప్రభుత్వమే స్వయంగా భూసేకరణ చేసి ఇచ్చింది. మొత్తం 98 ఎకరాలకు పక్కాగా యాజమాన్య పత్రాలు ఉన్నాయి. అరవయ్యేళ్ల క్రితమే అందులో ఫ్యాక్టరీ కట్టి, ముందు జాగ్రత్తగా చుట్టూ ప్రహరీగోడ నిర్మించారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ అర్థరాత్రి ఫ్యాక్టరీ మీదకు పొక్లెయిన్లు, డంపర్లతో దండెత్తి వచ్చింది. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అండ దండలతో ఏకంగా 15 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించింది. దాదాపు రూ.800 కోట్ల విలువైన భూమిని కబ్జా చేస్తుంటే సమస్త యంత్రాంగం సలాం కొట్టింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఉదంతం రాష్ట్రంలో భూముల యాజమాన్య హక్కుల భద్రతపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ఒకనాడు 45 ఎకరాల భూమిని స్వయంగా అమ్మి, కొలిచి అప్పగించిన పెద్దమనిషి ప్రస్తుత వారసులు ఇప్పుడు పథకం ప్రకారం అరవయ్యేళ్ల తర్వాత వచ్చి మా భూమి ఫ్యాక్టరీలో కలిసిందంటూ వివాదం లేవనెత్తారు. రెవెన్యూ యంత్రాంగాన్ని కూడగట్టుకొని ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఏకపక్ష సర్వేలు నిర్వహించి వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశారు.


 హైకోర్టు అడ్డుకొని స్టే ఇవ్వడంతో ఏకంగా కబ్జాకు తెగబడ్డారు. మే 13న అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు బడా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన నాలుగు పొక్లెయిన్లు, పది టిప్పర్లు అల్యూమినియం ఫ్యాక్టరీలోకి దూసుకొచ్చాయి. పక్కనున్న భూమికి సంబంధించి పవర్‌ ఆఫ్‌ అటార్నీ కాగితాన్ని అడ్డం పెట్టుకొని, ఫ్యాక్టరీ గోడలు బద్దలు కొట్టి, లోపలిదాకా వచ్చారు. ప్రహరీ గోడ ఆనవాలు లేకుండా చేయడం కోసం నిర్మాణ వ్యర్థాలు మొత్తం తరలించేశారు. 15 ఎకరాల మేర కంచె వేశారు. అల్యూమినియం ఫ్యాక్టరీకి అనుబంధంగా యాభై ఏళ్ల క్రితం నిర్మించిన కార్మికుల క్వార్టర్లను కూడా కంచె లోపల కలిపేసుకొని వాళ్లను వెళ్లిపోవాలని వత్తిడి చేస్తున్నారు. రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పెద్దల అండ ఉన్న అండతోనే హైకోర్టు ఉత్తర్వును కూడా లెక్క చేయకుండా బడా రియల్టర్‌ ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని భావిస్తున్నారు. ఇందులో కబ్జాదారులకు రెవెన్యూ యంత్రాంగం, పోలీసుల సహకారం అందించిన తీరు రాజధాని నగరంలో ప్రైవేటు ఆస్తుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఇలాగే కొనసాగితే దశాబ్దాల క్రితం మీరు కొన్న భూములను ఇట్టే వివాదాస్పదం చేయొచ్చు. చక్రం తిప్పే నేతల ద్వారా రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని ప్రభావితం చేయగలిగితే మీ భూమికి రెక్కలు వచ్చినట్లే.

800 కోట్ల భూమి కబ్జా!

ఎక్కడ ఈ భూమి?

తెలుగు సినిమాలో క్లైమాక్స్‌ ఫైటింగ్‌ సీన్‌ షూటింగ్‌ అంటే హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్లాల్సిందే. దూకుడు మొదలు ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు బ్లాక్‌ బస్టర్‌ సినిమాలన్నీ అక్కడ షూట్‌ చేసుకున్నవే. ఐటీ కారిడార్‌లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పక్కన వందెకరాల్లో ఈ ఫ్యాక్టరీ ఉంది. అర్థ శతాబ్దం కిందటే అందులో కార్మికుల కోసం క్వార్టర్లు నిర్మించి, వసతి ఏర్పాటు చేశారు. పాతికేళ్లుగా సినిమా కంపెనీ ఈ భూమిని లీజుకు తీసుకొని సినిమా షూటింగులు నిర్వహిస్తోంది. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం భారీ సెట్టింగులు వేశారు. తాజాగా తమిళ హీరో అజిత్‌ కొత్త సినిమా కోసం సెట్లు వేస్తున్నారు. ఇంతలో ఈ భూమి తమదంటూ కేఎన్‌ఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కంచె వేసింది. దాంతో క్వార్టర్లు, సగం సినిమా సెట్టింగులు ఆ కంచె లోపలికి వెళ్లిపోయాయి. ఇక్కడ న్యాయస్థానం ఆదేశాలు అమలు కావడం లేదు.. దౌర్జన్యంగా భూమిని ఆక్రమించుకున్నారన్న ఫిర్యాదులు బుట్ట దాఖలవుతున్నాయి.


ఎప్పుడు కొన్నారు? 

సెంట్రల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు దశాబ్ద కాలం ముందే అల్యూమినియం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం మార్చి 6, 1961లో 45 ఎకరాల భూమిని ఇక్కడ కొన్నారు. ది కమర్షియల్‌ అండ్‌ ఇండస్ర్టియల్‌ ఫెనాన్స్‌ లిమిటెడ్‌(సీఐఎ్‌ఫఎల్‌) అనే సంస్థ వద్ద ఈ భూమిని కొనుగోలు చేశారు. సంస్థ ఎండీ కిషన్‌చంద్‌ ఈ భూమిని స్వయంగా రిజిస్టర్‌ చేశారు. 1967లో ఫ్యాక్టరీ విస్తరణ కోసం భూమి సేకరించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఎల్‌.వెంకట్రాంరెడ్డి అనే వ్యక్తి నుంచి 43.13 ఎకరాలు, సీఐఎ్‌ఫఎల్‌ నుంచి మరో పది ఎకరాలు మొత్తం 53.14 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి ఇచ్చింది. ఇందుకు నిర్ణీత ధరను కూడా ప్రభుత్వానికి చెల్లించారు. దాంతో శేరిలింగంపల్లి గ్రామ పరిధిలోని 90, 91, 92, 93, 94, 95, 96, 99/1, 99/2, 100/1, 100/2, 101/1, 101/2, 101/3 సర్వే నెంబర్లలో అల్యూమినియం ఫ్యాక్టరీకి 98.14 ఎకరాల భూమి సమకూరింది. వెంటనే చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. కార్మికుల కోసం 1970లో క్వార్టర్లు నిర్మించారు. మధ్యలో కొన్నాళ్లు పరిశ్రమ మూత పడింది. కొన్నేళ్ల క్రితం పున:ప్రారంభమైంది. సంస్థ ప్రాంగణం ఖాళీ స్థలాన్ని సినిమా షూటింగ్‌ల కోసం రెండున్నర దశబ్దాలుగా అద్దెకిస్తున్నారు. తాజాగా కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ఫ్యాక్టరీ లోపలి భూభాగానికి కిషన్‌చంద్‌ వారసుల నుంచి పవరాఫ్‌ అటార్నీ ఉందనే పేరుతో తెర మీదకు వచ్చింది. ఫ్యాక్టరీ ప్రాంగణం లోపల 15 ఎకరాలకు పైగా భూమి తమది ఉందని వాదిస్తోంది. 


సర్వే నివేదిక కోర్టు పరిశీలనలో ఉండగానే ప్రహరీ కూల్చివేయడాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రశ్నిస్తోంది. దౌర్జన్యంగా ఫెన్సింగ్‌ ఎందుకు వేస్తున్నారని అడిగితే చేయి చేసుకున్నారని సెక్యురిటీ గార్డులు చెబుతున్నారు. మూడు క్వార్టర్లకు విద్యుత్‌, నీటి సరఫరా నిలిపేశారు. ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని క్వార్టర్లలో ఉంటున్న కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కిషన్‌చంద్‌ కుటుంబానికి చెందిన కొందరు తమ పూర్వీకుడు విక్రయించినది పోగా మిగిలింది ఫ్యాక్టరీ పరిధిలో ఉందంటూ కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు జనరల్‌, స్పెషల్‌ పవరాఫ్‌ అటార్నీ ఇచ్చారు. దాని ప్రకారమే కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అల్యూమినియం ఫ్యాక్టరీ పరిధిలోని కొంత స్థలం తమదని వాదిస్తోంది. మండల సర్వేయర్‌ నివేదికలోనూ ఈ విషయం ఉందని అంటున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం సర్వేపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా సర్వే నివేదిక తయారు చేశారంటోంది. సర్వే కోసం ఫ్యాక్టరీ ప్రాంగణంలోకే రాలేదని గుర్తు చేసింది. అక్టోబర్‌ 25, 2021 తేదీతో సర్వే నోటీసును 30న తమకు ఇచ్చారని, నవంబర్‌ 1వ తేదీన సర్వే చేయనున్నట్టు నోటీసులో పేర్కొన్నారని ఫ్యాక్టరీ యాజమాన్యం ఆంధ్రజ్యోతికి తెలిపింది. దీపావళి పండుగ నేపథ్యంలో మరోసారి సర్వే చేయాలని సూచించినట్టు వెల్లడించింది. తమ ప్రమేయం లేకుండా నవంబర్‌ 8న సర్వే చేసి, నివేదిక ఇవ్వడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లింది. సర్వే చేస్తున్న విషయం తమకు చెప్పలేదని, నివేదిక వివరాలు తమకు ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొంది. దాంతో డిసెంబర్‌ 13న హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.


కింది కోర్టులో మరో పిటిషన్‌

డిసెంబరు 17వ తేదీన కిషన్‌చంద్‌ కుటుంబానికి చెందిన సురుచిచంద్‌, సలోని జవేరి, శివాని చంద్‌లు భూమి వాస్తవ యజమానులం తామేనని, బాంబే హైకోర్టు ఏప్రిల్‌, 2, 1994 నాడు ఇచ్చిన ఆర్బిట్రల్‌ అవార్డుతో భూమి తమదైందని ప్రస్తావిస్తూ తమ హక్కులకు భంగం కలగకుండా చూడాలంటూ కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించారు. భూమికి సంబంధించి స్పెషల్‌ పవరాఫ్‌ ఆటార్ని ఇచ్చామని, అప్పటి నుంచి భూమి కబ్జాలో ఉన్నామని తెలిపారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులను(ఇంటెరిం ఇంజక్షన్‌) జారీ చేసింది. దాంతో మరోసారి ఫ్య్యాక్టరీ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్‌ 13న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను జూన్‌ 17 వరకు కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, వాటిని ధిక్కరిస్తూ అర్ధ, అంగ బలంతో కేఎన్‌ఆర్‌ సంస్థ దౌర్జన్యకాండ కొనసాగించింది. రెవెన్యూ, పోలీస్‌ అధికారులు వారికి సహకరిస్తున్నారు.

అర్ధరాత్రి.. అరాచకం

మే 13వ తేదీన అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో (తెల్లవారితే 14) ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వచ్చి ఫ్యాక్టరీ ప్రహరీ గోడను కూల్చేశారు. ఉదయం 6 గంటలకు ఫ్యాక్టరీ ప్రతినిధులు చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. 10 గంటలకు రావాలంటూ తిప్పి పంపారు. 10 గంటలకు వెళితే ఉదయం ఇచ్చిన ఫిర్యాదు కనిపించడం లేదన్నారు. రెండు రోజుల అనంతరం కేఎన్‌ఆర్‌ సిబ్బంది కొందరు ఫెన్సింగ్‌ వేశారు. ఫ్యాకరీ ప్రతినిధులు సమాచారమందించినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఫెన్సింగ్‌ వేయవద్దని అడ్డుకున్న కార్మికులనే స్టేషన్‌కు తరలించారు. నిర్మాణ సంస్థ సిబ్బంది జోలికి పోలీసులు వెళ్లక పోవడం అనుమానాలకు తావిస్తోంది. సెట్టింగులు, క్వార్టర్లను ఆక్రమించి కంచె వేయడమే కాకుండా రక్షణ కోసం గార్డులను ఏర్పాటు చేశారు. రహదారులకు అడ్డుగా రాళ్ల కుప్పలు పోశారు. క్వారర్లకు విద్యుత్‌, నీటి సరఫరా నిలిపివేశారు. టిప్పర్ల రాకపోకలతో పైపులైన్లు పగిలి ఇళ్ల చుట్టూ మురుగు నీరు చేరింది. ప్రహరీ గోడ కూల్చి, కంచె వేసినప్పుడు ప్రేక్షకపాత్ర వహించిన పోలీస్‌ యంత్రాంగం భూమి కబ్జాలోకి వెళ్లిపోయాక పికెట్‌ ఏర్పాటుచేసి కాపలా కాస్తుండడం గమనార్హం. అధికార పార్టీ అండదండలే దీనికి కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. భూమి వాళ్లదైతే దొంగ రాత్రి గోడలు కూల్చివేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అందరి సమక్షంలో సర్వే చేసి, నిజంగా వారికి భూమి ఉన్నట్టు తేలితే కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలే తప్ప దౌర్జన్యం చేయడం సబబు కాదని కార్మికులు పేర్కొంటున్నారు.


ఖాళీ చేసి పొమ్మంటుర్రు

మాది వరంగల్‌ జిల్లా.. 15 యేళ్లుగా మా ఆయన కంపెనీలో పని చేస్తున్నారు. ఇక్కడే క్వార్టర్‌లో ఉంటాం. మేముండే ప్రాంతమంతా తమదంటూ కొందరూ అర్ధరాత్రి గోడలు కూల్చి వచ్చారు. ఆ తర్వాత పెన్సింగ్‌ వేశారు. రాత్రిళ్లు వచ్చి ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెబుతున్నారు. లేకుంటే పోలీసులతో వచ్చి రాత్రికి రాత్రే ఇళ్లు కూల్చేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికిపోతాం.

-ఓ కార్మికుడి భార్య వరలక్ష్మి


నీళ్లు, కరెంట్‌ బంద్‌

మా ఆయన ఇదే కంపెనీలో పని చేసేవారు. ఆయన పోయాక కంపెనీలోనే 30 యేళ్లుగా అటెండర్‌గా పని చేస్తున్నాను. క్వార్టర్‌లో ఉంటున్నా. వారం రోజులుగా మమ్మల్ని వెళ్లిపోమంటున్నారు. నీళ్లు, కరెంటు బంద్‌ చేశారు. ఎండాకాలం బయటకు రాకుండా పెన్సింగ్‌ వేశారు. డ్యూటీకి కూడా పోలేకపోతున్నాం. మంచి నీళ్లు, సరుకులు తెచ్చుకోవడమూ ఇబ్బందే. ఫెన్సింగ్‌ కింద నుంచి తిరగడం వృద్ధులకు ఇబ్బందిగా ఉంటోంది. 

- అటెండర్‌ సీ.లక్ష్మి


రోడ్డుపై రాళ్లు పోశారు

మా అబ్బాయి కంపెనీలో పని చేస్తారు. చాలా ఏళ్లుగా ఇక్కడే క్వార్టర్స్‌లో ఉంటున్నాం. గోడ కూల్చేశారు. కంపెనీలోకి వెళ్లకుండా, రాకుండా రోడ్డుపై రాళ్లు పోశారు. అడ్డుగా పెన్సింగ్‌ పాతారు. ఇళ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. తొలగించిన కరెంటు పునరుద్దరిస్తే మళ్ళి తీసేస్తున్నారు. పైపులైన్లు పగులగొట్టడంతో ఇళ్లు మొత్తం బురదగా మారింది.

- సూపర్‌వైజర్‌ తల్లి సపూర్‌ ఉన్నీసా


రెండు సార్లు సర్వే చేశాం

కోర్టు ఆదేశాల మేరకు సర్వే చేశాం. పూర్తి వివరాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించాం. ఇరు వర్గాలు తమ భూమి ఉందని చెబుతున్నాయి. సర్వే ఆధారంగా న్యాయస్థానం తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. రెండు పర్యాయాలు సర్వే చేశాం. 

- రెవెన్యూ వర్గాలు



Friday, May 20, 2022

To stand tall &to serve selflessly- ‘Parma Shri’Daripalli Ramaiah

To stand tall &to serve selflessly- ‘Parma Shri’Daripalli Ramaiah definitely shares those qualities with trees. Ramaiah, who planted more than crore saplings in Khammam was hospitalized after an accident.He doesn’t want to press charges-instead ask the person to plant 100saplings https://t.co/ZlmbJUykR4

Ramaiah was on his way to water plants when a car rammed into him in Wednesday. He is currently out of danger and instructed his family to convey the deal to let the accused off hook if he agrees to plant& care for 100 saplings. #GreatMen #GreatThoughts #RealGreenIndiaChallenge https://t.co/iF7N5RySps

A lot of politicians& celebs claim that they are doing service to the planet after planting a sapling & posing for pics #GreenIndiaChallenge. But Ramaiah is the true epitome🙏🏼. FYI-no politician visited him in the hospital so far or offered any assistance. #Telangana #RealHero

Courtesy by : @revathitweets Twitter 

నేటి నుంచి కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం....!

*నేటి నుంచి కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం....!*

ఇవాళ్టి నుండి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం ప్రారంభం కానుంది. రైతు డిక్లరేషన్ పై పల్లె పల్లెకు కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు.ఈ నేపథ్యంలోనే.. నేడు ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో రచ్చబండలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Thursday, May 19, 2022

పట్టణ & గ్రామం ప్రాంతాల్లో నివసించే పేదలకు పక్కా గృహాలు అందించేందుకు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం.

పట్టణ & గ్రామం ప్రాంతాల్లో నివసించే పేదలకు పక్కా గృహాలు అందించేందుకు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం.

🏘️PMAY-అర్బన్ కింద ఇప్పటివరకు 96,127 ఇళ్లు తెలంగాణకు మంజూరు చేయబడ్డాయి.

🏘️అందులో 83,639 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 

⚡PMAY-U కింద తెలంగాణకు 2476.73 కోట్లు విడుదలయ్యాయి.

🏘️ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ పథకం యొక్క లక్ష్యం కొన్ని మౌలిక సదుపాయాలతో కూడిన పక్కా గృహాలు గ్రామం ప్రాంతాల్లో పేదలకు అందించడం లక్ష్యం.

⚡PMAY-గ్రామిన్ కింద తెలంగాణకు 190 కోట్లు విడుదలయ్యాయి.

⚡ఈ పథకం పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేక పోవడం. విడుదల చేసిన 190 కోట్లు తిరిగి ఇవ్వాలని అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

🏘️ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ యొక్క క్రెడిట్ లింకింగ్ సబ్సిడీ స్కీమ్ కింద భారత ప్రభుత్వం గృహ రుణాల పై సబ్సిడీ & వడ్డీ రాయితీని అందిస్తుంది. 

🏘️గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో PMAY-U యొక్క CLSS నిలువు కింద 69,499 మంది లబ్ధిదారులు F.Y.2016-17 నుండి F.Y. 2020-21.

Courtesy by : @AletiRajeshARS Twitter 


జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య బయోమెట్రిక్ విధానంతో

జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య బయోమెట్రిక్ విధానంతో తమ హాజరు నమోదు చేసుకుంటున్న కార్మికులు.

Courtesy by : hmtv Media Twitter

Hyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు జీతం కట్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నెల రోజులు పనిచేసినా చిన్న పొరపాటులో పూర్తి శాలరీ అందుకోలేక పోతున్నారు. దీనికి ప్రధాన కారణం బయోమెట్రిక్ హాజరు విధానమే అంటున్నారు కార్మికులు. అధికార యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ పరిస్థితి నెలకొందంటున్నారు. కార్మికుల జీతాల సమస్యపై స్ఫెషల్ స్టోరి. Also Read - Cyber ​​Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏడు జోన్లు, వాటిలో ముప్ఫై సర్కిళ్లున్నాయి. దాదాపు 8వేల మంది కార్మికులున్నారు. వీరిలో మూడు వేల మంది వేతనాల్లో కోత విధించారు. కొన్ని సర్కిళ్లలో దాదాపు 70శాతం మందికి వేతనాల్లో కోత విధించారు. కార్మికులకు 14వేల వేతనానికి 15వందల నుంచి 8వేల వరకు వేతనాల్లో కోత పడింది. దీంతో బల్దియా పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

https://www.hmtvlive.com/telangana/ghmc-sanitation-workers-facing-salary-problems-81722

ఈ జీతాలు రాకపోవడానికి ప్రధాన కారణం బయో మెట్రిక్ విధానమే అనే మాట వినిపిస్తుంది. బయోమెట్రిక్ మిషన్లలో సాంకేతిక లోపాలున్నా సరిచేయాల్సిన కాంట్రాక్టు ఏజెన్సీ పనిచేయకపోయిన పాత మిషన్లనే కొనసాగించారు. పనిచేయని మిషన్లలో బయోమెట్రిక్ తీసుకుని సమయంలో తేడా వచ్చినా కోత విధించారు. పారిశుధ్య కార్మికుల సాధారణ పనివేళలు ఉదయం 6నుండి మధ్యాహ్నం 2గంటల వరకు వేసవి సందర్భంగా మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుందని, దీన్ని ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అమలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఉదయం 5నుంచి 6గంటల లోపు బయో మెట్రిక్ నమోదు చేయాల్సి ఉండగా ఐదున్నర గంటలు దాటితే వేయక పోవడం వల్లే జరిగిందని మరికొందరు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్య కార్మికులకు బయోమెట్రిక్ మిషన్లు సరిగ్గా వినియోగించడం రానందున కూడా గైర్హాజరు పడుతున్నట్టు తెలుస్తోంది. వినియోగంపై తగిన అవగాహన కల్పించాల్సిన అధికారులే కాంట్రాక్టు ఏజెన్సీకిచ్చి చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

https://www.hmtvlive.com/telangana/ghmc-sanitation-workers-facing-salary-problems-81722