*జర్నలిస్ట్- ఓ జర్నలిస్ట్ మిత్రమా ఇది నీకె*
సోనియా సిగ్గు పడింది, మోడీ తుమ్మాడు, కెసిఆర్ తిట్టాడు, చంద్రబాబు నవ్వాడు, గాలి ఇంట పెళ్లి సందడి, డేరా బాబా సరాగాలాడాడు, సెలబ్రిటీ కూతురు కాలు జారింది, విరాట్ సిక్స్ కొట్టాడు, దానికి అనుష్క కెవ్వు మంది, మొగుడు కాదన్నాడు, ప్రియుడు అవును అన్నాడు,
ఛి ఛి ఇదేనా జర్నలిజం... విలువలతో కూడిన, ఒక ఆంకిత భావం, తెగింపు, సమాజాన్ని మార్చే వారధులు మనమే అన్న, ఒక స్పృహ ఏమి లేదా. ఎవడు డబ్బులిస్తే వాడికి ఊడిగం చేసే సిగ్గులేని బ్రతుకులకు పవిత్రమైన జర్నలిజం పేరు పెట్టుకుంటారా? పనికి రాని సుత్తి మహేష్, రాంగోపాల్ వర్మ కాదు సోదరా... మన నిస్సహాయ ప్రపంచాన్ని కుర్చోపెట్టు ని స్టూడియోలో, సమస్య తెలిసి, ప్రభుత్వం దిగి వచ్చి, అలాంటి సమస్యలకు భరోసా దొరికేంతవరకు, నాయకులను, పాలకులను, పార్టీలను ఏకి పారెయ్, ఎవరొద్దన్నారు మిత్రమా? మేలుకో మిత్రమా. *జర్నలిజం విలువలను బ్రతికుంచు*. పతనమవుతున్న ఈ సమాజాన్ని నిలబెట్ట వలసిన బాధ్యత నిపై ఉందని గుర్తుంచుకో... ని కలం రాయడం మొదలు పెడితే ప్రపంచం ఉలిక్కి పడాలి, ని గళం వినిపిస్తే చతికిల పడ్డ ప్రపంచం పరుగులు పెట్టాలి అని అంటున్న Voice of Telugu కి మీరు ఎం సమాధానం ఇస్తారు.
*ప్రజలను గొర్రెలను చేసి ఈ రాజకీయ నాయకులు రాజ్యం ఏలుతుంటే*
బుర్ర కథలు చెప్పగానే అందరూ నమ్మి మోసపోతుంటే. ప్రజలను చైతన్య పరచాల్సిన బాద్యత ని పై లేదా?
పచ్చని అడవిలో ఒక మొక్క పెట్టి, అడవంతా నేనే పెట్టిన అని చెప్తుంటే, సిగ్గు లేకుండ ప్రజలకు చెప్తున్నారు
ఎం లేదన్న మాయమాటలు చెప్పి గాలిలో మేడలు కడ్తాడు అంతే ఇంకా చేసేదీ ఏంలేదన్న, అప్పుల తెలంగాణ ఐంది ఎప్పుడో..... దానిని మనం ఏం చెయ్య లేము అని అంటున్న ఒక తెలంగాణ బిడ్డకు ఎం సమాధానం ఇస్తారు.
ప్రజల త్యాగాలకు అర్థం లేకుండా పోయింది. నమ్మి నానవోస్తె పుచ్చిబుర్రలైనట్లయింది. ప్రశ్నించేవారిపై కేసుల, జైళ్ళపాలుచేసే నియంతృత్వం సాగుతుంది. ఇకనైనాప్రజలు నిజాలు గ్రహించకపోతే తెలంగాణ బొందలగడ్డగా మారక తప్పదు అని హెచ్చరిస్తున్న నిరుద్యోగికి ఎం చెప్తావ్.
ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడు ఎలుతున్నాడు రో తెలంగాణ అని గర్జిస్తున్న తెలంగాణ ఉద్యమ కళాకారుడికి ఎం చెప్తావ్.
అన్న మళ్ళి తెలంగాణ కోసం పోరాటం చేయవలసిందేనా???
*రైతులు, RTC కార్మికులు, విద్యార్థులు, ఆత్మహత్యలు చేసుకున్నా*, లంచం ఇవ్వనిదే ఏ ప్రభుత్వ సంస్థలల్ల పనులు జరగక పోయినా, ఆరు సంవత్సరాలయినా VC ని నియమించకుండా ఉస్మానియా భూములను కొల్లగొడుతూ, ఉస్మానియ ఉనికిని లేకుండా, భవిష్యత్తులో ప్రజలు ప్రభుత్వం పైన తిరగబడకుండా ఉద్యమాలకు ఊపిరి ఐన ఉస్మానియాని బ్రష్టుపట్టించే పనిలో అధికార పార్టీ నేతలు ఉన్నా, ఉస్మానియా భూములను అక్రమంగా కొల్లగొడుతున్నా, *ఏ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికెషన్స్ ఇవ్వకపోయినా, పూటకొక్క మాట మారుస్తూ, ప్రజలను మభ్యపెడుతున్నా, కేవలం తన ఫార్మ్ హౌస్ లో పంట పండించడం కోసం కొండపోచమ్మ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ల పేరు చెప్పి లక్షల కోట్లు మింగుతున్నా*, ఇవన్నీ చూసి ప్రశ్నించే వారిపైన *అక్రమ కేసులు పెడుతున్నా*, తెలంగాణ పేరు చెప్పి మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం నుంచి విముక్తి కలగాలని ప్రజలు కోరుకున్నా, జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా అని మోసం చేసినా, దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చెయ్యకపోయినా, మూడెకరాల భూమి, ఇంటికొక్క ఉద్యోగం ఇస్తా అని ఇవ్వకపోయినా, నియంత పాలన చేయడానికి, ప్రజలను, ప్రతిపక్షాలను నోరు ఎత్తకుండా చేయడానికి *40,000 పోలీసు ఉద్యోగాలిచ్చీ అణచివేత చేస్తుంటే*, ఇల్లు కూడా దాటకుండా చేస్తున్నా చూస్తూ కూర్చుందామా?
కేవలం అధికార పార్టీ చేసే తప్పులను ప్రశ్నించినందుకు ఒక న్యూస్ ఛానల్ని డబ్బులతో కొని, ఆ ఛానల్ ని నేలమట్టం చేస్తే, *అందులో పనిచేసే 170 మంది రోడ్డున పడ్డారు.*
*డబ్బు, అధికారం ఉంది కదా అని అన్ని న్యూస్ చానల్స్ని కొని తన ఆధీనంలోకి తీసుకోని, తాను చెప్పిన వార్తలు మాత్రమే వచ్చేలా చేస్తుంటే*. ఈ రంగానికి రాకముందు సమాజ శ్రేయస్సు కోసం మార్పుకోసం ఎంతో పాటుపడుదాం అనుకొని ప్రస్తుతం తమ మనుసుని చంపుకొని తన కుటుంబ పోషణ కోసం, నెలకు వచ్చే జీతం కోసం, ఆత్మ గౌరవాన్ని చంపుకొని కాలం గడిపేస్తున్నారు.
ఇలాంటి జర్నలిస్ట్ ల కోసం, ఆలాగే సమాజంలో జరుగుతున్న మోసాలను, రాజకీయ చదరంగాలను ప్రజలముందు నేరుగా ఉంచడం కోసం, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అక్రమాలు ఆధారాలతో సహా అందరూ చూడాలనే, మంచిపనిలు చూడాలనే, ముక్యంగా ప్రజా సమస్యలు వెలుగులోకి రావాలనే ఉద్దేశంతో... అలాగే
*ఇదేనా బంగారు తెలంగాణ? పోరాడి సాధించుకున్న తెలంగాణ?*
అని అడిగిన ఒక అభాగ్యుడి కి జవాబుగా మా ఈ జర్నలిజం అనే అప్లికేషన్ తయారు చేసాము.
*ఓ జర్నలిస్ట్ మిత్రమా మేలుకో.*
సమాజం నికొరకై ఎదురుచూస్తుంది. ని కలానికి పని చెప్పు..
*నిజమైన జర్నలిస్ట్ అనిపించుకో... నీవు చదివిన చదువుకు న్యాయం చెయ్యు*
ప్రజలను చైతన్య వంతులని చేయు
ని సత్తా చూపించు
నిజాల్ని ప్రజల ముందు ఉంచు. దౌర్జన్యాన్ని ఎదిరించు
ఈ దొంగలను చీల్చి చెండాడు ని కలం తో
ఎవ్వరికీ భయపడకుండా వార్తలను సాక్షాలతో పెట్టు.. అందరికి తెలిసేలా చెయ్
*Q Group Media*