Wednesday, June 30, 2021

చెస్‌ అభిమన్యుడు12 ఏండ్లకే గ్రాండ్‌మాస్టర్‌ హోదా

హైదరాబాద్ : 01/07/2021

చెస్‌ అభిమన్యుడు

12 ఏండ్లకే గ్రాండ్‌మాస్టర్‌ హోదా

నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 


చెస్‌ అభిమన్యుడు

న్యూయార్క్‌: భారత సంతతికి చెందిన అమెరికా కుర్రాడు అభిమన్యు మిశ్రా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చెస్‌ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన(12 ఏండ్ల 4నెలలు) గ్రాండ్‌ మాస్టర్‌గా అవతరించాడు. న్యూజెర్సీకి చెందిన అభిమన్యు బుధవారం భారత్‌కు చెందిన 15 ఏండ్ల లియోన్‌ మెన్‌డోన్కాపై విజయంతో గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకున్నాడు. నల్ల పావులతో బరిలోకి దిగిన అభిమన్యు..అద్భుత ప్రదర్శనతో గ్రాండ్‌మాస్టర్‌ అయ్యేందుకు కావాల్సిన ఎలో రేటింగ్‌ను కైవసం చేసుకున్నట్లు చెస్‌ డాట్‌కామ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో 19 ఏండ్ల క్రితం రష్యా గ్రాండ్‌మాస్టర్‌ సెర్గె కర్జాకిన్‌(12 ఏండ్ల 7 నెలలు) నెలకొల్పిన అతిపిన్న గ్రాండ్‌మాస్టర్‌ రికార్డును తాజాగా అభిమన్యు తిరుగరాశాడు.

పరిశ్రమలు, ఐటీశాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ : 01/07/2021

పరిశ్రమలు, ఐటీశాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
పరిశ్రమలు, ఐటీశాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ప్రతిపాదనలపైన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల వారీగా పరిశ్రమలు, ఐటీశాఖల విభాగాధిపతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా అండ్‌ లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని, ఈ మేరకు పలు కంపెనీలు తమ ఆసక్తిని వివిధ శాఖల అధికారులకు తెలిపాయని అధికారులు మంత్రికి వివరించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటు జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని, ఆ మేరకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదిత పెట్టుబడులను వివిధ జిల్లాలకు తరలించేలా ఆయా కంపెనీలను కోరాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇప్పటికే పలువురు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వానికి అందజేశారని,  అటువంటి ప్రాంతాలకు ఈ పెట్టుబడులు తరలివెళ్లేలా  ప్రయత్నించాలని వివిధ శాఖల డైరెక్టర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు.

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ : 30/06/2021

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా, రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని సీఎం తెలిపారు. 

ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య యజ్ఞంలో, వైద్య నారాయణులై తమవంతు పాత్రను పోశించాలన్నారు. ప్రజారోగ్యం కోసం తమ కృషిని మరింతగా కొనసాగించాలని, రాష్ట్రంలోని ప్రతీ డాక్టరుకు సీఎం పిలుపునిచ్చారు.

కరోనా సహా అన్ని ఆరోగ్య విపత్తుల కాలంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవన్నారు. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కునే క్రమంలో తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి రోగులకు సేవలందించిన ప్రతి డాక్టరునూ, వారికి సహకరిస్తున్న కుటుంబ సభ్యులను, పేరు పేరునా మరోసారి అభినందిస్తున్నానని సీఎం అన్నారు.

ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి  ఇప్పటికే పలు వైద్య కళాశాలలను ప్రభుత్వం నెలకొల్పింది దేశంలోనే మొట్టమొదటిసారిగా అన్నిరకాల రోగ నిర్ధారణ కేంద్రాలను ప్రతి జిల్లాల్లో ఏర్పాటు చేశాం. హైదరాబాద్, వరంగల్ సహా పలు ప్రాంతాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానాల ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభమైంది: సీఎం

రానున్న కాలంలో ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలో డాక్టర్లు, నర్సులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వున్నది: సీఎం శ్రీ కేసీఆర్

తెలంగాణ @TelanganaCMO (ట్విట్టర్)సౌజన్యంతో 

తహసీల్దార్ ఆఫీస్ గేటుకు తాళిబొట్టును వేలాడదీసి మహిళ నిరసన......!

హైదరాబాద్ : 30/06/2021

తహసీల్దార్ ఆఫీస్ గేటుకు తాళిబొట్టును వేలాడదీసి మహిళ నిరసన......!*

సిరిసిల్ల: తమకు చెందిన భూమిని రెవెన్యూ అధికారులు ఇతర వ్యక్తులకు పట్టా చేశారన్న ఆవేదనతో ఓ మహిళ వినూత్న రీతిలో ఆందోళనకు దిగారు. తన తాళిబొట్టు లంచంగా తీసుకుని న్యాయం చేయాలంటూ.. తహశీల్దార్‌ కార్యాలయ గేటుకు వేలాడదీశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం... మానాల గ్రామానికి చెందిన పొలాస రాజేశం- మంగ దంపతులకు సర్వే నెంబరు-130/14లో 2 ఎకరాల భూమి ఉంది. కాగా రాజేశం మూడు సంవత్సరాల క్రితం చనిపోయారు. ఈ క్రమంలో బతుకుదెరువు రీత్యా మంగ మెట్‌పల్లికి వెళ్లారు.అయితే తాను లేని సమయంలో రెవెన్యూ అధికారులతో ఎంక్వైరీ చేయించుకుని ఇతర వ్యక్తులు తమ పేరున భూమిని పట్టా చేయించుకున్నట్లు ఆమె ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో... బుధవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్న మంగ.. ఆఫీసు గేటుకు తాళిబొట్టు వేలాడదీసి నిరసన వ్యక్తం చేశారు. తన భర్త చనిపోయాడని, జీవనాధారంగా ఉంటుందనుకున్న భూమిని కూడా ఇలా అక్రమంగా పట్టా చేసుకుంటే ఎలా అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తాళిబొట్టును తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం
చేశారు.

*link Media ప్రజల పక్షం🖋️*

prajasankalpam1.blogspot.com 

జోనల్ వ్యవస్థలో మార్పులు.....!

హైదరాబాద్ : 30/06/2021

*జోనల్ వ్యవస్థలో మార్పులు.....!*

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, స్థానికతకు సంబంధించి జోనల్‌ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు, చేర్పులకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. నారాయణపేట జిల్లాకు జోగులాంబ జోన్‌లో, ములుగు జిల్లాకు కాళేశ్వరం జోన్‌లో చోటు కల్పించారు. స్థానికంగా ఉన్న విజ్ఞప్తుల మేరకు వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌కు మార్పు చేశారు. ఇక నుంచి అందుకు అనుగుణంగానే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు స్థానికతను ఖరారు చేస్తారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

*link Media ప్రజల పక్షం*

prajasankalpam1.blogspot.com 

రైతుల సంక్షేమం కోసం పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం

హైదరాబాద్ : 30/06/2021

కేంద్రంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం విషయం ప్రజలకి తేలిసే వింధంగా ప్రచారం జరగాలి.. 
అనేక మంది రైతులు ఈ పథకం కింద నమోదు చేసుకోక నష్టపోతున్నారు.ఈరోజు ఆఖరు అని చెప్పి ఉపయోగం ఎంటి? మీకు సామాన్యప్రజలకు ఇవ్వడం ఇష్టం ఉన్నట్లు అని పించడం లేదు.. https://t.co/VQcfy0rKd4

Tuesday, June 29, 2021

బెస్ట్‌ పోలీస్‌స్టేషన్లు, సిబ్బందికి పురస్కారాలు

హైదరాబాద్ : 30/06/2021

ఉత్తమ పీఎస్‌గా తాడూరు ఠాణా

నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
ఉత్తమ పీఎస్‌గా తాడూరు ఠాణా
  • బెస్ట్‌ పోలీస్‌స్టేషన్లు, సిబ్బందికి పురస్కారాలు
  • డీజీపీ మహేందర్‌రెడ్డి చేతులమీదుగా అందజేత

హైదరాబాద్‌,(నమస్తే తెలంగాణ): విధుల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీస్‌స్టేషన్లు, పోలీస్‌ సిబ్బందికి డీజీపీ మహేందర్‌రెడ్డి పురస్కారాలు అందజేశారు. ఫంక్షనల్‌ వర్టికల్‌ విధానం అమలులో బెస్ట్‌ పోలీస్‌స్టేషన్లలో నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు ఠాణా తొలిస్థానంలో, కోదాడ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ రెండు, రామగుండం పోలీస్‌స్టేషన్‌ మూడు, అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ నాలుగో స్థానంలో నిలిచాయి. ఆయా ఠాణాల ఎస్‌హెచ్‌వోలకు డీజీపీ మంగళవారం ప్రశంసాపత్రాలు అందజేశారు. ఉత్తమంగా పనిచేసిన 223 మంది సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌కమిషనర్లతో డీజీపీ మహేందర్‌రెడ్డి శాంతిభద్రతలు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సైబర్‌ నేర పరిశోధనలో సిబ్బంది శిక్షణ కోసం రూపొందించిన ఇన్వెస్టిగేటర్స్‌ డైరెక్టరీ ఫర్‌ సైబర్‌ వారియర్స్‌ 2.0 పుస్తకాన్ని ఆవిష్కరించారు.

సైబర్‌ భద్రత మన బాధ్యత
భవిష్యత్తులో సైబర్‌ నేరాల ముప్పే ఎక్కువగా ఉండబోతున్నందున సైబర్‌ భద్రతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పోలీస్‌ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మూడో సైబర్‌ కాంగ్రెస్‌ను మంగళవారం ఆయన వెబినార్‌ ద్వారా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 1,650 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 3,300 మంది విద్యార్థులు, 1,650 మంది టీచర్లను సైబర్‌ అంబాసిడర్లుగా ఎంపిక చేశారు. వీరందరికీ పదినెలలపాటు సైబర్‌ సేఫ్టీ అంశాలపై శిక్షణ ఇస్తారు. సైబ్‌హర్‌-3 పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ.. సైబర్‌ సేఫ్టీ శిక్షణలో కీలకంగా పనిచేస్తున్న అడిషనల్‌ డీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి, సహకారం అందిస్తున్న విద్యాశాఖ ఉన్నతాధికారులను అభినందించారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన, యంగిస్థాన్‌ ఫౌండర్‌ డైరెక్టర్‌ అరుణ్‌ డేనియల్‌, సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్‌టాండన్‌ తదితరులు పాల్గొన్నారు.

Monday, June 28, 2021

నేడు వర్చువల్ లో బల్దియా కౌన్సిల్ మీటింగ్..

హైదరాబాద్ : 29/06/2021

నేడు వర్చువల్ లో బల్దియా కౌన్సిల్ మీటింగ్.. బీజేపీ హాజరయ్యేనా..?

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
ghmc fine to trs leader anand babu goud over place flexi at hyderabad

చాలా రోజుల తర్వాత జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదించనుంది. అయితే ఈ వర్చువల్ సమావేశంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రత్యక్ష సమావేశాలే పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు, మంత్రుల టూర్లకు లేని అభ్యంతరాలు.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కు అడ్డొచ్చాయా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ghmc fine to trs leader anand babu goud over place flexi at hyderabad

ఆన్ లైన్ మీటింగ్ అంటే.. జాయిన్ అయ్యామా.. విన్నామా.. వెళ్లామా అన్నట్లుగానే ఉంటుంది. ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉండదు. అదే కరోనా రూల్స్ పాటిస్తూ మీటింగ్ పెడితే సమస్యలపై చర్చించ వచ్చనేది బీజేపీ నేతల వాదన. వర్చువల్ వల్ల ఉపయోగం ఉండదని అంటున్నారు. అయితే అధికారులు మాత్రం 150 మంది కార్పొరేటర్లు ఆన్ లైన్ లో పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు.

గ్రేటర్ ఎన్నికలకు ముందే అప్పటి స్టాండింగ్ కమిటీ రూ.5,600 కోట్ల బడ్జెట్ ను ఆమోదించింది. జనరల్ బాడీలోనూ ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. కరోనా కారణంగా అది వాయిదా పడుతూ వస్తోంది. ఈసారి పక్కాగా కౌన్సిల్ మీటింగ్ పెట్టి దాన్ని ఆమోదింపజేయాలని చూస్తున్నారు. అందుకే వర్చువల్ మీటింగ్ పెట్టారు. అయితే దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది.

నిజానికి హైదరాబాద్ సమస్యలపై చిట్టా ప్రిపేర్ చేశారు బీజేపీ నేతలు. కౌన్సిల్ మీటింగ్ లో ప్రశ్నల వర్షం కురిపించాలని ప్లాన్ చేసుకున్నారు. పక్కాగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఇప్పుడు వర్చువల్ మీటింగ్ అనేసరికి.. ఏం చేయలేని పరిస్థితి. అందుకే ఈ సమావేశం ప్రత్యక్షంగా జరపాలని డిమాండ్ చేస్తున్నారు. వర్చువల్ మీటింగే జరుగుతుందని మేయర్ విజయలక్ష్మి స్పష్టంచేశారు. డివిజన్లలో ఏవైనా సమస్యలుంటే.. తన దృష్టికి తీసుకురావాలని అన్ని పార్టీల కార్పొరేటర్లకు సూచిస్తున్నారామె

దళిత మంత్రం… ఉప ఎన్నిక వేళ కేసీఆర్ తంత్రం

హైదరాబాద్ : 28/06/2021

దళిత మంత్రం… ఉప ఎన్నిక వేళ కేసీఆర్ తంత్రం

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
దళిత మంత్రం… ఉప ఎన్నిక వేళ కేసీఆర్ తంత్రం

– మంత్రాలకు చింతకాయలు రాలుతాయా
– కేసీఆర్ మాటలు దళితులు నమ్ముతారా..!
– దళిత సీఎం .. హామీ గాయం మానిందా!
– ప్రత్యేక రాష్ట్రంలో దళితులు క్షేమమేనా..!
– మరియమ్మ, నేరెళ్ల వంటి ఉదంతాల సంగతేంటి..?
– విపక్షాలపై కేసీఆర్ దళితాస్త్రం

దళితుల పై కెసిఆర్ కు ప్రేమ నిజమేనా…కాదా…! ఇది తేల్చుకోవాల్సింది అక్షరాలా దళిత సోదరులే. ఉద్యమ సమయం నుంచి గద్దెనెక్కేదాకా సారు మాటలు, గాల్లో కట్టిన మూటలు.. శుష్కమైన హామీలు.. ఆఖరికి తెలంగాణ వచ్చాక జరుగుతున్న ఘటనలు అన్నీ బేరీజు వేసుకోవాల్సింది …సారు టక్కుటమారాల్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా దళితులదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దళితుల ఆర్ధిక స్వాలంబన కోసం తాను కట్టుబడి ఉన్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికైనా ఈ ఆలోచన చేసినందుకు ధన్యవాదాలు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి సలహాలను తీసుకున్నాడు .దీనితో అయన గొప్ప ప్రజాస్వామ్య వాది అనుకుంటే పొరపాటే .హుజురాబాద్ ఎన్నికల వేళ ఇలాంటి డ్రామాలు మాములే అనికూడా అంతా అనుకుంటున్నారు. ఆదివారం ప్రగతిభవన్ లో దళితుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం సుదీర్ఘంగా 11 గంటల పాటు సాగింది. కేసీఆర్ కి దళితుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో దీనినిబట్టి అర్ధం అవుతుందని ఎవరైనా అనుకుంటే పొరపాటే. కేసీఆర్ ను ఇక్కడే అర్ధం చేసుకోవాలి, లేదంటే అయన బుట్టలో పడతామని దళిత నేతలే అంటున్నారు..సమావేశానికి హాజరైన విపక్ష నాయకులు కేసీఆర్ ఆతిథ్యానికి మంత్ర ముగ్ధులయ్యారు. కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రతిపక్ష నాయకులు భజన చేయడం వారి రాజకీయ అవగాహనా లోపానికి అద్దం పడుతుందని కూడా వారు మండిపడుతున్నారు. కొత్తగా ప్రకటించిన పథకంపై అందరూ అహో ఓహో అని చంకలు గుద్దుకోవడం విపక్షాల దిగజారుడు తనానికి నిదర్శనం అని అంటున్నారు.

ఓటు బ్యాంకు పాలిటిక్స్ తప్ప కేసీఆర్ కు నిజాయితీ లేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ దళితుల ఓట్ల కోసం కొత్త పథకానికి శ్రీకారం చుట్టాడు. కాకపోతే ఈసారి అఖిలపక్ష సమావేశం పెట్టి ప్రకటించాడు అని అంటున్నారు. ఎందుకంటే ఇదంతా డ్రామా, కేసీఆర్ టక్కుటమార విద్య, గోకరణ గజకరణ విద్య అని విపక్షాలు విమర్శించకుండా ముందే వారికి చెక్ పెట్టాడు అని విమర్శిస్తున్నారు. కేసీఆర్ సమావేశానికి పిలిస్తే చాలు అన్నట్లు గా కేసీఆర్ ను పొగడ్తలలో ముంచెత్తే విపక్షాలు కూడా టీఆరెస్ లో చేరితే పోలా అని చురకలంటిస్తున్నారు. సమావేశానికి వెళ్లకపోతే ప్రతిపక్షాలకు దళితులు అభివృద్ధి చెందడం ఇష్టం లేదని దుమ్మెత్తి పోస్తారు అనే విమర్శకు భయపడితే వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండాల్సింది. అలా కాకుండా భజన చేయడానికి వెళ్లినట్లు ఉందనేది వారి వాదన. విపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటిదాకా దళితులకు జరిగిన అన్యాయాన్ని సమావేశంలో కేసీఆర్ కు గుర్తు చేయాలి. తాము ఎలాంటి ప్రతిపాదనలు పెట్టారో దానికి కేసీఆర్ ఏమన్నాడో కూడా మీడియా ముఖంగా చెప్పాలి. లేదంటే సీఎం కార్యాలయం విడుదలచేసిన ప్రెస్ నోట్ ద్వారా ప్రతిపక్షాలకు రాజకీయంగా నష్టం జరుగుతుంది అని దళిత సంఘాలు హితవు పలుకుతున్నాయి. సీఎం కార్యాలయం తమకు అనుకూలంగా ఉండే విషయాలనే మీడియాకు రిలీజ్ చేస్తుంది. వాటినే మేము పరిగణనలోకి తీసుకొని మాట్లాడతాము అని అంటున్నారు.

కొత్త పథకం ద్వారా ఒక్కొక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రైతుబంధు మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కూడా కేసీఆర్ మళ్ళీ పాత పాటే పాడాడు. సమైక్య రాష్ట్రంలో దళితులు గోసపోయారు.. తెలంగాణ వచ్చాకే వారి బతుకులలో వెలుగు నిండింది అన్నారు. ఇది ముమ్మాటికీ అబద్ధం. ఒక సామాన్య దళిత కుటుంబం లో జన్మించి నీతి నిజాయితీ గా ప్రజలకు సేవ చేస్తున్న దళిత బిడ్డ అయిన దామోదర్ సంజీవయ్యను నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ కు ఉంది. ఈ విషయాన్ని అఖిలపక్ష సమావేశానికి వెళ్లిన కాంగ్రెస్ ప్రతినిధి గట్టిగా ప్రస్తావించారా…? ప్రస్తావించకపోతే ఎందుకు ప్రస్తావించలేకపోయారో చెప్పాలని నిలదీస్తున్నారు.. ఉద్యమ సమయంలో దళితుడిని సీఎం చేసి తాను కాపలా కుక్కలా ఉంటాను అని కేసీఆర్ అన్నాడు. తెలంగాణ రాగానే ప్లేటు ఫిరాయించి తానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కి దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచారు. దళితులకు పాలన చేయడం సాధ్యం కాదు అనేలా వ్యవహరించారు. ఇది వాస్తవం కాదా! దీనిపై వామపక్షాలు కేసీఆర్ ను నిలదీయవచ్చు గా సమావేశంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. కేసీఆర్ అంటే భయమా లేక తాము చేసుకునే పైరవీలకు విఘాతం కలుగుతుందని భయమా అని దళిత నాయకులు అడుగుతున్నారు. ఉద్యమ నాయకుడిగా తెలంగాణను ఎలా బాగుచేసుకోవాలో తనకు తెలిసినట్లు గా ఎవరికీ తెలియదు అన్నట్లు మాట్లాడాడు. అది నిజమని అనుకుంటే దళితుడిని సీఎం చేసి తాను ప్రభుత్వ సలహామండలి అధ్యక్షుడిగా ఉంటూ సలహాలు సూచనలు చేస్తూ తెలంగాణను బంగారు తెలంగాణ గా చెయ్యవచ్చు గా అని అంటున్నారు. కానీ కేసీఆర్ కు అహంకారం అడ్డు వచ్చింది. ఆయనలోని అగ్రకులతత్వం బయటకు వచ్చింది. అందుకే తానే సీఎం కావాలని అనుకున్నాడు. మొక్కుబడిగా దళితుడిని డిప్యూటీ సీఎం చేసి చేతులు దులుపుకున్నాడు. అదికూడా మొదటి టర్మ్ మాత్రమే. రెండోసారి అధికారంలోకి వచ్చాక అదికూడా లేదు. దీనినిబట్టి కేసీఆర్ కు దళితుల మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అని అంటున్నారు.

కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను విపక్షాలు మరిచిపోయాయా..? దళితుడిని ముఖ్యమంత్రి
ని చేసే విషయం పక్కనపెడితే.. కనీసం మంత్రి వర్గంలో సముచిత స్థానం కూడా కల్పించలేదని విషయం గుర్తు లేదా..? అని దళిత సంఘాలు
అడుగుతున్నాయి. మొదటిసారి మంత్రివర్గంలో మాదిగ నేతకు ప్రాధాన్యత ఇచ్చి కేబినెట్ లో ఒకరికి అవకాశం ఇస్తే.. రెండోసారి మాల కులానికి చెందిన నేతకు అవకాశం ఇచ్చారు. అంటే ఇస్తే ఎవరో ఒకరికి తప్ప.. రెండింటికి చెందిన నాయకులకు ఇవ్వలేదు. దీన్ని బట్టే కేసీఆర్ వైఖరి ఏంటో అర్థం అవుతుందని అంటున్నాయి. పైగా విపక్ష నాయకులు ఇదంతా మర్చిపోయి.. కేసీఆర్ పెట్టిన భోజనం చేసి వచ్చారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అదే తన సామజిక వర్గానికి చెందినవారికి ముగ్గురికి అవకాశం ఇచ్చాడని గుర్తు చేస్తున్నారు.

ఎంపీగా ఓడిపోయిన వినోద్ కు కేబినెట్ హోదా కల్పించారని.. అలాంటి కేసీఆర్ కు దళితుల మీద ప్రేమ ఉందంటే ప్రతిపక్షాలు ఎలా నమ్మాయని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఒకే ఒక్కసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంకుబండ్ దగ్గరకు వచ్చి విగ్రహానికి దండ
వేశాడు. ఆ తరువాత ఎప్పుడూ అటువైపు చూడలేదు. 120 అడుగుల విగ్రహం పెడతానని చెప్పి ఐదేళ్లు అయింది. ఇంతవరకు అతీగతీ లేదు.
నిన్నకాక మొన్న ప్రకటించిన వీవీ విగ్రహాన్ని మాత్రం నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేశారు. తెలంగాణ బిడ్డ దేశాన్ని నడిపించిన మహానుభావుడు.. అనేక సంస్కరణలు తెచ్చి దేశాన్ని ఆర్ధిక పురోభివృద్ధికి కృషి చేసిన నాయకుడు.. ఆయన విగ్రహాన్ని పెట్టడాన్ని తాము కూడా స్వాగతిస్తామని అంటున్నారు దళితులు. కాకపోతే అంటేద్కర్ విగ్రహ ఏర్పాటుకే ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు.

కేసీఆర్ కు దళితుల మీద నిజంగా ప్రేమ ఉంటే.. తెలంగాణ భవన్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. దానికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది గాంధీ అయితే.. దళితులకు స్వేచ్ఛ తీసుకొచ్చింది అంబేద్కర్ అని.. అలాంటి మహోన్నత వ్యక్తి ఫోటోను తెలంగాణ భవన్ లో ఎందుకు పెట్టలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది చాలా చిన్న విషయం అని అనుకోవచ్చు.. కానీ.. తమకు మాత్రం పెద్ద విషయం అని అంటున్నారు దళితులు. దీన్నిబట్లే కేసీఆర్ ఆలోచనలు
ఎలా ఉన్నాయో అద్దం పడుతున్నాయని చెబుతున్నారు.

దళితులకు మూడు ఎకరాలు భూమి అన్నారు. ఏమైంది..? అదేమంటే భూమి దొరకడం లేదని చెబుతున్నారు. రేపు కొత్తగా ప్రవేశపెట్టిన
పథకానికి కూడా నిధులు లేవు అంటే ఏం చేయాలి..? నిజానికి ఇప్పుడు అసలు నిధులు ఉన్నాయా..? అనేది ప్రశ్న. అనేక సంక్షేమ పథకాలకు నిధుల కొరత వెంటాడుతోంది. అప్పులు చేసి వాటిని అమలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా దళితుల కోసం సంక్షేమ పథకాన్ని ప్రవేశ
పెట్టారు. దీనికి బాలారిష్టంలోనే నిధుల కొరత వెంటాడడం ఖాయమని భావిస్తున్నారు దళిత నేతలు. అగ్రవర్ణాల పిల్లలు, దళిత పిల్లలు ఒకేచోట చదవాలని.. కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి ఎన్నాళ్లవుతుంది. ఇంతవరకు కేసీఆర్ ఏం చేశారు. బీసీ, ఎస్సీ, మైనార్టీల వారీగా గురుకులాలు
పెట్టి చేతులు దులుపుకున్నారు. మరియమ్మ లాకప్ డెత్ పై స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పడం సమర్ధించాల్సిందే. ఇలాంటివి మళ్ళీ పునరావృతం అయితే బాధ్యులైన పొలీస్ అధికారులను సర్వీస్ నుండి తొలిగిస్తానని హెచ్చరించడం స్వాగతించ తగ్గ పరిణామమే.. కాకపోతే ఇలాంటిదే కేటీఆర్ నియోజకవర్గంలోని నేరెళ్లలో జరిగింది. కానీ.. నేటివరకు కేసీఆర్ స్పందించలేదు. విచారణకు ఆదేశించలేదు. ఆ కుటుంబాలను ఆదుకోలేదని గుర్తు చేస్తున్నారు దళితులు. దీనిపై ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఆనాడు ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టే స్పందించలేదా..? ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉందని స్పందించారా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు దళితులు.

పోలీసులు పెట్టిన చిత్రహింసలకు నేరెళ్ల దళిత యువకులు.. జీవిత కాలం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నెలకు వేల రూపాయల మందులు ఖర్చు చేస్తున్నారు. అలాంటి పోలీసు అధికారులను ఎందుకు రక్షిస్తున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలని అంటున్నారు.
ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో భాగంగా రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాలో పాల్గొన్న భారతిపై.. పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో ఆమె చనిపోయింది. ఆ సంఘటనపై కేసీఆర్ ఎందుకు విచారణకు ఆదేశించలేదని అడుగుతున్నారు. పైగా మాదిగల ఉద్యమాన్ని చీల్చి కేసీఆర్ ఆనంద పడ్డాడని అంటున్నారు ఎమ్మార్పీఎస్ నేతలు. దళిత ఉద్యమాలు బలంగా ఉండడం కేసీఆర్ కు ఇష్టం ఉండదని మండిపడుతున్నారు. మొత్తంగా ఆయన మాటలు కోటలు దాటతాయి ఆచరణలో మాత్రం గడప దాటదని సెటైర్లు వేస్తున్నారు. ఏ పథకానికైనా వేల కోట్లు కేటాయిస్తున్నట్లు
ప్రకటిస్తారు. కానీ ఖర్చు చేయడానికి నిధులు ఉండవు. కేసీఆర్ విశ్వసనీయత రోజురోజుకీ మసకబారుతుందని.. కాకపోతే తన వ్యూహాలతో ప్రతిపక్షాలను ప్రజలను బోల్తా కొట్టిస్తూ కాలం గడుపుతున్నాడని విమర్శిస్తున్నారు. ఇది కూడా ఎక్కువ రోజులు నడవదని… దళితులు ఓట్లు వేసే యంత్రాలుగా మారొద్దని సూచిస్తున్నారు ఎమ్మార్పీఎస్ నేతలు.

పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్ : 28/06/2021

పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్‌

పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్‌

నిర్మల్‌ : దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో పురోగతి బాట పట్టించిన దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు అసలైన గౌరవమిచ్చింది సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమ‌వారం పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారత దేశం రూపొందడానికి బాటలు నిర్మించిన అసాధారణ నేత, బహుముఖ ప్రజ్ఞాశాలిగా మ‌న పీవీ కీర్తిని పొందారని ఆయ‌న చేసిన సేవ‌ల‌ను కొనియాడారు.


పీవీ శతజయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌..పీవీ సేవలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం తరఫున ఏడాది పొడ‌వునా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. పీవీ నరసింహారావు ఈ దేశం కోసం ఎంతో చేసినా, ఆయన్ను కాంగ్రెస్ పార్టీ మరచిపోయిందని తెలిపారు. కానీ పీవీ నరసింహారావు కూతురు వాణిదేవికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపించుకున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పీవీతో తనకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. 1991నుంచి పీవీతో ప‌రిచ‌యం ఉంద‌ని, ఎంపీగా ఉన్న స‌మ‌యంలో తాను టీడీపీకి రాజీనామ చేసి మైనార్టీలో ఉన్న పీవీ ప్రభుత్వానికి మద్దతునిచ్చాన‌న్నారు. పీవీ ఆశ‌యాలు, అలోచ‌న‌ల‌కు అనుగుణంగా యువ‌త న‌డుచుకోవాల‌ని మంత్రి పిలుపునిచ్చారు.

Sunday, June 27, 2021

రేవంత్ రెడ్డి ముందున్న ముళ్లు.. స‌వాళ్లు ఇవే!

హైదరాబాద్ : 27/06/2021

రేవంత్ రెడ్డి ముందున్న ముళ్లు.. స‌వాళ్లు ఇవే!

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
రేవంత్ రెడ్డి ముందున్న ముళ్లు.. స‌వాళ్లు ఇవే!

ల్లు అల‌కగానే పండ‌గ కాదు.. ఇప్పుడు రేవంత్ రెడ్డిదీ ఇదే ప‌రిస్థితి. కొత్త అధ్య‌క్షుడిగా ముందుకు సాగే బాట‌లో ప్ర‌స్తుతం ఆయ‌న ఎదుట అనేక ముళ్లు, స‌వాళ్లు ఉన్నాయి. ఒక ర‌కంగా ఇకపై తెలంగాణ‌లో కాంగ్రెస్ కు ఇప్పుడు రేవంత్ చీఫ్ కాక‌ముందు.. అయిన త‌ర్వాత అన్న ప‌రిస్థితులు రాబోతున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ముందున్న మొద‌టి అతి పెద్ద స‌వాల్… అసంతృప్తుల‌ను చ‌ల్లార్చ‌డం.

రేవంత్ రెడ్డిని పార్టీ చీఫ్‌గా ప్రక‌టించ‌గానే.. ఓ వ‌ర్గంలో ఇప్పటికే అగ్గిరాజుకుంది. అలా ఎలా ఇస్తారంటూ బాహ‌టంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఆయ‌న అప్ప‌ర్ హ్యాండ్‌ను ఇష్ట‌ప‌డ‌ని కొంద‌రు పార్టీ వీడే ఆలోచ‌న‌లో కూడా ఉన్నారు. ఇప్పుడు వారంద‌రినీ మేనేజ్ చేయ‌డం రేవంత్ రెడ్డికి అతి పెద్ద‌, ముఖ్య‌మైన టాస్క్‌గా మార‌నుంది. ముఖ్యంగా బ‌య‌టివాళ్ల‌కు పీసీసీ ఇస్తే ఊరుకోబోమ‌న్న‌ వీహెచ్.. పీసీసీ ప‌ద‌వి కోసం చివరి వ‌ర‌కూ పోటీప‌డిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతే బీజేపీలోకే అంటూ చెప్పిన రాజ‌గోపాల్ రెడ్డి, పార్టీలో ఉండాలా వ‌ద్దా అని ఎప్ప‌టిక‌ప్పుడు లెక్క‌లు వేసుకునే జ‌గ్గారెడ్డి వంటి నేత‌లతో పాటు త‌న నాయ‌క‌త్వాన్ని విబేధించే మిగిలిన వారితో రేవంత్ రెడ్డి ఎలా స‌ఖ్య‌త సాధిస్తారు?వారిని క‌లుపుకొని ముందుకు ఎలా సాగుతారన్న‌ది ఇప్పుడు అత్యంత ఆస‌క్తిక‌రంగా మారింది.

రేవంత్ రెడ్డి ముందున్న మ‌రో స‌వాల్.. కోవ‌ర్టులు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత కాంగ్రెస్ పాలిట అతి పెద్ద స‌మ‌స్య‌గా మారిందిది. కాంగ్రెస్ వ్యూహాల‌న్ని కూడా ఇప్ప‌టిదాకా ముందుగానే కేసీఆర్‌కు తెలిసిపోయేవి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అయితే కాంగ్రెస్ త‌మ మేనిఫెస్టోని ప్ర‌క‌టించ‌క‌ముందే.. అది టీఆర్ఎస్ భ‌వ‌న్‌లో క‌నిపించింద‌న్న మాట‌లు వినిపించాయి. కాంగ్రెస్‌లో కీల‌క ప‌ద‌వుల్లో కొన‌సాగే నేత‌లు.. అధికార‌పార్టీ ప‌ట్ల అన‌ధికార‌ విధేయ‌త చూపిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు, అభిప్రాయాలు సొంత పార్టీలోనే ఇప్ప‌టికీ ఉన్నాయి. అలాాంటి వారికి రేవంత్ రెడ్డి ఎలా చెక్‌పెడ‌తార‌న్న‌ది కూడా ఇంట్రెస్టింగ్ థింగ్. ఇదే సమయంలో ఈ విష‌యంలో రేవంత్ రెడ్డికి ఊర‌టనిచ్చే సంగ‌తి ఒక‌టుంది. మొన్న‌టివ‌ర‌కు కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌నే ఏకంగా.. కేసీఆర్‌కు అనుకూలంగా న‌డుచుకుంటున్నార‌న్న విమ‌ర్శ వినిపించేది..కానీ రేవంత్ రెడ్డి విష‌యంలో అలా అనుకునే ఆస్కారం చాలా త‌క్కువ‌. ఆది నుంచి టీఆర్ఎస్‌తో రేవంత్ రెడ్డికి పార్టీప‌రంగా, వ్య‌క్తిగ‌తంగా చాలా వైరం ఉంది. కానీ పోరాడేందుకే స‌రైన వేదిక‌, బ‌లం దొర‌క‌లేదు. ఇప్ప‌డు ఆ రెండూ ఆయ‌న చేతిలో న్నాయి. ఇక‌పై ప్ర‌భుత్వంపై ఆయ‌న‌ సాగించే పోరాటంలో పార్టీ శ్రేణులు, సాధార‌ణ ఓట‌ర్లు కూడా ద్వంద్వ‌ర్థాల‌ను వెతికే అవ‌కాశాలు కూడా త‌క్కువే. ఇది ఆయ‌న‌కు చాలా బ‌లంగా మారనుంది.

ఇక రేవంత్ రెడ్డి ముందున్న మరో అతి పెద్ద‌ స‌వాల్ ఆధిపత్య పోరు లేదా వర్గపోరు. మొద‌టి నుంచి కాంగ్రెస పాలిట శ‌నిలా దాపురించింది ఈ స‌మ‌స్య‌. కాంగ్రెస్‌లో ఎవ‌రిని అధ్య‌క్షుడిగా చేసినా.. ఆ పార్టీలో ఆయ‌నకు వ్య‌తిరేకంగా మ‌రో వ‌ర్గం ఏర్ప‌డేది. ఇప్ప‌టికీ ఆ పార్టీలో రెండు, మూడు వ‌ర్గాలు క‌నిపిస్తాయి. పాత నాయ‌కులు, కొత్త నాయ‌కులు అనో లేక‌.. రెడ్డి, బీసీ అంటూ మ‌రో వ‌ర్గ‌మో క‌నిపించేది. ఇక ఎన్నిక‌లు వ‌స్తే చాలు.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి విష‌యంలో గ్రూపులుగా విడిపోయే అల‌వాటు ఆ పార్టీలో క‌నిపిస్తుంది. ఇలాంటి బ‌హునాయ‌క‌త్వ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల్సిన అవ‌స‌రం కూడా చాలా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి ఇంటా, బయటా అనేక చాలెంజ్‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంది. మ‌రి వాటికి ఎలా చెక్‌పెడతారో చూడాలి.

Saturday, June 26, 2021

మరియమ్మ, ఆమె కుమారుడిపై పోలీసుల థర్డ్‌ డిగ్రీ?

హైదరాబాద్ : 27/06/2021

మరియమ్మ, ఆమె కుమారుడిపై పోలీసుల థర్డ్‌ డిగ్రీ?

సాక్షి మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 

దొంగతనం కేసులో అరెస్టయిన దళిత మహిళ.. లాకప్‌డెత్‌ కావడం ఇప్పుడు పెద్ద దుమారం లేపుతోంది.  కేసు హైకోర్టు దాకా వెళ్లడం.. సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీస్‌శాఖ మెడకు చుట్టుకుంటోంది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల వరుస ఆందోళనలతో ఉన్నతాధికారులు ఒక్కొక్కరిని బాధ్యులను చేస్తూ సస్పెన్షన్‌ వేటు వేస్తున్నారు. మరియమ్మ, అతని కుమారుడిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారా.. చనిపోయేంత వరకు దెబ్బలు కొట్టారా.. చనిపోయిన రోజు అసలు ఏం జరిగింది.. ఇందులో పోలీసుల పాత్ర.. దీనిపై లోతుగా పరిశీలిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

సాక్షి, యాదాద్రి(నల్లగొండ): అడ్డగూడూరు మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్‌ బాలశౌరి ఇంట్లో ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లకుంటకు చెందిన మరియమ్మ వంట మనిషిగా పనిచేస్తోంది. ఈ నెల 3న మరియమ్మ దగ్గరికి తన కుమారుడు ఉదయ్‌కిరణ్, అతని స్నేహితుడు శంకర్‌ వచ్చారు. 5వ తేదీ పాస్టర్‌ పనిమీద హైదరాబాద్‌కు వెళ్లాడు. 6వ తేదీన తిరిగి వచ్చాడు. తన ఇంట్లో రూ.2 లక్షల దొంగతనం జరిగిందని 16న అతను అడ్డగూడూరు పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. అయితే అంతకుముందు రోజే మరియమ్మ కుమారుడితో కలిసి స్వగ్రామమైన కోమట్లకుంటకు వెళ్లిపోయింది. పోలీసులు పాస్టర్‌కు చెందిన కారులోనే 17న కోమట్లకుంటకు వెళ్లి మరియమ్మ, ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్, అతని స్నేహితుడు శంకర్‌ను 18న ఉదయం 8 గంటలలోపు అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరిపారు. అయితే డబ్బు పోయిన రోజుకు, పోలీస్‌ కేసు నమోదైన రోజుకు మధ్యలో పది రోజుల గడువు ఉంది. ఈ సమయంలో పాస్టర్, మరియమ్మల మధ్య డబ్బు విషయంలో ఏం జరిగిందో బయటికి పొక్కనీయడం లేదు. 

మీకేం పని ఇళ్లకు వెళ్లండి..
మరియమ్మ, ఆమె కుమారుడు, మరో యువకుడిని అడ్డగూడూరుకు తీసుకువచ్చే సమయంలోనే తీవ్రంగా కొట్టారని సమాచారం. దొంగతనం సొమ్మును రికవరీ చేసే క్రమంలో ఇంటరాగేషన్‌ పేరుతో మరోమారు స్టేషన్‌లో థర్ఢ్‌ డిగ్రీ ప్రయోగించారని తెలుస్తోంది. ఇంటరాగేషన్‌ కోసం ప్రత్యేకంగా ఉంచిన రబ్బర్‌టైర్‌ బెల్ట్‌తో ‘పోలీస్‌’శైలిలో కొట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తమను కొట్టవద్దని మరియమ్మ వేడుకున్నట్లు తెలుస్తోంది. కుమారుడిని నడుంకింది భాగంలో కొడుతుండగా అడ్డుకోబోయిన ఆమెను పోలీసులు పక్కకు నెట్టేశారు. మహిళా పోలీస్‌లు లేకుండానే కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. మరియమ్మ దెబ్బలకు తాళలేక పెద్దగా ఏడుస్తూ అరుస్తుండడంతో పోలీస్‌స్టేషన్‌ చుట్టుపక్కల ఇళ్లలోని మహిళలు ‘ఏమైంది.. మహిళను ఎందుకు కొడుతున్నారు’ అని ప్రశ్నించగా ‘మీకేం పని ఇళ్లలోకి వెళ్లండ’ని పోలీస్‌లు వారిని బెదిరించినట్లు సమాచారం. అప్పటికే ఆమె కుప్పకూలిపోయిందని, కిందపడిపోయిన మరియమ్మను ఇద్దరు కానిస్టేబుళ్లు చేతులకింద బెల్ట్‌ పెట్టి పోలీస్‌ స్టేషన్‌లోకి బలవంతంగా ఎత్తుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు.

స్పందించిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం
మరియమ్మ లాకప్‌డెత్‌పై ప్రజా సంఘాలు, ప్రతిపక్షపార్టీలు ఆందోళనకు దిగాయి. హైకోర్టు సైతం ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆలేరు కోర్టును ఆదేశించింది. అదేవిధంగా రీపోస్ట్‌మార్టం చేయించాలని, బాధ్యులైన పోలీ సులపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు సీఎం కేసీఆర్‌ లాకప్‌డెత్‌పై విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

అడుగడుగునా పోలీసులపై ఆరోపణలు
► స్పృహ కోల్పోయిన మరియమ్మను పోలీసులు 18వ తేదీ ఉదయం 9.30 గంటలకు స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు.
► నాడి పరిశీలించిన వైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని, పల్స్‌ దొరకడం లేదని చెప్పడంతో హుటాహుటిన భువనగిరి జిల్లా కేంద్రాస్పత్రికి 11 గంటలకు తరలించారు.
► అక్కడ పరిశీలించిన వైద్యులు చనిపోయినట్లు చెప్పారు. మృతదేహం మార్చురీలో ఉండగానే పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. 
► కొందరు నాయకుల సహకారంతో కేసును తారుమారు చేసే ప్రయత్నాలు జరిగాయి.
► 11 గంటలకు తీసుకువచ్చిన మృతదేహానికి  పోస్ట్‌మార్టం చేయకుండా జా ప్యం చేయడం వెనక పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 
► జిల్లాలోని ఓ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికా రి ఆస్పత్రి వద్దకు వచ్చి బాధితులు, మరికొంత మందితో చర్చించారని సమాచారం.  
► అదేరోజు రాత్రి కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ నాయకులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగడం, 19వ తేదీ మరుసటి రోజు వివిధ ప్రజా సంఘాలు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. 
► వైద్యులు మరియమ్మ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్ట్‌మార్టం జాప్యం వెనుక పోలీసుల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. 
► మరియమ్మ పోస్ట్‌మార్టం నివేదిక ఇంకా రాలేదని భువనగిరి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌  రవిప్రకాష్‌ ‘సాక్షి’తో చెప్పారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు  మరియమ్మ అవవయాల ను పంపించామన్నారు. మరో వైపు  హైకో ర్టు ఆదేశాల మేరకు రీపోస్ట్‌మార్టం చేయాల్సి ఉంది. 

పాస్టర్‌నే వాహనం అడిగిన పోలీసులు
మరియమ్మను తీసుకువచ్చేందుకు కారు కావాలని పోలీసులు..సదరు పాస్టర్‌ను అడగగా తన సొంతకారును అప్పచెప్పినట్లు తెలిసింది. అయితే కొంచెం పెద్ద వాహనం కావాలని, ఈ కారు చిన్నగా ఉండడంతో సరిపోదని తిరిగి ఇచ్చేశారు. దీంతో సదరు పాస్టర్‌ బొలెరోను సమకూర్చినట్లు సమాచారం. ఆ వాహనంలోనే పోలీసులు కోమట్లకుంటకు వెళ్లి నిందితులను తీసుకువచ్చారు. 

పోలీసులపై చర్యలు ప్రారంభం
దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్‌ కేసులో పోలీసులపై చర్యలు ప్రారంభం అయ్యాయి.  చౌటుప్పల్‌ ఏసీపీ సత్తయ్యను కమిషనరేట్‌కు అటాచ్‌ చేస్తూ సీపీ మహేశ్‌ భగవత్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే అడ్డగూడురు ఎస్‌ఐ మహేష్, కానిస్టేబుళ్లు జానయ్య, రైటర్‌ రషీద్‌లను ఈనెల 19న భువనగిరి డీసీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. ఆ తరువాత సస్పెండ్‌ చేశారు. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆలేరు జడ్జితోపాటు పోలీస్‌శాఖ పరంగా మరికొంత మంది పోలీస్‌ అధికారులపై విచారణ ప్రారంభించారు.  

తెలకపల్లి రవి : రేవంత్‌ రెడ్డికి పిసిసి పీఠం, ఇంటా బయిటా సవాళ్లు

హైదరాబాద్ : 27/06/2021

తెలకపల్లి రవి : రేవంత్‌ రెడ్డికి పిసిసి పీఠం, ఇంటా బయిటా సవాళ్లు

tv మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 

తెలంగాణ పిసిసి అద్యక్షుడుగా రేవంత్‌ రెడ్డి నియామకం కాంగ్రెస్‌లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ ముఖ్య పరిణామం అవుతుంది. ఎడతెగని వివాదాలను అంతర్గత విభేదాలను పక్కనపెట్టి అధిష్టానం రేవంత్‌ను ఎంపిక చేయడంలో ఆయనపై విశ్వాసంతో పాటు ఆ పార్టీ పరిస్తితి కూడా అర్థమవుతుంది. ఎప్పటినుంచో వున్న పిసిపి పీఠం ఆశిస్తున్న హేమాహేమీలను కాదని, గత ఎన్నికల ముందు టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌నే ఎంచుకున్నారంటే కెసిఆర్‌ ప్రభుత్వాన్ని ఢీకొనగల సత్తా ఆయనకే వుందని నాయకత్వం భావించిందన్న మాట. బండిసంజయ్‌ అద్యక్షుడైనా దుబ్బాక జిహెచ్‌ఎంసి ఫలితాలతో దూకుడుగా వున్న బిజెపి ముందు కాంగ్రెస్‌ నిలవలేకపోతున్నదనే భావన పెరుగుతున్న నేపథ్యం కూడా వారి సోనియా గాంధీ రాహుల్‌గాంధీల దృష్టిలో వుండొచ్చు. సామాజిక కోణంలో రెడ్డివర్గానికి చెందిన వారినే నియమించాలంటే ఎందరో పోటీ పడుతున్నారు. కాని ఆర్థిక వనరుల సమీకరణ, సమస్యలపై చొరవతో రంగంలోకి దిగడం ప్రభుత్వాన్ని తీవ్రభాషలో ఢీకొనడం ఇవన్నీఆయనకు అదనపు అర్హతలై వుండాలి. ఆయనతో పాటు అయిదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లనూ పలువురు ఉపాద్యక్షులు కమిటీల బాధ్యులను నియమించారు గనక వారందరినీ కలుపుకొని పావలసినభాధ్యత భారం ఆయనపై వుంటాయి.

టికాంగ్రెస్‌లో యువ నాయకులు క్రియాశీల ప్రతినిధులు అనేకమంది రేవంత్‌నే కోరుతున్నా అధిష్టానం సమయం తీసుకుంది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా చేసి చాలా కాలం గడిచినా ఒక దశలో జీవన్‌రెడ్డిని నియమించినట్టే వార్తలు వచ్చినా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక పేరిట నిలిపివేసి ఈ నిర్నయం ప్రకటించింది.ఇప్పటికైనా కాంగ్రెస్‌ నాయకులంతా పూర్తిగా ఆమోదిస్తారని కాదు గాని ఒకసారి ప్రకటన వెలువడ్డాక వారికి వేరే గత్యంతరం వుండదు. ఏడేళ్ల తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్‌ కాంగ్రెస్‌ నాయకులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి కారణంకూడా రేవంత్‌ రానుండడమేనని ఒక భావన బలంగావుంది. ఓటుకు నోటు కేసుతో సహా చాలా విషయాల్లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చాలా అంశాల్లోరేవంత్‌పై కేంద్రీకరించడం గత ఎన్నికల ముందు ఐటి దాడులు,ఆయన కూడా అదే స్థాయిలో కెటిఆర్‌ భూముల వంటి అంశాలపై కేసులు వేయడం ఘర్షణను పెంచింది. ఇప్పుడు కూడా ఇవన్నీ కొనసాగుతున్నాయి.

టిడిపిలో వుండగా చంద్రబాబుకు బాగా సన్నిహితుడైన రేవంత్‌ కాంగ్రెస్‌లోకి వచ్చాక కూడా ఆ పాత శక్తుల అండదండలు కాపాడుకుంటున్నారు. మీడియాలోనూ ఒక భాగం ఆయనకు బాగా మద్దతునిస్తుంది. మరోవైపున పార్టీ సీనియర్ల సహకారం పైన చెప్పిన కేసుల ప్రభావం దేశవ్యాపితంగా కాంగ్రెస్‌ బలహీనపడుతున్న స్తితి ఇవన్నీ ఆయన ముందున్న సవాళ్లు అవుతాయి. ఎక్కువ మందిని కలుపునిపోవడం, సంయమనంతో అడుగులేయడంపై ఆయన భవిష్యత్‌ గమనం ఆధారపడివుంటుంది. టిడిపిలో దక్కని అద్యక్ష పదవి కాంగ్రెస్‌లో దక్కించుకున్న రేవంత్‌ మారిన దేశ రాష్ట్ర రాజకీయ పరిస్తితిలో ఎలా నెట్టుకువస్తారో చూడాల్సిందే.

Friday, June 25, 2021

రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే..... మ్యుటేషన్!

హైదరాబాద్ : 26/06/2021

*రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే..... మ్యుటేషన్!*

*మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి మ్యుటేషన్‌ బాధ్యతలు రిజిస్ట్రేషన్ల శాఖకు బదిలీ*

*ప్రస్తుతానికి ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న భవనాలకు మాత్రమే.. ​*

*వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పైలట్‌ పద్ధతిలో నిర్వహిస్తున్న సబ్‌-రిజిస్ట్రార్లు*

*జీహెచ్‌ఎంసీ, మున్సిపల్, పంచాయతీరాజ్‌ శాఖలతో రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌ అనుసంధానం*

*త్వరలోనే ఖాళీ స్థలాలు, కొత్త భవనాల మ్యుటేషన్ల బదిలీ యోచన*

హైదరాబాద్‌: వ్యవసాయేతర ఆస్తుల మ్యుటేషన్‌ ప్రక్రియను సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గతంలో స్థానిక సంస్థలకు (మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు) ఉన్న మ్యుటేషన్‌ బాధ్యతలను రిజిస్ట్రేషన్ల శాఖకు బదలాయించింది.వారం రోజులుగా రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ మ్యుటేషన్‌ ప్రక్రియను పైలట్‌ పద్ధతిన నిర్వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి పాత భవనాల మ్యుటేషన్‌ను మాత్రమే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చేస్తుండగా.. ఖాళీ స్థలాలు, కొత్త భవనాల మ్యుటేషన్‌ను ఇంకా స్థానిక సంస్థల పరిధిలోనే ఉంచారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే మ్యుటేషన్‌ ప్రక్రియ కోసం జీహెచ్‌ఎంసీ, మున్సిపల్, పంచాయతీరాజ్‌ శాఖల సర్వర్లతో రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌ను అనుసంధానం చేశారు.
అయితే, జీహెచ్‌ఎంసీ, గ్రామాల్లోని భవనాలకు సంబంధించిన డేటా రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న కార్డ్‌ డేటాతో సరిపోలుతోందని, ఈ రెండుచోట్ల ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన భవనాల మ్యుటేషన్‌కు ఎలాంటి ఇబ్బంది తలెత్తడం లేదని తెలుస్తోంది. కానీ, మున్సిపల్‌ శాఖ డాటాతో రిజిస్ట్రేషన్ల శాఖ డేటా సరిపోలడం లేదని, దీంతో కొత్త మున్సిపాలిటీల్లోని భవనాల మ్యుటేషన్‌కు ఇబ్బందులు వస్తోందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల సమాచారం. దీన్ని కూడా అధిగమించేందుకు మున్సిపల్, రిజిస్ట్రేషన్‌ వర్గాలు ప్రయత్నిస్తున్నాయని, ఈ సమస్య కూడా తీరితే సాధ్యాసాధ్యాలను బట్టి ఖాళీ స్థలాలు, కొత్త భవనాల మ్యుటేషన్‌ బాధ్యతలు కూడా రిజిస్ట్రేషన్ల శాఖకు అప్పగించే అంశాన్ని
*మ్యుటేషన్‌ అంటే..*

ఆస్తి బదలాయింపు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ద్వారా జరిగితే ఆ ఆస్తిని సంక్రమణదారుడి పేరిట నమోదు చేయడమే మ్యుటేషన్‌ ప్రక్రియ. గతంలో ఏదైనా భూమి లేదా ఆస్తిపై క్రయ, విక్రయ లావాదేవీ జరిగితే ఆ లావాదేవీని సబ్‌రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్‌ చేసేవారు. ఆ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ ఆధారంగా మ్యుటేషన్‌ కోసం పట్టణాల్లో అయితే మున్సిపాలిటీలు, గ్రామాల్లో అయితే పంచాయతీలకు వెళ్లేవారు. మ్యుటేషన్‌ కోసం మళ్లీ మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకునేవారు. మీ సేవా కేంద్రం నుంచి దరఖాస్తు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల అధికారులు పాత యజమాని, కొత్త యజమానికి సదరు ఆస్తి లేదా భూమిపై ఉన్న హక్కులు, భూమి/భవనం విస్తీర్ణం ఎంత ఉంది? ఎంత పన్ను చెల్లించాలి? చెల్లించారా లేదా, నిబంధనల ప్రకారం ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్‌ లావాదేవీలో ఉన్న సంక్రమణదారుడి పేరిట బదిలీ (మ్యుటేషన్‌) చేసేవారు.
అయితే, ఈ మ్యుటేషన్‌ కోసం ఫీజును మాత్రం రిజిస్ట్రేషన్‌ సమయంలోనే చెల్లించేవారు. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా మ్యుటేషన్‌ ఫీజు స్థానిక సంస్థలకు వెళ్లేది. మ్యుటేషన్‌ ఫీజు రిజిస్ట్రేషన్‌ సమయంలోనే చెల్లిస్తున్నారు కనుక మళ్లీ ప్రత్యేకంగా స్థానిక సంస్థలకు దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే మ్యుటేషన్‌ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్‌ లావాదేవీ పూర్తయిన తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (పీటీఐఎన్‌)ను నమోదు చేసి, సదరు భవనానికి సంబంధించిన వివరాలు, అన్ని రకాల అనుమతులు ఉన్నాయా.. లేదా.. ఉల్లంఘనలున్నాయా.. అనే అంశాలను పరిశీలించి మ్యుటేషన్‌ ప్రక్రియను నిర్వహిస్తున్నామని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి.పరిశీలిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

*సుజీవన్ వావిలాల  ప్రజల పక్షం*🖋️

GISP Portal: విదేశాలకు వెళ్లే భారత విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. వివరాలివే

హైదరాబాద్ : 26/06/2021

GISP Portal: విదేశాలకు వెళ్లే భారత విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. వివరాలివే..

విదేశాల్లో విద్యనభ్యసించాలనుకుంటున్న విద్యార్థుల సౌకర్యార్థం కేంద్రం ఓ పోర్టల్ ను తీసుకురానుంది. వివరాలు ఇలా ఉన్నాయి.



విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఎక్కువగా స్కాలర్‌షిప్‌లు, మెడికల్ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఆ దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరాతీస్తారు. ఈ వివరాలకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని జీఐఎస్‌పీ పోర్టల్‌లో పొందుపరచనున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌ల వివరాలను GISP అందిస్తుంది. దీంతో పాటు ఎడ్యుకేషన్ లోన్లు అందించే బ్యాంకులు, ఆర్థిక సంస్థల వెబ్‌ లింకులను సైతం అందిస్తుంది.

విదేశాల్లో పరిస్థితుల సమాచారం కూడా..
విద్యార్థులు వెళ్లాలనుకునే వివిధ దేశాల రాజకీయ, ఆర్ధిక పరిస్థితులను.. ఆ దేశంలో ఇప్పటికే చదువుతున్న భారత విద్యార్థుల సంఖ్య వంటి వివరాలను GISP పోర్టల్ అందిస్తుంది. ఆయా దేశాల్లో విద్యార్థులు ఉండాలనుకుంటున్న ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి, భాషా సమస్యతో పాటు సామాజిక, రాజకీయ, జీవన పరిస్థితులు.. అక్కడి ఆహారపు అలవాట్లు.. వంటి పూర్తి వివరాలను ఈ ప్లాట్‌ఫాం ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. వివిధ దేశాల గురించి విద్యార్థులు తరచుగా అడిగే ప్రశ్నలు, వాటికి సంబంధించిన సమాధానాలు కూడా పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి.

విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే భారత విద్యార్థులకు అన్ని విధాలుగా సేవలందించే ఉమ్మడి ప్లాట్‌ఫాంగా జీఐఎస్‌పీ పోర్టల్‌ను తీర్చిదిద్దుతున్నట్లు ప్రభుత్వం బిడ్ డాక్యుమెంట్‌లో పేర్కొంది. ఈ పోర్టల్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని ఎన్‌ఐసి ప్లాట్‌ఫామ్‌ హోస్ట్ చేస్తుంది. ఈ వెబ్‌సైట్ భద్రత ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

GISP ఎవరికి అవసరం?
ప్రస్తుతం దాదాపు 11 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నట్లు అంచనా. ఈ క్రమంలో ఎంతోమంది విద్యార్థులు విదేశీ విద్యాసంస్థల గురించి సరైన సమాచారం తెలుసుకోకుండా, నకిలీ యూనివర్సిటీలలో నమోదు చేసుకొని మోసపోయారు. ఇలాంటి విద్యా సంస్థలు అక్కడి ప్రభుత్వాల అనుమతి తీసుకోకుండా పనిచేస్తుంటాయి. దీంతో యాజమాన్యాలపై సంబంధిత దేశంలోని అధికారులు చర్యలు తీసుకుంటే.. మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవి.

విదేశాల్లో ఉండే ఇలాంటి నకిలీ యూనివర్సిటీలు, విద్యా సంస్థల గురించి భారత ఎంబసీలు ఎప్పటికప్పుడు విద్యార్థులను హెచ్చరిస్తూ.. సలహాలు, సూచనలు జారీ చేస్తాయి. ఇతర దేశాల్లో పనిచేసే కొన్ని భారతీయ సంస్థలు సైతం విద్యార్థులకు సేవలందిస్తాయి. వారి వెబ్‌సైట్‌లో అసలైన విద్యాసంస్థల వివరాలను పొందుపరుస్తున్నాయి. మన అధికారులు అక్కడి విశ్వవిద్యాలయాలు, కళాశాలలను కూడా సందర్శిస్తూ.. భారతీయ విద్యార్థుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి అన్ని రకాల సేవలను GISP పోర్టల్‌లో కేంద్రీకృతం చేయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం పనిచేస్తోంది. అన్ని దేశాల్లోని విద్యా సంస్థల సమాచారం ఈ ప్లాట్‌ఫాం ద్వారా లభిస్తుంది.

GISP ఏర్పాటుకు ముందు విదేశాంగ శాఖ అధికారులు.. కేంద్ర విద్యా శాఖ, కేంద్ర ఆరోగ్య శాఖ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌.. వంటి సంస్థలను సంప్రదించింది. విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల డేటాబేస్‌ను రూపొందించడానికి 2015లో "స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్"ను విదేశాంగ శాఖ అభివృద్ధి చేసింది. ఇందులో భారత విద్యార్థులు విదేశాల్లో చదువుతున్న కోర్సులు, విద్యా సంస్థ, విదేశాల్లో వారు ఉంటున్న ప్రాంతం చిరునామా, కోర్సు వ్యవధి.. వంటి విషయాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు నకిలీ యూనివర్సిటీలు, ఫేక్ ఏజెంట్లు, విద్యార్థుల భద్రతకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు పోర్టల్‌ను సైతం రూపొందించారు. అయితే ఈ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో జీఐఎస్‌పీ పోర్టల్‌ను భారత ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

Thursday, June 24, 2021

రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు ఇప్పటివరకు సుమారు 96 లక్షల టీకాలు ఇవ్వడం జరిగింది :సోమేశ్ కుమార్ CS

హైదరాబాద్ : 25/06/2021



రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు ఇప్పటివరకు సుమారు 96 లక్షల టీకాలు ఇవ్వడం జరిగిందని, రాబోయే రెండు రోజుల్లో కోటి టీకాల మార్కును దాటనున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు 25 లక్షల మంది హై రిస్క్ గ్రూపులకు చెందిన వారికి టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. https://t.co/NQqn0NnD17 
గురువారం సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో ఏర్పాటు చేసిన 'పనిప్రదేశపు వ్యాక్సినేషన్ సెంటర్'ను సీఎస్ పరిశీలించారు. వీధి వ్యాపారులతో మాట్లాడి టీకాలు తీసుకోవల్సిందిగా ఉత్తేజపరిచారు. తమ పని ప్రదేశంలోనే టీకాలు వేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవను వీధి వ్యాపారులు అభినందించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 100 కేంద్రాలలో 30 సంచార బృందాలతో టీకాలు వేస్తున్నట్లు సీఎస్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 'మాప్ అప్ డ్రైవ్' జరుగుతోందని, ప్రత్యేక డ్రైవ్ లో టీకా తీసుకోని వారందరూ దీనిలో తీసుకోవచ్చని అన్నారు. ఆరోగ్యశాఖ సిబ్బంది సేవలను ఈ సందర్భంగా సీఎస్ అభినందించారు.
ఈ పర్యటనలో వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తదితర అధికారులు పాల్గొన్నారు. #COVID19Vaccination



SBI కస్టమర్లకు గుడ్‏న్యూస్..

హైదరాబాద్ : 25/06/2021

SBI కస్టమర్లకు గుడ్‏న్యూస్.. అందుబాటులోకి కొత్త క్రెడిట్ కార్డ్స్.. అదిరిపోయే బెనిఫిట్స్.. వీరికి అనుగుణంగా..

Tv9 మీడియా (ట్విట్టర్) సౌజన్యంతో 
    

SBI-FabIndia Co Branded Credit Cards: మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉందా ? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.



SBI-FabIndia Co Branded Credit Cards: మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉందా ? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. దేశీయ దిగ్గజ ప్రభుత్వం రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. కొత్త క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని క్రెడిట్ కార్డు కంపెనీల్లో ఒక్కటైన ఎస్బీఐ.. లైఫ్ స్టైల్ రిటైల్ చెయిన్ ఫ్యాబ్ ఇండియాతో కలిసి ఈ కొత్త క్రెడిట్ కార్డు అందుబాటులోకి తెచ్చింది.

అంటే ఇది కో బ్రాండెడ్ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డు. దీనిని తీసుకోవడం వలన రూ. 1500 విలువైన గిప్ట్ వోచర్ కూడా పొందవచ్చు. అంతేకాకుండా.. రివార్డ్ పాయింట్లు కూడా పొందవచ్చు. ఈ కార్డు ప్రీమియం సెగ్మెట్ కస్టమర్లు లక్ష్యంగా ఎస్బీఐ ఆవిష్కరించింది. ఈ కార్డు వలన కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసుకుందామా. ఇందులో మూడు నెలలకు రూ. 2 లక్షలకు పైన ఖర్చు చేస్తే.. రూ. 1250 గిఫ్ట్ వోచర్ వస్తుంది. అలాగే ఫ్యూయెల్ సర్ చార్జ్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే సంవత్సరంలో రూ. 75 వేలు ఖర్చు చేస్తే ఫ్యాబ్ ఫ్యామిలీ లాయల్టీ ప్రోగ్రామ్ ప్లాటినమ్ టైర్ యాక్సెస్ లభిస్తుంది. అంతేకాకుండా.. ఫ్యాబ్ ఇండియా స్టోర్ లో ఖర్చు చేసే ప్రతి రూ.100 కు 10 రివార్డు పాయింట్లు వస్తాయి. ఇతర ఖర్చులపై ప్రతి రూ.100 ఖర్చుపై 2 నుంచి 3 పాయింట్లు లభిస్తాయి

పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదానికి అడ్డుక‌ట్ట వేయాలి: అజిత్ దోవ‌ల్‌

హైదరాబాద్ : 25/06/2021

పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదానికి అడ్డుక‌ట్ట వేయాలి: అజిత్ దోవ‌ల్‌

నమస్తే తెలంగాణ మీడియా (ట్విట్టర్) సౌజన్యంతో 
పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదానికి అడ్డుక‌ట్ట వేయాలి: అజిత్ దోవ‌ల్‌

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాద సంస్థ‌లైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లను కట్టడి చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పిలుపునిచ్చారు. తజికిస్తాన్‌ రాజధాని డషంబేలో ఎనిమిది దేశాల షాంఘై కోపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ) స‌ద‌స్సుకు దోవల్‌ హాజరయ్యారు. ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు.

ఉగ్రవాద సంస్థల‌కు ఆర్థిక సాయం అందకుండా దీటుగా ఎదుర్కోవాలన్నారు. అందుకోసం ఎస్‌సీవో, యాంటీ టెర్రర్‌ వాచ్‌డాగ్‌ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదరాలని సూచించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలన్న దోవల్‌.. ఉగ్రవాద దాడుల బాధితుల‌కు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌లో తరచూ దాడులకు పాల్పడే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లను కట్టడి చేయడానికి దోవల్‌ ఒక కార్యాచరణను ప్రతిపాదించినట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ప్చ్ “లాభం” లేదు.. స‌ర్కార్ ధ‌ర‌ల‌పై ‘ప్రైవేట్’ అసంతృప్తి

హైదరాబాద్ : 24/06/2021

ప్చ్ “లాభం” లేదు.. స‌ర్కార్ ధ‌ర‌ల‌పై ‘ప్రైవేట్’ అసంతృప్తి

తొలివెలుగు మీడియా (ట్విట్టర్) సౌజన్యంతో 

క‌రోనా వైర‌స్ చికిత్స‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఖ‌రారు చేసి ధ‌ర‌ల‌పై రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్ప‌త్రుల యాజ‌మాన్యాలు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నాయి. ప్ర‌భుత్వం నిర్దేశించిన ధ‌ర‌ల్లో క‌రోనా ట్రీట్‌మెంట్ చేయ‌డం సాధ్యం కాద‌ని అంటున్నాయి. ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా రేట్ల‌ను ఫిక్స్ చేసింద‌ని.. త‌మ‌ను సంప్ర‌దించ‌కుండానే, తమ అభిప్రాయం సేక‌రించ‌కుండానే జీవో జారీ చేయ‌డం స‌రికాద‌ని త‌ప్పుబ‌డుతున్నాయి. జీవోను స‌వ‌రించాల్సిందేన‌ని.. ధ‌ర‌ల్లో మార్పులు చేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి. అంతేకాదు ప్ర‌భుత్వం పునరాలోచ‌న చేయ‌క‌పోతే.. ఆ ధ‌ర‌ల్లో చికిత్స అందించ‌డం క‌ష్ట‌మేన‌ని తేల్చి చెబుతున్నాయి. ఈ విష‌యంపై స‌ర్కార్‌తో చ‌ర్చించి.. తాడోపేడో తేల్చుకోవాల‌ని భావిస్తున్నాయి.

రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌తోనే క‌రోనా క‌ట్ట‌డి సాధ్యం కాద‌ని భావించే ప్ర‌భుత్వం.. ప్రైవేట్ ఆస్ప‌త్ర‌లు సాయం కోరింద‌ని, ప్ర‌భుత్వం అడిగిన‌ట్టుగా తాము త‌మ ఆస్ప‌త్రుల్లో క‌రోనా బాధితుల కోస‌మే ప్ర‌త్యేకంగా బెడ్ల‌ను కేటాయించి స‌హ‌కరించామ‌ని గుర్తు చేస్తున్నాయి. అలాంటిది ఇంత‌టి కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్న‌ప్పుడు క‌నీసం త‌మ అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోక‌పోవ‌డం స‌రైంది కాద‌ని విమ‌ర్శిస్తున్నాయి. ప్ర‌భుత్వం తాజాగా జారీ చేసిన జీవో ప్ర‌కారం క‌రోనా ట్రీట్‌మెంట్ చేయ‌డం క‌న్నా.. బెడ్ల‌ను ఖాళీగా ఉంచుకోవ‌డ‌మే మంచిద‌ని అంటున్నాయి. సాధార‌ణంగా ఒక్కో క‌రోనా బాధితుడికి కోలుకునే వ‌ర‌కూ చికిత్స అందించాలంటే రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు అవుతుంద‌ని గ‌తంలో ఆరోగ్య‌శాఖ మంత్రిగా ప‌నిచేసిన ఈట‌ల రాజేంద‌ర్ చెప్పిన మాట‌ల‌ని ప్రైవేట్ ఆస్ప‌త్రుల యాజ‌మాన్యాలు ప్ర‌స్తావిస్తున్నాయి.

క‌రోనాకు అందించే క్ర‌మంలో ఏయే ప్రొటోకాల్ పాటించాల్సి వ‌స్తుందో.. రోగుల‌కు ఏమేం స‌దుపాయాలు క‌ల్పించాల్సి వ‌స్తుందో ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి లిఖిత‌పూర్వ‌కంగా నివేదిక స‌మ‌ర్పించాని యాజ‌మానాలు చెబుతున్నాయి. ఆరోగ్య‌శాఖ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న మంత్రి హ‌రీష్ రావు కూడా దాన్ని ప‌రిశీలించి.. తాము చెబుతున్న అంశాల్లో వాస్త‌వం ఉంద‌ని అంగీక‌రించార‌ని.. కానీ చివ‌రికి చేయాల్సింది చేశార‌ని ఆక్రోశం వెళ్ల‌గ‌క్కుతున్నాయి. త్వ‌రలో థ‌ర్డ్ వేవ్ రావొచ్చ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్న వేళ‌.. ప్రైవేట్ ఆస్ప‌త్రులు పెడుతున్న మెలికను విప్ప‌డం స‌ర్కార్‌కు స‌వాల్‌గా మారేలా ఉంది. మ‌రీ జీవోలో మార్పులు చేస్తుందా.. లేదా అదే ధ‌ర‌ల్లో చికిత్స అందించాల‌ని ఆదేశిస్తుందా చూడాలి.

యాదాద్రి జిల్లా అడ్డగూడూరు ఠాణాలో మహిళ మృతిపై న్యాయ విచారణకు హైకోర్టు ఆదేశించింది. మరియమ్మ మృతిపై విచారణ

హైదరాబాద్ : 24/06/2021

Ts New: మరియమ్మ మృతిపై హైకోర్టు విచారణ

ఈనాడు మీడియా (ట్విట్టర్) సౌజన్యంతో 

Ts New: మరియమ్మ మృతిపై హైకోర్టు విచారణ

హైదరాబాద్‌: యాదాద్రి జిల్లా అడ్డగూడూరు ఠాణాలో మహిళ మృతిపై న్యాయ విచారణకు హైకోర్టు ఆదేశించింది. మరియమ్మ మృతిపై విచారణ జరపాలని ఆలేరు మెజిస్ట్రేట్‌ను ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం.. నివేదికను సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని స్పష్టం చేసింది. అవసరమైతే రీపోస్టుమార్టం జరపాలని తెలిపింది. పోలీసు స్టేషన్‌లో సీసీ కెమెరాలు లేకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. పీయూసీఎల్‌ ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. 

రాచకొండ సీపీకి మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు 

పోలీసు కస్టడీలో చనిపోయిన దళిత మహిళ మరియమ్మ ఘటనపై నివేదిక ఇవ్వాలని రాచకొండ సీపీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. మరియమ్మ చనిపోయిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని దళిత, బహుజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. దొంగతనం చేసిందనే నెపంతో మరియమ్మను, ఆమె కుమారుడిని యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీసు స్టేషన్‌ తీసుకొచ్చారని పేర్కొంది. పోలీసు సిబ్బంది విచక్షణా రహితంగా కొట్టడం వల్లే మరియమ్మ చనిపోయిందని దళిత సంఘాల నాయకులు కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సదరు సిబ్బందిని సస్పెండ్‌ చేసి చేతులు దులిపేసుకున్నారని తెలిపారు. ఈ ఘటనపై జులై 28లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని రాచకొండ సీపీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. 

Wednesday, June 23, 2021

జమ్ముకశ్మీర్‌ రాజకీయ పార్టీలతో నేడు ప్రధాని మోడీ భేటీ

హైదరాబాద్ : 24/06/2021

PM Modi: జమ్ముకశ్మీర్‌ రాజకీయ పార్టీలతో నేడు ప్రధాని మోడీ భేటీ

PM Modi: హాజరుకానున్న ఫరూక్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ * ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం తొలిసారి సమావేశమవుతున్న నేతలు

 hmtv మీడియా (ట్విట్టర్)సౌజన్యంతో 

PM Modi meeting with Jammu and Kashmir Political Parties

PM Modi: ఇవాళ రాజకీయంగా మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. జమ్ముకాశ్మీర్‌ భవిష్యత్తుపై నేడు క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. జమ్ములోని వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఇందుకోసం అన్ని ప్రధాన పార్టీలను ప్రధాని మోడీ ఆహ్వానించారు. జమ్ము కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్దరించాలనే అంశంపై చర్చ జరగనుంది. ఈ భేటీ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నివాసంలో సమావేశం ప్రారంభంకానుంది. కశ్మీర్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు 14 మందిని కేంద్రం ఈ సమావేశానికి ఆహ్వానించింది.

ఈ సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్ అబ్దుల్లా బుధవారం పార్టీల నేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలు తీర్చేలా.. ఈ ప్రాంత ఐక్యత, సమగ్రత కాపాడేలా చర్యలు తీసుకునే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. కశ్మీర్‌కు తిరిగి స్వతంత్ర ప్రతిపత్తిని కట్టబెట్టాలని సమావేశంలో గట్టిగా డిమాండ్ చేస్తామన్నారు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ. కశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా తిరిగి కట్టబెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇక ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జరిగే తొలి సమావేశం కావడంతో దీనిపై అందరికీ ఆసక్తి నెలకొంది.

పోలింగ్‌ విధుల్లో పాల్గొన్న... 17 మంది ఉపాధ్యాయుల మృతి

హైదరాబాద్ : 24/06/2021

పోలింగ్‌ విధుల్లో పాల్గొన్న... 17 మంది ఉపాధ్యాయుల మృతి

మరో ఇద్దరు జూనియర్‌ అధ్యాపకులు కూడా

హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్‌

TS news: పోలింగ్‌ విధుల్లో పాల్గొన్న... 17 మంది ఉపాధ్యాయుల మృతి

ఈనాడు మీడియా (ట్విట్టర్) సౌజన్యంతో 

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పనిచేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 17 మంది, జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల్లో ఇద్దరు కరోనా కారణంగా మృత్యువాతపడ్డారని విద్యాశాఖ పేర్కొంది. పోలింగ్‌ విధుల్లో ఉండగానే వారికి కరోనా సోకిందన్న దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా హైకోర్టులో ప్రమాణపత్రం(అఫిడవిట్‌) దాఖలు చేశారు. ‘‘నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికతో పాటు వరంగల్‌, ఖమ్మం తదితర ప్రాంతాల్లో మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. విధుల్లో 9,737 మంది ఉపాధ్యాయులు, 185 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. అందులో 487 మంది టీచర్లు, అయిదుగురు అధ్యాపకులు కరోనా బారిన పడ్డారు. చనిపోయిన 17 మంది ఉపాధ్యాయుల్లో ఏడుగురు ఎస్‌జీటీలు, ఎనిమిది మంది స్కూల్‌ అసిస్టెంట్లు, ఒకరు పీఈటీ, మరొకరు టీఆర్‌టీ. వరంగల్‌ గ్రామీణ జిల్లాకు చెందిన వారు అయిదుగురు, నల్గొండలో నలుగురు, జనగామ, ఖమ్మం జిల్లాల్లో ముగ్గురేసి, వరంగల్‌ అర్బన్‌లో ఇద్దరు చనిపోయారు. బాధిత కుటుంబ సభ్యులకు అందాల్సిన ప్రయోజనాలను యుద్ధ ప్రాతిపాదికన చెల్లిస్తాం’’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో కరోనాతో 177 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారని ప్రభుత్వం తెలిపింది. వీరి సంక్షేమం కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నామని హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. ‘‘అనాథలుగా మారిన పిల్లలకు మూడేళ్లపాటు నెలకు రూ.2 వేలు అందిచనున్నాం. జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. తల్లిదండ్రుల పూర్వ వివరాలు తెలియని చిన్నారులు బీసీ రిజర్వేషన్లు పొందేలా బీసీ-ఏ ధ్రువీకరణ పత్రం ఇప్పించనున్నాం. విద్యాసంస్థల్లో మూడుశాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. అత్యవసర సమయాల్లో రక్షణ కోసం పిల్లలకు సాధారణ ఫీచర్లతో కూడిన మొబైల్‌ ఫోన్లు అందించాం. అందులో 1098, 100, సహాయ కేంద్రం, సీడబ్ల్యూసీ సభ్యులు, డీసీపీయూ అధికారుల నంబర్లు నమోదు చేశాం. దీంతో ఆపద సమయాల్లో ఆయా చిన్నారులను రక్షించేందుకు వీలవుతుంది. కరోనాతో చనిపోయిన తల్లిదండ్రుల ఆస్తులపై హక్కుల కోసం బాధిత చిన్నారులకు న్యాయసహాయం అందించాలని న్యాయసేవా సంస్థను కోరాం’’ అని తెలిపింది.

10.34 లక్షల కేసుల నమోదు

కరోనా రెండోదశలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని 10.34 లక్షల కేసులు నమోదు చేశామని ప్రభుత్వం తెలిపింది. మొత్తం రూ.41.27 కోట్లు జరిమానా విధించామని పేర్కొంది. నల్లబజార్లో కొవిడ్‌ మందులు, ఆక్సిజన్‌ వంటివాటిని అమ్ముతున్న వారిని గుర్తించి ఇప్పటి వరకూ 171 కేసులు నమోదు చేసినట్లు వివరించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈనెల 1 నుంచి 20 వరకు 14,62,050 మందికి హరేకృష్ణ ఫౌండేషన్‌ సహకారంతో అన్నపూర్ణ పథకం కింద ఉచిత భోజనం అందించామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది.

Lisa Caprini Sthalekar ICC Hall of Fame

Hyderabad : 23/06/2021

Courtesy : @Gabbar0099(Twitter)

A girl was born on 13th Aug 1978 at Pune, her biological parents were unable to support her, placed her at doorsteps of an Orphanage home called Shreevatsa. The orphanage home gave her a name, Laila.

A couple from Michigan, named Haren & Sue, who had a daughter but wanted to adopt a boy came to this orphanage home in search of a baby boy but didn't find any. Sue fell in love with big brown eyes of Laila and decided to adopt her. After legal formalities completed.

the couple took the little girl to USA and changed her name from Laila to Lisa. Later the couple settled down in Sydney

The girl was introduced to Cricket by her Father and started playing at backyard of her house along with father, later in nearby grounds with boys.

The love for cricket never ended as she grew up and completed her studies

1997 debut for New South Wales
2001 debut in Odis for Australia
2003 debut in Tests for Australia
2005 debut in T20Is for Australia
8 Tests, 416 Runs & 23 Wkts
125 Odis, 2728 Runs & 146 Wkts
54 T20Is, 769 Runs & 60 Wkts

1st Women Cricketer to complete the double of 1000 Runs & 100 Wickets in Odis

When ICC introduced Rankings, she was rated as No 1 All rounder

Captained Australia

Part of 4 WC titles (Odis + T20Is)

Lisa Sthalekar, recently was  Inducted in ICC Hall of Fame

తెలంగాణలో మ‌ళ్లీ జేఏసీ జెండాలు !

హైదరాబాద్ : 23/06/2021

తెలంగాణలో మ‌ళ్లీ జేఏసీ జెండాలు !

తొలివెలుగు మీడియా (ట్విట్టర్) సౌజన్యంతో 
తెలంగాణలో మ‌ళ్లీ జేఏసీ జెండాలు !

తెలంగాణలో మ‌ళ్లీ ఉద్య‌మ‌ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. టీఆర్ఎస్ నిరంకుశ‌, నిర్ల‌క్ష్య వైఖ‌రికి వ్య‌తిరేకంగా వివిధ సంఘాలు మ‌రోసారి ఏక‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఆర్టీసీ యూనియన్లు ఉమ్మ‌డిగా ఉద్యమబాట పట్టేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. ఇత‌ర సంస్థ‌ల్లో కూడా ఆ దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. ఆర్టీసీలో టీఎంయూ మిన‌హా 10 యూనియన్లు కలిసి ఎలా జేఏసీగా ఏర్ప‌డ్డాయో.. అధికార పార్టీ అనుబంధ సంఘాన్ని వ‌దిలేసి కొత్త‌గా జాయింట్ యాక్ష‌న్ క‌మిటీల ఏర్పాటుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

సింగ‌రేణిలోని కార్మిక సంఘాలు, ఉద్యోగులు కూడా త్వ‌ర‌లో జేఏసీ ఏర్పాటుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలేవీ నెర‌వేర‌క‌పోవ‌డం, పైగా వాటిపై ఎక్క‌డ నిల‌దీస్తారోన‌ని భ‌యంతో కార్మిక సంఘాల‌కు ఎన్నిక‌లే నిర్వ‌హించ‌క‌పోవ‌డంతో వారే ఉద్య‌మానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. వారం , ప‌ది రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న రావొచ్చ‌ని అంటున్నారు. వీరితో పాటు ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కూడా ఇదే త‌ర‌హా ఆలోచ‌న చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు రాష్ట్రంలో హుజురాబాద్ బైపోల్ మిన‌హా వేరే ఎన్నిక‌లు లేక‌పోవ‌డంతో కేసీఆర్ త‌మకు ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తార‌నే న‌మ్మ‌కం వివిధ సంస్థ‌లు, వ‌ర్గాల‌కు చెందిన ఉద్యోగులు, కార్మికుల్లో క‌నిపిస్తోంది. దీంతో కేసీఆర్‌పై పోరాటం చేయాలంటే.. మ‌ళ్లీ జేఏసీల ఏర్పాటు అవ‌స‌రం త‌థ్య‌మ‌ని వారు భావిస్తున్నారు.

తెలంగాణ‌లో జేఏసీల‌కు ఎంతో చ‌రిత్ర ఉంది. ప్ర‌త్యేక రాష్ట్ర సాధన‌లో అవి చేసిన పోరాటం చాలా పెద్ద‌ది. కానీ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత‌.. చాలా వాటిని కేసీఆర్ నిర్వీర్య‌మ‌య్యేలా చేశారు. దీంతో రాజ‌కీయ జేఏసీ మిన‌హా మిగిలిన‌వేవీ కూడా ఉనికిలో లేకుండాపోయాయి. ఇప్పుడు మ‌ళ్లీ ఏడేళ్ల త‌ర్వాత‌.. తెలంగాణ‌లో జేఏసీల మాట విన‌బ‌డుతోంది.